ఈ భాగంలో అనుభవాలు:
- బాబా మరోసారి ఇచ్చిన భరోసా
- శ్రీసాయి ఊదీ సామర్థ్యం
బాబా మరోసారి ఇచ్చిన భరోసా
సాయిభక్తురాలు శ్రీమతి శిరీష బాబా తనకు ఇటీవల ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
సాయిరామ్! నేను 2020, జనవరి 5, ఆదివారంనాడు జరిగిన ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కొన్ని నెలల క్రితం నేను ఒక అనుభవాన్ని ఈ బ్లాగు ద్వారా మీతో పంచుకున్నాను. అందులో బాబా మా అబ్బాయి గురించి ఎలా భరోసా ఇచ్చారో తెలియజేశాను. ఇప్పుడు మరోసారి బాబా భరోసా ఇచ్చారు. మా అబ్బాయి ఇంటినుండి దూరంగా హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. తను ఇంటర్మీడియట్ పూర్తిచేసి ప్రొఫెషనల్ కోర్సులో చేరాడు. ఒకరోజు నేను, 'ఈ వయస్సులో తను తనకున్న స్వేచ్ఛ వలన తప్పుడు మార్గాలవైపు ఆకర్షింపబడే అవకాశముంద'ని భయపడ్డాను. బాబా మా అబ్బాయిని చూసుకుంటానని నాకు భరోసా ఇచ్చినప్పటికీ నేను అనవసరంగా ఈ విషయం గురించి ఆందోళన చెందడం మొదలు పెట్టాను. నేను ఆదివారం సాయంత్రం 4 గంటలకు మా అబ్బాయితో ఫోన్లో మాట్లాడాను. తరువాత కూడా నేను ఎటువంటి కారణం లేకుండా తన గురించి ఆందోళన చెందుతూ సరిగ్గా గం. 4.10 నిమిషాలకి ఫేస్‌బుక్ తెరచి ఒక సందేశాన్ని చూసి అశ్చర్యపోయాను. ఆ సందేశం ఇలా ఉంది:
"అరే తులా కల్జీ కస్లీ? మాలా సారీ కల్జీ ఆహే (నీకు ఏ విషయంలోనైనా ఆందోళన, చింత, విచారము ఎందుకు? నీ ఆందోళనలు, చింతలు, బాధ్యతలు అన్నీ నావి)" - సాయిబాబా
ఆ సందేశం ద్వారా నేను చింతిస్తున్న దాని గురించి బాబా మళ్ళీ నాకు భరోసా ఇచ్చి నన్ను ఆశీర్వదించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!" ఆ సందేశాన్ని స్క్రీన్ షాట్ తీశాను. దాన్ని కూడా క్రింద జతపరుస్తున్నాను. బాబా ఎంతో దయగలవారు. ఆయన ఎల్లప్పుడూ మన హృదయాలలో కొలువై ఉంటారు. మన కోరికలు, చింతలు, ఆందోళనలన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి తమదైన శైలిలో ఆయన సరైన సమయంలో మనకు భరోసా ఇస్తూ మన చింతలను దూరం చేసి మనశ్శాంతినిస్తుంటారు.

శ్రీసాయి ఊదీ సామర్థ్యం
నాకొక ఆల్సేషన్ జాతి పెంపుడు కుక్క ఉంది. దాని పేరు రాబిన్. తనకి పెట్టే ఆహారంలో పాలు లేదా మజ్జిగ కలిపిన అన్నం ప్రధానమైనది. చాలా అరుదుగా చికెన్ బోన్స్ ఇస్తాము. జూలై 30, 1978న దానికి విరోచనాలు మొదలయ్యాయి. ఏమి తిన్నా జీర్ణించుకోలేకపోయింది. ఉన్నట్టుండి అది కాస్తా తీవ్రమై డయేరియాగా పరిణమించింది. ప్రతి అరగంటకొకసారి అయ్యే విరేచనాలలో బ్లడ్ కూడా పోతూ ఉండేది. దాంతో అందరూ భయపడి, దానిని ఆసుపత్రికి తీసుకుని వెళ్లి వైద్యుడిని సంప్రదించమని నన్ను ఒత్తిడి చేశారు. నేను, 'నా వైద్యుడైన శ్రీసాయిబాబా సులువుగా లభ్యమయ్యేలా అతిచేరువలో ఉన్నప్పుడు మరొక వైద్యుడి వద్దకు ఎందుకు వెళ్లాల'ని అనుకున్నాను. నేను కొన్ని ఊదీ ప్యాకెట్లను ఈ సృష్టిని నడిపించే శ్రీసాయిబాబా పాదాల వద్ద (బెంగళూరులోని శ్రీసాయి ఆధ్యాత్మిక కేంద్రంలో) ఉంచాను. బాబాను ప్రార్థించి, రోజుకు మూడుసార్లు ఆ ఊదీని పాలల్లో, గంజిలో లేదా తనకి పెట్టే ఆహారంలో కలిపి ఇవ్వడం ప్రారంభించాను. అయితే ప్రారంభంలో సమస్య ఇంకా తీవ్రమైంది; కానీ నేను నా విశ్వాసాన్ని కోల్పోకుండా ఒకటే నిర్ణయించుకున్నాను, 'ఈ చికిత్సతో కుక్క మనుగడ సాగించాలి లేదా అది చనిపోవాలి' అని. నాది మొండిపట్టుదల లేదా గ్రుడ్డివిశ్వాసం అని మీరు అనుకోవచ్చు. అయితే ఒక వారం రోజుల పాటు అదే చికిత్స కొనసాగించాక, హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ వ్యాధి నెమ్మదిగా అదుపులోకి వచ్చింది. నేను శ్రీసాయిబాబాను ప్రార్థిస్తూ ఆ చికిత్సను కొనసాగించాను. బాబా కృప వలన కుక్క సాధారణ స్థితికి తిరిగి వచ్చింది. ఇప్పుడు మీరు బాబా ఊదీ యొక్క సామర్థ్యాన్ని గ్రహించే ఉంటారు. మన రోజువారీ జీవనప్రయాణంలో కొన్ని సమయాలందు తలెత్తే క్లిష్ట పరిస్థితులను బాబా ఊదీతో అధిగమించవచ్చు. దృఢమైన విశ్వాసంతో ఉన్నవారిపై బాబా కృప సదా ఉంటుంది.
-ఎ.రామచంద్రన్,
బెంగళూరు.
మూలం: శ్రీసాయిలీల, జనవరి 1979.

No comments:
Post a Comment