సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 734వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:

  1. బాధ్యతగా ఏసీ రూం ఏర్పాటు చేసిన బాబా
  2. బాబా అనుగ్రహంతో తగ్గిన నొప్పి

బాధ్యతగా ఏసీ రూం ఏర్పాటు చేసిన బాబా


పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:


నేను సాయిభక్తురాలిని. బాబా మా కుటుంబానికి ఎన్నో అద్భుత అనుభవాలను ప్రసాదించారు. ఇప్పుడు నేను పంచుకోబోయే ఇటీవలి అనుభవం చిన్నదే కానీ బాబా చేసిన సహాయం చాలా గొప్పది. ప్రస్తుతం మేము హైదరాబాదులో నివసిస్తున్నాము. మా అమ్మాయి ఒక యూనివర్సిటీలో తను కోరుకున్న బ్రాంచిలో బి.టెక్‌ చదువుతోంది. నిజానికి మా అమ్మాయిని మహారాష్ట్రలో చదివించాలని అక్కడున్న కొన్ని యూనివర్సిటీలలో తనకు సీటుకోసం ప్రయత్నించాము. కారణం, మేము మహారాష్ట్రకు చెందిన వాళ్ళము. మా అమ్మాయి అక్కడే పుట్టి పెరిగింది. తనకి ఆంధ్ర, తెలంగాణ అంతగా ఇష్టంలేదు. ఎందుకంటే, తేమ ఎక్కువగా ఉండే ఇక్కడి వాతావరణంలో తను సర్దుకోలేదు. కాబట్టి తనకి మహారాష్ట్రలో సీటు వస్తే బాగుంటుందని తలచి మేము కరోనా లాక్‌డౌన్‌కి ముందు పూణే వెళ్లి అక్కడి కొన్ని యూనివర్సిటీలను చూశాము. తనకి ఒకవేళ పూణేలో సీటు వస్తే, అక్కడికి శిరిడీ దగ్గర కాబట్టి నెలకోసారి శిరిడీ వెళ్లి నా ప్రియమైన బాబాను దర్శించుకోవచ్చని అనుకున్నాను. మేము అలా ఆలోచిస్తే బాబా ప్రణాళిక వేరుగా వుంది. ఆయన మా అమ్మాయికి ఒక దక్షిణాది రాష్ట్రంలో సీటు ఇచ్చారు. అయితే ఒక తల్లిగా ఆ వాతావరణం మా అమ్మాయికి నచ్చదని నా మనసుకి చాలా కష్టంగా అనిపించింది. దాంతో నిరంతరం నేను బాబాను, "ఎందుకు బాబా, మీరు మమ్మల్ని ఇలా పరీక్షిస్తున్నారు?" అని అడగటం మొదలుపెట్టాను. అంతలో జాయినింగ్ ప్రక్రియ మొదలవడంతో వేరేదారిలేక మా అమ్మాయి దక్షిణాది రాష్ట్రంలోని ఆ యూనివర్సిటీలో చేరింది. ఆన్లైన్ క్లాసులు కూడా ప్రారంభమయ్యాయి. ఇంట్లోనే క్లాసులకి హాజరవుతూ నెమ్మదిగా తన మనసు సర్దుకుంది. 


అదలా ఉంటే, మా అమ్మాయి యూనివర్సిటీలో చేరాక యూనివర్సిటీ అధికారులు హాస్టల్ ఫెసిలిటీ గురించి మెసేజ్ చేశారు. మా అమ్మాయి హాస్టల్ కోసం దరఖాస్తు చేసుకుంది. ఎవరో హాస్టల్‌లో ఏసీ గదులు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పడంతో మేము ఏసీ రూమును ఎంచుకున్నాము. కారణం, మా అమ్మాయి ఇక్కడి వాతావరణంలోని తేమని తట్టుకోలేదని ముందే చెప్పాను కదా. అయితే అందరూ మా అమ్మాయికి ఏసీ గది దొరుకుతుందో, లేదో అన్నట్లు మాట్లాడేవారు. దాంతో నేను యూనివర్సిటీ అధికారులు ఇచ్చిన కొన్ని ఫోన్ నెంబర్ల ద్వారా ఏసీ గదికోసం ఒక వార్డెన్‌ను సంప్రదించాను. ఆమె, "మీ అమ్మాయి పేరు నా రిజిస్టరులో రాసుకుంటాను, ఏసీ గది అందుబాటులో ఉంటే గనక మీ అమ్మాయికి కేటాయిస్తామ"ని చెప్పింది. కానీ, "ఖచ్చితమైన హామీ మాత్రం ఇవ్వలేన"ని చెప్పింది. దాంతో మేము ఆందోళన చెంది రెండు, మూడుసార్లు వార్డెన్‌కి ఫోన్ చేశాము. ఆమె ప్రతిసారీ అదే సమాధానం చెప్తూ ఉండేది. ఇదంతా 2020, జులై/ఆగష్టులో జరిగింది. కరోనా పరిస్థితుల వలన ఆన్లైన్ క్లాసులు జరుగుతుండటంతో మా అమ్మాయి ఇంట్లోనే ఉంటున్నందున మేము సంతోషంగా ఉన్నాము. ఆ సంతోషంలో హాస్టల్ గురించి మేము పూర్తిగా మరిచిపోయాము. 2021, మార్చి వరకు ఆన్లైన్ క్లాసులతో ఆనందంగా గడిచిపోయింది.


హఠాత్తుగా యూనివర్సిటీ అధికారులు 'ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించబడవు. కాబట్టి యూనివర్సిటీకి వచ్చి పరీక్షలు వ్రాయాల'ని మెసేజ్ పెట్టారు. దాంతో మేము హైదరాబాద్ నుండి దక్షిణాది రాష్ట్రంలో ఉన్న ఆ యూనివర్సిటీకి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాము. మేము వెళ్లడానికి సరిగ్గా నాలుగురోజులు ముందు, మా ప్రయాణం గురించి, హాస్టల్లో మా అమ్మాయిని వదిలి వచ్చే విషయం గురించి నేను తీవ్రంగా ఆందోళన చెందుతున్న తరుణంలో బాబా ఈ సాయి మహారాజ్ సన్నిధి ద్వారా నాకు ఈ దిగువ మెసేజ్ ఇచ్చారు.


ఆ మెసేజ్ చూస్తూనే నా మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించింది. తరువాత మేము యూనివర్సిటీకి వెళ్ళాము. మొదటిరోజే మా అమ్మాయి అక్కడి వాతావరణం మరియు తేమతో చాలా ఇబ్బందిపడింది. తను యూనివర్సిటీకి వెళ్లగా నేను హాస్టల్ వార్డెన్‌ను కలవడానికి వెళ్ళాను. నాతోపాటు మా అమ్మాయి స్నేహితురాలి తల్లి ఒకరు వచ్చారు. నేను వార్డెన్‌ని, "దయచేసి ఏసీ గది ఏర్పాటు చేయమ"ని చాలా ప్రాధేయపడ్డాను. కానీ ఆమె, "ఏసీ గదులు అందుబాటులో లేవ"ని చెప్పింది. ఇక నేను చేసేదిలేక, "సరే" అని అన్నాను. అంతలో ఆమె, "ఒక గది ఉంది. కానీ అది 2020లోనే బుక్ చేయబడింది. వాళ్ళు నాగపూర్‌కు చెందినవాళ్లు. కాబట్టి మీ అమ్మాయికోసం ఏసీ గది లేదు" అని చెప్పింది. అప్పుడు నేను, "మేడం, మేము కూడా బుక్ చేసుకున్నాము. మేము నాగపూర్ నుండే వచ్చాము" అని చెప్పాను. ఆమె అనుమానాస్పదంగా, "మీ అమ్మాయి పేరేమిటి?" అని అడిగింది. నేను అమ్మాయి పేరు చెప్పాను. అప్పుడు ఆమె తన రిజిస్టరును చెక్ చేసుకొని, "అవును, ఈ పేరు మీదే గది బుక్ చేయబడింది. కాబట్టి ఆ ఏసీ గది మీదే" అని చెప్పింది. నిజంగా నేను ఆశ్చర్యపోయాను, నన్ను నేను నమ్మలేకపోయాను. నేను అంతులేని ఆనందంలో మునిగిపోయాను. ఆ తరువాత ఆ వార్డెన్, "నాతో ఒక వార్డెన్ (నేను అదివరకు మాట్లాడిన వార్డెన్) మీ అమ్మాయి పేరు మీద ఏసీ గదిని రిజర్వ్ చేయమని చెప్పారు" అని చెప్పింది. నిజానికి మేము చేసిన ఆ ఫోన్ కాల్ గురించి నేను పూర్తిగా మరచిపోయాను. వార్డెన్ విద్యార్థి పేరు నమోదు చేసుకుంటే రిజర్వేషన్ పూర్తయినట్లని మాకు తెలియదు. నిజానికి ఆమె మాకు ఖచ్చితమైన హామీ ఇవ్వనందున మాకు ఎటువంటి ఆశా లేదు. నిజంగా ఇదంతా బాబా దయవల్ల మాత్రమే జరిగింది. ఆ వార్డెన్ ద్వారా బాబానే మా అమ్మాయికి సహాయం చేశారు. నిజానికి నేను కాలేజీ ప్రారంభం కాకముందు నుండి, "బాబా! మీరెందుకు నా కూతురికి ఈ యూనివర్సిటీలో సీటు ఇచ్చారు?" అని బాబాతో చాలా పోట్లాడాను. అంతేకాదు, "ఇక నా బిడ్డ బాధ్యత మీదే. తనకు కావాల్సిన ప్రతిదీ మీరే ఏర్పాటు చేయాలి" అని నిరంతరం బాబాను ప్రార్థించాను. ఆయన నా ప్రార్థన విని బాధ్యతగా మా అమ్మాయికి ఏసీ రూం ఏర్పాటుచేశారు. ఇంకొక విషయం చెప్పడం మరిచిపోయాను. అదేమిటంటే, మా అమ్మాయి చదువుతున్న యూనివర్సిటీలో ఒక బాబా మందిరం ఉంది. ఇది బాబా చేసిన గొప్ప అద్భుతం. మేము మా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేము. బాబా అనుగ్రహానికి మా అమ్మాయి చాలా సంతోషించింది, అసలు తన ఆనందానికి హద్దులు లేవు. తనిప్పుడు బాబా దయతో హాస్టల్‌లో సర్దుకుంది. కానీ ఈ కరోనా భయంతో, "బాబా! దయచేసి నా బిడ్డను కాపాడండి. తనని ఎప్పుడూ సంరక్షిస్తూ ఉండండి. తనపై మీ అనుగ్రహాన్ని కురిపించండి" అని బాబాను ప్రార్థిస్తున్నాను. చివరిగా, నా అనుభవాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన భయ్యాకు ధన్యవాదాలు.

బాబా అనుగ్రహంతో తగ్గిన నొప్పి


సాయి భక్తుడు శ్రీకాంత్ తమకి బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:


నా పేరు శ్రీకాంత్. మాది మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్. నా భార్య పేరు శ్రీవాణి. తను సాయిభక్తురాలు. ఇటీవల ఒకరోజు రాత్రి అకస్మాత్తుగా నా భార్యకు సయాటికా నొప్పి తీవ్రంగా వచ్చింది. డాక్టర్లకు ఫోన్ చేస్తే MRI స్కానింగ్ చేయించమన్నారు. తీవ్రమైన నొప్పితో తను విలవిలలాడుతుంటే నాకు ఏమి చేయాలో తోచలేదు. ఆ రాత్రి సమయంలో ఎక్కడికి వెళ్లాలో, ఏమి చేయాలో తెలియక, బాబా ముందు కూర్చుని, నా బాధను బాబాకు చెప్పుకుని, “బాబా! నా భార్యకు ఎలాంటి ఆపదా రాకుండా కాపాడు. మీ దయవల్ల తన నొప్పి తగ్గి తను ఆరోగ్యంగా ఉంటే సచ్చరిత్ర పారాయణ చేస్తాను” అని మ్రొక్కుకుని, బాబా ఊదీని నా భార్యకు రాశాను. మరుసటిరోజు తెల్లవారుఝామున 4 గంటల సమయంలో నా భార్య లేచి నడిచింది. బాబా దయవల్ల నొప్పి తగ్గింది. బాబా చూపిన దయకు సంతోషంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. MRI స్కానింగులో ఎలాంటి ఇబ్బందీ లేకుండా నా భార్య ఆరోగ్యంగా ఉండేలా అనుగ్రహించమని బాబాను కోరుకుంటున్నాను.


సాయినాథ్ మహరాజ్ కీ జై!


5 comments:

  1. Om sai ram today sai leelas are very nice. You are not giving me darshan in dreams.i want to see you in my dream.please make my desire.yesterday you blessed me to do venkateshwar swami vratamu.it is very nice.i got his blessings.He blesses my family. And takes care in Corona of my family�� om sai ram ❤❤������

    ReplyDelete
  2. Om sai ram baba amma health bagundali thandri pleaseeee sai thandri

    ReplyDelete
  3. Baba ayurvedic medicine tondarga pani chesi cure ayyela chudu baba nuvve doctor vi daya chupinchu thandri sainatha om sai ram om sai ram

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo