- మనస్ఫూర్తిగా చేసిన ప్రార్థన - లభించిన బాబా అనుగ్రహం
- వ్యాక్సిన్ వేయించుకొనేలా అనుగ్రహించిన బాబా
సాయిభక్తురాలు సాయిసంహిత తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
సాయి మహరాజ్ సన్నిధికి నా నమస్కారం. నా పేరు సాయిసంహిత. ఇంతకుముందు నేను నా అనుభవాలు కొన్నింటిని మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకోబోతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
గత నెల నేను ఒక తప్పు చేశాను. అది నాకు తెలీకుండానే జరిగిపోయింది. నా వల్ల అలా జరిగినందుకు నేను చాలా బాధపడ్డాను. అప్పుడు నేను బాబాకు నమస్కరించి, “ప్లీజ్ బాబా, ఇలాంటి తప్పులు ఇంకెప్పుడూ చేయను. ఈ గండం నుంచి గట్టెక్కితే నేను నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని మనస్ఫూర్తిగా ప్రార్థించాను. బాబా నన్ను కాపాడారు. “థాంక్యూ సో మచ్ బాబా!” ఇంకో విషయం, నేను ఈ తప్పు గురించి ఎన్నిసార్లు చీటీలు వేసినా సమాధానాలు ప్రతికూలంగానే వచ్చాయి. కానీ మనస్ఫూర్తిగా వేడుకోగానే బాబా నన్ను కాపాడారు.
మరో అనుభవం:
నేను సచ్చరిత్ర పారాయణ చేస్తున్నాను. “బాబా! సచ్చరిత్ర పారాయణ చేస్తున్నాను, నాకు మీ దర్శనం కావాలి బాబా” అని బాబాను కోరుకున్నాను. 2021, మార్చి 31న పారాయణ పూర్తయింది. అదేరోజు ఉదయం 5.30 గంటల సమయంలో నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో, బోరు వేసే బండి ఉంటుంది కదా, ఆ బండి మొత్తం బాబా మందిరంలా తయారుచేశారు. వెనకాల ఒక పెద్ద బాబా విగ్రహం ఉంది. బాబాను, బాబా మందిరాన్ని చూడగానే చాలా ఆనందం వేసింది. అంతలోనే, ‘బోర్ వేసేటప్పుడు బాబా వంగుతారు కదా’ అనుకున్నాను. అదే కలలో నేను మా ఫ్రెండుని కలిశాను. ఇంకా అక్కడ నాకు ఇష్టమైన వ్యక్తి పేరు కూడా వినిపించింది. నా ఫ్రెండుని కలిసి బయటికి వచ్చాక, మా అమ్మమ్మ శిరిడీ వెళ్ళే బస్సు ఎక్కింది. ఆ బస్సు పైన బాబా తిరగలి ఉంది. తరువాత నేను, మా అమ్మ, నాన్న కూడా ఆ బస్సు ఎక్కాము. ఆ బస్సులో ప్రయాణించేవారిలో కొంతమంది అన్నవరంలో దిగారట. మా అమ్మమ్మ కూడా అక్కడ దిగుతుంటే నేను కూడా దిగేశాను. మా నాన్న నా ట్రైనింగ్ ఫోటోలతో పాటు వెంకటేశ్వరస్వామి స్టిక్కర్లు తెచ్చిచ్చారు నాకు. అంతటితో నా కల ముగిసింది. ఆ కలకి అర్థమేమిటో తెలీదు కానీ, అడగగానే నాకు దర్శనం ప్రసాదించారు బాబా. బాబా ఎన్నడూ ఇచ్చిన మాట తప్పరు. “థాంక్యూ సో మచ్ బాబా!”
“బాబా! ఎందుకో చాలా భయం వేస్తోంది. ఒక్కోసారి నేను మీ మీద అనుమానం వ్యక్తం చేస్తున్నాను. మీరు మాట తప్పరని తెలిసి కూడా ఎందుకు ఇలా జరుగుతోందో తెలియడం లేదు. నన్ను క్షమించండి బాబా. నన్ను కాపాడండి. అన్ని దారులూ మూసుకుపోయాయి. మీరే వాటిని తెరచి నాది నాకు ప్రసాదించండి. బాబా! ఈ క్రమంలో ఎవ్వరూ బాధపడకుండా చూడండి. నాకు మీ మీద నమ్మకముంది. ప్లీజ్ బాబా, నన్ను కాపాడండి. నాకు అసలేం అర్థం కావడం లేదు. నాకు తోడుగా ఉండి నాది నాకు ప్రసాదించండి బాబా!”
వ్యాక్సిన్ వేయించుకొనేలా అనుగ్రహించిన బాబా
పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
సాయిభక్తులకు నా నమస్కారములు. నేను 2021, ఏప్రిల్ 3న కో-వ్యాక్సిన్ టీకా వేయించుకున్నాను. కానీ వ్యాక్సిన్ వేయించుకోవడానికి నేను ఎంత టెన్షన్ పడ్డానో ఆ బాబాకే తెలుసు. నిజానికి నేను ఆరోజు వ్యాక్సిన్ వేయించుకోవాలని అనుకోలేదు. కానీ ఎందుకో హఠాత్తుగా వ్యాక్సిన్ వేయించుకోవాలని అనిపించింది. అయినా భయం. దాంతో, "బాబా! నాకు చాలా భయం వేస్తోంది. మీకు ఎలా అనిపిస్తే అలా జరిగేలా చేయండి. టీకా వేయించుకోమన్నదే మీ ఉద్దేశ్యమైతే అలా జరిగేటట్టు చేయండి. భయం లేకుండా నేను వ్యాక్సిన్ వేయించుకొనేటట్లు చేస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాతో చెప్పుకున్నాను. తరువాత మావారితో వ్యాక్సిన్ గురించి ప్రస్తావించాను. అంతే, మావారు వ్యాక్సిన్ వేయించుకోవటానికి వెళదామని ఒకటే బలవంతపెట్టారు. బాబానే తనతో అలా అనిపిస్తున్నారని నాకనిపించి వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్ళాను. కానీ ఒకటే ఆందోళనపడ్డాను. గుండెదడ స్పష్టంగా వినపడుతోంది. భయంతో 'బాబా, బాబా' అని బాబానే తలచుకుంటూ ఎలాగో ఆయన దయవలన మొదటి డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నాను. "థాంక్యూ సో మచ్ బాబా. మాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి సదా మమ్మల్ని కాపాడండి బాబా".
Om sai ram baba I also need your darshan in dreams.i am waiting from so many years.i like Thrush day.i love baba very much.please bless my family��❤ be with us.baba you are my lovely Lord. Om sai ram ��������❤��
ReplyDeleteఓం సాయిరాం!
ReplyDeleteసాయి వచనం:-
ReplyDelete'ఎవ్వరి గురించీ తప్పుగా మాట్లాడవద్దు. నీ గురించి ఎవరైనా మాట్లాడినా చలించకు. వాడి మాటలు నీకేమీ గుచ్చుకోవు కదా. ఇతరులు చేసే పనులకు ఫలితం వారే అనుభవిస్తారు. నీవు చేసే పనుల ఫలితమే నీకుంటుంది.'
'బాబా ఉన్నారు. బాబా తప్పక మేలు చేస్తారు. బాబా చూసుకుంటారు
Om Sai Ram
ReplyDeleteఓం సాయి రామ్...
ReplyDelete