సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 742వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. భక్తుల వెన్నంటి ఉండి వారి బాగోగులు చూసుకొనే దైవం బాబా
  2. మనసు కుదుటపరచిన బాబా

భక్తుల వెన్నంటి ఉండి వారి బాగోగులు చూసుకొనే దైవం బాబా


విజయవాడ నుండి సాయిభక్తుడు ఉపేంద్ర తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.


సాయిభక్తులందరికీ నా నమస్కారం. నా పేరు ఉపేంద్ర. నేను విజయవాడలో నివాసం ఉంటున్నాను. ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే సాయిబాబా భక్తుల అనుభవాలు చదవడం నాకు అలవాటు. ఈ బ్లాగును నిర్వహిస్తున్న మీకు నా కృతజ్ఞతలు. ఇటీవల నా జీవితంలో చోటుచేసుకున్న అద్భుతమైన అనుభవాలను మీ ముందుకు తీసుకొస్తున్నాను. 


నాకు గత సంవత్సరకాలం నుండి అప్పుడప్పుడు ఛాతీలో నొప్పి వస్తుండటంతో మానసికంగా ఆందోళన చెంది ఎంతోమంది డాక్టర్లను సంప్రదించి రకరకాల టెస్టులు చేయించుకున్నాను. ఆ రిపోర్టులు పరిశీలించిన డాక్టర్లంతా, “మీకు ఏ సమస్యా లేదు” అని చెప్పినప్పటికీ ఛాతీలో నొప్పి మాత్రం తాత్కాలికంగా తగ్గటం, మళ్లీ తిరిగి అప్పుడప్పుడు నొప్పి రావడం జరుగుతోంది. గత నెలలో అదేవిధంగా ఛాతీలో నొప్పి రావడంతో బాబా దగ్గరికి వెళ్లి, ‘నేను డాక్టర్ దగ్గరికి వెళ్లాలా, వద్దా?’, ‘ఈ నొప్పి తగ్గుతుందా, లేదా?’ అని చీటీలు వేసి బాబాను అడిగాను. దానికి సమాధానంగా, డాక్టర్ దగ్గరకు వెళ్ళవద్దుఅని చెప్పారు బాబా. ఆశ్చర్యకరంగా, ఆరోజు సాయంత్రానికి నా ఛాతీనొప్పి తగ్గిపోయింది. ఆ తరువాత బాబా దయవల్ల మళ్ళీ ఇప్పటివరకు నాకు ఛాతీనొప్పి రాలేదు. అందుకు బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 


ఇటీవలే జరిగిన మరొక సంఘటన:


ఒకరోజు నేను క్రిందపడటం వల్ల నా కుడిచేయి మణికట్టు దగ్గర ఫ్రాక్చర్ అయింది. డాక్టర్ దగ్గరకు వెళితే, మొదట చేతికి మామూలు కట్టుకట్టి, “మూడు రోజుల తర్వాత రండి, ఎంఆర్ఐ స్కాన్ చేద్దాం. దాన్నిబట్టి అవసరమైతే సర్జరీ చేయవలసి ఉంటుంది” అని చెప్పారు. మూడు రోజుల తర్వాత గురువారంనాడు మళ్ళీ డాక్టర్ దగ్గరకు వెళ్ళాను. వెళ్లేముందు బాబాకు నమస్కరించుకుని, “బాబా! ఈరోజు డాక్టరుగారు నాకు సర్జరీ అవసరం లేదని చెబితే నా ఈ అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను. దయచేసి నాకు సర్జరీ అవసరం రాకుండా చూడు తండ్రీ!” అని వేడుకున్నాను. డాక్టర్ దగ్గరకు వెళ్ళగానే డాక్టరుగారు నా చేతిని పరిశీలించి, “ఎంఆర్ఐ స్కాన్ కూడా అవసరం లేదు. మూడురోజుల తర్వాత రండి, కట్టు మార్చి పంపిస్తాను. నాలుగు వారాల్లో పూర్తిగా నయం అవుతుంది” అని చెప్పారు. అంతకుముందు ‘ఎంఆర్ఐ స్కాన్ చేసి అవసరమైతే సర్జరీ చేయాల’ని చెప్పిన అదే డాక్టర్ ఇప్పుడు కనీసం ‘ఎంఆర్ఐ స్కాన్ కూడా అవసరం లేదు’ అని చెప్పటం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. ఇదంతా కేవలం బాబా దయ మాత్రమే. బాబా పిలిస్తే పలికే దైవం. ఎల్లప్పుడూ తన భక్తుల వెన్నంటి ఉండి వారి బాగోగులు చూసుకుంటారు, మార్గనిర్దేశనం చేస్తారు. 


శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


మనసు కుదుటపరచిన బాబా


పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు ఇటీవల బాబా తనకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి


సాయిభక్తులకు నా నమస్కారములు. నేను 2021, మార్చి 19, సాయంత్రం 5 గంటలకు జరిగిన ఒక చిన్న అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. మా అబ్బాయి హైదరాబాదులో ఇల్లు కొనుక్కున్నాడు. ప్రస్తుతం ఆ ఇంటిలో కర్రపని నడుస్తోంది. మేము వేరే ఊర్లో ఉంటున్నందువలన ఆ పనులన్నీ మా అబ్బాయే చూసుకుంటున్నాడు. ఒక్కోసారి తను ఆఫీసుకు సెలవుపెట్టి గానీ లేదా శని, ఆదివారాల్లో గానీ పని జరిగే చోటుకి వెళ్ళి చూస్తుంటాడు. మిగిలినరోజుల్లో పనివాళ్ళతో వాట్సాప్‌లో ఫోటోలు పెట్టమని, చూసి సలహాలిస్తుంటాడు. ఆ ఫోటోలు మాకు కూడా పంపి ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే చెప్పమంటాడు. మేము కూడా ఏదైనా చెప్పాల్సి ఉంటే చెప్పడం, బాగుంటే ఓకే అని చెప్పడం చేస్తుంటాము. అలాగే మార్చి 19న కూడా మా అబ్బాయి వాట్సాప్‌లో మెసేజ్ పెట్టాడు. ఆ సమయంలో నేను నిద్రపోతున్నాను. 4:30కి ఆ ఫోటో చూసి 'ఓకే' అని సమాధానమిచ్చాను. కానీ, తర్వాత ఐదు గంటల సమయంలో మళ్లీ చూసి ఒకదాని గురించి, "అలా పెట్టించావేమిటి?" అని అడగటానికని మా అబ్బాయికి ఫోన్ చేశాను. అయితే తను ఫోన్ తీయలేదు. సరే, తరువాత మాట్లాడదామనుకొని నేను ఊరుకున్నాను. అంతలో తను ఫోన్ చేసి, "నేను అప్పుడే బండి స్టార్ట్ చేశాను, నువ్వు ఫోన్ చేశావు. దాంతో హఠాత్తుగా బ్రేకు వేశాను. బ్యాలన్స్ తప్పింది. కొంచెం ఉంటే క్రిందపడిపోయేవాడిని" అని కోపంగా మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. ఒక్కసారిగా నా మనసు ఏదోలా అయిపోయింది. "తనకేమైనా అయిందా?" అని ఆందోళనగా అనిపించి, 'బాబా, బాబా' అని బాబా రక్షక మంత్రాన్ని 11 సార్లు చదివి, "బాబా! మీ దయవల్ల తనకి ఏమీ కాకుండా ఉంటే నా అనుభవాన్ని ఈరోజే బ్లాగుకు పంపిస్తాను" అని అనుకున్నాను. తరువాత మా అబ్బాయికి మెసేజ్ పెడితే, "దెబ్బలేమీ తగల్లేదు" అని అన్నాడు. దాంతో మనసు కుదుటపడి సంతోషంగా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. "బాబా! మీ దయ ఎల్లవేళలా మాపై ఉండాలి".


12 comments:

  1. Kothakonda SrinivasApril 12, 2021 at 7:59 AM

    ఓం సాయిరాం!

    ReplyDelete
  2. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. Baba tandri you are my lord.sai baba tomorrow is ugadi festival please bless baba this new year must bring happiness to people in the world.destroyed corona virus���� from the world.be with us and bless us.

    ReplyDelete
  5. మా అబ్బాయి ముమ్ములి వదిలి వెళ్లిపోయి
    699 ఐపొయింది సాయి తండ్రీ

    ReplyDelete
  6. Om sai ram baba Amma problem tondarga cure cheyi thandri pleaseeee

    ReplyDelete
  7. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI.. OM SAI RAM

    ReplyDelete
    Replies
    1. Chaalaa baagunnaye meru pampina anubhavaalu om sai ram

      Delete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo