సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 292వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయిబాబా కృప
  2. సాయి కృపతో డెంగ్యూ నయమైంది
  3. బాబా నా సైనస్ తలనొప్పిని నయం చేశారు

సాయిబాబా కృప

USA నుండి అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

8 సంవత్సరాలు ఎంతో ప్రయత్నించిన తరువాత బాబా దయవలన నా సోదరి ఒక ఆడపిల్లకి జన్మనిచ్చింది. ఆ కష్టకాలంలో బాబాపై ఆశను కోల్పోకుండా ఉన్నందుకు మా చిన్ని ఏంజిల్ మా జీవితాలలోకి వచ్చింది. ఇటీవల నా సోదరి తన బిడ్డని తీసుకుని ఇండియా వెళ్ళింది. అక్కడికి వెళ్లిన 2 వారాల తరువాత మా చిన్ని ఏంజిల్ అనారోగ్యానికి గురైంది. డెంగ్యూ జ్వరంగా డాక్టర్లు నిర్ధారించారు. మేమంతా చాలా భయపడిపోయాము. తన ప్లేట్లెట్ కౌంట్‌ను డాక్టర్లు తరచుగా గమనిస్తూ ఉండేవారు. ఒకరోజు రాత్రి ప్లేట్లెట్ కౌంట్ 38000కి పడిపోయింది. మరుసటిరోజు ఉదయం మళ్ళీ చెక్ చేస్తామని, ఒకవేళ అంతకంటే ప్లేట్లెట్ కౌంట్ పడిపోతే ప్లేట్లెట్ మార్పిడి చేయాల్సివుంటుందని డాక్టర్ చెప్పారు. కేవలం ఒక సంవత్సరం వయస్సున్న చిన్నారికి ప్లేట్లెట్ మార్పిడి అంటే మేము చాలా భయపడ్డాము. దీనంగా బాబాను ప్రార్థించి, భారం ఆయన మీద వేశాము. బాబా కృప చూపించారు. మరుసటిరోజు ఉదయం మళ్ళీ చెక్ చేసినప్పుడు ప్లేట్లెట్స్ సంఖ్య పెరిగింది. "ఎల్లప్పుడూ మాకు రక్షణనిస్తూ మార్గనిర్దేశం చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు బాబా!"

source: http://www.shirdisaibabaexperiences.org/2019/10/shirdi-sai-baba-miracles-part-2516.html

సాయి కృపతో డెంగ్యూ నయమైంది

సాయి భక్తుడు మోహన్ తమ రీసెంట్ అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:

5 సంవత్సరాల మా బాబు పేరు సాయి సిద్ధార్థ్. తనకి 2020, జనవరి 10న జ్వరం వచ్చింది. రెండురోజుల తర్వాత బాబుకి వచ్చింది డెంగ్యూ అని డాక్టర్ నిర్ధారించారు. డెంగ్యూ అని తెలిసి మేమంతా చాలా ఆందోళన చేద్దాం. నేను బాబా మందిరానికి వెళ్లి 51 రూపాయలు బాబాకు సమర్పించుకొని, బాబుకు జ్వరం తగ్గేలా అనుగ్రహించమని బాబాను వేడుకున్నాను. బాబా మా మీద కృప చూపారు. బాబు జ్వరం తగ్గి, ఇప్పుడు తను నార్మల్ అయిపోయాడు. మా దేవుడు, మా డాక్టర్ అన్నీ బాబాయే.

జై సాయిరామ్.

బాబా నా సైనస్ తలనొప్పిని నయం చేశారు

USA నుండి అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

నేను చిన్నతనంనుండి సాయిభక్తురాలిని. బాబా నాకు చాలా అనుభవాలు ప్రసాదించారు. కొన్ని రోజుల క్రితం సైనస్ తలనొప్పితో నేను చాలా బాధపడ్డాను. నాకు ఎప్పుడూ ఈ నొప్పి ఉంటుంది. కానీ అప్పటికి కొద్దిరోజులముందే నేను యు.ఎస్. వెళ్లి ఉన్నాను. అక్కడ వచ్చే చాలా రకాల అలర్జీలు కారణంగా ఈసారి నాకొచ్చిన సైనస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. తలనొప్పికి తోడు జ్వరంతో 12 రోజులకు పైగా బాధపడ్డాను. అలర్జీలు కోసం నేను చాలా మందులు తీసుకుంటున్నా, అవి నయం చేయడానికి బదులు నన్ను మరింత అనారోగ్యంతో బలహీనం చేశాయి. అప్పుడు సాయి మాత్రమే నాకు సహాయం చేయగలరని గ్రహించి ఇతర మందులతోపాటు రోజుకి 3సార్లు బాబా ఊదీని నీళ్లలో కలుపుకుని త్రాగడం మొదలుపెట్టాను. నెమ్మదిగా నయమవడం మొదలై త్వరలోనే పూర్తిగా కోలుకున్నాను. నాకు నయమైతే తోటి సాయిభక్తులతో నా అనుభవాన్ని పంచుకుంటానని బాబాకు మాట ఇచ్చినట్లుగా నేను ఈరోజు మీతో నా అనుభవాన్ని పంచుకున్నాను. నాకు ఇంకొక కోరిక  చాలాకాలంగా ఉంది. త్వరలోనే సాయి ఆ కోరికను నెరవేరుస్తారని ఆశిస్తున్నాను. అది నెరవేరాక మీతో పంచుకుంటాను. "ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉంటూ నా సిల్లీ సిల్లీ కోరికలను వింటున్న మీకు చాలా చాలా ధన్యవాదాలు బాబా! లవ్ యు బాబా!"

source: http://www.shirdisaibabaexperiences.org/2019/10/shirdi-sai-baba-miracles-part-2516.html


3 comments:

  1. Om Sairam
    sainath maharaj ki jai
    sarvam sai natharpanam

    ReplyDelete
  2. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo