ఈ భాగంలో అనుభవాలు:
- ఖాళీ కడుపుతో ఏ పని చేసినా అది సఫలం అవదు
- ప్రార్థించినంతనే ఇల్లు చూపించారు బాబా
ఖాళీ కడుపుతో ఏ పని చేసినా అది సఫలం అవదు
పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:
సాయిబంధువులందరికీ ఓం సాయిరాం! ఈ ఆధునిక సచ్చరిత్రను మాతో నిత్యపారాయణ చేయిస్తున్న బ్లాగ్ నిర్వాహకులకు కూడా ఓం సాయిరాం! 'నా సాయి తన బిడ్డలను ఎంత ప్రేమిస్తారో!' అనే నా భావాలను ఇంతకుముందు మీతో పంచుకున్నాను. ఎవరికైనా అది అర్థం కాలేదేమోనని ఇంకొంచెం వివరంగా ఈ అనుభవాన్ని చెబుతున్నాను. ఇది చదివితే ఖచ్చితంగా సాయి ప్రేమ అర్థమవుతుంది.
నేను ఇప్పుడు పంచుకోబోయే అనుభవం ఒక నెల క్రితం జరిగింది. "ఖాళీ కడుపుతో ఏ పని చేసినా అది సఫలం అవదు" అని సచ్చరిత్రలో బాబా చెప్పింది అందరికీ గుర్తుండే ఉంటుంది. "అది కేవలం పుస్తకంలో రాశారంతే, నిజంగా బాబా చెప్పారో లేదో" అనే ఆలోచన ఎవరికైనా (ఎవరూ ఉండరు) ఉంటే ఈ అనుభవాన్ని వారితో చదివించండి. సాయి మాట, సాయి సచ్చరిత్ర ఎంత సత్యమైనవి అనేది వారికి తెలుస్తుంది.
బాబా దయవల్ల 'సాయిమహరాజ్ సన్నిధి బ్లాగ్' నిర్వాహకులు పంపిన మెస్సేజ్‌తో ఆగస్టులో నేను మహాపారాయణలో భాగస్వామినయ్యాను. దానికి సంబంధించిన వివరాలను బాబా అనుగ్రహిస్తే ఇంకొక అనుభవం ద్వారా పంచుకోవటానికి ప్రయత్నిస్తాను. నేను మహాపారాయణలో చేరిన రెండున్నర నెలల్లోనే సాయి నన్ను మహాపారాయణకి క్లాస్ టీచర్ని చేశారు. అంటే, నేను 48మంది భక్తులతో పారాయణ చేయించాలి. అంతటి గొప్ప అనుగ్రహాన్ని పొందుతానని నేనసలు ఊహించలేదు. "ధన్యవాదాలు సాయినాథా!"
నెలరోజుల క్రితం ఒక గురువారంనాటి ఉదయాన నేను కేవలం పాలు మాత్రమే తీసుకొని, 'సభ్యులందరూ వారికి కేటాయించిన అధ్యాయాలు పారాయణ చేయడం పూర్తిచేస్తే, పారాయణ పూర్తయిందని రిపోర్ట్ పెట్టేసి అప్పుడు తినొచ్చు' అని అల్పాహారం తినకుండా ఉన్నాను. పారాయణ పూర్తయిందన్న సభ్యుల మెసేజ్ కోసం ఎదురుచూస్తూ చూస్తూనే లంచ్ టైమ్ కూడా అయింది. నేనింక ఏమీ తినకుండా అందరూ పారాయణ చేసేస్తే ఒకేసారి భోజనమే చేసేద్దామని ఎదురుచూస్తున్నాను. 47 మంది సభ్యుల పారాయణ పూర్తయింది. ఇంకొక్కరు మాత్రమే మిగిలారు. వారిది కూడా అయిపోతే రిపోర్టు పెట్టేసి భోజనం చేద్దామని చూస్తుంటే 2.30 అవుతున్నా ఆ సభ్యుని పారాయణ అవలేదు. మెస్సేజ్ పెట్టినా, ఫోన్ చేసినా పారాయణ చేస్తానని చెప్తున్నారేగానీ ఎంతకీ చేయటం లేదు. నిజానికి ఆ వ్యక్తి ఎప్పుడూ త్వరగానే పారాయణ చేస్తారు కానీ, ఏ కారణంచేతనో వారే ఆరోజు ఆలస్యం చేస్తున్నారు. కాసేపటికి ఆ వ్యక్తి తన పారాయణ పూర్తయ్యేసరికి సాయంత్రం 4గంటలు కావచ్చని కెప్టెన్‌తో చెప్పినట్లు తెలిసింది. ఇక చేసేది లేక భోజనం చేయడం మొదలుపెట్టాను. మీకు అర్థం అయిపోయింది కదా తరువాత ఏమి జరిగిందో? నేను భోజనం మొదలుపెట్టిన 5 నిమిషాల్లో, సాయంత్రం 4 గంటల వరకు పారాయణ పూర్తి కాదని చెప్పిన ఆ వ్యక్తి తన పారాయణ పూర్తి చేసి రిపోర్టు పెట్టిన మెస్సేజ్ వచ్చింది. అంటే, నేను ఏమీ తినకుండా ఉన్నానని నా సాయితండ్రి అలా చేశారు. 'నువ్వు తింటే కానీ పారాయణ పూర్తి కాదు' అని ఆయన నాకు తెలియజేశారు.
చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని అనేవారు కదా, 'నువ్వు హోంవర్క్ చేస్తేనే ఆడుకోనిస్తాను, అన్నం తింటేనే టీవీ చూడనిస్తాను' అని. అలాగే అనిపించింది సాయి చేసింది కూడా. ఇలాంటివి ఎన్నో అనుభవాలు జరిగాయి. వీలైనపుడు వాటిని మీ అందరితో పంచుకుంటాను.
అందరికీ నేను చెప్పేది ఒక్కటే! మనం అనుకున్నవి జరగలేదని బాబాకి మన మీద ప్రేమ లేదని అనుకోవద్దు. ప్రతిక్షణం ఆయన మన మీద ప్రేమ కురిపిస్తూనే ఉంటారు. ఒక తల్లిలా, ఒక తండ్రిలా నీకు ఏది మంచిదో అదే చేస్తారు.
ఓం సాయిరాం!

ప్రార్థించినంతనే ఇల్లు చూపించారు బాబా
న్యూజిలాండ్‌కు చెందిన ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
ఓం సాయిరామ్! జీవితంలో అడుగడుగునా మనకు తోడుగా సాయిబాబా ఉన్నారని నా పూర్తి విశ్వాసం. ఈ కలియుగంలో కూడా ఆయన తన భక్తులకు ఎన్నో అద్భుతాలు చూపిస్తున్నారు. మేము గత సంవత్సరం నుండి ఒక అద్దె ఇంటి కోసం వెతుకుతున్నాము. మేము ఎంతగా ప్రయత్నిస్తున్నా మాకు తగిన ఇల్లు దొరకలేదు. ఒకవేళ మాకు ఇల్లు నచ్చినా ఇంటి ఓనర్స్ నుండి ఎటువంటి స్పందనా ఉండేదికాదు. మేము చాలా నిరాశచెందాము. కానీ చేసేదిలేక సమస్యను బాబాకు వదిలివేశాము. అదే సమయంలో భారతదేశంలో ఉన్న నా తల్లిదండ్రులు కూడా ఒక ఇంటికోసం వెతుకుతున్నారు్. మాకు, నా తల్లిదండ్రులకు ఇల్లు దొరికేలా అనుగ్రహించమని బాబాకు చెప్పుకుని నేను నవగురువార వ్రతం ప్రారంభించాను. ఒక వారం తరువాత మావారు తనకు తెలిసిన ఒక వ్యక్తిని కలిశారు. మాటల్లో మావారు అతనితో, మేము ఇంటికోసం వెతుకుతున్నామని, ఎక్కడైనా ఖాళీగా ఉన్న ఇల్లు గురించి తెలిసినట్లైతే మాకు తెలియజేయమని చెప్పారు. తరువాత కొద్దిరోజులలోనే అతను ఫోన్ చేసి తన ఫ్యామిలీ ఫ్రెండ్ ఇల్లు ఖాళీగా ఉందని, మాకు ఆసక్తి ఉంటే వెళ్లి ఇల్లు చూడమని చెప్పారు. వెంటనే మేము వెళ్లి ఇల్లు చూశాము. అది పాత ఇల్లు. కానీ ఓనర్స్ చాలా మంచివారు. అక్కడితో బాబా దయవలన మా సమస్య ముగిసింది. నా తల్లిదండ్రులకు కూడా బాబా కృపవలన మంచి ఇల్లు దొరికింది. "బాబా! ఇదంతా మీ ఆశీర్వాదం వల్లనే. మా పరిస్థితి మీకు తెలుసు, అన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకోండి. మీపై నాకు అపారమైన నమ్మకం ఉంది".

Om sai ram 🙏🙏🙏
ReplyDeleteom sairam
ReplyDeletesai always be with me
you are my strength
pls. always be with me
జై సాయిరాం చాలా చాలా అద్భుతం
ReplyDeleteజై సాయిరాం మీరు పంపించే సాయి భక్తుల అనుభవాలు చాలా చాలా బాగున్నాయి
ReplyDeleteమహేశ్వరి వల్లం కొండ
Om sai ram!🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm sai ram!! 🙏🙏🙏
ReplyDelete