ఈ భాగంలో అనుభవాలు:
- దయగల దేవుడు మన బాబా
- బాబా కురిపిస్తున్న ఆశీస్సులు
దయగల దేవుడు మన బాబా
సాయిరామ్! సాయిభక్తులందరికీ నా వందనాలు. ఈ బ్లాగ్ నిర్వాహకులందరికీ సాయి ఆశీస్సులు. నా పేరు సునీత. ఇది నేను మీతో పంచుకుంటున్న నా మూడవ అనుభవం. ఒకసారి మావారికి చాలా తీవ్రంగా చెయ్యినొప్పి వచ్చింది. మూడు రోజుల పాటు ఆ నొప్పితో ఆయన విలవిల్లాడిపోయారు. ఆయన బాధను మేము చూడలేకపోయాము. అప్పుడు నేను, “బాబా! మావారికి చెయ్యినొప్పి చాలా ఎక్కువగా ఉంది. ఆ నొప్పితో తను పడుతున్న బాధను చూడలేకపోతున్నాను. ఆయన నొప్పిని నాకు ఇవ్వండి, నేను భరిస్తాను” అని బాబాను చాలా ఆర్తిగా వేడుకున్నాను. ఆ రాత్రి అందరం నిద్రపోయాము. తెల్లవారేసరికల్లా బాబా అనుగ్రహంతో మావారి చెయ్యినొప్పి పూర్తిగా తగ్గిపోయింది. ఎంతో సంతోషంతో బాబాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. మరో విషయం, నేను ఆ నొప్పిని నాకివ్వమని ప్రార్థించినప్పటికీ బాబా ఆ నొప్పిని నాకు ఇవ్వలేదు. అంతటి దయగల దేవుడు మన బాబా. ఆర్తితో నిస్వార్థంగా ఏది అడిగినా బాబా వెంటనే చేస్తారని నేను పూర్తిగా నమ్ముతాను. “నా బిడ్డలని కాపాడు బాబా! అందరికీ సాయం చేయండి బాబా! నా బిడ్డల కోరికలను తీర్చి, ఆ అనుభవాలను కూడా నేను బ్లాగులో పంచుకునే అవకాశం నాకు ఇవ్వు బాబా”.
ధన్యవాదములు.

బాబా కురిపిస్తున్న ఆశీస్సులు
యు.ఎస్.ఏ నుండి సాయిభక్తురాలు శ్రీమతి యశ్వంతి తన రీసెంట్ అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
ఓం సాయిరామ్! సాయిభక్తులందరికీ హాయ్! నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని, ఆయన నాపై కురిపించిన ఆశీస్సులను మీతో పంచుకుంటాను.
11 సంవత్సరాల వయసులో మొదటిసారి నేను శిరిడీ దర్శించాను. అదే బాబాతో నా మొదటి అనుభవం. అప్పటినుండి బాబా సదా నాపై తమ అనుగ్రహాన్ని కురిపిస్తుండేవారు. అయితే బాబా నా విషయంలో ఎంతో శ్రద్ధ చూపిస్తున్నప్పటికీ నేను ఆయనకు అంత ప్రాముఖ్యత ఇచ్చేదాన్ని కాదు. సంవత్సరాలు దొర్లిపోయాయి. నాకు వివాహమైంది. మా అత్తగారు గొప్ప సాయిభక్తురాలు. ఆమె ఎంతగానో బాబాని ఆరాధించినప్పటికీ మా మామగారు, బావగారు హఠాత్తుగా చనిపోయారు. తరువాత నేను చాలా కష్టాలు ఎదుర్కొన్నాను. దాంతో కలత చెంది బాబాను పూర్తిగా విస్మరించాను.
కొన్నిరోజుల తరువాత ఒకరోజు నేను బాబా పటాన్ని చూసి గతంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాను. నెమ్మదిగా నా మనసు బాబా వైపుకు మళ్లింది. నాకు వివాహమై ఐదు సంవత్సరాలు అయినా పిల్లలు లేరు. గతంలో మేము పిల్లలకోసం అంతగా ఆలోచించలేదు. కానీ కుటుంబసభ్యుల నుండి వస్తున్న ఒత్తిడి కారణంగా 6 నెలలుగా మేము పిల్లల కోసం ప్రయత్నిస్తున్నాం. రోజులు గడుస్తున్నా నేను గర్భం దాల్చకపోయేసరికి నాలో భయం మొదలైంది. ఆ విషయమై ఒకరోజు నేను క్వశ్చన్&ఆన్సర్ వెబ్‌సైట్‌లో బాబాను అడిగాను. అప్పుడు, "అబ్బాయి పుడతాడు. ఒక నెలలో మీకు తెలుస్తుంది" అని వచ్చింది. బాబా మాట అక్షర సత్యమైంది. నేను గర్భవతినయ్యాను. నాకు దిగులుగా అనిపించినప్పుడల్లా నేను క్వశ్చన్&ఆన్సర్ వెబ్‌సైట్‌లో బాబాను అడుగుతుండేదాన్ని. ఒకసారి అలా అడిగినప్పుడు, "4వ నెల నుంచి 7వ నెల వరకు మీరు సమస్యలు ఎదుర్కొంటారు" అని వచ్చింది. అప్పుడు నాకేమీ అర్థం కాలేదు. కానీ 4వ నెల వచ్చాక డాక్టరు పరీక్షించి, "మావికి సంబంధించిన సమస్య ఉందని, మావి పరిమాణం తక్కువగా ఉంద"ని చెప్పారు. రక్తస్రావం జరిగినా, నొప్పిగా ఉన్నా వెంటనే అత్యవసర పరిస్థితి క్రింద హాస్పిటల్లో చేరమని కూడా చెప్పారు. ఈ సమస్య 7వ నెల వరకు పరిష్కారం కాలేదు. "అది పరిష్కరింపబడకపోతే సిజేరియన్ చేయాల్సి ఉంటుంద"ని డాక్టరు చెప్పారు. అసలే కరోనా సమయం కావడంతో మా అమ్మ యు.ఎస్.ఏ కి రాలేని పరిస్థితి. అందువలన నేను చాలా ఆందోళన చెందాను. అయితే 8వ నెల వచ్చాక అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయిస్తే, మావి సాధారణ స్థితికి వచ్చింది. కానీ నా బిడ్డ బ్రెయిన్ యొక్క వెంట్రికల్స్‌లో ఒకటి పెద్దదిగా ఉందని తెలిసింది. అలా ఉంటే శిశువు యొక్క సెరెబ్రోస్పానియల్ ద్రవాన్ని క్రిందకు మళ్లించాలని, ఇది శిశువు ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని తెలిసింది. అది తెలిసి నేను నిర్ఘాంతపోయాను, చాలా బాధపడ్డాను. అప్పుడు నేను బాబాను ప్రార్థించి, "ఈ సమస్యను పరిష్కరించండి బాబా. అది పరిష్కారమై ఈసారి రిపోర్టులు నార్మల్‌గా వస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. నిన్న (2020, మే 14) నేను అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవడానికి వెళ్ళాను. బాబా దయవలన వెంట్రికల్స్ స్థితిలో మార్పు వచ్చింది. డాక్టర్ రిపోర్టులు చూసి, "ఇప్పుడు సాధారణంగా ఉంది" అని చెప్పారు. నా జన్యు పరీక్షల రిపోర్టులు కూడా నార్మల్ అని వచ్చాయి. బాబా ఆశీర్వాదం వలన ఇక ఏ సమస్యా లేదు. "బాబా! మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ ఆశీస్సులతో నార్మల్ డెలివరీ అవుతుందని ఆశిస్తున్నాను. అమ్మ నాకు తోడుగా ఉండటానికి ఇక్కడికి వచ్చేలా, తన ప్రయాణం సురక్షితంగా సాగేలా మరియు బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా ఆశీర్వదించండి బాబా". మీకో ముఖ్య విషయం చెప్పాలి, 'బాబా చెప్పినట్లే నా కడుపులో ఉన్నది మగబిడ్డ'. ఆయన మాట అక్షరం కూడా పొల్లుపోదు.
ఓం సాయిరామ్!

Om Sri sairam tatayya 🙏 🌹
ReplyDeleteWhat is question and answer section ?
ReplyDeletesee this site sai --- https://www.yoursaibaba.com/
Deleteఓం సాయిరామ్!
ReplyDelete