సాయిశరణానంద అనుభవాలు - పదహారవ భాగం
నిన్నటి తరువాయిభాగం.....
ఒకసారి ఉదయం 8-30 గంటలకో లేక మధ్యాహ్నం 2 గంటలకో నేనూ, శ్రీబాలకరాం మాన్కర్ కూర్చొని ఉన్నప్పుడు బాబా, “బాలకరామూ, వీడూ ఒకప్పుడు ఒక గుహలో ఎదురెదురుగా కూర్చొని తపస్సు చేసుకునేవారు” అన్నారు. ఆరోజో లేక ఆ మర్నాటి రాత్రో నేను స్వప్నంలో ఒక గుహలో కూర్చొని తపస్సు చేస్తుండటాన్ని చూశాను. అప్పుడు ఒక రాత్రి ఒక స్త్రీ రావటం వల్ల నేను పతనమైపోయాను. "మనం ఇతరుల గుణదోషాలను తెలుసుకున్నప్పటికీ కూడా వారికి వారి దోషాలను చెప్పకుండా మంచినే చెప్పాలి" అని నేను తెలుసుకున్నాను.
ఒకరాత్రి బాబా, "ఒక రూపాయి తీసుకెళ్ళి చిల్లర పట్టుకురా" అన్నారు. నేను ఎంతమందినో అడిగాను కానీ, చిల్లర దొరకలేదు. తరువాత ఒక వ్యక్తి, “బయ్యాజీ దగ్గరకు వెళ్ళు. అతని దగ్గర దొరుకుతుంది” అన్నాడు. ఆయన ఇంటిని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళి అతనిచ్చిన చిల్లర తీసుకొచ్చి బాబాకిచ్చాను. దాని రహస్యం ఏమిటంటే, బాబా నాకు ఏకత్వం (ఏకాత్మత), అంటే తాదాత్మ్యం అనే రూపాయినిచ్చారు. అయితే నేను ఆయనకు ఏమి అర్పించాలి? - “చిల్లర!" విడగొట్టి, విడగొట్టి ఒక్కొక్క భాగాన్ని విడివిడిగా చేస్తూ చేస్తూ మాయాపూరితమైన ఈ ఆటను సమాప్తం చేసి దాని భేదాన్ని తెలుసుకుని వారి చరణాలకు అర్పణ చేయాలి. “ఆసనం వేసుకుని ప్రశాంతంగా కూర్చోకుండానే మాయ తత్వాన్ని విడిగా పట్టుకుని అందులోని ఒక పరమతత్వాన్ని తెలుసుకొని దాన్ని బాబాకు అర్పించాలి” అని చెబుతుంది - “అహం బ్రహ్మాస్మి". "చిల్లర అంటే ఏమిటి?" - మాయను ఛేదించగల సర్వశ్రేష్ఠ సాక్షి అయిన పరమాత్మతో తాదాత్మ్యం చెందే స్థితి.
ఒకసారి నా మనసులో, “ఎన్ని భాషలను నేర్చుకోవాలి? ఇంగ్లీషు, మరాఠీ, సంస్కృతం, గుజరాతీ అయితే నాకు తెలును. అయితే సంస్కృతం, మరాఠీల్లో పాండిత్యం నాకు చాలా తక్కువ. దానికోసం ఇప్పుడు అవి నేర్చుకోవటం అనే తలనొప్పి ఎందుకు తెచ్చుకోవాలి?” అన్న ఆలోచన వచ్చింది. అప్పుడు బాబా, "అరె! నాలుగు మెట్లు దిగాలి! ఇందులో తల బద్దలుకొట్టుకునే ప్రశ్న ఎందుకు వస్తుంది?” అన్నారు. దాని అర్థం చతుర్విధ వాణి అని ఇప్పుడు తెలుస్తోంది. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరులు పరమేశ్వరుడివి. హిరణ్యగర్భకి లేక మానవుడికి ఈ నాలుగు వర్ణాలతో ఉన్న తారతమ్యాన్ని తెలుసుకొని కార్యంలో ప్రవృత్తమవటం నేర్చుకోవాలి. శృతి, స్మృతి, పురాణాలు, మహనీయుల వచనాలు అని ఇవి నాలుగు రకాలైన వాణులు. వీటిని ప్రమాణంగా తీసుకుని నిత్యానిత్యాలను వివేచించాలి. అంతేకాక విష్ణుసహస్రనామంలో కూడా చతురాత్మా, చతుర్వ్యూహ, చతుర్దంష్ట్ర, చతుర్భుజ అని నాలుగు రకాల విశిష్టత ప్రతిపాదించబడింది. ఈ ప్రకారంగా 'నాలుగు' యొక్క విశిష్టత క్రింద వ్రాయబడిన శ్లోకంలో వస్తుంది.
“చతుర్మూర్తి చతుర్బాహు చతుర్వ్యూహ శ్చతుర్గతి చతురాత్మా చతుర్భావ చతుర్వేద విదేకపాత్”
చతుర్మూర్తి అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, నీవు - నేను. ఇవన్నీ నా పనులే. అప్పుడు ఈ నాలుగు, అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, నీవు ఇవన్నీ నేనే అని తెలుసుకో.
తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ
🙏🌹Om sri sairam tatayya🌹🙏
ReplyDelete