సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 406వ భాగం....



సాయినే నమ్ముకున్నాం

తిరుపతి నుండి సాయిభక్తుడు మోహన్‌బాబు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్! నేను చిన్ననాటినుండి సాయిభక్తుడిని. ప్రతిరోజూ నేను సాయిసచ్చరిత్ర పారాయణ చేస్తుంటాను. 2018లో నేను చాలా కష్టకాలాన్ని అనుభవించాను. ఆ సంవత్సరం జనవరి నెలలో మా బాబు సాయిసిద్ధార్థకి ఆటిజం (మానసిక ఎదుగుదల లేకపోవడం) అని తెలిసింది. ఎప్పుడూ ఏడుస్తూ హైపర్ ఆక్టివ్‌గా ఉండే మా బాబుకి అటువంటి సమస్య అని తెలిసి మేము చాలా బాధపడ్డాము. ట్రీట్‌మెంట్ కోసం బెంగుళూరులోని NIMHANS హాస్పిటల్‌కి వెళ్లాలని నిర్ణయించుకున్నాము. అక్కడికి వెళ్లే ముందు దురదృష్టవశాత్తూ నేను బైక్ మీద నుండి పడిపోయాను. అయినా వెనుకాడకుండా అలాగే బెంగుళూరు వెళ్లి వచ్చాము. కానీ బాబు కండిషన్‌లో ఏ మార్పూ లేదు. ఆ కష్టంతో రోజులు గడుస్తూ ఉంటే హఠాత్తుగా ఆగష్టులో నాన్నకి హై బి.పి. ఎటాక్ అయ్యింది. చాలా సీరియస్ కండిషన్ అయినందున ఆయనని ఐదురోజులు ఐ.సి.యు.లో ఉంచారు. మేము చాలా భయపడిపోయాము. మా ఆర్థిక పరిస్థితి అంతా ఆయన పెన్షన్ మీదే ఆధారపడి ఉంది. అటువంటి మాకు అంత కష్టం వచ్చేసరికి ఏమీ తోచక తీవ్ర ఆందోళనకు గురయ్యాము. ఆ కష్టం నుండి బయటపడేయమని బాబాని ఎంతగానో వేడుకున్నాం. చివరికి ఐదురోజుల తరువాత నాన్న హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. కేవలం బాబా ఆశీస్సులతోనే నాన్న క్షేమంగా ఉన్నారు. బాబా మా కుటుంబంపై చాలా కృప చూపారు. "బాబా! మీకు చాలా చాలా కృతజ్ఞతలు".

రెండేళ్లుగా బాబుకి బిహేవియర్ థెరపిస్ట్ దగ్గర థెరపీ ఇప్పిస్తున్నాము. థెరపిస్ట్ 'బాబుకి మైల్డ్ ఆటిజం, మాటలు వస్తాయ'ని చెప్పినప్పటికీ ఇప్పటివరకు బాబు కండిషన్‌లో ఏ మార్పూ లేదు. కానీ మేము బాబానే నమ్ముకున్నాము. బాబు బిహేవియర్‌లో మార్పు వచ్చి, మాటలు వస్తే, ప్రతి సంవత్సరం శిరిడీ వస్తామని బాబాకి మ్రొక్కుకున్నాము. మా బాబు గురించి క్వశ్చన్&ఆన్సర్ వెబ్‌సైట్‌లో బాబాని అడిగితే, "మరికొంత సమయం వేచి ఉండండి. ఫలితం దక్కుతుంది" అని వచ్చింది. బాబా దయవల్ల మా బాబుకి మాటలు వస్తాయనే నమ్మకంతో ఆరోజు కోసం ఆశగా ఎదురుచూస్తున్నాము.

సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

మన ప్రార్థనలు బాబాకు చేరడానికి గాజు గ్లాసులు అడ్డం కాదు!

సాయిభక్తుడు కౌశల్ తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

నా పేరు కౌశల్. నేను గుజరాత్‌లోని వడోదరలో నివాసముంటున్నాను. 2005లో మొదటిసారి నేను సాయిబాబా పేరు విన్నాను. అప్పటినుండి నేను నా సాయిబాబాకు అంకిత భక్తుడిగా ఉన్నాను. ఆయన ఆశీస్సులతో నేను ప్రతి సంవత్సరం శిరిడీ సందర్శిస్తున్నాను. నా ప్రార్థనలు తమకు చేరుతున్నాయని బాబా నాకు తెలియజేసిన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోబోతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.

శిరిడీలో భారీ రద్దీ కారణంగా సాయిబాబా సమాధికి రెండువైపులా పెద్ద గాజు గ్లాసులను అడ్డంగా పెడుతున్నారని మీ అందరికీ తెలుసు. అవి అడ్డంగా పెట్టినందువల్ల మనం మన తలను వంచి సాయిబాబా సమాధిని మన చేతులతో తాకలేకపోతున్నాము. అది మనసుకెంతో బాధగా ఉంటుంది. ఆ బాధ నాకు లేకుండా చేశారు బాబా. చాలాకాలం క్రితం నేను శిరిడీ ప్రయాణమవబోతూ, ఆ ముందురోజు, "బాబా! ఎలాగైనా ఈసారి మీ సమాధిని తాకే అవకాశాన్ని నాకు ఇవ్వండి" అని బాబాను ప్రార్థించాను. కానీ నేను దర్శనానికి వెళ్ళినప్పుడు ఎప్పటిలాగే గ్లాసులు అడ్డంగా ఉన్నందున బాబా సమాధిని తాకలేకపోయాను. అందువలన నేను ఎంతో నిరాశ చెందాను.

ఆ రాత్రి నేను చావడి దగ్గర కూర్చుని ఉన్నాను. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి, "మేము సమాధికి అడ్డంగా ఉన్న గ్లాసులను తాకితే అది సాయిబాబాకు చేరుతుందా?" అని నన్ను ప్రశ్నించాడు. నేను ఆ వ్యక్తితో, "ఖచ్చితంగా చేరుతుంది. మీరు హృదయపూర్వకంగా నమస్కరించినట్లైతే, అది ఎల్లప్పుడూ సాయిబాబాకు చేరుతుంది" అని బదులిచ్చాను. తరువాత కూడా ఆ వ్యక్తి ఇంచుమించు అలాంటి ప్రశ్నలనే వేరువేరు విధాలుగా అడుగుతూ ఉన్నాడు. నేను బదులిస్తూ ఉన్నాను. ఆ సమయంలో నేను గ్రహించలేక పోయాను గానీ, మరుసటిరోజు 'శిరిడీ వచ్చే ముందురోజు నేను చేసిన ప్రార్థనకు సమాధానం బాబా నాతోనే చెప్పించార'ని గ్రహించాను. ఆ వ్యక్తిని మాధ్యమంగా చేసుకుని సాయిబాబా నా దగ్గరకు వచ్చి నా ప్రార్థనలకు బదులిచ్చారని అర్థమైంది. అప్పటినుండి శిరిడీ వెళ్ళినప్పుడు సమాధికి అడ్డంగా గ్లాసులు ఉన్నా నాకు ఏ బాధా కలగడం లేదు. ఎందుకంటే, నా ప్రార్థనలు సాయిబాబాకు చేరుతున్నాయని నాకు తెలుసు. "ఐ లవ్ యు సాయిబాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు".

source:http://www.shirdisaibabaexperiences.org/2020/01/shirdi-sai-baba-miracles-part-2618.html


9 comments:

  1. Om sai ram,mee Babu ki pakka atism taggipotundi uncle,may baba give u strength to fight with the situation,love u sai,pls be with me always.

    ReplyDelete
  2. I love you sai tatayya🙏🙏🙏 om Sairam.

    ReplyDelete
  3. సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  4. OM SAIRAM
    SAI ALWAYS BE WITH ME

    ReplyDelete
  5. ఓం సాయిరాం🌹🙏🌹

    ReplyDelete
  6. Avunu babu ki Sainadhuni 🙏🙏🙏💐🌹🌹🌼🌻daya valla antha taggipoyi normal avutaru. Miku baba sadha thodhu untaru andhi

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo