సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 415వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. కోరుకున్నది అనుగ్రహించే బాబా
  2. మన మనసుకి అనుగుణంగానే బాబా అనుగ్రహిస్తారు

కోరుకున్నది అనుగ్రహించే బాబా

నా పేరు అంజలి. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా కృతజ్ఞతలు. బాబా నా జీవితంలో చూపించిన ఎన్నో లీలలను ఈ బ్లాగ్ ద్వారా మీ అందరితో పంచుకున్నాను. ఇటీవలే బాబా ప్రసాదించిన మరొక లీలను ఇప్పుడు మీతో పంచుకుంటాను. 

2020, ఏప్రిల్ నెల 28వ తారీఖున నా గొంతులోని ఎడమవైపు భాగంలో టాన్సిల్స్ వలన నొప్పి వచ్చింది. ఏదయినా మింగుతుంటే బాగా నొప్పిగా అనిపించేది. మంచినీళ్ళు తాగుతున్నా ఇబ్బందిగా ఉండేది. గొంతునొప్పి తగ్గడానికి మందు వేసుకున్నప్పటికీ ఫలితమేమీ కనపడలేదు. దాంతో నేను నా బాధను బాబాకు చెప్పుకొని, “బాబా! ఈ గురువారానికల్లా ఎలాగైనా నా గొంతునొప్పిని తగ్గించండి” అని ప్రార్థించి, మందులతోపాటు బాబా ఊదీని నా గొంతుకు రాసుకోవడం మొదలుపెట్టాను. మరో విషయం ఏమిటంటే, స్వీట్స్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో స్వీట్ తీసుకోవడం నాకు అలవాటు. ఆయుర్వేద డాక్టర్ నన్ను అసలు స్వీట్స్ తినవద్దని చెప్పారు. కానీ నన్ను నేను నియంత్రించుకోలేక నా ప్రమేయం లేకుండానే స్వీట్స్ తినేస్తున్నాను. ఆ విషయంలో కూడా నేను, 'స్వీట్ కనిపించినా తినకుండా వుండేలా నన్ను మార్చమ'ని బాబాను కోరుకున్నాను. నేను కోరుకున్నట్లే ఏప్రిల్ 28, గురువారం ఉదయానికల్లా టాన్సిల్ నొప్పి తగ్గిపోయింది. అంతేకాదు, స్వీట్స్ తినే విషయంలో కూడా నాకు కాస్త నియంత్రణ వచ్చింది. అంతా బాబా అనుగ్రహమే. మనం ఏది కోరుకుంటే బాబా అది అనుగ్రహిస్తారు. పిలిస్తే పలికే దైవం నా బాబా. టాన్సిల్ సమస్య తగ్గితే నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటానని బాబాకు చెప్పుకున్నాను. “థాంక్యూ సో మచ్ బాబా! మీ లీలను పంచుకోవడం కాస్త ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి. మీ దయ నా కుటుంబం మీదా, అలాగే అందరిమీదా వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తండ్రీ!”. మరో సాయి లీలతో త్వరలోనే మళ్ళీ మీ ముందుకు రావాలని ఆశిస్తున్నాను. 

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహరాజ్ కీ జై!

మన మనసుకి అనుగుణంగానే బాబా అనుగ్రహిస్తారు

నా పేరు స్వాతి. నేను సాయిభక్తురాలిని. నేను ప్రతి గురువారం సాయిసచ్చరిత్ర పారాయణ చేస్తుంటాను. నేను ఎప్పుడూ అనుకుంటుంటాను, “నిజంగా బాబా మనం ఏది అడిగితే అది చేస్తారా?” అని. అలాగే, బ్లాగులో ఎంతోమంది సాయిభక్తుల అనుభవాలు చదువుతున్నప్పుడు, “నిజంగా బాబా ఇన్ని అద్భుతాలు చేస్తారా?” అని అనుకునేదాన్ని. నా సందేహాలను తీర్చేలా అలాంటి అద్భుతాన్ని బాబా నాకు కూడా ప్రసాదించారు. దానినే ఇప్పుడు మీతో పంచుకుంటాను. 

ప్రతి నెలా వచ్చినట్లే ఈ నెల కూడా నాకు నెలసరి వచ్చింది. సాధారణంగా నాకు 5 రోజుల్లో బ్లీడింగ్ తగ్గిపోతుంది. కానీ ఈసారి 15 రోజులైనా బ్లీడింగ్ కనిపిస్తూనే ఉండేసరికి చాలా ఆందోళనపడ్డాను. అప్పుడు నేను మనసులోనే, “బాబా! మీరే నా ఆరోగ్యం సరిచేయాలి. బ్లీడింగ్ తగ్గితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని బాబాను ప్రార్థించాను. బాబాను ప్రార్థించిన తరువాత బ్లీడింగ్ కాస్త తగ్గింది గానీ ఇంకా పూర్తిగా తగ్గలేదు. దాంతో మావారు హాస్పిటల్ కి వెళ్లి డాక్టరుకి చూపించుకుందామన్నారు. అప్పుడు నేను బాబా దగ్గర ‘వెళ్లు’, ‘వద్దు’ అని 2 చీటీలు వేసి, “బాబా! నేను హాస్పిటల్ కి వెళ్లాలో వద్దో మీరే నిర్ణయించండి” అని బాబాను ప్రార్థించి, అందులోనుంచి ఒక చీటీ తీశాను. ఆ చీటీలో ‘వెళ్ళు’ అని వచ్చింది. బాబా నిర్ణయం ప్రకారం నేను, మావారు హాస్పిటల్ కి బయల్దేరాము. అయితే కరోనా కారణంగా ఏ హాస్పిటల్ కి వెళ్లినా డాక్టర్లెవరూ అందుబాటులో లేరు. మా ఇంటికి దగ్గరలో ఒక హాస్పిటల్ ఉంది కానీ, అక్కడ చాలామంది పేషెంట్లు ఉండటంవల్ల డాక్టరుకి చూపించుకోవడం కుదరలేదు. దాదాపు పది హాస్పిటల్స్ తిరిగాము. నాకు మాత్రం మనసులో ‘శ్రీసాయి’ అనే పేరు ఉన్న హాస్పిటల్ కి వెళ్లాలని అనిపించి మనసులోనే బాబాను ఆర్తిగా ప్రార్ధించాను. అసలు మాకు ‘శ్రీసాయి’ అనే పేరుతో హాస్పిటల్ ఉందని తెలియదు. నేను, మావారు అలా చాలా హాస్పిటల్స్ తిరిగి, ఎక్కడా డాక్టర్లు లేరని ఇక ఇంటికి బయలుదేరాము. మేము ఇంటికి వస్తుండగా దారిలో ‘శ్రీసాయి హోమియో క్లినిక్’ అనే ఒక బోర్డు కనిపించింది. అది చూసి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మేము వెంటనే ఆగి క్లినిక్ లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళగానే బాబా ఫోటో కనిపించింది. బాబాను చూడగానే నాకు ఎంతో సంతోషంగా అనిపించి, నాకు తోడుగా ఉన్నందుకు మనసులోనే బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. మేము వెళ్ళిన సమయంలో డాక్టర్ క్లినిక్ లో లేకపోయినా ఆవిడ వచ్చేవరకు వెయిట్ చేసి, ఆవిడ వచ్చాక నా ప్రాబ్లం ఆవిడకి చెప్పాను. ఆవిడ నాకు హోమియో మాత్రలు ఇచ్చి, ‘ఒక్కరోజులో తగ్గిపోతుంది’ అన్నారు. ఆ మందులు వాడాక ఒక్కరోజులో బ్లీడింగ్ తగ్గిపోయింది. నేను బ్లాగులో అనుభవం పంచుకుంటానని బాబాకు మాటిచ్చి కూడా పంచుకోవటంలో అశ్రద్ధ చేశాను. తరువాతరోజు మళ్లీ బ్లీడింగ్ కనిపించింది. వెంటనే బాబాను క్షమించమని వేడుకుని, నా అనుభవాన్ని బ్లాగ్ ద్వారా మీ అందరితో పంచుకుంటున్నాను. బాబా దయవల్ల నా ఆరోగ్యం కుదుటపడుతుందని నా విశ్వాసం. “బాబా! నాకు మీరు చేసే అద్భుతాన్ని చూడాలని ఉంది” అని నేను ఎప్పుడూ బాబాని మనసులో ప్రార్థించేదాన్ని. బాబా దయవల్ల నాకు ఒక మంచి అనుభవం కలిగింది. నేను నిజంగా చెప్తున్నాను, మనం మనసులో బాబాను ఎలా ప్రార్థిస్తే బాబా అలాగే చేస్తారు, మనకు ఏది మంచిదో బాబా అదే చేస్తారు. బాబా నాపై చూపించిన ప్రేమకు నేను ఎన్నోసార్లు బాబాకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాను.


8 comments:

  1. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  2. om saraim
    sai always be with me

    ReplyDelete
  3. om sairam
    om sairam
    om sairam
    om sairam
    om sairam
    om sairam
    om sairam
    om sairam
    om sairam
    om sairam
    om sairam
    om sairam
    om sairam
    om sairam

    ReplyDelete
  4. Om sri sairam tatayya 🙏🌹

    ReplyDelete
  5. Sai always bless me
    sairam chala chala andolanaga undi
    emi cheyalo ardam kavadam ledu
    ee alochanala nundi rakshinchu sai

    ReplyDelete
  6. SaiNadha! 🙏Naku inka patience ledhu tandri ippatikey chala badhalu paddanu ento anbhavinchanu.kanisam nenu padina hardwork ki anna job ravatla tandri em cheyyanu tandri inthaka percentage tecchukoni kudha technical job raka stress tho unna tandri. Inka naku edhii dikku ,ma nana garuu anna leruu ayina chanipoyaru ee intini ippudhu em cheyyali enduku inka na jeevitam . Kanisam chavuu anna ippinchuu tandri. Naku inka eyy darii kanapadtla

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo