- అన్నీ అడ్డంకులు అధిగమింపజేసి క్షేమంగా అమెరికా చేర్చిన బాబా
- ఉదయానికల్లా జ్వరం, తలనొప్పి తగ్గిపోయేలా దయ చూపిన బాబా
అన్నీ అడ్డంకులు అధిగమింపజేసి క్షేమంగా అమెరికా చేర్చిన బాబా
సాయిభక్తురాలు శ్రీమతి మంగ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
సాయిబంధువులందరికీ నమస్కారం. నేను ఈమధ్యనే ఈ బ్లాగ్ చదవటం జరిగింది. ఎన్నెన్ని అనుభవాలు! ఎంతమంది భక్తులు! ఈ బ్లాగ్ నిర్వాహకులకు చాలా కృతజ్ఞతలు. నా పేరు మంగ. నేను 2016 నుండి సాయిభక్తురాలిగా మారాను. అంతకుముందు కూడా సాయిని పూజించేదాన్ని, కానీ బాబాపై అంత నమ్మకం ఉండేది కాదు. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈమధ్యకాలంలో జరిగిన ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
మా అమ్మాయి తన కుటుంబంతో యు.ఎస్.ఏ లో నివసిస్తోంది. తను గర్భవతిగా ఉన్నప్పుడు 2020, సెప్టెంబరు నెలలో తనకు డెలివరీ టైం ఇచ్చారు. అయితే, 2020, ఏప్రిల్ నెలలోనే మా వీసా గడువు పూర్తికావటంతో తనకు సహాయంగా వెళ్ళే అవకాశం మాకు లేకుండా పోయింది. కరోనా కారణంగా వీసా రెన్యువల్‌కి దరఖాస్తు చేసుకోవడం వెంటనే వీలుపడలేదు. ఆ తరువాత దరఖాస్తు చేసుకుంటే 2021, ఫిబ్రవరిలో వీసా రెన్యువల్ అయింది. దాంతో మేము మార్చి 26వ తేదీన అమెరికా వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఇంతలో, ‘మార్చి ఒకటో తారీఖు నుండి 60 సంవత్సరాలు పైబడినవారికి కరోనా వ్యాక్సినేషన్ వేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామ’ని ప్రభుత్వం ప్రకటించింది. దాంతో, మేము వ్యాక్సినేషన్ తీసుకున్న తరువాతే అమెరికా వెళదామని నిర్ణయించుకున్నాము. మార్చి 2వ తారీఖున కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నాము. 28 రోజుల తరువాత, అంటే మార్చి 30వ తారీఖున రెండవ డోస్ వ్యాక్సినేషన్ తీసుకోవాల్సి ఉంది. అందువల్ల అంతకుముందు మార్చి 26వ తేదీకి బుక్ చేసుకున్న ఫ్లైట్ టికెట్లను క్యాన్సిల్ చేసుకుని, రెండవ డోస్ తీసుకున్న 10 రోజులకి, అంటే ఏప్రిల్ 9వ తారీఖున అమెరికా వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఈలోగా, మొదటి డోస్‌కి, రెండవ డోస్‌కి మధ్య కనీసం 6 నుంచి 8 వారాల సమయం ఉంటే టీకా సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పి రెండవ డోస్ తీసుకోవాల్సిన తేదీని మార్చారు ప్రభుత్వంవారు. “ఇదేంటి ఇలా జరిగింది? ఇప్పటికే ఒకసారి ప్రయాణం వాయిదా వేసుకున్నాము. మళ్ళీ ప్రయాణం వాయిదా వేసుకోవాలా?” అని అనుకున్నాము. అక్కడ అమెరికాలో మా అమ్మాయి ఒకవైపు ఉద్యోగాన్ని, మరోవైపు పిల్లలిద్దరినీ చూసుకోలేక చాలా బాధపడుతోంది. పోనీ నానీ(సహాయకురాలు)ని పెట్టుకుందామంటే కరోనా సమయం. దాంతో నా బాధనంతా బాబాకు చెప్పుకుని మాకు సహాయం చేయమని ప్రార్థించాను. సాయిని ప్రార్థించగానే మార్చి 29వ తేదీన ప్రైవేట్ హాస్పిటల్స్‌లో వ్యాక్సిన్ ఇస్తారని తెలిసింది. ఎంతో సంతోషంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకుని రెండవ డోస్ వ్యాక్సినేషన్ తీసుకున్నాము. అలాగే, విదేశాలకు వెళ్ళేముందు RTPCR టెస్ట్ రిపోర్టు కూడా నెగిటివ్ రావాలని బాబాను కోరుకుని 5 వారాలు సాయి దివ్యపూజ చేశాను. ఎందుకంటే కొన్నిసార్లు టెస్ట్ చేసే కిట్స్‌లో లోపం వలన టెస్ట్ రిపోర్టులు కూడా తప్పుగా వస్తుంటాయి. బాబా దయవలన RTPCR టెస్ట్ రిపోర్టు నెగిటివ్‌గా వచ్చింది. ఆ తరువాత బాబా ఆశీస్సులతో మేము ఏప్రిల్ 9వ తేదీన బయలుదేరి ఏ ఇబ్బందీ లేకుండా క్షేమంగా అమెరికా చేరుకున్నాము. అమెరికా చేరుకున్నాక క్వారంటైన్లో ఉండాల్సిన సమయం కూడా ఏ సమస్యలూ లేకుండా పూర్తయింది. బాబాకు మా వేలవేల ధన్యవాదాలు. బాబా ప్రసాదించిన ఈ అనుభవాన్ని మీతో పంచుకోగలగటం చాలా సంతోషంగా ఉంది.
ఉదయానికల్లా జ్వరం, తలనొప్పి తగ్గిపోయేలా దయ చూపిన బాబా
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
సద్గురు శ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ కీ జై!
నా పేరు మాధురి. ముందుగా, సాయిబంధువులకు, ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. బాబా ఆశీస్సులు ఎల్లవేళలా మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మొదటిసారి నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటున్నాను. 2021, ఏప్రిల్ 6వ తేదీ సాయంత్రం నాకు బాగా తలనొప్పి వచ్చింది. రాత్రయ్యేసరికి జ్వరం కూడా వచ్చింది. కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మా ఇంట్లో మరమ్మత్తు పనులు చేయడానికి కొంతమంది పనివాళ్ళు వస్తున్నారు. అందుచేత నాకు చాలా భయమేసి బాబా ఊదీని నీళ్లలో కలుపుకొని త్రాగి, టాబ్లెట్ కూడా వేసుకున్నాను. చాలామంది భక్తులు కోవిడ్ భయానికి, ఇంకా పలురకాల సమస్యల విషయంలో పరిష్కారం లభిస్తే తమ అనుభవాలను బ్లాగులో పంచుకుంటామని అనుకోవటం, సాయినాథుని కృపతో అవి పరిష్కారమవటం రోజూ బ్లాగులో చదువుతూ ఉంటాను. అందువలన నేను కూడా బాబాతో, "ఉదయానికల్లా ఈ జ్వరం, తలనొప్పి తగ్గిపోతే, నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి బ్లాగు'లో పంచుకుంటాన"ని చెప్పుకున్నాను. బాబా దయ చూపించారు. ఉదయానికల్లా తలనొప్పి, జ్వరం పూర్తిగా తగ్గిపోయాయి. "థాంక్యూ బాబా. మీ కృప మా అందరిపై ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను".
Om Sairam
ReplyDelete🙏🙏🙏
Om Sairam
ReplyDeleteSai always be with me
717 days
ReplyDeleteSairam
Om sai ram baba ma amma arogyam bagundali thandri please
ReplyDeleteOm sri sachidananda sadguru sainaadh mahaaraj ki jai
ReplyDeleteNamameeswaram Sadgurum Sainatham. Om Sai Sri Sai Jaya Jaya Sai🔥🔥🔥🌹🌹🌹💐💐💐🙏🙏🙏
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI.. OM SAI RAM
ReplyDelete