సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 376వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - పదవ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

బి.ఎ. అయిన తరువాత జె.ఎ.నటేశన్ కంపెనీ వారు ప్రచురించిన స్వామి వివేకానంద గ్రంథం పఠించటం ప్రారంభించాను. నాలాగానే స్వామి వివేకానంద కూడా గ్రాడ్యుయేషన్ మూడవ తరగతిలో ఉత్తీర్ణులయ్యారు. ఇది చదివాక, గ్రాడ్యుయేషన్ మూడవ తరగతిలో పాసయినవారిక్కూడా భగవద్దర్శనం ప్రాప్తిస్తుందన్న ధైర్యం నాక్కలిగింది. ఆయన గురుకృపతో భారతదేశ విశిష్టతను గూర్చి ప్రపంచమంతటా చాటాడు. వారి భాష కొంచెం కఠినంగా ఉండటం వల్ల నా పఠనం అసంపూర్ణంగా మిగిలిపోయింది. అయితే శ్రీగురుకృప వల్ల అది సంపూర్ణమైంది. గ్రంథం నిరుపమానమైనది. 

ఆ రోజుల్లో వారి 'మాయావతీ ఆవృత్తి' అనే సంపూర్ణ గ్రంథం అయిదు భాగాలుగా కేవలం 12.50 పైసలకి లభించేది. అది తెప్పించి నేను చదవటం మొదలుపెట్టాను. స్వామి రామతీర్థగారి గ్రంథాలు రెండు భాగాలూ ఒక్కొక్కటి రూపాయి చొప్పున ప్రచురించబడ్డాయి. అవి కూడా తెప్పించి చదివాను. ఇవికాక శ్రీదాసగణు విరచిత ప్రాచీన అర్వాచీన లీలామృతమూ, సమర్థ రామదాసుగారి దాసబోధ కూడా చదివాను. 'లా' చదవటం మొదలుపెట్టాను. ఇంట్లో నాన్నగారి గ్రంథాలున్నాయి. వాటిలో పంచదశిపై నా చేయి పడింది. అయితే అది కొంచెం కూడా అర్థం కాకపోవటంవల్ల మళ్ళీ దాన్ని యథాస్థానంలో ఉంచాను. శంకరాచార్యుల వారి 'శతశ్లోకి' కూడా చదివాను. అది చదివేటప్పుడు పూర్వజన్మలో ఈ గ్రంథాన్ని ఎన్నోసార్లు చదివిన అనుభూతి కలిగింది. ఈ కాలంలోనే సంత్ తుకారాం జీవితచరిత్ర, రామదాసస్వామి ఛత్రపతి శివాజీకి చేసిన బోధ కూడా చదివాను.

ఈ మధ్యకాలంలో నాకో స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో బాబా, “నీ గదిలో కూర్చొని భోజనం చేయి" అన్నారు. భవిష్యత్తులో నేను సన్యసించాలన్న దానికి సూచనగా, "భిక్షగా పాలు మాత్రమే తీసుకో" అని కూడా చెప్పారు. అయితే భిక్ష తీసుకొమ్మన్న సూచనకి నేనంత ప్రాముఖ్యత ఇవ్వలేదు కానీ, ఆరోజు నుంచి నేను వంటగదిలో అందరితోపాటు కలిసి భోజనం చేయటం మానేసి నా గదిలో భోజనం చేయటం మొదలుపెట్టాను. ఆ రోజుల్లో మా నాన్నగారు మాతోనే ఉండేవారు. కానీ మొదట్నుంచీ నాదీ, వారిదీ భోజన సమయం వేర్వేరుగా ఉండేది. మేము పెందరాళే భోజనం చేసేవారం, ఆయన మధ్యాహ్నం కొంచెం ఆలస్యంగా భోజనం చేసేవారు. నాలో భోజన విషయంలో వచ్చిన పరివర్తనను తెలుసుకొని అపార్థం చేసుకుని మా అమ్మతో, “ఏకాంతంగా తన గదిలో కూర్చొని భోజనం చేయాలన్న వామన్ నియమం ఏమైనా బావుందా?” అన్నారాయన.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo