సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 330వ భాగం.


ఖపర్డే డైరీ - పదిహేనవ భాగం   

1-1-1912.

నేను పొద్దున్నే లేచి చావడికి కాకడ ఆరతికి వెళ్ళాను. మొట్టమొదటగా నేను అత్యంత కరుణతో నిండి ఉన్న సాయిమహారాజు వదనాన్ని చూసి చాలా సంతోషించాను. నేను వాడాకి వచ్చాక ఉపాననీ సోదరుణ్ణి చూశాను. అతను ధూలియా నుండి వచ్చాడు. అతన్ని నేనిదివరకు పూణేలోనూ, అమరావతిలోనూ చూశాను. అతను సాయిమహారాజుని చూడటానికి వెళితే ఆయన తమతో పాటు వెనుకటి జన్మలనుంచి అనేక అనుబంధాలతో వచ్చే మనుషులు తత్పరిణామంగా ఇప్పుడు కలవటం గురించి చెప్పారట. 

ముందు జన్మలో ఆయన, బాపూసాహెబ్ జోగ్, దాదాకేల్కర్, మాధవరావు దేశ్‌పాండే, నేను, దీక్షిత్ ఒక ఇరుకు వీధిలో కలిసి జీవించటం గురించిన ఒక కథ చెప్పారు. అక్కడ ఆయన గురువు ఉండేవారట. ఇప్పుడు ఆయన మా అందర్నీ మళ్ళీ కలిపారట. వారు బయటకు వెళ్ళటం చూసి, రామాయణం చదువుతూ కూర్చున్నాను. వారిని నేను మళ్ళీ మధ్యాహ్న ఆరతి సమయంలో చూశాను. వారు నా పట్ల కరుణతో ఉన్నారు. దీక్షిత్ ఈరోజు ప్రసాదం నివేదన చేశాడు. మేమందరం అతనితో కలిసి భోజనం చేశాము. నేను, వైద్య, నానాసాహెబ్ చందోర్కర్, దహనుకు చెందిన దేవ్ మామ్లేదారు, ఇంకా ఇతరులతో కూర్చున్నాను. మళ్ళీ కాసేపు చదువుతూ కూర్చుని సాయిమహారాజుని మశీదులో చూసేందుకు వెళ్ళాను. మొదట నన్ను మిగతావారితో కలసి బయటకి పంపేసి, నేను పరుగెత్తిపోవటానికి చాలా ఆత్రుతపడుతున్నానంటూ నన్ను మళ్ళీ వెనక్కి పిలిచారు. సాయంత్రం చావడికెదురుగా ఆయన్ను చూశాను. రాత్రికి భీష్మ భజన, దీక్షిత్ రామాయణం జరిగాయి. బాలాషింపీ భజనకి వచ్చాడు.

2-1-1912.


నేను బాగా పెందరాళే లేచాను. నిన్న వచ్చిన ఉపాసనీ సోదరుడు ఈరోజు వెళ్ళిపోయాడు. నా ప్రార్థన పూర్తయిన తరువాత ఇంకా చాలామంది వెళ్ళిపోయారు. మధ్యాహ్న ఆరతి అయ్యాక సి.వి.వైద్య మరో ముగ్గురు పెద్దమనుషులతో కలిసి వెళ్ళిపోయాడు. నానాసాహెబ్ చందోర్కర్ ధనుర్మాసం చేసి ఆహ్వానించాడు. భోజనాలయ్యాక సి.వి.వైద్య వెళ్ళిపోయాడు. కోపర్గాం మామ్లేదార్, దహనుకు చెందిన మామ్లేదార్ దేవ్ కూడా వెళ్ళిపోయారు. సాయంత్రమయ్యాక నానాసాహెబ్ చందోర్కర్‌ తన కుటుంబసభ్యులందరితో వెళ్ళిపోయాడు. గత కొద్దిరోజులుగా పూర్తిగా కిటకిటలాడుతూ కోలాహలంగా, ఆహ్లాదంగా ఉన్న వాడా ఇప్పుడు ఖాళీగా ఉండి బావురుమంటోంది. సాయిమహారాజు బయటకు వచ్చినప్పుడు ఒకసారి, మళ్ళీ శేజారతి సమయంలో మరోసారి చూశాము. మా అబ్బాయి బాబా, గోపాలరావ్ డోర్లేలు నన్ను అమరావతి తీసుకెళ్ళటానికి ఈరోజు ఉదయం వచ్చారు. నేను రావటమనేది సాయిమహారాజు అనుమతి మీద ఆధారపడి ఉంటుందని చెప్పాను నేను. వాళ్ళు సాయిమహారాజుని చూసొచ్చి అనుమతి విషయంలో ఎటువంటి కష్టమూ లేదని చెప్పారు. భీష్మ ఒంట్లో కులాసాగా లేకపోవటం వల్ల ఈరోజు భజన లేదు. రామమారుతి ఈరోజు వెళ్ళిపోదామనుకున్నాడు కానీ సాయిబాబా అతన్ని ఉంచేశారు. రాత్రి రామాయణం, భాగవతం చదివాము.

3-1-1912.

ఉదయం నేను త్వరగా లేచి, కాకడ ఆరతికి హాజరై నా ప్రార్థన పూర్తిచేశాను. మా అబ్బాయి బాబా, గోపాలరావు డోర్లే మహాసంతోషంగా వచ్చారు నా వద్దకు. వాళ్ళు నన్ను సాయి వద్దకు మాధవరావు దేశ్‌పాండేతో కలిసి వెళ్ళమని చెప్పటంవల్ల నేనతనితో సాయిమహారాజు దగ్గరకు వెళ్ళాను. ఆయన తన అనుమతిని ధృవపరిచారు. కానీ మేం తిరిగి వస్తుండగా కిటికి వద్ద మమ్మల్ని ఆపి మేం రేపు బయలుదేరవచ్చు అని చెప్పారు. ఆయన బయటకు వెళ్ళేటప్పుడు, మళ్ళీ మశీదుకు తిరిగి వచ్చిన తరువాత నేనాయన్ని చూశాను. సాయిమహారాజుతో మాధవరావు నేను తిరిగి వెళ్ళే విషయం గురించి ప్రస్తావించినప్పుడు నాకు ఇక్కడా, అమరావతిలో కూడా సొంతిళ్ళు ఉన్నాయని సాయిమహారాజు సమాధానమిచ్చారు. కనుక నాకెక్కడ ఇష్టమైతే అక్కడ ఉండవచ్చుననీ, అమరావతికి అసలు తిరిగి వెళ్ళకుండా కూడా ఉండవచ్చునని చెప్పారు. ఆ రకంగా ఆ విషయం నిర్ధారణ అయినట్లు నాకనిపించింది. కనుక నేను మా అబ్బాయి బాబా, గోపాలరావు డోర్లేలతో అమరావతికి తిరిగి వెళ్ళమని చెప్పాను. వాళ్ళు తయారై సాయికి వీడ్కోలు చెప్పేందుకు వెళ్ళి సాయిమహారాజు ఆశీస్సులు తీసుకున్న తరువాత, ఆయన వారిని రేపు వెళ్ళమని అన్నారు. నా కుటుంబం మొత్తానికి రేపు తిరిగి వెళ్ళేందుకు అనుమతిని మధ్యాహ్నం ఇస్తామని చెప్పారు. 

తన గాయత్రీ పురశ్చరణ అనుష్ఠానం పూర్తయిన సందర్భంగా మేఘుడు ఈరోజు బ్రాహ్మణ సంతర్పణ చేశాడు. మేమంతా అతనితో భోజనం చేశాము. భోజనాలు సాఠేవాడాలో  పెట్టారు. మధ్యాహ్నం సాయిమహారాజుని మశీదులోను, సాయంకాలం వారు బయటకు వెళ్ళే సమయంలోనూ దర్శనం చేసుకున్నాను. ఈరోజు నవ్వటమూ, తిట్టటమూ రెండూ ఒకేసారి చేస్తూ ఆయన చాలా ఆహ్లాదంగా ఉన్నారు. రాత్రి భీష్మ భజన జరిగింది. దీక్షిత్ రామాయణం రెండు అధ్యాయాలు పఠించాడు. తాత్యాపాటిల్ తండ్రి సాయంత్రం చనిపోయాడు.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

4 comments:

  1. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai

    🙏🙏🙏

    ReplyDelete
  2. Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya jaya sai🙏🙏🙏🙏

    ReplyDelete
  3. ఓం సాయిరాం🌷🙏🌷

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo