ఈ భాగంలో అనుభవం:
- జీవితంలోకి బాబా ప్రవేశం - కురిపిస్తున్న అనుగ్రహం
కోల్‌కతాకు చెందిన ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
నేను క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజనీరుని. నా జీవిత ప్రయాణం చాలా కష్టంతో కూడుకున్నది. బాబా ఆశీస్సులతో ఇటీవల నా వివాహం జరిగింది. నిస్సహాయస్థితిలో ఉన్న నాకు మంచి జీవిత భాగస్వామిని చూపించడంలో బాబా ఎలా సహాయపడ్డారో నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
20 సంవత్సరాల నుండి మా అమ్మ దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతోంది. కానీ మాది సంతోషకరమైన కుటుంబం. బాల్యంనుండి దేవాలయాలు, ప్రార్థనలు, ధ్యానం మొదలైన ఆధ్యాత్మిక కార్యకలాపాలు నన్ను చాలా ఆకర్షిస్తుండేవి. అయితే నేను, నా కుటుంబం ఎప్పుడూ సాయిబాబాను పూజించలేదు. చెప్పాలంటే కోల్‌కతాలో సాయిబాబా ఆలయాలు చాలా తక్కువ. అందుకేనేమో ఆయన గురించి మాకు సరిగ్గా తెలియదు.
2016 జనవరిలో నాకు వివాహం అయ్యింది. నేను చాలా సంతోషంగా అత్తవారింట అడుగుపెట్టాను. ఆ ఆనందం కేవలం ఒక నెల మాత్రమే నిలిచింది. ఎందుకంటే నా భర్త ఒక మానసిక రోగి. ఆ విషయాన్ని దాచిపెట్టి మోసంతో మా వివాహాన్ని జరిపించారు. అతను, అతని తల్లి నన్ను చాలా హింసించేవారు. ప్రతిరోజూ నేను నరకయాతన ఎదుర్కోవలసి వచ్చింది. నెల ముగిసేసరికి ఆ హింసను భరించలేక నేను పుట్టింటికి తిరిగి వచ్చేసి, విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. నా ఈ పరిస్థితికి నా తల్లిదండ్రులు మానసికంగా కృంగిపోయారు. మేము తీవ్రమైన బాధను అనుభవించాము. ఆ కఠిన పరిస్థితి నుండి బయటపడటానికి నేను చాలా దేవాలయాలను సందర్శించి క్రొత్త జీవితం మొదలుపెట్టడానికి సహాయం చేయమని దేవుళ్ళను ప్రార్థించాను. నా తల్లిదండ్రులు నాకోసం మరో జీవితభాగస్వామిని వెతకడం ప్రారంభించారు. కానీ తగిన సంబంధం దొరకలేదు. జీవితంపై ఎటువంటి ఆశ లేకుండా 2 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు నా జీవితంలోకి బాబా ప్రవేశించే శుభసమయం వచ్చింది.
ఒకరోజు నేను ఆఫీసులో కంప్యూటర్ ముందు కూర్చుని వర్క్ చేస్తున్నాను. నా మనస్సులో మాత్రం 'నా జీవితంలో ఎప్పుడైనా శుభవార్త అన్నది వస్తుందా? మంచి జీవితభాగస్వామి దొరుకుతాడా? అసలు సంతోషం వస్తుందా?' అని ఆలోచనలు నడుస్తున్నాయి. అకస్మాత్తుగా కంప్యూటరులో ఒక పేజీ తెరచుకుంది. ఆ పేజీలో 'శివ్‌పూర్ సాయిబాబా మందిరం' గురించి ఉంది. నాకు ఆశ్చర్యంగా అనిపించింది. నేను దానిని చదవడం మొదలుపెట్టాను. శివ్‌పూర్ పశ్చిమబెంగాల్ లోని బేతుదహరి ప్రాంతంలో ఉన్న ఒక చిన్న గ్రామం. అక్కడొక శిరిడీ సాయిబాబా మందిరం ఉంది. ఆ మందిర వెబ్‌సైట్‌లో అద్భుత కథలున్నాయి. అవి చదివాక ఆ మందిరం మా ఇంటినుండి చాలా దూరంలో ఉన్నప్పటికీ, నాకు పూర్తిగా తెలియని ప్రదేశం అయినప్పటికీ ఆ వారంలో ఎలాగైనా అక్కడకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఆశ్చర్యంగా నా తల్లిదండ్రులు కూడా నేను ఒంటరిగా అక్కడికి వెళ్ళడానికి ఒప్పుకున్నారు. నేను కూడా ఒంటరిగా వెళ్ళడానికి కాస్త ఆందోళనపడినప్పటికీ ఇంటినుండి బయలుదేరాను. తీరా నేను రైల్వేస్టేషనుకి వెళితే, ఆరోజు రైల్వే పునరుద్ధరణ పనులు జరుగుతున్న కారణంగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులో లేవు. నేను చాలా నిరాశకు గురై ప్లాట్‌ఫాం పైనున్న ఒక బెంచీ మీద కూర్చుని, "ఏవిధంగానైనా శివ్‌పూర్ చేరుకోవడానికి నాకు సహాయం చేయండి బాబా" అని బాబాను ప్రార్థించాను. బాబా కృపవలన నేను ఎక్కాల్సిన రైలు మాత్రమే సమయానికి వచ్చి, ఎటువంటి ఇబ్బందీ లేకుండా నేను మందిరానికి చేరుకున్నాను. బాబా దర్శనం చేసుకుని, "నాకు తగిన మంచి జీవితభాగస్వామిని చూపించండి బాబా!" అని ఆర్తిగా బాబాను ప్రార్థించాను. తరువాత తిరుగు ప్రయాణంలో కూడా రైలు సమయానికి రావడంతో ఆలస్యం కాకుండా క్షేమంగా ఇల్లు చేరుకున్నాను. ఇక అప్పటినుండి నేను సదా బాబా గురించి ఆలోచిస్తూ ఆయనను ఆరాధించడం మొదలుపెట్టాను. నేను 9 గురువారాల సాయి సత్యవ్రతాన్ని మొదలుపెట్టి, సాయి సచ్చరిత్ర చదవడం కూడా ప్రారంభించాను. నా వ్రతం పూర్తవుతూనే బాబా అనుగ్రహంతో USA నుండి ఒక సంబంధం వచ్చింది. అన్నీ సజావుగా సాగి 2019 మే నెలలో నా వివాహం జరిగింది. నా భర్త నిజంగా చాలా మంచి వ్యక్తి, నన్ను చాలా ప్రేమిస్తాడు. నేను తనతో, తన కుటుంబంతో చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితంలో సాయిబాబా ఇచ్చిన గొప్ప బహుమతి నా భర్త.
మరో అనుభవం:
నేను శివ్‌పూర్ సాయిబాబా మందిరాన్ని దర్శించిన తరువాత మా ఇంటికి సమీపంలో ఉన్న ఒక చిన్న సాయిమందిరాన్ని తరచూ నా ఆఫీసు సమయం ముగిశాక దర్శిస్తుండేదాన్ని. ఒకసారి నేను సచ్చరిత్ర సప్తాహపారాయణ పూర్తిచేసి స్వీట్స్ తీసుకుని సాయంత్రం 7:30 సమయంలో మందిరానికి వెళ్ళాను. ఆ స్వీట్స్ బాబాకి నివేదించమని అక్కడ పూజారికి ఇస్తే, అతను, "సమయం దాటింది, ఇప్పుడు నివేదించము" అని చెప్పాడు. నేను నిరుత్సాహపడి మౌనంగా కూర్చుండిపోయాను. నా పూజను, స్వీట్స్‌ను స్వీకరించడానికి బాబా ఇష్టపడలేదని నాలో నేనే బాధపడ్డాను. తరువాత నేను మందిరం నుండి బయటకు వచ్చి, అక్కడున్న బిచ్చగాళ్లకు ఆ స్వీట్లు పంచేసి, పగిలిన హృదయంతో ఇంటికి తిరిగి వచ్చాను. ఆ తర్వాత నేను 3 నెలలపాటు ఆ మందిరాన్ని దర్శించలేదు.
తరువాత ఒకరోజు నేను అదే సమయంలో (రాత్రి 7:30 గంటలకు) మందిరానికి వెళ్ళాను. పూజ సమయం దాటిందని పూజారి ఎలాగూ నా పూజను అంగీకరించరని నాకు తెలుసు కాబట్టి, కేవలం బాబా కోసం కొన్ని పువ్వులు తీసుకుందామని అక్కడ ఉన్న దుకాణానికి వెళ్ళాను. ఆ షాపు యజమాని, "దీదీ(అక్కా)! పండిట్(పూజారి) ఆరోజు మీ పూజకు అభ్యంతరం చెప్పారు కదా, ఆరోజు పండిట్ మీ పూజను అంగీకరించకపోయేసరికి మీరు చాలా నిరాశకు గురై వెళ్లిపోయారు. మీరు వెళ్లిపోయిన తరువాత, 'బాబాకు పూజ, నివేదన సమర్పించకుండా ఏ భక్తుడూ నిరాశతో తిరిగి వెళ్లకూడద'ని యాజమాన్యం ఆదేశించింది. కాబట్టి ఏ సమయంలో అయినా సరే పండిట్ భక్తుల పూజకు అభ్యంతరం చెప్పరు" అని చెప్పాడు. అది విని నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే, ఆ షాపు యజమాని నాకు తెలియదు. ఆరోజు నేను నా బాధను బాబాతో తప్ప మరెవరితోనూ పంచుకోలేదు. మరి అక్కడ జరిగిన విషయం అతనికి ఎలా తెలుస్తుంది? ఒకవేళ తెలిసినా అది జరిగిన 3 నెలల తర్వాత అతను గుర్తుపెట్టుకుని నాకెలా చెప్పగలడు? అంతేకాదు, ఒక సంఘటన ఆలయ నియమాన్నే మార్చింది. కాదు, ఈ భక్తురాలు పడిన మనోవేదనకు బాబా ఆలయ నియమాన్నే మార్చేలా చేసి, ఏ భక్తునికీ అటువంటి బాధ కలగకుండా చేశారు. ఇది బాబా నాకిచ్చిన గొప్ప అనుభవం.
ఈ కొద్దికాలంలోనే బాబాతో నాకు చాలా అనుభవాలున్నాయి. ఆయన దృష్టి ఎప్పుడూ నాపై ఉందని నేను అనుభూతి చెందుతున్నాను. నేను ప్రతి సమస్యను బాబాతో పంచుకుంటాను. జీవితంలో అడుగడుగునా నాకు తోడుగా ఉండమని నేను బాబాను ప్రార్థిస్తున్నాను. ఆయన భక్తుల ప్రార్థనలను ఖచ్చితంగా వింటారు. ప్రతిరోజూ సాయి సచ్చరిత్ర చదవమని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. అది మీకు అపారమైన మానసిక శాంతిని, మనోబలాన్ని ఇస్తుంది.
source:http://www.shirdisaibabaexperiences.org/2019/11/shirdi-sai-baba-miracles-part-2532.html

Thank you so much sai baba,,
ReplyDeleteI am waiting for the blessings of saibaba
ReplyDelete🙏🙏🙏
Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya jaya sai🙏🙏🙏🙏🙏
ReplyDeleteఆలయ నిర్వాహకులను సరైన దారిలో నడిపించి, అర్థం లేని నియమాలను మార్చి, భక్తుల ప్రేమను స్వీకరించిన బాబా ప్రేమకు ఆనందంతో కన్నీళ్లు వచ్చేస్తున్నాయి.
ReplyDeleteOM SAIRAM
ReplyDelete