- బాబా పెట్టిన భిక్ష - ఉద్యోగం
- నెలసరి సమస్యకు పరిష్కారం చూపి అనుగ్రహించిన సాయి
బాబా పెట్టిన భిక్ష - ఉద్యోగం
సాయిభక్తుడు సత్యసాయి వరప్రసాద్ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
అందరికీ నమస్కారం. నా పేరు సత్యసాయి వరప్రసాద్. మా అక్క పేరు రేవతి. తన ద్వారానే నాకు ఈ బ్లాగ్ గురించి తెలిసింది. బాబా వలన నాకు అర్థమైన జీవితం మరియు మాయ గురించి ఇంతకుముందు ఈ బ్లాగులో "జీవితం-మాయ" అనే శీర్షిక ద్వారా పంచుకున్నాను. అలాగే ఆ ఆర్టికల్‌లో నాకు ఉద్యోగం వస్తే ఆ అనుభవాన్ని ఈ బ్లాగులో అందరితో పంచుకుంటానని వ్రాశాను. ఆ అనుభవాన్నే ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను.
మనం సాయిబాబాను ఏదైనా కావాలి అని అడిగితే, అది ఇచ్చేముందు మాయ ద్వారా బాబా మనల్ని పరీక్షిస్తారు. ‘శిరిడీకి వచ్చే భక్తులను బాబా దక్షిణ అడిగి మరియు రాధాకృష్ణమాయి ఇంటికి పంపి పరీక్షించిన తర్వాత వాళ్లు అడిగినవి లేదా వాళ్లకు అవసరమైనవి ఇచ్చేవారు’ అని సచ్చరిత్రలోని ఒక అధ్యాయంలో చెప్పబడింది. బాబా మనల్ని పరీక్షించే సమయంలో, బాబా అడిగే ప్రశ్నలకు మనం సరైన సమాధానం ఇవ్వగలగాలి. అప్పుడు ఆ మాయ (చిక్కుముడి) నుంచి బయటపడే ఉపాయాన్ని బాబా మనకు ఇస్తారు. ఆ తర్వాత మనకు ఆ విషయంలో ఎటువంటి ఆపదా రాకుండా చూసుకుంటారు.
నా ఉద్యోగం విషయంలో కూడా అదే జరిగింది. మా అమ్మ నా ఉద్యోగం గురించి ఎన్నో పూజలు చేసింది, నా కోసం తనకు ఇష్టమైనవి కూడా వదిలేసింది. అలానే మా అక్కావాళ్లు కూడా నా ఉద్యోగం గురించి బాబాను ప్రార్థించి సచ్చరిత్ర పారాయణ చేశారు. అంతేకాదు, ఈ బ్లాగులో నా అనుభవాన్ని వ్రాయమన్నారు కూడా. అక్క సలహాతో నేను మహాపారాయణ చేయటం ప్రారంభించాను. పారాయణ ప్రారంభించిన 5వ వారంలో ఒకానొకరోజు బ్రహ్మముహూర్త సమయంలో బాబా నా ద్వారా "జీవితం-మాయ" అనే ఆర్టికల్‌ను ఈ బ్లాగులో పంచుకోవటం కోసం వ్రాయించుకున్నారు.
అవి చేయటం వలన బ్లాగులో పంచుకున్న రెండు రోజులకు నేను ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న నా ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. బాబా దయవలన వరుస దినములలో ఇంటర్వ్యూలు ఇచ్చి ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాను. నిజానికి చివరిదైన మేనేజర్ ఇంటర్వ్యూలో సరిగా సమాధానం ఇవ్వలేకపోయాను. అందువలన నాకు ఆ ఉద్యోగం రాదనుకొని చాలా భయపడ్డాను. కానీ బాబా దయవలన చివరి రౌండు ఇంటర్వ్యూ జరిగిన 10 రోజుల తర్వాత HR కాల్ చేసి, నేను ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యానని చెప్పి ఆఫర్ లెటర్ రిలీజ్ చేశారు. ఇదంతా బాబా పెట్టిన భిక్ష. “బాబా! నా మనసులో నీపై ఉన్న గురుభక్తి రోజురోజుకూ పెరుగుతూ, మంచి గుణాలైన శ్రద్ధ, సబూరిలు అలవడేలా అనుగ్రహించు గురుదేవా!”
నాకు బాబాపై ఇంతగా నమ్మకం ఉండటానికి కారణమైన మా అమ్మ శ్రద్ధ-సబూరికి సరైన ఉదాహరణ. ఎవరైనా బాధలో ఉంటే వాళ్లకు సాయిలీలలను చెప్పి వాళ్ళను సరైన దిశలో నడిపిస్తుంటుంది. గత సంవత్సరం ఆగస్టులో తను పదవీవిరమణ చేసింది. తనకు వాళ్ళ సంస్థ నుంచి రావలసిన మొత్తం ఇంకా అందలేదు. “బాబా! మీ చల్లని చూపుతో అవి త్వరగా తనకు వచ్చేలా చూడు తండ్రీ!” అవి వచ్చిన వెంటనే ఆ విశేషాలను మళ్ళీ మీ అందరితో పంచుకుంటాను.
నెలసరి సమస్యకు పరిష్కారం చూపి అనుగ్రహించిన సాయి
పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు బాబా తనకి ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:
సాయిభక్తులకు, ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారములు. బాబాకు మాట ఇచ్చిన ప్రకారం నా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. నేను విశాఖపట్నం నివాసిని. నేను ప్రతిరోజూ మన సాయి మహరాజ్ సన్నిధిలో ప్రచురించే సాయిభక్తుల అనుభవాలు చదువుతుంటాను. నాకు గత 4 నెలల నుంచి నెలసరి రావడం లేదు. ఒకరోజు నేను నెలసరి రావడం కోసం ఈ బ్లాగులో రెండు అనుభవాలు చదివాను. మొదటి అనుభవంలో, ‘తనకు బాబా అనుగ్రహంతో నెలసరి వస్తే సాయి నవగురువారవ్రతం చేసుకున్నాను’ అని ఒక భక్తురాలు పంచుకున్నారు. రెండవ అనుభవంలో, ‘తాను నెలసరి కోసం డాక్టర్ దగ్గరకు వెళ్తే తనకు PCOD సమస్యేమీ లేదని డాక్టరు చెప్పార’ని మరో భక్తురాలు పంచుకున్నారు. ఈ రెండు అనుభవాలు చదివి నేను సంతోషించాను. ఎందుకంటే, నాకు ఎలాంటి PCOD సమస్యా లేదు. దాంతో, ‘నన్ను కూడా నవగురువారవ్రతం చేయమని బాబా చెప్తున్నారు’ అనుకుని వ్రతం మొదలుపెట్టాను. మూడు వారాలు వరుసగా నవగురువారవ్రతం చేశాను. 4వ గురువారం వచ్చింది. సరిగ్గా అదేరోజు నెలసరి వచ్చింది. కృతజ్ఞతలతో బాబాకు పాదాభివందనాలు సమర్పించుకున్నాను.
నా 8 సంవత్సరాల ప్రేమ నాకు దూరమైంది. నేను మానసికంగా, శారీరకంగా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కోల్పోయాను, నరకయాతన అనుభవించాను. 4 సంవత్సరాల తర్వాత, చేసుకున్న కర్మను అనుభవించాలని అర్థం చేసుకున్నాను. నాకు స్నేహితులు కూడా ఎవ్వరూ లేరు. ఇప్పుడు బాబా అనుగ్రహంతో కొందరు సాయిభక్తులు స్నేహితులుగా పరిచయమయ్యారు. ఇప్పుడు వాళ్ళే నాకు స్నేహితులు. నేను మహాపారాయణ గ్రూపులో ఉన్నాను. అందులో 3 క్లాసులకు టీచరుగా ఉన్నాను. ఇదంతా కేవలం బాబా దయ. “బాబా! మీరు ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉండండి. నా తల్లిదండ్రులకు ఆరోగ్యాన్ని ప్రసాదించండి. ఒక మంచి వ్యక్తితో నా వివాహం జరిగేలా దీవించు సాయితండ్రీ! అందరికీ మీ ఆశీస్సులు ప్రసాదించండి బాబా!” నా వివాహం అనుభవంతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. నా అనుభవాలను పంచుకునే అవకాశం ఇచ్చిన బాబాకు నా ధన్యవాదములు.
Om sai ram baba I want your blessings to my son. Please be with him. Give him long life. Please you protect him every minute sai. He is corona doctor. Om sai ram������ ❤❤❤
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai Always be with me
703 days
ReplyDeleteSairam
Om sai ram baba pleaseeee Amma arogyam bagundela chudu sai thandri
ReplyDeleteOm Sairam
ReplyDelete🙏🙏🙏
Om sairam
ReplyDelete🙏🙏🙏
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI.. OM SAI RAM
ReplyDelete