ఈ భాగంలో అనుభవం:
- సాయి ఆశీస్సులతో ఉద్యోగం, వివాహం, సంతానం
యు.ఎస్.ఏ నుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
నేను 2013 నుండి సాయిభక్తురాలిని. నేను సాయిబాబాను చాలా చాలా ప్రేమిస్తున్నాను. ఆయన నా జీవితానికి రక్షకుడు. ఇక నా అనుభవాలలోకి వస్తాను.
అనుభవం 1:
2014లో కొన్ని కారణాల వల్ల నేను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి పెట్టాల్సి వచ్చింది. నేను ఉద్యోగాన్ని వదిలేయడానికి కొన్నిరోజుల ముందు నా సహోద్యోగి ఒకరు శిరిడీ వెళ్తుంటే, నాకోసం సచ్చరిత్ర పుస్తకం తీసుకుని రమ్మని చెప్పాను. అతను శిరిడీ నుండి వచ్చినప్పటి నుండి నేను పుస్తకం గురించి తనని రోజూ ఆఫీసులో అడుగుతూనే ఉన్నాను. కానీ అతను ఏమీ చెప్పేవాడు కాదు. చివరిరోజు నేను ఆఫీసు విడిచిపెట్టే సమయంలో అతను రెండు నిమిషాలు వేచి ఉండమని చెప్పి, పుస్తకం తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. నేను ఆనందాశ్చర్యాలలో మునిగిపోయాను. పుస్తకం తీసుకుని తనకి కృతజ్ఞతలు చెప్పాను. అప్పుడతను ఇలా చెప్పాడు: "నేను ప్రయాణంలో ఉన్నప్పుడు మీరు సచ్చరిత్ర తెమ్మన్న విషయం పూర్తిగా మర్చిపోయాను. నేను శిరిడీ చేరుకుని బాబా దర్శనానికి వెళ్ళాను. దర్శనం చేసుకుంటూ ఉండగా అకస్మాత్తుగా మీ మాటలు నా మదిలో పదేపదే మెదిలాయి. నేను ఆశ్చర్యపోయాను. బయటకు వచ్చిన వెంటనే నేను పుస్తకం తీసుకున్నాను" అని. అది విని, బాబానే తనకి పుస్తకం సంగతి గుర్తువచ్చేలా చేసి నాకోసం పుస్తకం పంపారని చాలా ఆనందించాను.
తరువాత నేను నా సొంత ఊరు వెళ్ళిపోయాను. కొత్త ఉద్యోగం కోసం బాబాను ప్రార్థించి సచ్చరిత్ర పారాయణ చేశాను. గురువారం పారాయణ ముగించి ఇంట్లో వారందరికీ ప్రసాదం ఇచ్చి, ఫోన్ తీసుకుని నా మెయిల్స్ చూసుకోవడానికి టెర్రస్ మీదికి వెళ్ళాను. ఒక మెయిల్ చూసి ఆశ్చర్యపోయాను. అది కొత్త ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ లెటర్. అది నాకు లభించిన అత్యుత్తమ ఉద్యోగం. ఉద్యోగంలో చేరిన వెంటనే కంపెనీ తరఫున యు.ఎస్. వెళ్లే అవకాశం వచ్చింది. ఇదంతా నా సాయి కృప వలనే. బాబాను నమ్మండి, అద్భుతాలు మీ వెంట ఉంటాయి.
అనుభవం 2:
నేను 2016లో 'ఎస్' అక్షరంతో ప్రారంభమయ్యే పేరుగల వ్యక్తిని వివాహం చేసుకున్నాను. వివాహమైన తరువాత మేము శిరిడీ వెళ్లి బాబా ఆశీస్సులు తీసుకున్నాము. తరువాత నేను నా భర్తతో కలిసి యు.ఎస్. వచ్చాను. 3 నెలల తరువాత నేను గర్భవతినయ్యానని నాకు అనిపించింది. ఏ అమ్మాయి జీవితంలోనైనా ఇది గొప్ప మధురానుభూతి. ఆ వార్త ముందుగా నా సాయిబాబా ద్వారా నిర్ధారణ పొందాలని నేను అనుకున్నాను. నేను 'అవును' 'కాదు' అని రెండు చీటీలు వ్రాసి సాయిబాబా ఫోటో ముందు ఉంచాను. బాబాను ప్రార్థించి ఆయన సమాధానం కోసం ఒక చీటీ తీస్తే, అందులో “అవును” అని వచ్చింది. తరువాత మేము డాక్టరుని సంప్రదించాము. డాక్టరు పరీక్షించి నేను గర్భవతినని ధృవీకరించారు. సాయి “అవును” అని చెప్పినప్పుడు దాన్ని ఎవరు మార్చగలరు? నా ఆనందానికి అవధులు లేవు.
అనుభవం 3:
నా భర్త మగపిల్లాడు కావాలని ఆశపడ్డారు. నేను తనతో 'సాయిబాబాను ప్రార్థించండి' అని చెప్పి, నేను కూడా ప్రార్థించాను. తరువాత నేను వెబ్‌సైట్ లో శిరిడీ ప్రత్యక్ష ప్రసారం ఓపెన్ చేసి, బాబా సమాధి మీద 'అబ్బాయి' 'అమ్మాయి' అని చీటీలు ఉంచాను. బాబాను ప్రార్థించి ఒక చీటీ తీస్తే 'అబ్బాయి' అని వచ్చింది. ఆ చీటీలు చూసి నా భర్త "ఈ చీటీలు ఏమిటి?" అని అడిగారు. నేను నవ్వి, "మూడునెలల తరువాత చెప్తాను" అన్నాను. ఇక్కడ యు.ఎస్. లో చట్టబద్ధంగా ఐదవనెలలో స్కాన్ చేసి బిడ్డ ఆడా, మగా అన్నది చెప్తారు. ఐదవ నెల వచ్చాక డాక్టరు స్కానింగ్ ద్వారా మగబిడ్డ అని ధృవీకరించారు. తొమ్మిది నెలల నిండాక సాయిబాబా ఆశీస్సులతో మాకు అందమైన, ఆరోగ్యకరమైన మగబిడ్డ జన్మించాడు. మేము మధ్య పేరు సాయి అని వచ్చేలా తనకి పేరు పెట్టాము. మరో విషయం ఏమిటంటే, నాకు చికిత్స చేసిన డాక్టరు సాయిబాబాకు గొప్ప భక్తురాలు. ఆమె ఎప్పుడూ “ఓం సాయిరామ్” అని పలకరిస్తూ, 'బాబా నిన్ను ఆశీర్వదిస్తార'ని సదా చెప్తుండేది. ఇదంతా సాయిలీల కాదంటారా?
ఓం సాయిరామ్! నా అనుభవాన్ని చదువుతున్న అందరి కోరికలూ బాబా అశీస్సులతో నెరవేరాలని కోరుకుంటున్నాను. దయచేసి శ్రద్ధ, సబూరి కలిగి ఉండండి.
Source:http://www.shirdisaibabaexperiences.org/2020/01/shirdi-sai-baba-miracles-part-2594.html

Baba na love vishayam lo clarity ivvandi Baba pls.. e badhani tattukoleka potunna.. mi answer kosam wait chestunna..
ReplyDeleteఓం సాయిరాం🌷🙏🌷
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteBaba! Naku job ippinchandhi plz
ReplyDelete