సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 414వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయి నాపై కురిపించిన అనుగ్రహం
  2. టెన్షన్ నుండి ఉపశమనం ప్రసాదించిన సాయినాథుడు

సాయి నాపై కురిపించిన అనుగ్రహం

బోరబండ(హైదరాబాదు) నుంచి సాయిభక్తుడు రాకేష్ తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

ఒకరోజు ఉదయం నేను భరించలేని కడుపునొప్పి, వాంతులతో తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాను. ఏది తిన్నా వాంతి అయిపోతుండేది. ఆ కారణంగా నా శరీరం డీహైడ్రేషన్‌కు లోనై నేను చాలా నీరసించిపోయాను. ఇంట్లోవాళ్ళు నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. డాక్టర్ నాకు గ్లూకోజ్ ఎక్కించి, ఇంజక్షన్లు, మందులు ఇచ్చారు. అయినా నా పరిస్థితి కాస్త విషమంగానే ఉంది. మా అమ్మ సాయిభక్తురాలు. తనకి బాబా అంటే చాలా ఇష్టం. తను బాబా గుడికి వెళ్లి, నా ఆరోగ్యం గురించి బాబాను మనసారా ప్రార్థించి, ఊదీ ప్రసాదాన్ని తీసుకొచ్చింది. తను ఆ ఊదీని నీటిలో కలిపి నా చేతికిచ్చి, "బాబాను ప్రార్థిస్తూ నమ్మకంతో ఆ నీటిని త్రాగమ"ని చెప్పింది. నేను అమ్మ చెప్పినట్టే చేశాను. ఆ ఊదీనీటిని త్రాగిన పదినిమిషాలలో కడుపులో తిప్పినట్లై వాంతి చేసుకున్నాను. ఆశ్చర్యమేమిటంటే, అప్పటినుండి నా ఆరోగ్యం కుదుటపడింది. నేను పూర్తిగా కోలుకున్నాను. అంతా బాబా అనుగ్రహమే.

మరొక అనుభవం:

ఇది 2007లో జరిగింది. అవి నేను ఉద్యోగ సమస్యలను ఎదుర్కొంటున్న రోజులు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. దాంతో నా మీద నాకే నమ్మకం పోయింది. చాలా బాధను అనుభవిస్తున్న నన్ను చూసి మా బావగారు, "సాయిసచ్చరిత్ర చదివితే బాధలన్నీ సమసిపోతాయి. బాబా ఆశీర్వాదంతో నీకు ఉద్యోగం వస్తుంది" అని చెప్పారు. అప్పటికి బాబా అంటే నాకు పెద్దగా నమ్మకం లేదు. కేవలం ఉద్యోగం కోసం సచ్చరిత్ర చదివాను. నిజంగా అద్భుతం జరిగింది. పారాయణ ముగిసిన మరుసటి వారమే సాయి ఆశీస్సులతో నాకు ఉద్యోగం లభించింది. అప్పటినుంచి నాకు బాబా మీద నమ్మకం ఏర్పడింది. అప్పటినుండి ఇప్పటివరకు బాబా నాకు తోడుగా ఉండి నన్ను నడిపిస్తున్నారు.

మరొక అనుభవం:

ఒక ఆదివారం కూరగాయలు మరియు రెయిన్ కోటు కొనుక్కోవాలని ఎర్రగడ్డ రైతుబజారుకి వెళ్ళాను. ఒకచోట నా బైకుని పార్క్ చేసి, నాకు కావాల్సినవి కొనుక్కొని వచ్చేసరికి నా బైక్ కనబడలేదు. చుట్టుపక్కలంతా వెతికాను, అక్కడున్న అందరినీ అడిగాను. అందరూ మాకు తెలియదనే సమాధానమే ఇచ్చారు. బైకును ఎవరో తీసుకెళ్లిపోయారని అర్థమై చాలా ఆందోళన చెందాను. సోమవారం పోలీస్ స్టేషనుకి వెళ్లి ఫిర్యాదు చేశాను. వారు అన్ని వివరాలూ తీసుకొని, "బైక్ ఎప్పుడు దొరుకుతుందో ఖచ్చితంగా చెప్పలేం. ఏమైనా తెలిస్తే కబురు చేస్తామ"ని చెప్పి నా ఫోన్ నెంబర్ తీసుకున్నారు. తరువాత నేను, "బాబా! ఎంతో ఇష్టంగా తీసుకున్న బైక్, త్వరగా దొరికేలా అనుగ్రహించండి" అని చాలా ఆర్తిగా బాబాను వేడుకున్నాను. బాబా నా మొర ఆలకించారు. గురువారం ఉదయం నాకు పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వచ్చింది. వాళ్ళు, "మీ బైక్ దొరికింది, వచ్చి తీసుకెళ్లండి" అని చెప్పారు. నా సంతోషానికి అవధులు లేవు. ఆరోజు గురువారమైనందున బాబా చేసిన సహాయం నాకు చాలా స్పష్టంగా తెలుస్తోంది. నా బాధను చూడలేక మూడురోజుల్లోనే నా బైక్ దొరికేలా చేసిన బాబా ప్రేమకు చిన్నపిల్లవాడిలా ఏడుస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

టెన్షన్ నుండి ఉపశమనం ప్రసాదించిన సాయినాథుడు

హైదరాబాద్ నుండి శ్రీమతి మాధవీరెడ్డి ఇటీవల బాబా తనకి ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:


సాయిరాం! నా ప్రియమైన సాయిబంధువులందరికీ బాబా ఆశీస్సులు సదా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ కీలకమైన కొరోనా కాలంలో బాబా ఆశీస్సులతో అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈ మధ్యకాలంలో నేను నా శరీరంలోని హిమోగ్లోబిన్ స్థాయి తెలుసుకోవడానికి రక్త పరీక్ష చేయించుకోవడానికి వెళ్ళాను. రిపోర్టుల్లో రక్తహీనతకు సంబంధించిన చాలా సమస్యలు ఉన్నాయని తెలిసింది. ఫలితంగా చాలా తీవ్రమైన పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుందని మేమంతా చాలా టెన్షన్ పడ్డాం. అప్పుడు నేను బాబాను ప్రార్థించి, "తీవ్రమైన సమస్యలేవీ లేకుండా ఆశీర్వదించమ"ని వేడుకున్నాను. తరువాత డాక్టర్ సలహా తీసుకోవడానికి వెళ్ళాను. ఆయన అంతా పరిశీలించి, "భయపడాల్సిన పని లేదు. మూడు నెలల పాటు మందులు వాడుతూ, పోషక విలువలున్న మంచి ఆహారాన్ని తీసుకొంటే అంతా బాగుంటుంది" అని చెప్పారు. ఆ మాట నాకు, నా కుటుంబానికి ఎంతో ఊరటనిచ్చింది. బాబాకు మాట ఇచ్చినట్లుగా నేను నా అనుభవాన్ని ఈ బ్లాగు ద్వారా సాటి సాయిభక్తులతో పంచుకుంటున్నాను. బాబా ఇచ్చిన అందమైన అనుభవాలను పంచుకోవడానికి చక్కటి వేదికను ఏర్పాటు చేసిన ప్రియమైన ఈ బ్లాగ్ నిర్వాహకులకు చాలా ధన్యవాదాలు. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు".


9 comments:

  1. om sairam
    sai always be with me

    ReplyDelete
  2. om sai namo namah
    sri sai namo namah
    jaya jaya sai namo namah
    sadguru sai namo namah

    ReplyDelete
  3. sai nenu emi cheyalo cheppu sai
    please sairam
    do some thing sairam
    edchi edchi kanniru endipoindi sainath
    please sairam , thattuko leka potunnanu

    ReplyDelete
    Replies
    1. Ala edvaddhu,naku telustundhi Mee badha kani sainadha! 🙏 Tappaka help chestaru.

      Delete
  4. ఓం సాయిరాం🌹🙏🌹

    ReplyDelete
  5. Om Sri sairam tatayya 🙏🌹

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo