ఈ భాగంలో అనుభవాలు:
- ఒక్కరోజులోనే నయమయ్యేలా చేసిన బాబా
- అండగా ఉన్న బాబా
ఒక్కరోజులోనే నయమయ్యేలా చేసిన బాబా
అఖిలాండకోటి బ్రహ్మాడనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
ముందుగా ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్సుమాంజలి. మీరు చేస్తున్న ఈ సాయిసేవకి మేము మీకు ఋణపడివున్నాము. ఈమధ్య మా చుట్టాలబ్బాయి కాలికి దెబ్బ తగిలి బాగా ఇబ్బందిపడుతుంటే, డాక్టర్ పరిశీలించి ఆపరేషన్ చేయాలని అన్నారు. కరోనా కారణంగా పేషెంట్ కి తోడుగా ఎవరైనా ఉండటానికి గాని, చూడటానికి గాని వెళ్ళడానికి వీలులేని పరిస్థితులు. అందువలన నేను, “ఈ కొరోనా సమయంలో తనవాళ్ళెవరూ తన దగ్గర లేరు బాబా. మీరే ఆ అబ్బాయిని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి. తనకి త్వరగా నయమైతే ఈ అనుభవాన్ని నేను బ్లాగులో పంచుకుంటాను” అని బాబాను మనసారా ప్రార్థించాను. ఆశ్చర్యంగా డాక్టర్ ఒక్కరోజులోనే ఆ అబ్బాయికి నయం చేసి పంపించారు. బాబానే ఆ డాక్టర్ స్థానంలో ఉండి ఆ అబ్బాయికి నయం చేశారని ఎంతో సంతోషంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. “బాబా! ఎల్లవేళలా మీ భక్తులను ఇలాగే కాపాడండి. మేము మీకు ఎన్ని కోట్ల నమస్కారాలు సమర్పించినా మీ ప్రేమ ముందు అవి తక్కువే. మీ భక్తకోటిలో నేను ఒక చిన్న భక్తురాలిని. బాబా! మా కుటుంబ బాధ్యత మీరు తీసుకున్నందుకు చాలా సంతోషం తండ్రీ!”.
జై సాయిరాం!

అండగా ఉన్న బాబా
హైదరాబాదు నుండి సాయిభక్తుడు శివ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
బాబా భక్తులందరికీ నా నమస్సుమాంజలి. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. నా పేరు శివ. మేము హైదరాబాదులో ఉంటాము. మాకు ఇద్దరు పిల్లలు. మేము శిరిడీ సాయిబాబా భక్తులం. 2020, ఫిబ్రవరి 2వ తారీఖున పన్నెండేళ్ళ వయసున్న మా రెండవ అబ్బాయి ఉన్నట్టుండి ఫిట్స్ లాగా వచ్చి కోమాలోకి వెళ్ళిపోయాడు. అంతకు రెండురోజుల ముందునుండి తను ఆయాసంతో బాగా ఇబ్బంది పడుతున్నాడు. మేము వెంటనే బాబుని విక్రంపురిలో ఉన్న రెయిన్‌బో ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాము. అక్కడ మా బాబుకి పరీక్షలు చేసి, "రెండు కిడ్నీలూ పూర్తిగా డామేజ్ అయ్యాయ"ని చెప్పారు. అంతేకాదు, "బాబుకి ఫిట్స్ వచ్చిన సమయానికి కిడ్నీలు పనిచేయకపోవటం వల్ల బీపీ బాగా పెరిగింది. ఆ కారణంగా ఊపిరితిత్తులలోకి ఫ్లూయిడ్స్ చేరి ఇన్ఫెక్షన్ అయ్యింది. ఇంకా గుండెలో కొంతభాగంలో కొద్దిగా వాపులా వచ్చి గుండె కాస్త వ్యాకోచించింది. రక్తంలో కూడా ఇన్ఫెక్షన్ ఏర్పడింది. బాబుకి వెంటనే డయాలిసిస్ చేయాలి, మీరు బాబుని బంజారాహిల్స్ లోని రెయిన్‌బో హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళండి” అని చెప్పారు. మళ్ళీ అంతలోనే, “బాబు కండిషన్ చాలా క్రిటికల్‌గా వుంది, మేము తన జీవితానికి భరోసా ఇవ్వలేము” అని చెప్పారు. చేసేది లేక డాక్టర్లు చెప్పినదానికి అంగీకరించి బాబుని అంబులెన్సులో తీసుకొని వెళ్ళటానికి సిద్ధమయ్యాము. హాస్పిటల్ నుండి బయటకి రాగానే సాయిబాబా బండి అంబులెన్సుకి ఎదురు వచ్చింది. మేము అంబులెన్స్ దిగి, బాబాకి నమస్కారం చేసుకుని, "బాబును కాపాడమ"ని ఆర్తిగా వేడుకుని, బాబాకు దక్షిణ సమర్పించాము. తరువాత మా అంబులెన్సు వెనకాలే సాయిబాబా బండి కూడా మెయిన్‌రోడ్డు దాకా వచ్చింది. మేము ఏ ప్రమాదం లేకుండా బంజారాహిల్స్ హాస్పిటల్‌కి చేరుకున్నాము. బాబా దయవల్ల బాబుని వెంటనే ICU కి షిఫ్ట్ చేసి ట్రీట్‌మెంట్ మొదలుపెట్టారు. మా బాబు 13 రోజులు ICU లో వున్నాడు.
మా బాబు ICU లో ఉన్నప్పుడు, మా బంధువు ఒకావిడ శిరిడీ నుండి బాబా ఊదీ తీసుకొచ్చి మాకు ఇచ్చారు. మాపై దయతో బాబానే స్వయంగా మాకోసం ఊదీ పంపినట్లు భావించాము. బాబాను ప్రార్థించి, ఊదీని మా బాబుకి పెట్టాము. బాబా అనుగ్రహంతో మా బాబు కోమా నుండి బయటకి వచ్చాడు. (సుమారుగా 13 రోజులు కోమాలో వున్నాడు.) కిడ్నీలు తప్ప మిగతా అవయవాలన్నీ సాధారణస్థితికి వచ్చాయి. ICU నుండి రూముకి షిఫ్ట్ చేసిన రెండు రోజుల తరువాత చిన్న సర్జరీ కోసం బాబుని ఆపరేషన్ థియేటర్‌కి తీసుకొని వెళ్లారు. అక్కడ ఉన్నట్టుండి ఒక సమస్య వచ్చి తనకి కార్డియాక్ అరెస్ట్ అయింది. కానీ, బాబా దయవల్ల డాక్టర్స్ దగ్గరే వున్నారు కాబట్టి వెంటనే హార్ట్ పంప్ చేసి మళ్ళీ సాధారణస్థితికి తీసుకొని వచ్చారు. ఆరోజు రాత్రి బాబు మాకు దక్కుతాడని అనుకోలేదు. బాబానే డాక్టర్స్ రూపంలో దగ్గరుండి బాబుని కాపాడారు.
ప్రస్తుతం బాబు ఆరోగ్యం కుదుటపడింది. కిడ్నీలకు ప్రతిరోజూ డయాలిసిస్ జరుగుతోంది. మా బాబుకి పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించమని బాబాను ప్రార్థిస్తూ నా భార్య ఇప్పటివరకు తొమ్మిదిసార్లు సాయిసచ్చరిత్ర పారాయణ చేసింది. బాబా అనుగ్రహంతో త్వరలోనే మా బాబు సంపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడని ఆశిస్తున్నాము. “బాబా! మీరే మాకు అండ. మా బాబుకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించండి తండ్రీ!”.

Siva garu
ReplyDeleteDont worry. Baba is great and kind, your son will be hale and healthy with his blessings.
Thank you so much
DeleteBaba! Unnaru meeto fast ga Mee babu recover avutaru.Sainadhuni meedha purti nammakam unchandhi.
DeleteSarvaniki kartha saibaba varey.ayna krupa meeku yellavelala undalani,me babu aryogyam bagundalani...manasara prardistunna....om sairam
ReplyDeleteBaba will take care of your child sai. Om sree sai aarogya kshemadaaya namaha ane namaanni veelaina anni sarlu japam cheyandi sai. Omsairam
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఅఖిలాండకోటి బ్రహ్మాడనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
ReplyDeleteజై సాయిరాం!
ReplyDeleteOm sairam
ReplyDeleteSai always ne with me
om sairam
ReplyDeletesai always be with me
sairam
ReplyDeletechaala chaala bhadaga undi sairam
emi ardham kavadam ledu
naaku ee edupu nundi vimukthini kaliginchu tandri
Sai meru hospital ku velladaaniki munde baba aasirvadam Icharu anni ayane chusukuntaru sai daya kala Varu tappaka babu nu kaapaadutaaru
ReplyDeleteOm sri sairam. Mee babu arogyam thondaraga kudutapadalani aa sai tatayya ni vedukuntunna 🙏🙏🙏.

ReplyDeleteOm Sri Sai Ram..thaatha
ReplyDeleteBhavya sree