సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 327వ భాగం.


ఖపర్డే డైరీ - పన్నెండవ భాగం

25-12-1911.

ఉదయం సాయిమహారాజు బయటకు వెళ్ళేటప్పుడు చూశాను. తరువాత మహాజనితోనూ, ఇంకా ఇతరులతోనూ కలసి మాట్లాడుతూ కూర్చున్నాను. చాలామంది అతిథులు వెళ్ళారు. ఇంకా ఎందరో వచ్చారు. చాలా కోలాహలంగా అనిపించింది. గోవర్ధనదాసు సాయిమహారాజుని చూడ్డానికి వచ్చిన వారందరికీ భోజనాలు పెట్టాడు. మా అబ్బాయి బల్వంత్‌కి రాత్రి ఒక కల వచ్చింది. అందులో మా ఎలిక్‌పూర్ ఇంట్లో అతను సాయిమహారాజుని, బాపూసాహెబ్ జోగ్‌ని చూశాడట. అతను సాయిబాబాకి ఆహారం సమర్పించాడట. అతను ఆ కల గురించి నాకు చెపితే అది కేవలం కల్పన అనుకున్నాను. అయితే ఈరోజు సాయి మహారాజు బల్వంత్‌ను పిలిచి "నిన్న మీ ఇంటికి వస్తే నాకు ఆహారమిచ్చావు కానీ దక్షిణ ఇవ్వలేదు. ఇప్పుడు నాకు ఇరవై అయిదు రూపాయలివ్వాలి" అన్నారు. బల్వంత్ వాడాకి వచ్చి, మాధవరావు దేశ్‌పాండేతో కలసి వెళ్ళి దక్షిణ సమర్పించాడు. మధ్యాహ్న ఆరతి సమయంలో సాయిమహారాజు పేడా, ప్రసాదమూ, పండ్లూ ప్రసాదించి, నేను వారికి నమస్కరించేలా నాకు ఒక ప్రత్యేకమైన సంజ్ఞను చేశారు. ఒక్కసారిగా నేను సాష్టాంగ నమస్కారం చేశాను. ఈరోజు ఉదయ ఫలహారం చాలా ఆలస్యమైంది. సాయంత్రం నాలుగు గంటలకుగానీ అది పూర్తికాలేదు. నేను గోవర్ధనదాసుతో కలసి వాడా వద్దనున్న మండపంలో అతని ఖర్చుతోనే తిన్నాను. దాని తరువాత నాకు బద్దకంగా అనిపించి మాట్లాడుతూ కూర్చున్నాను. మేమంతా సాయిమహారాజును ఆయన యథాప్రకారం సాయంత్రపు వ్యాహ్యాళికి వెళ్ళేటప్పుడూ, మళ్ళీ చావడికి భజన ఊరేగింపుతో వెళ్ళేటప్పుడు చూశాము. కొండాజీ ఫకీరు కూతురు రాత్రి మరణించింది. ఆమెను మా బసకు దగ్గరలో ఖననం చేశారు. భీష్మ భజన చేస్తే, దీక్షిత్ రామాయణం చదివాడు.

26-12-1911.

నేను త్వరగా లేచి కాకడ ఆరతికి వెళ్ళాను. సాయి మహారాజు అసాధారణమైన స్థితిలో ఉన్నారు. సట్కా తీసుకొని నేలమీద గుండ్రంగా కొడుతున్నారు. చావడి మెట్లు దిగే లోపలే రెండుసార్లు వెనక్కీ, ముందుకీ నడిచి తీవ్రమైన పదజాలం ఉపయోగించారు. నేను వెనుతిరిగి వెళ్ళి ప్రార్థన చేసుకొని, స్నానం చేసి, నా గది ముందర వరండాలో కూర్చున్నాను. సాయిమహారాజు బయటికి వెళ్ళటం చూశాను. పూణేలో ప్లీడరుగా పనిచేసే గోఖలే వచ్చాడు. నా భార్యని అతను షేగాఁవ్‌లో గణపతిబాబా ఈ భౌతిక ప్రపంచంలో పనిచేసేటప్పుడు చూశాడు. అతనితో పాటు ఇండియా బొమ్మలమ్మే అతను ఉన్నాడు. మధ్యాహ్న ఆరతై, నేను భోజనం చేసిన తరువాత  నన్ను వాళ్ళు చూశారు. మూడవ ఝాములో నేను కొద్దిసేపు పడుకొని తరువాత మహాజని, డా౹౹హాటే ఇంకా వేరేవాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నాను. మేము సాయిమహారాజుని మధ్యాహ్నం చావడి దగ్గరా, సాయంత్రం ఆయన బయటకి వెళ్ళేటప్పుడూ చూశాము. వారు చాలా కరుణతో ఉన్నారు. ఈరోజు మా అబ్బాయి బల్వంత్‌తో మాట్లాడి, అందర్నీ బయటకు పంపివేసిన తరువాత కూడా అతన్ని తనవద్ద కూర్చోనిచ్చారు. సాయంత్రం అతిథిని లోపలికి రానివ్వవద్దనీ, అతని మంచి చెడులు చూడవద్దనీ, అలా చేస్తే అందుకు ప్రతిగా సాయిబాబా అతని గురించి జాగ్రత్త వహిస్తానని చెప్పారు. మాధవరావు దేశ్‌పాండే అస్వస్థుడయ్యాడు. అతను పూర్తిగా మంచానికి అంటిపెట్టుకోకపోయినా బాగా జలుబు చేసి నీరసపడ్డాడు. సాయంత్రం యథాప్రకారం భీష్మ భజన, ఆ తరువాత దీక్షిత్ రామాయణ పఠనం జరిగాయి. పురాణం వినటానికి భాటే వచ్చాడు. ఈరోజు మేము సుందరకాండ మొదలుపెట్టాం.

27-12-1911.


రాత్రి బాగా నిద్రపోకపోయినా పొద్దున త్వరగా లేచి ప్రార్థన, స్నానం చేసుకొని రోజూకంటే ముందే దుస్తులు ధరించాను. మధ్యాహ్న ఆరతి అయ్యాక మూడుగంటలకి నా ఉదయ ఫలహారం చేసి అప్పుడు పడుకొని బాగా నిద్రపోయాను. మధ్యాహ్నం చాలామంది సాయిమహారాజుని చూడటానికి వెళ్ళారు. కానీ ఎవరితోనూ మాట్లాడేందుకు వారు ఇష్టపడక అందరినీ వెంటనే బయటకు పంపేశారు. అందుకే నేను వెళ్ళకుండా చదువుకుంటూ కూర్చున్నాను. మేమంతా వారిని సాయంత్రం వారు బయటకు వెళ్ళే సమయంలోనూ, మళ్ళీ శేజారతి సమయంలోనూ చూశాము. చాలామంది పాడటంవల్ల ఈరోజు భీష్మ భజన చాలా సుదీర్ఘంగా సాగింది. ఒక ముస్లిం యువకుడు తన పాటతో నన్ను ఆశ్చర్యపరచాడు. తరువాత దీక్షిత్ రామాయణ పఠనం నడిచింది.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

4 comments:

  1. Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya jaya sai🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya jaya sai🙏🙏🙏🙏

    ReplyDelete
  3. om sai ramb bless us from corona virus.you bless whole world with this desise.you blessed shiridi from colara

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo