సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 285వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయిబాబా కృప 
  2. సరైన సమయంలో బాబా సహాయం

సాయిబాబా కృప 

ఒక అజ్ఞాత సాయిబంధువు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

ముందుగా బ్లాగు నిర్వాహకులకు నా నమస్కారాలు. ప్రతిరోజూ నేను బ్లాగులో అనుభవాలు చదవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. భక్తుల అనుభవాలు పంచుకునేందుకు ఇంత చక్కటి అవకాశం కల్పిస్తున్నందుకు మీకు అనేక ధన్యవాదాలు. సాయిదేవుని అసంఖ్యాక లీలల్ని మీ ద్వారా మేము తెలుసుకోగలుగుతున్నాము. నేను సాయిభక్తురాలిని. నా దినచర్య సాయినామజపంతో మొదలై, అదే సాయినామస్మరణతో ముగుస్తుంది.

ఇక నా అనుభవంలోకి వస్తే.. ఒకసారి నేను నా 17 నెలల బాబుని తీసుకొని నా తల్లితండ్రులతో కలిసి హైదరాబాదు నుండి దక్షిణ తమిళనాడుకి ట్రైనులో వెళ్తున్నాను. రైలు ప్రయాణంలో మా బాబు ఎందుకో నిద్రపోకుండా బాగా ఇబ్బందిపడుతూ చాలాసేపు ఏడుస్తూనే ఉన్నాడు. నేను తనని కనీసం ఒక గంటైనా నిద్రపుచ్చేందుకు శతవిధాలా ప్రయత్నించి విఫలమయ్యాను. అప్పుడు నేను సాయిబాబాని తలచుకొని, "బాబా! నా బాబు ప్రశాంతంగా నిద్రపోయేలా చెయ్యండి" అని వేడుకున్నాను. ఆశ్చర్యం! మరుక్షణంలో చుట్టూ గోలగోలగా ఉన్నా కూడా బాబు నిద్రలోకి జారుకున్నాడు. మళ్ళీ మరునాటి ఉదయమే మేలుకున్నాడు.

తిరుగుప్రయాణంలో కూడా వాడు నిద్రపోవడానికి కష్టపడుతూనే ఉన్నాడు. అప్పుడు కూడా నేను బాబా సహాయాన్ని అర్థించాను. తరువాత 15 నిమిషాలకి వాడు ప్రశాంతంగా నిద్రపోయాడు.

"బాబా! నాకు, మావారికి మధ్య చెడుకాలం నడుస్తుందని మీకు తెలుసు. మా ఇద్దరి మధ్యనున్న అపార్థాలను తొలగించి గౌరవప్రదమైన వైవాహిక జీవితాన్నిచ్చి నన్ను అనుగ్రహించండి. నన్ను, మావారిని, మా బాబుని సదా ఆశీర్వదించండి. మీ చల్లని చేతులు మా శిరస్సుపై ఉంచి మాకు మార్గనిర్దేశం చెయ్యండి. నా జీవితంలోని  ప్రతి కదలికలో మీరు సదా నా వెన్నంటి ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మీ నామస్మరణ మరచిపోకుండా ఉండేందుకు నాకు సహాయం చెయ్యండి. కోటి కోటి ప్రణామాలు బాబా!"

ఓం సాయిరామ్!

సర్వేజనాః సుఖినోభవంతు.

సరైన సమయంలో బాబా సహాయం

ఒక అజ్ఞాత సాయిభక్తుడు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను బెంగళూరు నివాసిని. నేనొక ఎం.ఎన్‌.సి. సంస్థలో పనిచేస్తున్నాను. బాబా లీలాసముద్రంలో మనల్ని ముంచే గొప్ప ప్రయత్నం చేస్తున్న బ్లాగు నిర్వాహకులను నేను అభినందిస్తున్నాను.

ఒక గురువారం సాయంత్రం నాకు ప్రొడక్షన్ డిపార్ట్‌మెంటులో కొన్ని ఫైళ్లు కనపడటం లేదని తెలిసింది. నిజానికి అది పెద్ద సమస్యను సృష్టించవచ్చు. కొన్ని కారణాలవల్ల నేనే ఆ ఫైళ్ళను ప్రొడక్షన్ డిపార్ట్‌మెంటుకి పంపడం మర్చిపోయాను. అందుకు బాధ్యుడిని నేనేనని నా సహచరులతో తెలియజేయడానికి భయపడ్డాను. పైగా నేను చేసిన తప్పుకి 'నాకు సహాయం చేయలేద'ని బాబాను నిందించడం ప్రారంభించాను. తరువాత, ఆ విషయాన్ని అందరికీ తెలియజేయాలా లేక వాళ్ళు గుర్తించేవరకు వేచి ఉండాలా అనే నిర్ణయం తీసుకోలేక, "ఈ పరిస్థితిని హ్యాండిల్ చేసేందుకు నాకు మార్గనిర్దేశం చేయమ"ని బాబాను ప్రార్థించాను. అప్పుడు ఒక వెబ్‌సైట్ ద్వారా నాకొక సందేశం వచ్చింది, "నువ్వు తీసుకునే నిర్ణయం ఏమైనప్పటికీ నేను నీతో ఉంటాను" అని. ఆ సందేశం నా కళ్ళలో నీళ్ళు తెప్పించింది. సాయినుండి సరైన సమయంలో సరైన సందేశాన్ని చూడటం నాకు ఆశ్చర్యం కలిగించింది.

మరుసటిరోజు నాకు తెలిసిందేమిటంటే, వాళ్ళు కొన్ని ఇతర సమస్యల కారణంగా ఆ వారాంతంలో వేరే నిర్మాణానికి ప్రణాళికలు వేస్తున్నారని. అందువలన నేను చేసిన పొరపాటువల్ల పెద్దసమస్య ఏమీ లేదని అర్థమైంది. దాంతో నేను సమస్య (ఫైళ్లు మిస్సింగ్) గురించి వాళ్ళకి తెలియజేస్తే ఇబ్బంది ఏమీ ఉండదని బాబాను ప్రార్థించి, వాళ్ళకి సమాచారం ఇచ్చాను. అందరూ నవ్వుతున్న ముఖాలతో స్పందించారు, నన్ను ఎవరూ నిందించలేదు. దీని వెనుక సాయి ఉన్నారని నాకు తెలుసు. ఆయనపై మనకు బలమైన విశ్వాసం ఉన్నప్పుడు ఆయన ప్రతికూల పరిస్థితిని సైతం సెకన్లలో సానుకూలంగా మార్చేస్తారు. ఈ సమస్య ద్వారా సాయి నా రక్షకుడిగా నాతో ఉన్నారని నాకు అనుభవమైంది. "సాయీ! దయచేసి ఎల్లవేళలా నాతో ఉండి నాకు మార్గనిర్దేశం చేయండి. మీరు లేకుండా నేను ఏమీ కాను". 
శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!

source: http://www.shirdisaibabaexperiences.org/2019/10/shirdi-sai-baba-miracles-part-2501.html

3 comments:

  1. Sri sadguru sainath maharajuki jai om sai ram

    ReplyDelete
  2. Om Sri Sai Nath Maharaj Ki Jai

    Om sairam, sri sairam
    Pls.help me sairam
    alway be with me

    ReplyDelete
  3. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo