సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 409వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • సాయి అనుగ్రహ వీక్షణలు

సాయిభక్తురాలు శ్రీమతి శ్రావణి తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు శ్రావణి. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను ఇంతకుముందు మీతో చాలాసార్లు పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను మీ అందరితో పంచుకుంటాను. ముందుగా బాబా మా బాబుని ఒక పెద్ద అపాయం నుండి ఎలా కాపాడారో తెలియజేస్తాను.

2020, ఏప్రిల్ 12వ తేదీన ఎప్పటిలాగానే మా బాబు సైకిల్ తొక్కుతూ బయట ఆడుకుంటున్నాడు. ప్రతిరోజూ నేను సాయంత్రం సమయంలో అలా కొంచెంసేపు వాడిని ఆడిస్తాను. ఆరోజు ఎందుకో అప్పటిదాకా అక్కడే ఉన్న నేను సరిగ్గా అదే సమయానికి లోపలకి వెళ్ళాను. ఇక తమను గమనించేవాళ్ళు ఎవరూ లేరని వాడు, వాడి ఫ్రెండు కలిసి జారుడుమెట్లపై సైకిల్ డబుల్స్ తొక్కుతూ ఉన్నారు. మా బాబు వెనక సీట్లో ఉన్నాడు. ముందు కూర్చున్న బాబు బాలన్స్ చెయ్యలేకపోవడంతో సైకిల్ స్లిప్ అయ్యి మా బాబు అలానే వెనక్కి పడిపోయాడు. బాబు ఏడుపు విని వెంటనే బయటకు వచ్చాను. అక్కడ చూసినవాళ్ళంతా ‘మీ బాబు తలకి బాగా దెబ్బ తగిలినట్లుంది, గట్టిగా శబ్దం వచ్చింది’ అని చెప్పేసరికి నాకు చాలా భయమేసింది. వెనక సీటు నుండి క్రిందపడడంతో నిజంగానే వాడి తలకి చాలా బలంగా దెబ్బ తగిలింది. వాడు చాలాసేపు తలపట్టుకొని అలానే ఏడుస్తూ ఉన్నాడు. ఏదైనా హాస్పిటల్‌కి తీసుకొని వెళ్దామనుకున్నా లాక్‌డౌన్ సమయంలో అన్ని హాస్పిటల్స్ మూసివుంటాయి. వెంటనే బాబాను ప్రార్థించి, బాబా ఊదీని మా బాబు తలపై పూసి, కొంచెం ఊదీని నీళ్ళలో కలిపి వాడికి త్రాగించాను. బాబా దయవల్ల కొంచెంసేపటికి నొప్పి నుండి ఉపశమనం కలిగి బాబు కాస్త హుషారు అయ్యాడు. కానీ రాత్రి అయ్యాక పైకి లేస్తుంటే నొప్పిగా ఉందని ఏడుపు మొదలుపెట్టాడు. మావారు కూడా నాతో లేకపోవడంతో నేను చాలా భయపడ్డాను. ఏ ప్రేరణ కలిగిందో ఏమోగానీ బాబాని ప్రార్థిస్తూ, "ఒకసారి లేచి గెంతులు వేయమ"ని బాబుకి చెప్పాను. అలాగే నాలుగుసార్లు చేయించాను. ఆశ్చర్యంగా ఈసారి నొప్పిగా ఉంది అనలేదు, కాబట్టి తగ్గిపోయిందని నిర్ధారించుకున్నాను. బాబా దయవల్ల ఏ బాధా లేకుండా బాబు హాయిగా నిద్రపోయాడు. మరుసటిరోజు కూడా మెడభాగంలో కొద్దిగా నొప్పిగా ఉందని అంటే బాబా ఊదీ నీళ్ళలో కలిపి త్రాగించాను. బాబా కృపతో వేరే ఏ మందులూ వాడకుండానే నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. మరొక విషయం ఏమిటంటే, వాడు క్రిందపడింది బాబా గుడికి సమీపంలో. క్రిందపడి దెబ్బ తగిలిన వెంటనే ఏడుస్తూ బాబా ప్రసాదం కోసం గుడిలోకి వెళ్ళాడు. మరి తన బిడ్డ నొప్పితో బాధపడుతుంటే బాబా చూస్తూ ఊరుకోగలరా? 

2వ అనుభవం:

2020, ఏప్రిల్ 22వ తేదీ అర్థరాత్రి 2 గంటల సమయంలో మా నాన్నగారు ఛాతీకి రెండు వైపులా నొప్పిగా ఉందని మా అమ్మని లేపారు. అప్పటికే ఆయనకి ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఉన్నాయి. నేను భయపడతానని మా అమ్మ నన్ను లేపకుండా ముందు మావారిని నిద్రలేపింది. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా నాకు మెలకువ వచ్చి చూశాను. నాన్నని అలా చూసి నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. గాస్ట్రిక్ సమస్య అనుకుని దానికి సంబంధించిన మందులు వేశాము. కానీ చెమటలు పడుతుండేసరికి కొంచెం భయమేసింది. లాక్‌డౌన్ వల్ల హాస్పిటల్‌కి కూడా వెళ్ళలేని పరిస్థితిలో బాబానే మాకు అండగా నిలిచారు

"నాన్నకు నయంచేయమ"ని బాబాను ప్రార్థించి, కొద్దిగా బాబా ఊదీని నాన్న ఛాతీపై రాసి, మరికొంత ఊదీని నీళ్ళలో కలిపి ఆయన చేత త్రాగించాను. తరువాత నాన్నని ఏసి రూములో పడుకోబెట్టి బాబాని ప్రార్థిస్తూ ఉండగా, కొద్దిగంటల ముందు బ్లాగులో ప్రచురించిన అనుభవం గుర్తుకొచ్చింది. అందులో ఒక సాయిభక్తురాలు తన భర్తకి, పిల్లలకి దగ్గుగా ఉంటే ‘ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః’ అనే నామాన్ని జపిస్తే వాళ్ళకి నయమయినట్టుగా రాసి ఉంది. వెంటనే నేను కూడా మా నాన్న ఛాతీపై నా చేయివేసి, ‘ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః’ అనే నామాన్ని 108 సార్లు జపించాను. బాబా దయ చూపారు. వెంటనే చెమటలు తగ్గుముఖం పట్టి నాన్న నిద్రలోకి జారుకున్నారు. మరుసటిరోజు నేను నిద్రలేచేటప్పటికి నాన్న చాలా హుషారుగా ఉన్నారు. అది చూసి నేను ఎంతో ఆనందంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఆ తరువాత మేము తెలిసిన డాక్టరుని సంప్రదించి అన్ని టెస్టులు చేయించాము. రిపోర్ట్స్ అన్నీ నార్మల్ అని వచ్చాయి. ఇదంతా బాబా కృప వల్లనే సాధ్యం అయ్యింది. బాబానే మనందరి డాక్టర్. “థాంక్యూ సో మచ్ బాబా!”

3వ అనుభవం:

ఒకసారి మా నాన్నగారి కోసం మెత్తగా ఉంటాయని విత్తనాలు ఉండే ఖర్జూరాలు తీసుకున్నాను. మాములుగా అయితే నాకు విత్తనాలు ఉండేవి అంటే ఇష్టం ఉండదు. గురువారంరోజు బాబాకి పూజ చేసి, కొత్త ప్యాకెట్ ఓపెన్ చేసి బాబాకి కొన్ని ఖర్జూరాలు నైవేద్యంగా పెట్టాను. నా పూజ పూర్తయిన తరువాత, ప్రసాదం తిందామని బాబా ముందు ఉన్న ఒక ఖర్జూరాన్ని చేతిలోకి తీసుకున్నాను. ఆశ్చర్యకరంగా అందులో విత్తనం లేదు. మిగతా అన్ని ఖర్జూరాల్లోనూ విత్తనాలు ఉన్నాయి. నేను తిందామని తీసుకున్న ఖర్జూరంలోనే విత్తనం లేదు. సాయిసచ్చరిత్రలో ఠక్కర్‌కు ఇచ్చిన ద్రాక్షపండ్లలో విత్తనాలు లేకుండా చేసినట్లు నాకు కూడా విత్తనం లేని ఖర్జూరాన్ని ప్రసాదించారు బాబా. బాబా చేసిన ఈ లీల నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. "థాంక్యూ సో మచ్ బాబా!"

4వ అనుభవం:

2018 ఆగష్టులో మా పెళ్లిరోజుకి ఒకరోజు ముందు నేను శిరిడీలోనే ఉన్నాను. అందుకు గుర్తుగా నేను శిరిడీలో ఒకే రకంగా ఉండే రెండు ఉంగరాలు మా ఇద్దరికోసం తీసుకున్నాను. వాటిని బాబా ఇచ్చిన బహుమతిగా భావించి మేమిద్దరం పెట్టుకున్నాం. కొద్దిరోజుల తరువాత అనుకోకుండా నా చేతిలో నుండి ఉంగరం తీస్తుండగా అది ఎగిరి ఎక్కడో పడిపోయింది. ఆ ఉంగరం పడడానికి ఇంట్లోనే పడినప్పటికీ ఎంత వెతికినా దొరకలేదు. ఎన్నో రోజులు దానికోసం వెతికాను. గుర్తొచ్చినప్పుడల్లా వెతుకుతూనే ఉండేదాన్ని కూడా. ఎంతో ఆశగా తీసుకున్నాను, నా చేతిలోనే పోయేసరికి చాలా బాధపడ్డాను. నా ఉంగరం దొరికేలా చెయ్యమని బాబాని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. 2020, ఏప్రిల్ 26వ తేదీన నా గాజులు ఉండే బాక్స్ సర్దుతూ ఉండగా నా ఉంగరం అందులో ఉండటం చూసి నాకెంతో ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఈ మధ్యలో ఎన్నోసార్లు నేను నా గాజుల బాక్స్ సర్దుకొని ఉంటాను. కానీ నాకు ఎప్పుడూ ఆ ఉంగరం అందులో కనిపించలేదు. ఇంకో విషయం, మా ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఆ ఉంగరం దొరికివుంటే నాకు ఇస్తారే కానీ ఆ బాక్సులో పెట్టరు కదా! ఎప్పుడో సంవత్సరం క్రితం క్రిందపడిపోయిన ఉంగరం ఆ బాక్సులోకి ఎలా వచ్చిందో బాబాకే తెలియాలి. నా ఉంగరాన్ని పదిలంగా నాకు అందించినందుకు ఆనందంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.


11 comments:

  1. om sairam
    sai always be with me

    ReplyDelete
  2. om sai sri sai jaya jaya sai sadguru sai

    ReplyDelete
  3. naaku emi ardam kavadam ledu sai
    please do some thing, help me sai

    ReplyDelete
  4. Babaa babaaa adukonaga vegamu ga raavaa
    Nuvu tappa naakevare bhuvilo
    Baba tattukolekapotunnanu bhadhanu bharinchalekapotunnanu please please forgive me and help and save me babaa
    Nannu kshaminchu babaa rakahinchu babaa

    ReplyDelete
    Replies
    1. ఓం శ్రీ సాయిరాం 🙏🙏🙏మీరు ఎవరో నాకు తెలియదు కానీ మీరు సాయి బిడ్డ
      సాయి మీకు అండగా ఎప్పుడు వుంటాడు. మీరు మీ కష్టాల యొక్క భాదను వదిలి ధైర్యంగా నా పక్కన బాబా వున్నాడు ఎలాంటి సమస్యని అయిన ఏద్రుకొగలను అనే భావాన్ని మనసులోకి తెచ్చుకోండి. మన కర్మ ల ఫలితమే ఈ బాధలు కష్టాలు . మన కర్మను బాబా నే సరి చేయగలరు. దయచేసి ఓర్పు తో సహనం తో శ్రద్ధ తో వేచి చూడండి. ఓం సాయిరాం. అంతా మన మంచికే. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనే నామాన్ని జపించడం మరవకండి. బాబా కి నామ జపం అంటే చాలా ఇష్టం.

      Delete
  5. Babaa iam sorry babaa please do something and help me babaa

    ReplyDelete
  6. ఓం శ్రీ సాయిరాం 🙏🙏🙏

    ReplyDelete
  7. Om Sri Sai Ram...thata🙏
    Bhavya sree

    ReplyDelete
  8. Om Sri Sai Ram... Thata
    Bhavya sree..🙏🙏

    ReplyDelete
  9. Baba! I am waiting for your miracle in my life. Please bless me baba with Job🙏🙏🙏🌺🥀🌷🌹💐🌿

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo