సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 735వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. ఊదీతో నిద్రలేమి మాయం
  2. సాయిబాబా లీలలు, ఆయన చూపే దయ, ప్రేమ ఊహించలేనివి


ఊదీతో నిద్రలేమి మాయం


కర్నూలు నుండి సాయిభక్తురాలు లలిత తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


సాయిబంధువులందరికీ నా వందనాలు. నాకు అమ్మ, నాన్న అయిన నా సాయితండ్రికి శతకోటి పాదాభివందనాలు. ఈ సాయి బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. నా పేరు లలిత. నేను కర్నూలులో నివసిస్తున్నాను. నా సాయితండ్రితో నాకు అనుబంధం ఎలా కుదిరిందో, సరిగ్గా ఎప్పుడు ఆ స్వామి నా జీవితంలోకి వచ్చారో నాకు సరిగా గుర్తులేదుగానీ, ఆ తండ్రి నా జీవితంలోకి వచ్చినప్పటినుంచి నాకు తల్లి, తండ్రి లేని లోటు తీరుస్తున్నారు. బాబా నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించినప్పటికీ నేను ఆయనకు గొప్ప గొప్ప పూజలేమీ చేయలేదు. నా మనసును నా సాయితండ్రికి అంకితం చేయడం తప్ప మరేమీ చేయలేదు. నా జీవితంలో మొదటి ప్రాధాన్యత బాబాకే, ఆ తరువాతనే ఎవరికైనా.


నేను ఈ సాయిబాబా గ్రూపులోకి చేరడం కూడా ఒక అనుభవమే. నేను ఒక బ్యుటీషియన్ని. ఒకరోజు అనుకోకుండా నా దగ్గరకు ఒకామె వచ్చారు. ఆమే నాకు ఈ బ్లాగ్ గురించి చెప్పారు. కానీ ఆమె కేవలం రెండు మూడుసార్లు మాత్రమే నా వద్దకు వచ్చారు, ఆ తరువాత మళ్ళీ ఎప్పుడూ రాలేదు. కేవలం నన్ను ఈ గ్రూపులో చేర్చడానికే ఆమె వచ్చారు, కాదు.. కాదు, బాబానే ఆమెను పంపించారు అనేది నా నమ్మకం. ఎందుకంటే, ఆ తరువాత మేముండే ఏరియాలో ఆమె మళ్ళీ ఎప్పుడూ కనిపించలేదు. నాపై కరుణతో బాబా నన్ను ఈ గ్రూపులో జాయిన్ చేయించారని ఎంతో సంతోషించాను. 


ఈ గ్రూపులో నా అనుభవాలను పంచుకోవాలని నాకు చాలాసార్లు అనిపించింది. కానీ ఎలా పంపాలో తెలియక ఇన్నాళ్ళూ ఆగిపోయాను. ఇన్నిరోజులూ పంపకుండా ఆలస్యం చేసినందుకు బాబాను క్షమాపణలు కోరుతున్నాను. “మీ ఈ బిడ్డను క్షమించండి బాబా!” నాకు కలిగిన ఎన్నో అనుభవాలలో ఇప్పుడు చెప్పబోయే అనుభవం ఒకటి. మనం బాబా ఊదీ గురించి విన్నాము, చదివాము, ధరించాము కదా. ఊదీ లీలలు అద్భుతం. 2013 సంవత్సరం నుంచి నాకు నిద్రపట్టని రోగం ఉంది. ఎంత ప్రయత్నించినా నిద్రపట్టేది కాదు. డాక్టర్ వద్దకు వెళితే నిద్రపట్టడానికి మాత్రలు ఇచ్చారు. అవి వేసుకుంటే బాగా నిద్రపట్టేది. కానీ ‘ఇలా ఎన్నిరోజులు నిద్రమాత్రలు వేసుకోవాలి?’ అని చాలా బాధపడేదాన్ని. కానీ ఆ మాత్రలు వేసుకోవడం తప్పేది కాదు. నిద్రమాత్రలు వేసుకోకపోతే నిద్రపట్టేది కాదు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. నేను బాబా చరిత్ర పారాయణ చేస్తూ ఉంటాను. అందులోని ఊదీ లీలలు చదువుతున్నప్పటికీ, ప్రతిరోజూ ఉదయం, రాత్రి ఊదీని నుదుటన పెట్టుకునేదాన్నే గానీ నీళ్ళలో ఊదీ వేసుకుని త్రాగి, కొంచెం ఊదీని పొట్లంలో కట్టి తలక్రింద పెట్టుకుని పడుకోవాలనే ఆలోచన నాకు తట్టలేదు. ఇలా నిద్రలేమితో బాధపడుతూ ఉండగా, 2021 జనవరిలో నేను మా అక్కావాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడున్న బాబా గుడికి వెళ్ళి బాబా ఊదీని ఎక్కువగా తీసుకుని వచ్చాను. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, నేను కూడా రాత్రి పడుకునేముందు ఊదీ ధరించి, కొంచెం ఊదీని నీళ్ళలో కలుపుకుని త్రాగి, కొంచెం ఊదీని పొట్లంలో పెట్టుకుని దిండుక్రింద పెట్టుకుని పడుకుందామని. వెంటనే నేను బాబాకు నమస్కరించి, “మీ ఊదీ మహిమ వల్ల బాగా నిద్రపడితే నేను నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటాన”ని మ్రొక్కుకుని, ప్రతిరోజూ పడుకునేముందు ఊదీని నీళ్ళలో కలుపుకుని త్రాగి, ఊదీ పొట్లాన్ని తలక్రింద పెట్టుకోవడం ప్రారంభించాను. అప్పటినుండి బాబా దయవల్ల నాకు చాలా బాగా నిద్రపడుతోంది. అలా జనవరిలోనూ, ఫిబ్రవరిలోనూ, మార్చి నెల ప్రారంభం వరకు బాగా నిద్రపట్టింది. కానీ కొద్దిరోజుల నుంచి నాకు మళ్ళీ సరిగా నిద్రపట్టడం లేదు. ‘ఎందుకిలా జరుగుతోందా?’ అని ఆలోచిస్తే, నేను ఈ అనుభవాన్ని ఈ గ్రూపులో పంచుకుంటానని బాబాకు ఇచ్చిన మాటను మర్చిపోయాననే విషయం గుర్తొచ్చింది. “నా మతిమరుపుకి సిగ్గుపడుతున్నాను. నన్ను క్షమించండి బాబా! మీకు మాటిచ్చినట్లు ఇప్పుడు నా అనుభవాన్ని గ్రూపులో పంచుకుంటున్నాను”.


బాబా సర్వాంతర్యామి. ఆయన లీలలను మనం కనుగొనలేము. “బాబా! మీ దయ, కరుణ ఇలాగే మాపై ఎల్లప్పుడూ ఉండాలి తండ్రీ! అందరినీ చల్లగా చూడండి. మీ దయలేనిదే మేము లేము తండ్రీ! బాబా, మీకు నా సాష్టాంగ నమస్కారములు”. మళ్ళీ మరో అనుభవంతో త్వరలో మీ ముందుంటాను.


సాయిబాబా లీలలు, ఆయన చూపే దయ, ప్రేమ ఊహించలేనివి

సాయిబంధువులకు నమస్కారం. నా జీవితంలో బాబా నాకు ఎన్నెన్నో నిదర్శనాలు చూపించారు, నేను కోరిన కోర్కెలెన్నో నెరవేర్చారు. కోరిక నెరవేరిన తరువాత నేను మ్రొక్కినవాటిని నెరవేర్చకపోయినా ఆ తండ్రి నాపైన ఎటువంటి కోపమూ చూపకుండా మరల మరల నా కోరికలను తీరుస్తూ, నన్ను కష్టాలనుండి గట్టెక్కిస్తూ, నా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. నేను ఎన్నో అనుభవాలను ఈ బ్లాగులో పంచుకోవాలని అనుకున్నాను, కానీ నా కష్టం తీరాక వాటిగురించి మర్చిపోయాను. ఆ తరువాత నాకు గుర్తుకొచ్చినప్పటికీ వాటిని పట్టించుకోకుండా గాలికి వదిలేశాను. అయినా ఆ దయగల తండ్రి నాపై కరుణ చూపిస్తూనే ఉన్నారు. కానీ ఇటీవల జరిగిన ఒక సంఘటన గురించి నేను మీకు చెప్పకపోతే నిజంగా అది ద్రోహమే అవుతుంది. ఇటీవల నాకు పెద్దమొత్తంలో డబ్బు అవసరం కలిగి దానికి పరిష్కారం దొరక్క చాలా ఇబ్బంది వచ్చిపడింది. ఏం చేయాలో తెలియక చాలా టెన్షన్ పడ్డాను. నిజంగా కొంచెం పెద్దమొత్తంలోనే డబ్బు అవసరం వచ్చింది. అది ఎంత పెద్ద అవసరం అంటే, ఆరోజు 2 గంటల సమయానికి డబ్బు అందకపోతే నా పరువు పోయి నేను తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడేది. ఎప్పటిలాగే, ‘నా అవసరం తీరితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన’ని సాయికి మ్రొక్కుకుని నా ప్రశ్నకు సాయిబాబా సమాధానం కోసం వెతికితే నాకు సమాధానంగా, "నిరాశచెందకు, నీ ఇబ్బంది ఒక సామాన్య మనిషి ద్వారా తీరుతుంది" అని వచ్చింది. నిజంగా బాబాపై భారమైతే వేశానుగానీ, ఈసారి మాత్రం ఈ సమస్య తీరుతుందని నాకు ఎటువంటి నమ్మకమూ కలగలేదు. కానీ ఒక అద్భుతం జరిగింది. నేను ఒక సంవత్సరం క్రితం మాకు తెలిసినవాళ్ళను కొంత డబ్బు అప్పుగా అడిగాను, కానీ ఆ సమయానికి వాళ్ల దగ్గర డబ్బు సర్దుబాటు కాలేదు. తరువాత ఆ విషయం వదిలేశాను. ఈమధ్యలో మేము కనీసం ఫోనులో కూడా మాట్లాడుకోలేదు. కానీ నాకు డబ్బు అవసరం అనుకున్నరోజు సరిగ్గా 11 గంటలకు వాళ్ళు నాకు ఫోను చేసి, “అప్పుడు మీరు అడిగినప్పుడు డబ్బు సర్దుబాటు చేయలేకపోయాము. ఇప్పుడు డబ్బు సిద్ధంగా ఉంది, వచ్చి తీసుకెళ్ళండి” అని చెప్పేసరికి నేను ఒక్కసారిగా ఆ సాయితండ్రి చూపిన లీలకు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. వెంటనే తేరుకుని, వెళ్లి ఆ డబ్బు తీసుకుని నా అవసరం తీర్చుకుని బాబా దయతో ఇబ్బందినుండి బయటపడ్డాను. నిజంగా సాయిబాబా లీలలు, ఆయన చూపే దయ, ప్రేమ మనం ఊహించలేనివి. మనకు బాబాపై శ్రద్ధతో కూడిన నమ్మకం ఉంటే ఆ తండ్రి దయతో మనకు జీవితంలో ఏ లోటూ ఉండదు.


9 comments:

  1. Om sai ram i am also using sleeping tables from more years.i also follow this method.and get sai blessings with pavitramina udi.udi is blessing of baba to cure our health.om sai ram❤❤❤

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. 692 days
    sai ram

    Om sairam , Om Sairam , Om Sairam , Om Sairam, Om Sairam. Om Sairam

    ReplyDelete
  4. Om sairam jai sairam 🙏🙏🙏

    ReplyDelete
  5. Kothakonda SrinivasApril 5, 2021 at 8:52 PM

    ఓం సాయిరాం!

    ReplyDelete
  6. Om sai ram baba nuvvu chepinatte amma medicine vadtundi pleaseeee tondarga cure cheyi baba nenne namukuna thandri pleaseeee help us

    ReplyDelete
  7. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI.. OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo