ఈ భాగంలో అనుభవాలు:
- ప్రత్యక్ష సాయి లీలతో ఏర్పడిన భక్తి విశ్వాసాలు
- నా బిడ్డ హాయిగా నిద్రపోయేలా సహాయం చేశారు బాబా
ప్రత్యక్ష సాయి లీలతో ఏర్పడిన భక్తి విశ్వాసాలు
సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు శాంతి. నా చిన్నప్పటినుండి బాబాతో నాకు గల అనుబంధం, బాబాకు నాపై గల ప్రేమ, బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను గురించి మీతో పంచుకోబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
నాకు 8 సంవత్సరాల వయస్సున్నప్పుడు నా స్నేహితురాలి ద్వారా నాకు బాబాపై ఇష్టం ఏర్పడింది. ఇంట్లోవారికి బాబా గురించి చెబితే ‘బాబా ముస్లిం, మనం బాబాను పూజించకూడద’ని అంటారేమోనని వాళ్ళకి చెప్పకుండా నా స్నేహితురాలి దగ్గర చిన్న పాకెట్ సైజ్ బాబా ఫోటోని తీసుకుని పుస్తకంలో పెట్టుకొని మానసికంగా బాబాకు పూజ చేసుకొనేదాన్ని. ఒకరోజు మా మేనత్తగారు వాళ్లింట్లో బాబా భజన ఏర్పాటు చేసుకుని, దానికి మమ్మల్ని రమ్మని ఆహ్వానించారు. నేను, మా నాన్నగారు బాబా భజనకి వెళ్ళాము. అక్కడ ఒక అద్భుతం జరిగింది. భజన జరుగుతున్నప్పుడు ఉన్నట్టుండి మూడేళ్ళ వయసున్న మా మేనత్త మనుమరాలికి విపరీతంగా చెవిపోటు వచ్చింది. ఒకప్రక్క బాబా సత్సంగం(భజన) జరుగుతోంది, మరోప్రక్క పాప ఏడుస్తూ ఉంది. ఎంతమంది ఎన్నిరకాలుగా ప్రయత్నించినా పాపకి నొప్పి తగ్గలేదు. ఆర్.ఎం.పి డాక్టరుకు చూపించినా తగ్గలేదు. అప్పుడు మా మామయ్య బాబాను ప్రార్థించి కొద్దిగా బాబా ఊదీని పాప చెవికి రాశారు. అద్భుతం! ఊదీ మహిమతో పాపకి చెవినొప్పి తగ్గి తను హాయిగా నిద్రపోయింది. జరిగినదంతా చూసిన మా నాన్నగారు ఎంతో ఆశ్చర్యపోయారు. అంతేకాదు, ఆ బాబా లీలను ప్రత్యక్షంగా చూసిన నాన్నకి బాబాపై భక్తి విశ్వాసాలు ఏర్పడ్డాయి. ఇక మేము ఇంటికి వచ్చినప్పటినుంచి నాన్న అక్కడ జరిగిన అద్భుతాన్ని గూర్చి ఆలోచిస్తూ, ‘మన ఊరికి కూడా బాబాని తీసుకురావాలి’ అని అనుకొని, మా మేనత్త ఇంట్లో సత్సంగం నిర్వహించినవారిని కలుసుకొని, వారితో మాట్లాడి, వారంలో ఒకరోజు (మంగళవారం) మా ఊరిలో సత్సంగం నిర్వహించుకునే ఏర్పాట్లు చేసుకున్నారు. (ఆ సమయంలో సత్సంగం నిర్వహించే సాయిబంధువులకు మంగళవారం ఒక్కరోజు ఖాళీ ఉంది. మిగతా రోజులలో వాళ్ళు వేరు వేరు ఊర్లలో సత్సంగం నిర్వహించేవారు.) మొదటిసారి నలుగురు వ్యక్తులతో జరిగిన బాబా సత్సంగం ఇప్పుడు పెద్ద బాబా మందిరంలో వేలాదిమంది భక్తులతో ప్రతి మంగళవారం ఎంతో వైభవంగా జరుగుతోంది.
బాబా నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. నా పెళ్లి, నా ఉద్యోగం మొదలైన నా అనుభవాలన్నిటినీ ఇకముందు మీతో పంచుకుంటాను.

నా బిడ్డ హాయిగా నిద్రపోయేలా సహాయం చేశారు బాబా
ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
సాయిబాబా భక్తులందరికీ సాయిరామ్! నాకు రెండు నెలల వయసున్న పాప ఉంది. తను చాలామంది పిల్లలలాగే రాత్రిళ్ళు నిద్రపోయేదికాదు. అది నాకొక పెద్ద సమస్య అయింది. ఎందుకంటే, తను నా మొదటి సంతానం కావడం వలన మాతృత్వాన్ని మొదటిసారి అనుభవిస్తున్నానే గానీ బిడ్డను ఎలా సముదాయించాలో తెలిసేది కాదు. అది నాకెంతో బాధాకరంగా ఉండేది. తనకి గ్యాస్ సమస్య ఉన్నందున పది పదిహేను నిమిషాలపాటు బిగ్గరగా ఏడ్చేది. ఐదు నిమిషాలు విరామమిచ్చి మళ్ళీ ఏడ్చేది. ఇలా రాత్రంతా ఏడుస్తూనే ఉండేది. మేము తనని చాలామంది వైద్యులకు చూపించి, చాలా మందులు ప్రయత్నించాము. కానీ ఏమీ ప్రయోజనం కనపడలేదు.
చివరికి నేను, "నా బిడ్డ రాత్రిళ్ళు హాయిగా పడుకోవాలి. తన గ్యాస్ సమస్యను సరిచేసి ఏడుపు ఆపేలా చేయండి బాబా" అని సాయిబాబాను ప్రార్థించాను. బాబా కృప చూపారు. రెండు మూడురోజుల తరువాత నుండి నా బిడ్డ రాత్రిళ్ళు హాయిగా నిద్రపోవడం ప్రారంభించింది. నేను దేనివలనైతే ఎక్కువగా బాధపడ్డానో ఆ గ్యాస్ సమస్య కూడా సమసిపోయి ఏడవటం మానేసింది. ఈ సమస్యలోనే కాదు చాలా సమస్యలలో బాబా నాకు సహాయం చేశారు.
నేను నా సాయికి వాగ్దానం చేసినట్లు నా అనుభవాన్ని మీతో పంచుకున్నాను. కానీ నిజానికి నేను బాబా నాకు సహాయం చేస్తే రెండు మూడురోజుల్లో నా అనుభవాన్ని పంచుకుంటానని ప్రార్థించాను. కానీ వారం రోజులు ఆలస్యం చేశాను. అప్పుడు మళ్ళీ నా బిడ్డ ఏడవడం మొదలుపెట్టింది. అరగంట పాటు ఏడుస్తూనే ఉంది. దాంతో నేను నా అనుభవాన్ని పంచుకుంటానన్న విషయం గుర్తుకొచ్చింది. వెంటనే నేను నా ఆలస్యానికి బాబాకు క్షమాపణలు చెప్పుకుని, మరుసటిరోజు ఎలాగైనా నా అనుభవాన్ని పంచుకుంటానని వాగ్దానం చేశాను. నేను అలా వాగ్దానం చేసిన మరుక్షణంలో నా బిడ్డ ఏడుపు ఆపి సంతోషంగా ఆడటం ప్రారంభించింది. తరువాత హాయిగా నిద్రపోయింది. "నాకు సహాయం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి".
source:http://www.shirdisaibabaexperiences.org/2020/01/shirdi-sai-baba-miracles-part-2612.html?m=0

ఓం శ్రీ సాయిరాం తాతయ్య 🙏🙏🙏
ReplyDelete