- బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలు
- ఆరోగ్యాన్ని చేకూర్చిన బాబా
బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలు
పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు ఇటీవల తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీసాయి పాదపద్మములకు శతకోటి నమస్కారములు. ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా ధన్యవాదాలు. బాబా ఈమధ్య మమ్మల్ని శిరిడీకి ఆహ్వానించారు. మేము శిరిడీ ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకున్న తరువాత మా దగ్గరి బంధువు ఒకరికి ఆరోగ్యం బాగోలేదు. అది తెలిసి నేను ఎక్కడ మా శిరిడీ ప్రయాణం వాయిదాపడుతుందోనని భయపడి, "బాబా! ఏ ఆటంకం లేకుండా చూడు తండ్రీ. మీ అనుగ్రహంతో మా ప్రయాణం సవ్యంగా జరిగితే నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకు చెప్పుకున్నాను. ఆయన అనుమతి ఉన్నపుడు బాధ్యత ఆయనదే కదా! మాకు ఏ ఇబ్బందీ రాకుండా బాబా చూసుకున్నారు. బాబా ప్రసాదించిన మా మనవడిని తీసుకొని ఎంతో సంతోషంగా 2021, ఫిబ్రవరి 10న మేము శిరిడీ చేరుకున్నాము. నేను గత 25 సంవత్సరాలుగా శిరిడీ వెళ్తున్నాను. ఈసారి శిరిడీలో ఏర్పాట్లన్నీ బాబానే చూసుకున్నారు. బాబా ఆశీస్సులతో మా మనవడి 11వ నెల పుట్టినరోజును శిరిడీలో జరుపుకున్నాము. మా శిరిడీ ప్రయాణమంతా చెప్పనలవికానంత ఆనందంగా జరిగింది. "ధన్యవాదాలు బాబా".
మరొక అనుభవం:
అన్ని సమస్యలకూ ఊదీయే పరమౌషధమని నమ్మి మా ఇంట్లో అందరమూ ఊదీ తీసుకుంటుంటాము. ఈమధ్య మావారు హెల్త్ చెకప్ చేయించుకోవడానికి వెళ్లారు. నేను బాబాకు నమస్కరించుకుని, "బాబా! అంతా బాగుండేలా అనుగ్రహించండి" అని వేడుకున్నాను. బాబా దయతో షుగర్ కాస్త పెరగడం, ఇంకా రెండు, మూడు చిన్న చిన్న సమస్యలున్నా మిగతా అంతా బాగుంది. నేను ఆనందంగా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకొని, ఉన్న ఆ కొద్ది సమస్యలను వారు చూసుకుంటారని ఆయనకే అప్పగించాను. అయినా మా కుటుంబాన్ని చల్లగా చూసుకొనే బాధ్యత ఆయనకి అప్పగించిన తరువాత బాబా చల్లగా చూసుకుంటారు.
నేను ఇదివరకు పంచుకున్న ఒక అనుభవంలో కొంతమంది మాకు డబ్బులు, ప్లాట్స్, పొలాలు ఇవ్వాల్సి ఉందని చెప్పాను. బాబా దయతో ఇప్పుడిప్పుడే ఆ సమస్యలన్నీ ఒక్కొక్కటిగా కదులుతున్నాయి. ఒకరు ఇవ్వడానికి ఒప్పుకున్నారు కూడా. మన బాబా దయతో, మీ అందరి ప్రార్థనలతో తొందర్లోనే అన్నీ మాకు రావాలని ప్రార్థిస్తున్నాను. మేము ఈమధ్యనే మా మనవడి పుట్టినరోజు వేడుక జరుపుకున్నాము. కాదు కాదు, బాబాయే మా చేత జరిపించారు. కోవిడ్ దృష్ట్యా ఆ వేడుక వలన ఎవరికీ ఇబ్బంది కలగకుండా అందరినీ చల్లగా కాపాడమని బాబాను వేడుకున్నాను. ఆ సమయంలో ఒకావిడ క్రింద పడబోయారు. మేము చాలా భయపడ్డాము. కానీ బాబా ఆవిడకి ఏమీ కాకుండా కాపాడారు. ఆయన దయవల్ల అందరూ బాగున్నారు. బాబా ప్రసాదించే అనుభవాలు ఎన్నని చెప్పను?
"బాబా! ఏవైనా పంచుకుంటానని చెప్పి మరచిపోయివుంటే ప్రేమతో క్షమించి మా కుటుంబమంతటినీ చల్లగా కాపాడండి. మా కుటుంబమంతా కలిసి మీ దయతో ఒక ట్రిప్పుకి వెళ్తున్నాము. మీరు మాతోనే ఉండి, అన్నీ చూపించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడండి. క్షేమంగా వెళ్లి రావాలని ఆశీర్వదించండి బాబా". ఓపికతో నా అనుభవాలను చదివినందుకు అందరికీ నా వందనములు.
- బాబా పాదసేవకురాలు.
ఆరోగ్యాన్ని చేకూర్చిన బాబా
సాయిభక్తుడు రూపేష్ ఇటీవల తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.
ముందుగా ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా ధన్యవాదాలు. ప్రస్తుత కరోనా కాలంలో జ్వరం అంటేనే చాలా భయం వేస్తోంది. హాస్పిటల్‌కి కూడా వెళ్లలేని పరిస్థితి. ఇటీవల మా పాపకి జ్వరం వచ్చింది. వెంటనే తనకి మందులు వేసినప్పటికీ శరీర ఉష్ణోగ్రత పెరుగుతుండటంతో భయపడి, "బాబా! పాపని కాపాడండి. రేపటికల్లా జ్వరం తగ్గుముఖం పడితే నా అనుభవాన్ని మీ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని ప్రార్థించి పాపచేత బాబా ఊదీ తినిపించాం. బాబా అత్యంత దయామయులు. మరుసటిరోజుకి జ్వరం తగ్గి పాప తొందరగా కోలుకుంది.
మరో అనుభవం:
నా ఛాతీభాగంలో కండరాలు కాస్త పట్టేసినట్లుగా ఉండి బాధపడుతుండేవాడిని. అప్పుడు కూడా నేను నా బాధను తగ్గించమనీ, తగ్గితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాననీ బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల నొప్పి క్రమంగా తగ్గిపోయింది. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు".
Om Srinivasya namah. We went to Tirumala with sai blessings.we went to Kanipakam, Sree Kalahasti and have darshan of lord.i felt very happy.i have desireto have darshan of lord srinivas.we have nice darshan.
ReplyDeleteOm sairam. With sai blessings we went to Tirumala , kanipakam, arunachalam, sree kalahasthi .Today came to home safely. Sai u gave good darshan to us.lu sai jai sai ram. Govinda govinda. Om namah shivaya,
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
697 days
ReplyDeleteSairam
Om Sairam
ReplyDelete🙏🙏🙏
Om sai ram baba amma ki tondarga cure cheyi baba pleaseeee
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI.. OM SAI RAM
ReplyDelete