ఈ భాగంలో అనుభవం:
- శిరిడీయాత్రలోని అనుభవాలు - మొదటి భాగం...
ఓం సద్గురవే నమః.
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
నా పేరు సంధ్య. ‘సాయి మహరాజ్ సన్నిధి’ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి మరియు సాయిబంధువులకు నా నమస్కారాలు. సద్గురు సాయి దివ్యపాదాలకు నమస్కరిస్తూ, 2019 ఏప్రిల్‌లో మా శిరిడీ ప్రయాణంలో, సాయినాథుని దర్శనం, పండరిపూర్, శనిశింగణాపూర్, నాసిక్, తుల్జాపూర్, గురుస్థానాల దర్శనాలలో బాబా కరుణించిన లీలలని ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను.
ఆరోజు ఉదయం 11 గంటలకి మా శిరిడీ ప్రయాణం ప్రారంభమైంది. దారిలో కారులో ఏదో వాసన రావడం మొదలైంది. అదేంటా అని అనుకునేలోపే వెనుక వస్తున్న కారులో నుండి ఒక వ్యక్తి, “డీజిల్ లీక్ అవుతోంది, చూసుకోండి” అని చెప్తూ వెళ్ళిపోయారు. డ్రైవరు కారు ఆపి చూస్తే మొత్తం డీజిల్ అయిపోయివుంది. దాంతో కారు స్టార్ట్ కావడానికి మొరాయించింది. దగ్గరలో ఉన్న బసవకళ్యాణ (గురుస్థాన్) గ్రామంలో రిపేర్ చేసే వ్యక్తిని తీసుకువచ్చి కారు బాగుచేయించుకుని మళ్ళీ ప్రయాణం సాగించాము. దీనివల్ల రెండు గంటల సమయం వృధా అయిపోయిందని అనుకున్నాము. కానీ ఇదంతా సాయి సంకల్పమే అనుకుని ప్రయాణం సాగించాము. రాత్రి 2 గంటల సమయంలో మేము దారితప్పి మరికొంత సమయం వృధా అయినప్పటికీ, బాబా కృపవలన క్షేమంగా శిరిడీ చేరుకున్నాము.
మరుసటిరోజు ఉదయం బాబా దర్శనం కోసం బయలుదేరాము. ఇంతకుముందు మూడుసార్లు శిరిడీ దర్శించినప్పటికీ ఈసారి మాత్రం సాయి ఉనికిని, ప్రేమను పొందిన భక్తులుగా ఎప్పుడెప్పుడు సాయిని చూస్తామా అనే ప్రేమతో ఆరాటపడుతూ ఉన్నాము. సాయిని దర్శించబోతున్నామనే ఆనందంలో ముందుకు సాగుతున్నాము. అప్పుడు నేను నా మనసులో ‘బాబా ఏ కలర్ డ్రెస్సులో ఉంటారో!’ అని అనుకుంటూ, “నేను ఎల్లో కలర్ డ్రెస్సులో(చీర) ఉన్నాను, బాబా కూడా ఎల్లో కలర్ డ్రెస్సులో ఉంటారు” అని అనుకున్నాను. ఎందుకంటే, నేను జగన్మాత ఆలయాలు దర్శించినపుడు జగన్మాత చీర, నా చీర మ్యాచ్ అయితే నేను చాలా సంతోషిస్తాను. అలాగే సాయిమాతను దర్శిస్తున్నాననే ఆనందంలో ‘నా డ్రెస్, సాయిమాత డ్రెస్ మ్యాచ్ అవుతుంది అనుకుంటూ, బాబాను ఎప్పుడెప్పుడు చూస్తానా’ అని ఆతృతగా ముందుకు సాగుతుండగా బాబా బ్లూ కలర్ డ్రెస్సులో దర్శనమిచ్చారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. కారణం సాయిబిడ్డలని, సాయిబంధువులని ఒకచోట చేర్చి, ఆయన ప్రసాదించిన ప్రేమను ఒకరికొకరు చెప్పుకుని మురిసిపోయేలా చేస్తున్న మన ‘సాయిమహరాజ్ సన్నిధి’ బ్లాగ్ ఓపెన్ చేయగానే బాబా బ్లూ డ్రెస్సులోనే దర్శనమిస్తారు, అచ్చం అలానే బాబా దర్శనమిచ్చారు. ఆవిధంగా మన సాయిబాబాని (తండ్రిని, తల్లిని, గురువుని, మన పెద్దదిక్కుని) దర్శించుకున్నాననే భావన నాలో కలిగి ఆనందంతో సంతోషంగా బాబాను చూస్తూ క్యూలో ముందుకు సాగుతున్నాను. తరువాత నా చీర మ్యాచ్ అవలేదు అనుకుంటేంత లోపే 'నా చీర కొంగు బ్లూ కలర్‌లో ఉంది కదా, కొంతైనా మ్యాచ్ అయ్యింద'ని సంతోషించాను. తరువాత బాబాని కనులారా తృప్తిగా చూసుకొని, నా కోరికలు చెప్పుకుని, బాబా సమాధిని దర్శించుకున్నాను. 'బాబా! నాకు కొద్దిగా ఊదీ ఎక్కువ కావాలి' అని మనసులో అనుకున్నాను. బయటకు రాగానే మా పిల్లలకి, నాకు, నా భర్తకు ఊదీ ప్రసాదం, బూందీ ప్రసాదం అందింది. నేను అనుకున్నట్లుగా నాకు ఒక ఊదీ ప్యాకెట్ ఎక్కువగా ఇచ్చారు బాబా. సంతోషంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను.
ఇక ద్వారకామాయి దర్శించాలనే ఆతృతలో అక్కడికి వెళ్లి క్యూలో నిలుచున్నాము. బాబా కోసం కొన్ని పూలు తీసుకున్నాము. బాబాకి నైవేద్యంగా ఏమైనా (కోవా) తీసుకుందామంటే క్యూలో ఉన్నందువల్ల నా భర్తను అడిగే సాహసం చేయలేకపోయాను. ద్వారకామాయిలో అడుగుపెట్టగానే, బాబాకి నైవేద్యంగా కోవాగానీ లేదా ఏమైనా తినేపదార్థాలు (మరమరాలు లాంటివి) తీసుకురాలేకపోయాను, ముందుగానే కోవా తీసుకుని రావాల్సిందని అనుకున్నాను. ద్వారకామాయిని కనులారా తృప్తిగా చూస్తున్నాను. క్యూ ముందుకు సాగుతోంది. అంతలో ఒకతను బాబా పోలికలతో (ప్యాంటు, టీషర్ట్ ధరించి ఉన్నారు) కనపడ్డారు. అతను సచ్చరిత్ర చదువుతూ ఉన్నారు. అతనిని చూడగానే నేను కూడా సచ్చరిత్ర చదవాలనుకున్నాను. తరువాత కూడా నేను బాబాకి నైవేద్యంగా ఏమీ తీసుకురాలేదని మదనపడుతుండగా ఒక అబ్బాయి బాబాకి నైవేద్యం సమర్పించిన ప్లేట్ తీసుకుని వచ్చి, అందులోనుండి కోవా తీసి నాకు, నా భర్తకి, పిల్లలకి, ఇంకా మరికొందరి భక్తులకు ప్రసాదంగా పంచాడు. దయగల తండ్రి సాయిబాబా నా మనసునెరిగి, “బిడ్డా, కోవా నీవు తీసుకురాకపోతేనేం? నేను ఇస్తున్నా, తిను” అన్నట్లుగా నన్ను దీవించారు. మేము క్యూలోనే బాబా ప్రసాదాన్ని ఆరగించాము. అలా ద్వారకామాయిలో అడుగుపెట్టాక నోరు తీపిచేశారు బాబా. కాస్త ముందుకు వెళ్ళాక ధుని వేడి తగిలి ఆనందించాము. బాబాను కనులారా దర్శించుకుని ద్వారకామాయి ప్రాంగణంలో కూర్చున్నాము. బాబాకి మా ఆరోగ్యసమస్యలని విన్నవించుకుని, ఒక బాటిల్ నీళ్ళలో బాబా ఊదీని కలుపుకుని, బాబానే స్వయంగా ఊదీ ప్రసాదాన్ని మాకు ఇస్తున్నట్లుగా భావించి, ఊదీ కలిపిన నీళ్ళను బాబా ఇస్తున్న ఔషధంగా భావించి అందరం త్రాగాము. తరువాత చావడి, సత్పురుషుల సమాధులు, గురుస్థాన్ వేపచెట్టు, లెండీవనం, నందాదీపం దర్శించుకుని లెండీవనంలో సేదతీరాము.
కొంతసమయం అయ్యాక బాబా సన్నిధి అయిన బాబా ప్రసాదాలయంలో భోజనం చేయాలని మనసుకి గాఢంగా అనిపించింది. ఇక బాబా దయ చూడండి. బాబా ప్రసాదాలయంలో భోజనం చేద్దామని నా భర్తని అడిగాను. “అది ఎక్కడుందో నాకేం తెలుసు?” అన్నారాయన. ఎక్కడ హోటల్లో తినిపిస్తారో, బాబావారి ప్రసాదం ఎక్కడ చేజారిపోతుందో అని ఆందోళనగా రోడ్డు దాటాను. నా మనసునెరిగిన బాబా దయచూపారు. ఒక ఆటో వచ్చి మా ముందు ఆగింది. నాకు తెలుగు మాత్రమే తెలుసు. ‘బాబా ప్రసాదాలయం’ అన్నాను ఆ ఆటో అతనితో. అతను తలూపగానే చకచకా ఆటో ఎక్కాము. చక్కగా ప్రసాదాలయం ముందు ఆపాడు. పది రూపాయలు ఇచ్చాము. అందరం కలిసి బాబా ప్రసాదాన్ని కడుపునిండా ఆరగించాము. బాబా ప్రసాదం చాలా రుచిగా ఉంది. ‘సాత్వికాహారమంటే బాబా ప్రసాదమే!’ అన్న భావన కలిగింది. చాలా సంతోషంగా బాబాకి మనసారా కృతజ్ఞతలు చెప్పుకుని బయటకు రాగానే మమ్మల్ని అక్కడికి తీసుకువచ్చిన ఆటోడ్రైవరే ఆటోతో సిద్ధంగా ఉన్నాడు. ఆటో ఎక్కాము. మమ్మల్ని వసతిగృహం దగ్గర దింపాడు. బాబా ఎంతటి దయార్ద్రహృదయులో!
రేపటి భాగంలో మరికొన్ని అనుభవాలు పంచుకుంటాను ...

Om Sai Ram 🙏🌹🙏
ReplyDeleteOm sai ram
ReplyDelete