సాయిశరణానంద అనుభవాలు - పద్దెనిమిదవ భాగం
నిన్నటి తరువాయిభాగం.....
శిరిడీలో నేను సుదీర్ఘకాలం ఉన్నాను. బాబా ప్రసంగవశాత్తూ నన్ను దక్షిణ అడుగుతుండేవారు. నా దగ్గర డబ్బులున్నంత వరకూ నేను వారికి ఇస్తూనే ఉండేవాణ్ణి. చాలాసార్లు వైకుంఠని అడిగి డబ్బు తెప్పించుకోవలసి వచ్చేది. అప్పుడతను, “బాబా దక్షిణ ఎందుకు అడుగుతారు?" అని అడిగేవాడు. నా డబ్బులోనుంచే అతను నాకు డబ్బు పంపించేవాడు. అయినప్పటికీ అతని మనసుకి దుఃఖం కలిగేది. బాబా ఎవరినైనా పంపించి, నన్ను తమ వద్దకు పిలిపించి దక్షిణ అడిగేవారు. అంతేకాదు, వేరే వ్యక్తుల పేర్లు చెప్పి వారినుంచి దక్షిణ తెచ్చే పనిని నాకప్పజెప్పేవారు. ఆ తరువాత ప్రతిరోజూ అలాగే జరిగేది. అప్పటినుంచి బాబా నన్ను 'బాబు' అని పిలవటం మొదలుపెట్టారు. అలాగే చివరిదాకా నన్ను ఆ పేరుతోనే పిలిచేవారు.
ఒకసారి నేను లోపలిగదిలో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నప్పుడు మస్తిష్కం పైభాగంలోని ద్వారం తెరచుకుని సహస్రారచక్రమార్గం తెరుచుకున్నట్లు నాకనిపించింది. అప్పుడు డా౹౹పిళ్ళేగారు ఉపాసనీ మహారాజుని, "వామనరావుని బాబా ఎందుకు వెళ్ళనీయటంలేద"ని అడిగాడు. శ్రీఉపాసనీ మహారాజు అతనితో, “బాబా అతని చక్రం మరొకటి తెరిపించవలసి ఉంది" అని చెప్పారు. అది విని నాకు, “లలాటంలో ఉన్న ఏదో ద్వారాన్ని తెరచి బాబా నాపై కృప చూపించారు” అన్న విశ్వాసం కలిగింది.
ఆరోజుల్లో నేను వశిష్ఠగీతను చదువుతున్నాను. ఒకరోజు అందులో ప్రాణాయామ విశిష్టతను గురించి చదివి నేను ప్రాణాయామం చేస్తూ కూర్చున్నాను. ఇంతలో బాబా ఒక వ్యక్తిని పంపించి నన్ను పిలిపిస్తే నేనక్కడకు వెళ్ళాను. బాబా ఏమీ చెప్పకుండా నన్ను ఒక గంటసేపు అలాగే కూర్చోపెట్టారు. తరువాత కొందరి భక్తుల నుంచి దక్షిణ తెమ్మని నన్ను పంపించారు. రెండవసారి ప్రాణాయామం ప్రారంభించబోతున్నప్పుడు బాబా మళ్ళీ పిలిపించారు. నాకు వినిపించలేదేమో అనుకుని రాధాకృష్ణమాయి నా తలుపు తట్టి నన్ను బయటకు పిలిచి బాబా వద్దకు పంపించింది. అప్పుడు కూడా బాబా నన్ను చాలాసేవు ఉంచేశారు. దాంతో 'ప్రాణాయామక్రియ నాకోసం కాద'ని బాబా నాకు సూచించాలనుకుంటున్నారని నాకు అర్థమైంది.
ఈ రోజుల్లోనే ఒకనాటి మధ్యాహ్నం బాబా పాత ధోవతిని వెడల్పాటి పీలికలుగా చించి తమకోసం ఒక నాడా తయారు చేసుకున్నారు. ఒకటి, రెండుసార్లు దర్జీవాడిని పిలిపించి 18 గజాల ముతక వస్త్రాన్ని తెప్పించి, "కఫ్నీ కుట్టమ"ని ఆజ్ఞాపించారు. అతను ఆ ముతక వస్త్రాన్ని మడతపెట్టి రెండు మడతలలో కఫ్నీని తయారుచేశాడు. తలకు కట్టుకోవటానికి రెండున్నర గజాల (అయిదు మూరలు) ముక్కను కూడా తెప్పించేవారు బాబా. ఒకసారి బాబా నాతో, “మొదట్లో నేను పల్చని వస్త్రాన్ని వాడేవాడిని. అందువల్ల ప్రజలు నన్ను దూరంగా పెట్టేశారు. అందుకని నేను ముతక వస్త్రం వాడాలని నిశ్చయించుకున్నాను" అన్నారు.
ఒకసారి ధుని దగ్గర ఉండే నల్ల స్తంభం వైపు వేలుపెట్టి చూపిస్తూ నాతో, "మొదట ఇక్కడ ఒక గుహ ఉండేది. నేను రోజంతా ఇక్కడే కూర్చొని ఉండేవాడిని. అప్పుడు నాకు జడలూ, గడ్డమూ పెరిగాయి. నా గడ్డం ఎంత పొడవుగా పెరిగిందంటే అది భూమిని తాకుతూండేది. నేను బయటకు వెళ్ళినప్పుడు అది చీపురులా భూమిని శుభ్రం చేసేది. నేను ఎప్పుడో ఒకసారి ఈ గుహ నుండి బయటకు వచ్చేవాడిని. ఎవరైనా సత్యవంతుడూ, పుణ్యమూర్తీ వస్తే బయటకొచ్చి రెండు మూడు మాటలు అతనితో మాట్లాడేవాడిని. అప్పట్లో నేను కాఫీ త్రాగేవాణ్ణి. కానీ దాన్ని తయారుచేసే పద్ధతి వేరుగా ఉండేది. సగం నీరూ, సగం పాలూ తీసుకుని దాన్లో శొంఠిని వేసి కాఫీ చేసి త్రాగేవాణ్ణి. అలాగే నేను రకరకాలుగా కూరలు కూడా వండేవాణ్ణి. లేత పచ్చికలో ఉల్లిపాయ, మసాలా వేసి ఒకరకమైన కూరను వండేవాణ్ణి” అన్నారు.
తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.
Sainatha namo namaha🙏🙏
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః
🙏🌹ఓం శ్రీ సాయిరాం తాతయ్య 🌹🙏
ReplyDelete