సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 342వ భాగం.


సాయిబాబా ఆశీస్సులు భక్తులందరిపై ఎల్లవేళలా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ అందరికీ
'సాయి మహారాజ్ సన్నిధి బ్లాగు'
రెండవ వార్షికోత్సవ శుభాకాంక్షలు

ఖపర్డే డైరీ - ఇరవైఏడవ భాగం 

3-2-1912.

నేను చాలా ఆలస్యంగా లేచాను. సోమరితనపు తరంగం అంతటా ఆవరించినట్లు అనిపిస్తోంది. బాపూసాహెబ్ జోగ్ ఆలస్యంగా లేచాడు. అలాగే దీక్షిత్‌కీ, దాదాపు అందరికీ అయింది. నా ప్రార్థనానంతరం నేను మశీదుకి వెళ్ళానుగానీ, సాయిబాబా, “లోపలకి రాకుండా ఊదీ తీసుకొని వెళ్ళు” అన్నారు. నేను అలాగే చేసి బాపూసాహెబ్ జోగ్ బసకి వెళ్ళి ఉపాననీ, శ్రీమతి కౌజల్గిలతో కలసి పంచదశి చదువుతూ కూర్చున్నాను. మధ్యాహ్నం వరకూ అలాగే చదువుతూ కూర్చుని తరువాత అందరం సాయిబాబా ఆరతికి వెళ్ళాం. దాని తరువాత మధ్యాహ్న భోజనం అయింది. కొంత విరామం తరువాత దాసబోధ చదువుతూ కూర్చున్నాము. మధ్యాహ్నం దీక్షిత్ రామాయణం చదివాడు. సాయిబాబాకు స్థానిక భక్తుడైన గనోబా ఆబా అది వినటానికి వచ్చాడు. అతనికి చాలా శ్లోకాలు, కొన్ని కంఠస్థంగా కూడా వచ్చు. వారి వ్యాహ్యాళి సమయంలో సాయిబాబాను వెళ్ళి చూశాం.

మాధవరావు దేశ్‌పాండే సాయిబాబాకి నా విషయం చెప్పినట్లున్నాడు. కానీ వారు అవసరమైన అనుమతిని ఇవ్వక, “తను వృద్ధుణ్ణనీ, తన ప్రతిష్ఠని వదులుకోవటం ఇష్టంలేదని చెప్పార"నీ చెప్పాడతను. సుమారు రెండు వందలమంది పొరుగు పట్టణానికి వెళ్ళారనీ, వాళ్ళు తిరుగుబాటుదార్లుగా గుర్తింపబడ్డారనీ, మాధవరావు పేరు కూడా ఆ లిస్టులో ఉత్త పుణ్యానికి ఇరికించబడిందనీ, అందువల్ల దాని గురించి గొడవగా ఉందనీ చెప్పాడతను. రాత్రి జరిగిన వాడా ఆరతి, శేజారతికి నేను హాజరయ్యాను. భీష్మ భజన బదులు భాగవతం చదివితే దీక్షిత్ రామాయణం చదివాడు.

4 -2-1912.

ఉదయం త్వరగా లేచి కాకడ ఆరతికి హాజరై తరువాత నా ప్రార్థనను పూర్తిచేసుకున్నాను. నేను స్నానం చేసేటప్పుడు నారాయణరావు వామన్ గావోంకర్‌ని గురించి అడుగుతూ ఇద్దరు పెద్దమనుషులు వచ్చారు. వాళ్ళు లింగాయత శాస్త్రులు. పెద్దతని పేరు శివానందశాస్త్రి. వారితో ఇద్దరు స్త్రీలు కూడా ఉన్నారు. ఈ స్త్రీలు బ్రాహ్మణులు. పెద్దావిడ పేరు బ్రహ్మానందబాయి. మూడు సంవత్సరాల క్రితం నిత్యానందబాయి అనే లింగాయత స్త్రీని నాసిక్ వద్ద కలుసుకుంది. ఆమె పురోగమించిన యోగిని కనుక బ్రహ్మానందబాయికి దీక్ష ఇచ్చింది. మేమంతా సాయిమహారాజుని ఆయన బయటకు వెళ్ళేటప్పుడూ, తిరిగి మశీదుకు వచ్చేటప్పుడూ చూశాము. బ్రహ్మానందబాయి వారిని పూజించి రెండు ఆరతులు చాలా అద్భుతంగా పాడింది. మధ్యాహ్నం ఆరతయ్యాక భోజనం కానిచ్చి కొద్దిసేపు విశ్రమించాను. అప్పుడు దీక్షిత్ పురాణం విని, సాయిబాబాను సాయంకాలం వ్యాహ్యాళి సమయంలో చూశాము. వాడా ఆరతి అయ్యాక దీక్షిత్ పురాణమూ, భీష్మ భజనా జరిగాయి. బ్రహ్మానందబాయీ, ఆమె సహచరీ చాలా అద్భుతంగా పాడటంతో మేం భజనను చాలా ఆస్వాదించాము. శివానందశాస్త్రి కూడా పాడాడు. ఆ స్త్రీలు నాసిక్ నుంచి వచ్చారు. వాళ్ళు ఎప్పుడూ ఆ ప్రాంతంలోనే ఉంటారు.

