సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 737వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:

  1. సాయిబాబా చూపిన లీల
  2. సమస్యను బాబాకు అప్పగిస్తే ఆయనే చూసుకుంటారు
  3. బాబా ఊదీతో నయమైన కడుపునొప్పి


సాయిబాబా చూపిన లీల


సాయిభక్తురాలు జ్యోతి తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


సాయిభక్తులందరికీ నా నమస్సుమాంజలి. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా ప్రణామాలు. బాబా నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. ఇంతకుముందు కూడా రెండు అనుభవాలను ఈ బ్లాగులో పంచుకున్నాను. ఈరోజు ఇంకొక అనుభవం పంచుకుంటున్నాను. గత 12 ఏళ్లగా బాబా నామజప ఉత్సవాన్ని మా ఇంట్లో జరుపుకుంటున్నాము. 2020, మార్చి నెలలో జరిగిన ఉత్సవంలో బాబాకు చిలిం కోసం ఒక హుక్కాని కొని, అందులో పొగాకు, బొగ్గులు వేసి బాబా ఫోటో దగ్గర పెట్టాను. అప్పటినుండి దానిని బాబా దగ్గరే ఉంచేశాను. మధ్యమధ్యలో ‘బాబా చిలిం పీలుస్తున్నారా, లేదా’ అనీ, ‘ఆ పైపు అంచు నల్లగా అయిందా, లేదా’ అనీ గమనిస్తూ ఉండేదాన్ని. కానీ ఎప్పుడూ ఆ హుక్కా అంచు నల్లగా అవలేదు. “బాబా! నేను నీకోసం ప్రేమగా హుక్కా కొని తెస్తే నీవసలు చిలిం త్రాగడం లేదేంటి బాబా?” అని మధ్యమధ్యలో బాబాను గోముగా అడిగేదాన్ని. తర్వాత మళ్లీ ఆ విషయం మర్చిపోయేదాన్ని. 2020, డిసెంబరులో ఒక గురువారంరోజున బాబాకు ఆరతి ఇస్తున్నప్పుడు ఎందుకో నా చూపు ఆ హుక్కా అంచుపై పడింది. చూస్తే, ఎక్కడైతే హుక్కా పైపు అంచు ఉందో అక్కడ నుండి బాబా ఫోటో పైవరకు పొగ పైకి వెళితే ఎలా ఉంటుందో అలా ఆ పొడవునా బాబా ఫోటో రంగు మారిపోయింది. అది చూసి ఆశ్చర్యానందాలలో మునిగిపోయాను. అంటే, నేను అడుగుతున్నానని బాబా తాను చిలిం పీలుస్తున్నానని నాకు నిదర్శనం చూపించారు. (జతపరచిన ఫోటోని చూడగలరు.) నేనేదో సరదాగా అడిగానేగానీ బాబా నిజంగా అలా నిదర్శనం చూపిస్తారని అనుకోలేదు. బాబా చూపిన ప్రేమకు చాలా సంతోషం వేసింది. ఎప్పుడూ మన వెన్నంటి ఉండే సాయినాథుడిని ఎంత పొగిడినా తక్కువే. బాబాకు మనం ఇవ్వవలసిన దక్షిణ శ్రద్ధ, సబూరిలు కలిగివుండటమే!

సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


సమస్యను బాబాకు అప్పగిస్తే ఆయనే చూసుకుంటారు


నా పేరు అంజలి. సాయిభక్తకోటికి, ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారములు. ఇటీవల మా ఆఫీసులో క్రొత్త ఛార్జర్ పెట్టాము. బాబా దయవల్ల అదేరోజు సబ్‌స్టేషన్‌లో ఒక ట్రాన్స్‌ఫార్మర్ బ్రేకర్ ప్రాబ్లమ్ వచ్చింది. దానిని రిపేర్ చేయాలని నేను అదివరకే మా పైఅధికారులకు చెప్పినప్పటికీ వాళ్ళు అంతగా పట్టించుకోలేదు. ఇక నేను చేసేదేమీలేక సమస్యను బాబాకే చెప్పుకున్నాను. సరిగ్గా క్రొత్త ఛార్జర్ పెడుతున్నప్పుడే సబ్‌స్టేషన్‌లో ఆ బ్రేకర్ ప్రాబ్లమ్ వచ్చేలా చేసి ఆ సమస్యను అందరికీ తెలిసేలా చేశారు బాబా. ఇక వెంటనే సర్వీస్ ఇంజనీరుని పిలిపించి రెండురోజుల్లో బ్రేకర్ రిపేర్ చేయించారు. అంతకుముందు కూడా ఆఫీసులో ఎన్నో సమస్యలు వచ్చాయి. బాబా దయవల్ల ఒక్కో సమస్యా పరిష్కారమవుతూ వచ్చింది. నాకు అన్నీ బాబానే. ఏ సమస్య వచ్చినా దానిని పరిష్కరించే బాధ్యతను బాబాకే అప్పగిస్తాను. అంతా ఆయనే చూసుకుంటారు. మనకు ఉండాల్సింది 'శ్రద్ధ - సబూరి' మాత్రమే. ప్రస్తుతం నేను నా ఉద్యోగంలో బదిలీ కోసం ఎదురుచూస్తున్నాను. దానిని నాకు ఎప్పుడు ఇవ్వాలో బాబాకు తెలుసు. బదిలీ అయ్యాక నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటాను.


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


బాబా ఊదీతో నయమైన కడుపునొప్పి


నేను సాయిభక్తురాలిని. నేను నా భర్త, పిల్లలతో యు.ఎస్.ఏ.లో నివాసముంటున్నాను. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. 2021, మార్చి మొదటివారంలో అకస్మాత్తుగా నాకు తీవ్రమైన కడుపునొప్పి మొదలైంది. కడుపులో మంటగా ఉంటూ నాకు ఎంతో అసౌకర్యంగా అనిపించి చాలా భయమేసింది. ఎందుకంటే, 2018లో ఇలాగే కడుపునొప్పితో మొదలై నేను చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాను. వాటన్నిటినుండి బాబానే నన్ను కాపాడారు. అదంతా నేను గతంలో మీతో ఒక అనుభవంలో పంచుకున్నాను. మళ్ళీ అలాంటి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందేమోనన్న ఆలోచనతో భయపడ్డాను. కానీ నాకు నేనే ‘బాబా నాకు సహాయం చేస్తార’ని నచ్చజెప్పుకున్నాను. ఇంట్లో చాలా మందులు ఉన్నా నేను వాటిని వాడలేదు. నేను చేసిందల్లా ఒక్కటే, బాబా ఊదీని నీళ్ళలో కలుపుకొని త్రాగడం, మరికొంత ఊదీని నా కడుపుపై రాసుకొని 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని జపించడమే. బాబా దయవలన వారంరోజుల్లో నా ఆరోగ్యం పూర్తిగా సాధారణ స్థితికి వచ్చింది. బాబాకు మాటిచ్చిన ప్రకారం నేను నా అనుభవాన్ని మీ అందరితో పంచుకున్నాను. "నాకు సహాయం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా! ప్రస్తుతం నేను మీరు ఎంతలా నాపై ప్రేమ కురిపిస్తున్నారో తెలియజేసే మీ అద్భుతాలను చాలా చూస్తున్నాను. గతంలో నేను ఏ పుణ్యం చేశానో నాకు తెలియదుగానీ, మీ ప్రేమను చాలా పొందుతున్నాను. బాబా! దయచేసి ఎల్లవేళలా మీరు నాతో ఉండండి, ఎప్పుడూ నా చేతిని విడిచిపెట్టకండి".


7 comments:

  1. అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. Om Sai ram 🙏🏽🙏🏽🙏🏽🙌👏🌹❤️🍁

    ReplyDelete
  4. Om Sai Ganeshwara Sraddha and Saburi are the coins of baba.when we follow this path Sai blesses us.hukha Leela is very nice Sai baba🙏🏽🙏🏽🙏🏽🌹👏🙌❤️👑

    ReplyDelete
  5. Om sai ram nenne namukunamu baba ma parsthithi gurinchi telusu kada mamalini rakshinchu thandri sainatha pleaseeee thandri

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo