- బాబా ఫోటోనే ఊదీగా భావించి పొందిన అనుగ్రహం
- జటిలమయిన సమస్యను సులువుగా పరిష్కరించిన బాబా
సాయిభక్తుడు సత్య తమకి బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:
నేను ఈ ప్రపంచంలో కేవలం ఒక అణువును మాత్రమే. నా వయస్సు 67 సంవత్సరాలు. నేను చదువుకున్నాను గానీ, వ్రాసే అలవాటు అస్సలు లేదు. ఎప్పుడో చదువుకునే రోజుల్లో మా నాన్నగారికి ఉత్తరం వ్రాసేవాడిని, మరలా ఇన్నాళ్ళకు సాయి ప్రసాదించిన అనుభవాలను వ్రాస్తున్నాను. తప్పులేమైనా ఉంటే క్షమించండి. చిన్నప్పుడు నాకు దేవుడు, దయ్యం అనే నమ్మకాలేమీ లేవు. కానీ నేను 7వ తరగతి చదువుతున్నప్పటినుండి నాలో దైవభక్తి పెరిగింది. దానితోపాటు వయసు పెరిగింది. కాలేజీ చదువు అయిపోయింది. వివాహం కూడా జరిగింది. వివాహానికి ముందు నేను ఉద్యోగంలో చేరాను. ఒకసారి (1981 లేదా 1982లో) నేను, నా సీనియర్స్ కలిసి అఫీషియల్‌గా ఒక ప్రాజెక్టు పనిమీద పూనా వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు అనుకోకుండా నేను, నా స్నేహితుడు కలిసి శిరిడీ వెళ్ళాము. ఉదయాన్నే పూనా నుండి బస్సులో బయలుదేరి శిరిడీ చేరుకుని బాబా దర్శనం చేసుకుని సాయంత్రానికల్లా హోటలుకు తిరిగి వచ్చేశాము. అప్పట్లో నాకు బాబా గురించి అంతగా తెలియదు. బాబాను దర్శించుకున్నప్పటినుండి నా జీవితంలో ఎన్నెన్నో అనుభవాలు, అద్భుతాలు జరిగాయి. వాటినన్నింటినీ ఒక్కొక్కటిగా ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకుంటాను. అన్నీ వ్రాయడానికి ఎన్నో రోజులు పట్టవచ్చు. ప్రస్తుతం కొద్దిరోజుల క్రితం జరిగిన ఒక చిన్న అనుభవాన్ని మీతో పంచుకుంటాను.
గత ఒకటిన్నర నెలల నుండి నేను, మా అబ్బాయి హాస్పిటల్లోనే ఉంటున్నాము. మా అబ్బాయి ఒక పేషెంటు, నేను తనకు సహాయంగా ఉంటున్నాను. సుమారు 5 నెలల నుండి నేను సాయిచరిత్ర పారాయణ చేస్తున్నాను. కొద్ది రోజుల క్రితం ఉన్నట్టుండి నాకు కడుపులో ఎడమవైపు నొప్పి రావడం మొదలుపెట్టింది. నొప్పి తగ్గటానికి పెయిన్ బామ్, పెయిన్ స్ప్రే వాడుతున్నప్పటికీ నొప్పి తగ్గలేదు. పెట్టుకుందామంటే నా దగ్గర బాబా ఊదీ కూడా లేదు. ఇక చేసేది లేక మొబైల్ స్క్రీన్ సేవర్‌లో ఉన్న బాబా ఫోటోనే ఊదీగా భావించి దానిని కడుపుకి అద్దుకుని, ఫోటోలో ఉన్న బాబా పాదాలను చేత్తో తాకి నాలుకపై ఊదీ రాసినట్లు రాసుకున్నాను. తరువాత బాబాకు నమస్కరించి, “సాయీ, నా కడుపునొప్పి తగ్గించు తండ్రీ! నా నొప్పి తగ్గిన వెంటనే నా అనుభవాన్ని మన బ్లాగులో పంచుకుంటాను” అని ప్రార్థించి పడుకున్నాను. అంతే, బాబా అనుగ్రహంతో తెల్లవారేసరికల్లా నొప్పి తగ్గిపోయింది. “థాంక్యూ బాబా!” ఈ ఒక్కటే కాదు, నా జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. వాటన్నిటినీ ఒక్కొక్కటిగా మీతో పంచుకోగలనని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
జటిలమయిన సమస్యను సులువుగా పరిష్కరించిన బాబా
గుంటూరు నుండి సాయిభక్తుడు శ్రీనివాసరావు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
సాయిబంధువులకు, ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా నమస్కారములు. నా పేరు శ్రీనివాసరావు. ఇంతకుముందు నేను ఈ బ్లాగు ద్వారా నా అనుభవాలను కొన్నిటిని మీతో పంచుకున్నాను. ఇప్పుడు ఇంకొక అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. 2005వ సంవత్సరంలో మా నాన్నగారు మరణించారు. అయితే, ఆయన జీవించి ఉన్నప్పుడు ఆయన పేరుమీదుగా 1988లో గవర్నమెంటు ఒక ప్లాటు ఇచ్చింది. మా నాన్నగారి మరణానంతరం మేము ఆ ప్లాటు ఉన్న ఊరు విడిచిపెట్టి వేరే ఊరికి వెళ్లి అక్కడే ఉంటున్నాము. మేము ఆ ప్లాటు ఉన్న ఊరిలో లేకపోవడం చేత వేరేవాళ్ళు ఆ ప్లాట్ తమదేననీ, మా నాన్నే ఆ ప్లాటును తమకు అమ్మారనీ చెప్పి దానిని ఆక్రమించుకున్నారు. వారి వద్ద ఆ ప్లాటు తమదని ఋజువుచేసే పత్రాలేమీ లేవు. ఈ విషయం ఇప్పటివరకు అలాగే పెండింగులో ఉంది. అయితే ఇటీవల వారు ఆ ప్లాటును అమ్మాలని చూస్తున్నట్టు మాకు తెలిసింది. మా వద్ద ఆ ప్లాటుకు సంబంధించిన పత్రాలు ఎక్కడ ఉన్నాయో తెలియదు. దాంతో నేను బాబాకు నమస్కరించుకుని, “ధర్మం ప్రకారం ఆ ఫ్లాటు మాది అయితే దానిని మాకు అప్పగించు బాబా” అని ప్రార్థించాను. ఇందులో ఇంకొక విషయం ఏమిటంటే, మా ప్లాటును ఆక్రమించినవారు ఎస్సీలు. అందువల్ల మేము ప్లాటు వద్దకు వెళితే వారు ఎస్సీ-ఎస్టీ కేసు పెడతారనే భయంతో, ‘మేము ఆ ప్లాటు వద్దకు వెళ్లకుండానే ఈ సమస్యకు తగిన పరిష్కారం చూపమ’ని బాబాను వేడుకున్నాను. అద్భుతం! మేము ఆ ప్లాట్ దగ్గరకు వెళ్లకుండానే దానిని ఆ ఊరికి చెందిన వేరేవారు మావద్ద కొనేటట్టు చేశారు బాబా. ఎంతో జటిలమయిన ఈ సమస్యను బాబా చాలా సులభంగా పరిష్కరించారు. బాబాకు మనసారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శ్రద్ధ, సబూరీలను ఎల్లవేళలా మాకు అనుగ్రహించవలసినదిగా ప్రార్థిస్తున్నాను.
Jai sairam
ReplyDelete🙏🙏🙏
Om sai ram sai leelas are miracles. If we trust Lord baba photo can cure any diseases.that is power of baba.i love baba. Om saima��❤��������
ReplyDeleteఓం సాయిరాం!
ReplyDeleteఓం సాయిరాం 🌹🙏🌹
ReplyDeleteOm sai ram baba pleaseeee ma pyna daya chupinchu thandri amma ki problem tondarga cure cheyi thandri sainatha
ReplyDeleteBaba.. నా కోరిక మన్నించి.. మా బావమరిదిని కరోన బారి నుండి రక్షించావు తండ్రి. ఎవరికి ఏ కష్టం వచ్చినా నిన్ను శరణు కోరితే.. వెంటనే నువ్వు వారిని అనుగ్రహిస్తావు తండ్రి. అలాగే మా చెల్లెలి ఆరోగ్యం కూడా బాగుచెయ్యు తండ్రి.
ReplyDeleteశ్రీ సమర్ధ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.
ఓం సాయి రామ్
ReplyDeleteOm Sai Ram....
ReplyDeleteBaba plz Daddy ni kapadu thandri...I beg U Baba plzzzz. Plz show Ur miracle Baba. Plzzzz plzzzz plzzzz Daddy ni Kapadu thandri... Plzzz
ఓం సాయి రామ్
ReplyDeleteబాబా మా నాన్న ఆరోగ్యం కాపాడు తండ్రి, ఈరోజు ఉదయం నువ్వు చూపించిన మహిమ నేను మరవలేనిది, కరోనా తో బాధ పడుతున్న మా నాన్నని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళే దారిలో నే నాన్న ఆరోగ్యం మెరుగు పరిచి అంతో టెన్షన్ తగించవ్... చాలా థాంక్స్ బాబా.. మా నాన్నని హాస్పిటల్ లో జాయిన్ చేయకుండా ఇంటికి వచ్చేశాం. నీ మహిమ కి చాలా హ్యాపీ బాబా....
ఓం సాయి రామ్...
ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మారాజ్ కీ జై.....
ReplyDeleteసాయి బాబా ఈరోజు నువ్వు చుపించిన మహిమ అద్బుతం... నేను బైక్ పై నుండి కిందపడల్సిన నన్ను కపాడవ్ తండ్రి... నన్ను ఆక్సిడెంట్ నుండి కాపాడినబాబా కి చాలా థాంక్స్...
నాన్న ఆరోగ్యం కాపాడు తండ్రి...
మా కుటుంబాన్ని కాపాడు తండ్రి.. ప్లీజ్ అందరి ఆరోగ్యం కాపాడు బాబా...
ఓం సాయి రామ్...
సాయిబాబా తండ్రి సాయినాథ నేను మీ దయ తో చాలా ఆరోగ్యంగా ఉన్నాను తండ్రి..బాబా దేవా తండ్రి.. నాకు గత రెండు నెలల క్రితం జాండీస్ అయ్యినప్పుడు మీరు అందించిన ఆశీస్సులతో త్వరగా తగ్గి నయమైంది తండ్రి.. కానీ నేను చాలా బక్కగా ఉండే సరికి అందరు నన్ను ఇంకా ఆరోగ్యం నయం కాలేదా అని అడుగుతున్నారు బాబా చాలా భయంగా ఉంది.. దయచేసి నా టెన్షన్ ను తగ్గించి.. మీ ఆశీస్సులతో నాకు ఆనారోగ్యాన్ని లేకుండా చేసి మంచి ఆరోగ్యంతో త్వరగా ఆరోగ్యవంతుడి గానేను అయ్యేలా దీవించండి సాయిరాం బాబా దేవా.. నీవే తప్ప మాకెవరికీ భూమిలో నీవే కలవు సాయిరాం బాబా తప్పులు ఉంటే మన్నించు తప్పక దర్శనం ఇప్పించు తప్పక మీ ఆశీస్సులు మాపై కురిపించు థాంక్యూ సాయినాథ థాంక్యూ తండ్రి థాంక్యూ థాంక్యూ బావ
ReplyDelete