5-2-1912.

ఉదయం నా ప్రార్థన పూర్తిచేసుకోగానే నాగపూర్ నుంచి రాజారామ్‌పంత్ దీక్షిత్ వచ్చాడు. అతను కాకాసాహెబ్ దీక్షిత్ పెద్దసోదరుడు. అతను సాయిసాహెబ్ దర్శనం కోసం వెళ్ళాడు. నేను మా పంచదశి తరగతికి హాజరై బాపూసాహెబ్ జోగ్, ఉపాసనీ శాస్తి, శివానందశాస్త్రి , బ్రహ్మానందబాయి, ఇంకా మిగతావారితో కలసి అమృతానుభవంలోని ఒక శ్లోకం చదివాను. సాయిబాబా బయటకు వెళ్ళటమూ, తిరిగి మశీదుకు వెళ్ళటమూ మేమంతా చూశాము. వారు నాపట్ల ఎంతో కరుణ చూపి కొన్ని మాటలు చెప్పారు. ఆరతయ్యాక అందర్నీ బయటకు పంపేటప్పుడు నన్ను నా పేరుతో పిలిచి, "సోమరితనాన్ని వదులుకొని స్త్రీలనూ, పిల్లలనూ చూడాల"ని చెప్పారు. శ్రీమతి లక్ష్మీబాయికి ఒక రొట్టెముక్క ప్రసాదించి, రాధాకృష్ణఆయి వద్దకు వెళ్ళి ఆమెతో కలిసి తినమన్నారు. ఇది చాలా గొప్ప అదృష్టం. ఇకనుంచి ఆమె చాలా ఆనందంగా ఉంటుంది. నేను శివానందశాస్త్రినీ, బ్రహ్మానందబాయినీ, వారితో ఉన్న మిగతా అందర్నీ మాతో మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించాను. అదయ్యాక కాసేపు విశ్రమించాను. దీక్షిత్ రామాయణం చదివాక సాయిబాబా వ్యాహ్యాళికి వెళ్ళేటప్పుడు వారిని చూసేందుకు మేము వెళ్ళాము. వాడా ఆరతి అయ్యాక శేజారతి అయింది. రాత్రి బ్రహ్మానందబాయి అద్భుతంగా చేసిన భజన మధ్యరాత్రి వరకూ కొనసాగింది. నా తిరుగు ప్రయాణ విషయం ఈరోజు చర్చకు తీసుకురాబడింది. అది రేపు నిర్ణయించబడవచ్చు.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

9 comments:

  1. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  2. Congratulations to the devotees who are administering this fantastic blog and also to all the other sai devotees who participate on the eve of its successful second anniversary
    May Saibaba bless us to run this blog forever
    Jai sairam

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ సాయి. మీకు కూడా శుభాకాంక్షలు సాయి💐💐💐
      ఇలాగే మనమంతా మరెన్నో సాయి లీలల్లో మునిగితేలుతూ మన సాయి తండ్రీ ప్రేమలో కలకాలం ఓలలాడుతుండాలని మనసారా కోరుకుంటున్నాను సాయి.

      Delete
  3. "సాయిమహరాజ్ సన్నిధి"కి జన్మదిన శుభాకాంక్షలు సాయీ 💐
    బాబా ఆశీస్సులతో ఇలాగే మరెన్నో సాయిలీలలను మాతో పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

    ReplyDelete
    Replies
    1. thank you so much sai. మీకు కూడా శుభాకాంక్షలు సాయి💐💐💐
      ఇలాగే మనమంతా మరెన్నో సాయి లీలల్లో మునిగితేలుతూ మన సాయి తండ్రీ ప్రేమలో కలకాలం ఓలలాడుతుండాలని మనసారా కోరుకుంటున్నాను సాయి.

      Delete
  4. మీకు కూడా శుభాకాంక్షలు సాయి💐💐💐
    మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినదుకు
    ధన్యవాదాలు ఓంసాయిరాం🌷🙏🌷


    ReplyDelete
    Replies
    1. చాలా చాలా ధన్యవాదాలు సాయి. మన సాయి ప్రేమ ఇలాగె మన అందరిపై వర్షిస్తూ ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుత్నున్నాను సాయి

      Delete
  5. *సాయిమహరాజ్ సన్నిధి"కి రెండవ జన్మదిన శుభాకాంక్షలు సాయీ. ఇలాంటి మంచి బ్లాగు ను క్రియేట్ చేసిన ఈ బ్లాగు కార్యకర్తల కు అందరికీ ధన్యవాదాలు.
    బాబా ఆశీస్సులతో ఇలాగే మరెన్నో సాయిలీలలను మాతో పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

    ReplyDelete
  6. Om Sai Sree Sai Jaya Jaya Sai
    🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo