సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 741వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. బాబా ఊదీ - దివ్యౌషధి
  2. బాబా అనుగ్రహముంటే ఏ కష్టమూ ఉండదు


బాబా ఊదీ - దివ్యౌషధి

సాయిభక్తురాలు శ్రీమతి లక్ష్మి తనకు బాబా ఇటీవల ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.


నా పేరు లక్ష్మి. మేము బెంగుళూరులో ఉంటున్నాము. ముందుగా సాయినాథునికి మనఃపూర్వకంగా నమస్కరించి, తర్వాత ఈ బ్లాగును నిర్వహిస్తున్న అడ్మిన్ బృందానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సాయినాథుడు ప్రసాదించిన రెండు చిన్న అనుభవాలను నేనిప్పుడు మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను.


మొదటి అనుభవం:


రెండు నెలల క్రిందట మా పెద్దబ్బాయికి పన్నునొప్పిగా ఉంటే రూట్ కెనాల్ చేయించుకున్నాడు. తరువాత దవడ దగ్గర వాపు, నొప్పితోపాటు జ్వరం కూడా వచ్చేసరికి డాక్టరును సంప్రదిస్తే, "చిన్న ఇన్ఫెక్షన్" అని చెప్పి మందులు వ్రాసిచ్చారు. మందులతో తగ్గకపోగా వాపు కాస్తా గట్టిపడి బిళ్ళలా తయారైంది. దాంతో మళ్ళీ డాక్టరుని సంప్రదిస్తే, ఫిజీషియన్‌ని, సర్జన్‌ని కలవమన్నారు. వాళ్ళను సంప్రదిస్తే, "చిన్న సర్జరీ చేయాల"ని చెప్పి మాత్రలు ఇచ్చి రెండురోజులు వాడమన్నారు. నాకు భయమేసి బాబాకు మ్రొక్కుకొని, ఆ వాపుపై బాబా ఊదీని పూస్తూ, కొంత ఊదీని నీళ్లలో కలిపి రోజుకి రెండు, మూడుసార్లు మా అబ్బాయికి ఇవ్వసాగాను. క్రమంగా వాపు, నొప్పి, జ్వరం తగ్గి మామూలు స్థితికి వచ్చింది. దాంతో సర్జన్ "తగ్గుతోంది కదా, ఇక సర్జరీ వద్దు" అని అన్నారు. ఇదంతా ఆ సాయి మహరాజ్ అనుగ్రహం కాక ఇంకొకటి కాదు. "శతకోటి వందనాలు బాబా".


రెండవ అనుభవం:


2021, మార్చి నెల మొదట్లో మా చిన్నబ్బాయి పాదంలో నొప్పి కారణంగా సరిగా నడవలేక కుంటుకుంటూ చాలా ఇబ్బందిగా నడుస్తూంటే నేను సాయీశునికి నమస్కరించుకుని, "తప్పైతే క్షమించమ"ని చెప్పుకొని మా అబ్బాయి పాదానికి ఊదీ రాసి, మరికొంత ఊదీని నీళ్ళలో కలిపి ఇచ్చాను. అలా 3 రోజులు చేసేసరికి మందులు అవసరం లేకుండా తనకు నొప్పి పూర్తిగా తగ్గిపోయి హాయిగా ఉన్నాడు. "సాయినాథా! ఇలాగే మా సమస్యలన్నీ దూరంచేసి మా అందరినీ కాపాడుతూ ఉండండి. ధన్యవాదాలు బాబా".


బాబా అనుగ్రహముంటే ఏ కష్టమూ ఉండదు


పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు బాబా తనకు ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.


సాయిభక్తులందరికీ నా నమస్కారం. ఈ బ్లాగు నిర్వాహకులకు నా కృతజ్ఞతలు. నేను ఇంతకుముందు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో రెండు అనుభవాలను పంచుకోబోతున్నాను. 


మాకు ఒక చిన్న బాబు ఉన్నాడు. ఇటీవల ఒకసారి ఉద్యోగాన్వేషణ నిమిత్తం నేను, నా భర్త మా బాబును తీసుకొని బయటకి వెళ్ళవలసి వచ్చింది. ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితుల్లో బయటకి వెళ్లాలంటే చాలా భయం వేస్తోంది. పైగా మేము వెళ్లాల్సినచోట జనసమ్మర్ధం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్థితి. అందువలన వెళ్లేముందు నేను బాబాకు నమస్కరించుకొని, "వెళ్లే చోట మాకు ఎలాంటి సమస్యలూ లేకున్నట్లైతే నేను నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాతో చెప్పుకున్నాను. బాబా అనుగ్రహం వలన మాకు ఎలాంటి సమస్యలూ ఎదురుకాలేదు. "థాంక్యూ సో మచ్ బాబా!"


మరో అనుభవం:


నా భర్తకి కాలునొప్పి వస్తుండేది. డాక్టరుని సంప్రదిస్తే, "మొత్తం శరీరానికి స్కానింగ్ చేయించాలి" అని అన్నారు. ఇంకా "స్కానింగ్ చేయించిన తరువాత 7 రోజులకి రిపోర్టులు వస్తాయి" అన్నారు. అప్పుడు నేను బాబాతో, "నా భర్తకి ఏ సమస్యా లేకుండా రిపోర్టు నార్మల్‌గా వస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని చెప్పుకున్నాను. బాబా దయవలన రిపోర్టులో అంతా నార్మల్ అని వచ్చింది. ఎంతో ఆనందంగా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను.


7 comments:

  1. అనన్య చింతన.. అపురూప దివ్య నందన
    కారుణ్య నిలయ... కరుణా సముద్ర!!
    భక్త హృదయ విహారి..భయా నివారి
    లీలా విశ్వంభర దిగంబర.. శిరిడీశా సాయేశ
    పాహమాం రక్ష రక్ష 🙏🌷🙏

    ReplyDelete
  2. Om sainadha eswara udi is medicine to many diseases it cures with baba blessings.like dangerous cancer, corona virus����.baba is karuna murty om sai ram���� ��❤❤❤

    ReplyDelete
  3. Kothakonda SrinivasApril 11, 2021 at 9:29 AM

    ఓం సాయిరాం!

    ReplyDelete
  4. Om Sairam
    Sai Always Be With Me

    ReplyDelete
  5. Om sai ram baba Amma arogya samasya kuda teerchu thandri nenne namukunanu maku dikku nuvve thandri

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo