సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 276వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. కలకాదు నిజమనిపించేలా బాబా ఇచ్చిన అనుభవం
  2. జీవితాన్ని నడిపిస్తున్నది ఆ సాయినాథుడే!

కలకాదు నిజమనిపించేలా బాబా ఇచ్చిన అనుభవం

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను బెంగళూరు అమ్మాయిని. నేను చాలాకాలం నుండి సాయిబాబా భక్తురాలిని. కలలో బాబా నా కాలిసమస్యని ఎలా నయం చేశారో నేనిప్పుడు మీతో పంచుకుంటాను. నా కాళ్ళలో సమస్య ఉన్నందున, నేను చంక క్రింద పెట్టుకునే ఊతకర్ర సహాయంతో నడుస్తాను. కొన్నిరోజుల క్రితం నేను నడుస్తున్నప్పుడు ఎడమకాలి దిగువభాగంలో కండరాలు పట్టేసి నడక చాలా బాధాకరంగా అయ్యింది. అసలే నడవడం కష్టమైన నాకు మరింత కష్టం వచ్చిపడింది. అయినప్పటికీ నేను ఆ నొప్పిని సహిస్తూ నడక కొనసాగించాను. తరువాత ఒకరోజు ఆఫీసుకి బయలుదేరాను. మా ఇంటినుండి రోడ్డు చేరుకోవడానికి చాలా మెట్లు ఉన్నాయి. అవి దిగుతుండగా మళ్ళీ ఆ నొప్పి వచ్చింది. దాంతోపాటు తిమ్మిరి కూడా వచ్చింది. తీవ్రమైన నొప్పి కారణంగా నేను కూర్చోలేకపోయాను, నడవలేకపోయాను. ఏమి చేయాలో తెలియక అలాగే మధ్యలో నిలబడిపోయాను. నాతోపాటు ఉన్న మా అమ్మ నాకు ఏ సహాయం చేయలేక నిస్సహాయంగా చూస్తోంది. బాధతో నేను 'బాబా!' అని ఒక్కసారి పిలిచాను. కొద్దిక్షణాల్లో ఎక్కడినుంచి వచ్చిందో తెలియదుకాని ఒక నల్లకుక్క వచ్చి నా ముందు నిలబడింది. కొన్ని నిమిషాలపాటు అది నా కళ్ళల్లోకే చూస్తూ అక్కడే నిలబడి తరువాత పారిపోయింది. ఆ కుక్క కళ్ళల్లో అద్భుతమైన ప్రకాశం ఉంది. ఆ కుక్కని నేనెప్పుడూ మా ప్రాంతంలో చూడలేదు. నాకు బలాన్నివ్వడానికి ఆ కుక్క రూపంలో బాబానే వచ్చారని నాకు తెలుసు. ఆ కుక్క వెళ్ళిపోయాక నొప్పి భరించగలిగే స్థాయికి వచ్చింది. దాంతో నేను మెట్లు దిగి రోడ్డు వరకు చేరుకున్నాను. తరువాత క్యాబ్‌లో ఆఫీసుకు వెళ్ళిపోయాను.

అసలు అద్భుతం ఇప్పుడు చెప్తాను. ప్రతిరోజూ నేను బాబా ముందు ఆ తిమ్మిరి, నొప్పి తగ్గేలా చేయమని ఏడుస్తుండేదాన్ని. ఒకరాత్రి నాకొక అద్భుతమైన కల వచ్చింది. కలలో శిరిడీ సమాధిమందిరంలో లాగా ఒక ఎత్తైన వేదికపై పెద్ద బాబా విగ్రహం ఉండటం నేను చూశాను. క్రింద భాగంలో అందరూ నిలబడి ఆరతి పాడుతున్నారు. నాకు మరాఠీ రాదు, పైగా వాళ్ళు పాడుతున్న ఆరతి కూడా నాకు తెలియదు. కేవలం నేను చప్పట్లు కొడుతూ బాబాను చూస్తూ మైమరచిపోతున్నాను. అకస్మాత్తుగా బాబా తన రెప్పలు వాల్చడం నేను చూశాను. నేను భ్రమపడ్డానేమో అనుకుని దగ్గరగా ఉన్నవాళ్ళని "బాబా కనురెప్ప వాల్చడం చూశారా?" అని అడిగాను. కానీ వాళ్లంతా ఆరతి పాడటంలో బిజీగా ఉన్నారు. ఇంతలో మళ్ళీ బాబా కనురెప్ప వాల్చడం చూశాను. దాంతోపాటు తమ కాలిని కూడా కదిలిస్తున్నారు. నేను అందరితో, "చూడండి, బాబా తమ కాలును కదుపుతున్నారు" అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ వాళ్లెవరూ నా మాట వినడానికి సిద్ధంగా లేరు. అంతలో బాబా తమ ఆసనం మీదనుండి లేచి(విగ్రహం విగ్రహం లాగా అలానే ఉంది. కానీ బాబా మాత్రం లేచారు) కుడివైపుగా నడిచి, వేదిక మీదనుండి క్రిందకి దిగి ఒక చిన్న సందులోకి నడిచారు. నేను మెల్లగా ఆయనను అనుసరిస్తూ ఆ సందులోకి వెళ్ళాను. అప్పుడు బాబా వెనుకకు తిరిగి నేలమీద కూర్చున్నారు. నేను చేతులు కట్టుకుని ఆయన ముందు కూర్చున్నాను. నా చెక్కిళ్ళ మీదుగా కన్నీళ్ళు జాలువారుతున్నాయి. బాబా మరాఠీలో ఏదో చెప్పారు, కానీ అది నాకు అర్థం కాలేదు. తరువాత బాబా నొప్పి, తిమ్మిరి ఉన్న నా ఎడమకాలిని ముందుకు చాచమన్నారు. అప్పుడు ఆయన ఊదీని నా కాలికి రాసి, నా తలపై కొన్ని పువ్వులు విసిరారు. నేను చెప్పలేని ఆనందానికి లోనయ్యాను. బాబా నాపై విసిరిన ఆ పువ్వులను సేకరించి, భద్రంగా దాచుకోవాలని అనుకుని వాటిని ఏరుకుంటుండగా  ఆ పువ్వులు అక్షింతలుగా మారిపోయాయి. ఇంతలో వెనుకనుండి ఎవరో బాబాను తనతో తీసుకెళ్లడానికి వస్తున్నట్లు నేను గమనించాను. అతడు బాబా సన్నిహిత భక్తుడు శ్యామాలా ఉన్నారు. బాబా నాతో కూర్చుని ఉండటం చూసి, అతను మరొక మార్గం వైపుకు వెళ్ళాడు. ఇంకా నేను బాబాతో మరికొంత సమయం కూర్చుని మాట్లాడాలని అనుకుంటూ ఉంటే, బాబా నన్ను చూసి నవ్వుతూ ఆ సందునుండి వెలుపలికి నడవడం మొదలుపెట్టారు. నేను 'బాబా, బాబా' అని పిలుస్తూ ఆయనను అనుసరించాను కానీ, బయటికి వెళ్ళాక ఆయన అదృశ్యమయ్యారు. వెంటనే నాకు మెలకువ వచ్చింది. కల గుర్తుచేసుకుంటూ నేను చాలా ఆనందించాను. ఇది కేవలం కల కాదు, కలలా భ్రమపరిచే నిజం. ఎందుకంటే ఆరోజునుండి నాకు ఎటువంటి తిమ్మిరి, నొప్పి లేదు. ఇప్పుడు నాకు ఆ సమస్య అస్సలు లేదు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, బాబా ఇప్పటికీ సజీవంగా ఉన్నారు. ఆయన ఎక్కడికీ వెళ్ళలేదు. ఆయన తన సహాయం అందించడానికి ఏదో ఒక విధంగా వస్తారు. ఆయన చెప్పినట్లు మనం శ్రద్ధ, సబూరి కలిగి ఉంటే చాలు. బాబా నాకెన్నో అనుభవాలు ఇచ్చారు. వాటినుండి దీన్ని ఈరోజు మీతో పంచుకున్నాను. వీలైనంత త్వరలో ఇతర అనుభవాలను వ్రాయగలిగేలా సహాయం చేయమని బాబాను అభ్యర్థిస్తున్నాను.

source : http://www.shirdisaibabaexperiences.org/2019/09/shirdi-sai-baba-miracles-part-2492.html

జీవితాన్ని నడిపిస్తున్నది ఆ సాయినాథుడే!

ముందుగా సాయిబాబాకి నా నమస్కారములు. నా పేరు శ్రీనివాసదుర్గ. నేను విశాఖపట్టణం నివాసిని. నేను 25 సంవత్సరాలుగా సాయిభక్తురాలిని. నాకు అన్నీ ఆయనే. నా జీవితాన్ని, నా కుటుంబాన్ని నడిపిస్తున్నది ఆయనే. నాకు 15 ఏళ్లకే పెళ్లి అయింది. కొద్దికాలంలో మాకు ఇద్దరు అబ్బాయిలు పుట్టారు. అయితే నా భర్తకి ఉద్యోగమంటూ ఏదీ లేదు. సాయిభక్తురాలైన నా తల్లి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మా కుటుంబాన్ని నడిపించేది. కొంతకాలానికి ఆమె కాలం చేసింది. ఆ తరువాత నా భర్తకి పెద్ద ప్రమాదం జరిగి వెన్నుపూస విరిగిపోయింది. ఆపరేషన్ చేసినా ఆయన నడిచే పరిస్థితి రాలేదు. ఈ దారుణం జరిగి 16 సంవత్సరాలైంది. 28 ఏళ్ళ వయస్సులోనే నాపై ఎన్నో బరువు బాధ్యతలు పడ్డాయి. అప్పటినుండి నా భర్తను, పిల్లల్ని చూసుకుంటూ నా జీవితాన్ని సాగిస్తున్నానంటే అందుకు కారణం ఆ సాయినాథుడే! ఆయన అండతోనే మా జీవితాలు సంతోషంగా సాగుతున్నాయి. ఆయన అడుగడుగునా మాకు అందించే సహకారం మాటల్లో చెప్పలేనిది. ఎన్ని జన్మలెత్తినా మరిచిపోలేనిది ఆయన మా కుటుంబంపై చూపుతున్న ప్రేమ. ఆయన మహిమ అమోఘం. ఆయన లీలలు అద్భుతం.

6 comments:

  1. Om namoh sai nathaya namaha🙏🙏🙏🙏

    ReplyDelete
  2. jai sairam sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai

    ReplyDelete
  3. Always help all devotees sai. Sri sadguru sainathaya namaha. Subam bhavat. Omsai ram.

    ReplyDelete
  4. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo