సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 339వ భాగం


ఖపర్డే డైరీ - ఇరవై నాలుగవ భాగం  

25-1-1912.

ఉదయం మాధవరావు దేశ్‌పాండే నన్ను లేపి, నేను అతని పిలుపుకు సమాధానమిచ్చే లోపలే తను రెండుసార్లు కేకవేశానని చెప్పాడు. ప్రార్థనానంతరం కాకడ ఆరతికి వెళ్ళాను. సాయిబాబా మశీదుకి మౌనంగా నడిచి వెళ్ళారు. తిరిగి వచ్చాక మా పరమామృతం తరగతిని ఉపాసనీ, బాపూసాహెజ్ జోగ్, భీష్మ, శ్రీమతి కౌజల్గిలతో నిర్వహించాము. వివేక మహావాక్య అధ్యాయాన్ని ముగించాము. సాయిసాహెబ్‌ని బయటకు వెళ్ళేటప్పుడూ, తిరిగి వచ్చేటప్పుడూ చూశాము. మధ్యాహ్న ఆరతి మామూలుగా జరిగింది. సాయిమహారాజు నాకు పదేపదే చిలుం ఇచ్చారు. భోజనానంతరం కొద్దిసేపు విశ్రమించాక రామాయణం విన్నాము. ఇది దీక్షిత్ చదివాడు. తరువాత సాయిబాబాను చూసేందుకు వెళ్ళాము. ఇక్కడ నేనో నిజం చెప్పొచ్చు, సాయంత్రపు వ్యాహ్యాళి సమయంలో సాయిబాబా నాకు శ్రీమతి లక్ష్మీబాయి కౌజల్గి యొక్క పూర్వ చరిత్ర దాదాపు పూర్తిగా చెప్పారు. నాకు నిజాలు తెలుసు కనుక అదంతా సత్యమేనని నాకు తెలుసు.

26-1-1912.

ఉదయం చాలా పెందరాళే నిద్రలేచాను. సూర్యోదయం అవుతోందన్న తప్పు అంచనాతో ప్రార్థన పూర్తిచేసుకొని వరండాలో అటూ ఇటూ పచార్లు చేస్తున్నాను. సమయానికి దాదాపు ఒకటిన్నర గంటయినా ముందున్నాననుకుంటా. సూర్యోదయమయ్యాక నా నిత్యక్రమం మొదలుపెట్టి తరువాత బయటకు వెళ్ళాము. పరమామృతం కొంచెం చదివి సాయిబాబా బయటకి వెళ్ళటం మళ్ళీ తిరిగి రావటం చూశాము. నాకు అస్వస్థతగా అనిపించటంవల్ల కొద్దిసేపు పడుకున్నాను.

27-1-1912

ఉదయాన్నే నిద్ర లేచి, ప్రార్థనానంతరం కాకడ ఆరతికి హాజరయ్యాను. సాయిబాబా ప్రశాంతంగా ఉన్నట్లనిపించలేదు. ఒక్కమాటైనా లేకుండా మశీదుకి వెళ్ళి అక్కడ కూడా ఏమీ మాట్లాడలేదాయన. నేను, ఉపాసనీ, బాపూసాహెబ్ జోగ్, భీష్మ పరమామృతం చదువుకొని సాయిబాబా బయటకు వెళ్ళటం, తిరిగి రావటం చూశాము. మధ్యాహ్న ఆరతి తేలిగ్గా గడిచిపోయింది. దాని తరువాత భోంచేశాము. కొద్దిసేపు పడుకొని, ఒక జాబు వ్రాసి, దీక్షిత్ మధ్యాహ్నం పూట చదువుతున్న రామాయణానికి హాజరయ్యాను. వ్యాహ్యాళి సమయంలో సాయిబాబాను చూసినప్పుడు ఆయన గంభీరంగా ఉన్నప్పటికీ ఆహ్లాదంగానే మాట్లాడారు. చివర్లో పెద్దగా, కోపంగా మాట్లాడారు. చీకటిపడ్డాక ఇంకా పెద్దగా మాట్లాడారనీ, ఇబ్రహీం అనే పేరుతో ఉన్న వ్యక్తి మతం మార్చుకున్నాడనీ, పగిలిన గోడ దగ్గర చేతులు పెట్టుకొని నిలుచున్న సాయి తన కోపాన్ని ప్రదర్శించారనీ విన్నాను. సాయిసాహెబ్ బట్టలు రాధాకృష్ణఆయి ఉతికినందుకు కూడా బాబా కోపించారు.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo