ఈ భాగంలో అనుభవాలు:
- ఏ కష్టం లేకుండా ఉద్యోగాన్ని ప్రసాదించిన సాయి
- సమయానికి సహాయం చేసి బాబా క్షేమంగా శిరిడీ తీసుకెళ్లారు
ఏ కష్టం లేకుండా ఉద్యోగాన్ని ప్రసాదించిన సాయి
ఓం సాయిరామ్! నా పేరు ప్రవీణ్. నేను 'సాయి మహారాజ్ సన్నిధి బ్లాగు' వారి 'సాయి భక్తుల అనుభవాలు' టెలిగ్రామ్ చానల్‌లోని సభ్యుడిని. నేను క్రమం తప్పకుండా ప్రతిరోజూ అందులో షేర్ చేసే భక్తుల అనుభవాలు చదువుతూ ఉంటాను. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
నేను అమెరికాలోని బోస్టన్ నగరంలో ఒక బహుళజాతి సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. నాకు హెచ్1బి వీసా ఉంది. హఠాత్తుగా రెండు వారాల క్రితం 2020, ఏప్రిల్ 30తో నా ఉద్యోగం ముగియనుందని నాకు తెలిసింది. నా క్లయింట్ చాలా తక్కువ వ్యవధిలో నోటీసు ఇవ్వడంతో నేను చాలా భయపడ్డాను. COVID19 మహమ్మారి కారణంగా USAలో పెద్ద సంఖ్యలో ఉద్యోగస్తుల తొలగింపులు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో క్రొత్త ఉద్యోగం పొందడమంటే చాలా కష్టం. అలాంటిది నా యజమాని క్రొత్త ఉద్యోగం చూసుకోవడానికి కేవలం 5 వారాల గడువు మాత్రమే ఇచ్చాడు. ఆ సమయంలోగా నాకు ఉద్యోగం రాకపోతే నేను USA వదిలి వెళ్ళిపోవాలి. అందువలన నా పరిస్థితి గురించి చింతిస్తూ నేను చాలా టెన్షన్ పడ్డాను. అటువంటి స్థితిలో ఒకరోజు 'సాయి భక్తుల అనుభవాలు టెలిగ్రామ్ గ్రూప్' నుండి నాకొక నోటిఫికేషన్ వచ్చింది. నేను దానిని ఓపెన్ చేసి చూశాను. అందులో రెండు అనుభవాలు ఉన్నాయి. నేను నా మనస్సులో "వీటిలో ఏదైనా ఉద్యోగానికి సంబంధించినదై ఉండాలి" అని అనుకున్నాను. చూస్తే, నేను ఊహించినట్లుగానే మొదటి అనుభవం ఉద్యోగానికి సంబంధించినదే! ఉద్యోగంతో ఒక భక్తుడిని బాబా ఎలా ఆశీర్వదించారన్నది ఆ అనుభవం. నేను ఆ అనుభవాన్ని చదివిన తరువాత నా మనస్సులో, 'బాబా కృపతో నాకు త్వరలో ఉద్యోగం వస్తే, నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాన'ని అనుకున్నాను. ఏమి జరిగిందో చూడండి! ఏప్రిల్ 29న మా సంస్థ మార్కెటింగ్ విభాగానికి చెందిన ఒక వ్యక్తి నుండి నాకు ఫోన్ వచ్చింది. అతను, "ఒక ఉద్యోగం ఉంది, ఇంటర్వ్యూకి సిద్ధంగా ఉండమ"ని చెప్పాడు. నేను అతనితో, "తప్పకుండా" అని చెప్పి ఫోన్ పెట్టేశాను. తరువాత నేను ఇంటర్వ్యూ కోసం సిద్ధమవుతూ, ఇంటర్వ్యూ కాల్ కోసం వేచి చూస్తున్నాను. మళ్ళీ ఏం జరిగిందో చూడండి! మరుసటిరోజు ఉద్యోగ నియామకాలు చేసే మేనేజర్ నుండి నాకొక కాల్ వచ్చింది. అతను, "ఇంటర్వ్యూ ఏమీ అవసరం లేదు. క్లయింట్ ఈ ఉద్యోగానికి తన సమ్మతి తెలియజేశారు. మీరు మే 4, సోమవారంనాడు ఉద్యోగంలో చేరండి" అని చెప్పాడు. ఏ కష్టం లేకుండా బాబా నాకు ఎంత అద్భుతంగా ఉద్యోగం ఇచ్చారో చూశారా! బాబా ఎప్పుడూ తన బిడ్డలకి రక్షణ ఇస్తారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా! నాకు మరికొన్ని కుటుంబ సమస్యలున్నాయి. దయచేసి వాటినుండి నాకు ఉపశమనం కలిగించండి".

సమయానికి సహాయం చేసి బాబా క్షేమంగా శిరిడీ తీసుకెళ్లారు
శిరిడీ పేరు వింటే చాలు, తన మదిలో మెదిలే మొట్టమొదటి శిరిడీ దర్శనం గురించి, ఆ ప్రయాణంలో తనకు బాబా చేసిన సహాయం గురించి ఒక సాయిబంధువు మనతో పంచుకుంటున్నారు.
సాయిబంధువులకు నమస్కారం. హైదరాబాదు నుండి మా ఊరు చాలా దూరం. మా ఊరినుండి శిరిడీ వెళ్ళాలంటే తప్పనిసరిగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుండి శిరిడీ వెళ్ళే రైలు ఎక్కాలి. అప్పట్లో మాకు రైళ్ళ రాకపోకల గురించి అసలు తెలియదు. అందువల్ల తెలిసినవారి సహాయంతో మా కుటుంబసభ్యులందరికీ రైలు టికెట్లు బుక్ చేయించుకున్నాను. మేము వెళ్లవలసిన రైలు మధ్యాహ్నం మూడు గంటలకు సికింద్రాబాదు నుండి బయలుదేరి అర్థరాత్రి మూడు గంటలకు నాగర్‌సోల్‌లో ఆగుతుంది. నాగర్‌సోల్‌లో దిగి అక్కడనుండి వేరొక వెహికల్ ఎక్కి శిరిడీ వెళ్లేలా ఏర్పాటు చేశారు.
నేను సికింద్రాబాదు రైల్వేస్టేషన్‌కి వెళ్లడం అదే మొదటిసారి. శిరిడీ వెళ్లాల్సిన రైలు ఏ ప్లాట్‌ఫాం దగ్గర ఆగుతుందో కూడా నాకు తెలియదు. అందువల్ల ఏ ఇబ్బంది కలగకూడదని రైలు బయలుదేరే సమయానికన్నా మూడు గంటల ముందే మేము రైల్వేస్టేషన్‌కి చేరుకున్నాము. అక్కడ ఉన్న రైల్వే సిబ్బందిని అడిగితే, ‘ఫలానా ప్లాట్‌ఫాం మీద కూర్చోండి, రైలు అక్కడే ఆగుతుంద’ని చెప్పారు. వాళ్లు చెప్పిన ప్లాట్‌ఫాం పైనే కూర్చుని రైలుకోసం ఎదురు చూస్తూ కూర్చున్నాము. రైలు బయలుదేరాల్సిన సమయం అవుతున్నా రైలు రాలేదు. దాంతో మా ప్రక్కనున్న వాళ్ళని కనుక్కుంటే, “శిరిడీ వెళ్లాల్సిన రైలు కొన్ని కారణాల వల్ల వేరే ప్లాట్‌ఫాం దగ్గర ఆగిందని, ఆ రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉందని, త్వరగా వెళ్ళినట్లయితే అందుకోవచ్చని” చెప్పారు. "సహాయం చేయమ"ని మనసులోనే బాబాను ప్రార్థించుకుంటూ, హడావిడిగా శిరిడీ వెళ్ళే రైలు ఉన్న ప్లాట్‌ఫాం దగ్గరికి వెళ్లేసరికి మేము ఎక్కాల్సిన రైలు బయలుదేరింది. సాటి ప్రయాణీకుడి సహాయంతో ఎలాగో రైలు ఎక్కి కూర్చున్నాము. కానీ, గుండె వేగం మాత్రం అసలు తగ్గలేదు. “కొన్ని క్షణాలు ఆలస్యమై ఉంటే రైలు మిస్సయ్యేవాళ్లం కదా! బాబాని చూడలేకపోయేవాళ్ళం కదా!” అనే ఆలోచనలే నన్ను చాలా బాధపెట్టాయి. మనసంతా ఆందోళనగా ఉండిపోయింది. ఈ విధంగా ఎందుకు జరిగిందా అని ఆలోచిస్తూ ఉండిపోయాను. ప్రయాణం సాఫీగా సాగుతూనే ఉన్నప్పటికీ, ఎందుకోగానీ చాలాసేపటి వరకు ఆ భయం నన్ను వదల్లేదు. అదే కాకుండా 'శిరిడీకి ఎలా వెళ్తామో?' అనే దిగులు నన్ను పట్టుకుంది. మేము దిగాల్సిన స్టేషన్ అర్థరాత్రి 3 గంటల సమయంలో వస్తుంది కాబట్టి, సాయంత్రం పడుకుని రాత్రి మెలకువగా ఉందామని అనుకున్నాను. కానీ అసలు నిద్ర పట్టలేదు. అర్థరాత్రి ఒంటిగంట సమయంలో గాఢంగా నిద్రపట్టేసింది. ఇంతలో ఎవరో నన్ను తట్టినట్టుగా అనిపించింది. వెంటనే లేచి వెళ్లి అక్కడున్న పోలీసులని అడిగాను, “మేము నాగర్‌సోల్‌లో దిగాలి. ఆ స్టేషన్ రావడానికి ఎంత సమయం ఉంద”ని. “ఇప్పుడు రాబోయేది నాగర్‌సోల్ స్టేషనే, దిగడానికి రెడీగా ఉండమ”ని చెప్పారు. గబగబా అందరినీ లేపి, సామాన్లు తీసుకుని డోర్ దగ్గర రెడీగా నిలబడ్డాము. రెండు నిమిషాలలో స్టేషన్ వచ్చింది, అందరం దిగాము. కానీ, చాలాసేపటి వరకు ఇంకా భయంగానే ఉన్నది, 'మెలకువ రాకుండా అలాగే నిద్రపట్టి ఉంటే మా పరిస్థితి ఏంటా?' అని. నాగర్‌సోల్‌లో ఆగకుండా ముందుకు వెళ్లిపోయేవాళ్లం. తెలియని ప్రాంతం, తెలియని భాష, తెలియని మనుషుల మధ్య ఎంతో ఇబ్బందిపడేవాళ్ళం. ఏ ఇబ్బందులూ పడనీయకుండా, రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు సమయానికి బాబా మాకు సహాయం చేసి మమ్మల్ని క్షేమంగా శిరిడీ తీసుకెళ్లారు. పుట్టింటికి బిడ్డలు వస్తే ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసుకునే తల్లిలా, శిరిడీలో కూడా చాలా చక్కని దర్శనాలను అనుగ్రహించి నా పుట్టింటి దర్శనాన్ని కన్నులారా చేయించారు బాబా. “చాలా చాలా ధన్యవాదాలు బాబా!”

OM SAI NAMO NAMAH
ReplyDeleteSRI SAI NAMO NAMAH
JAYA JAYA SAI NAMO NAMAH
SADGUGU SAI NAMO NAMAH
Sai naa alochanalu anni neeku telusu
ReplyDeleteemi ardam kavadam ledu sai
naaku estam leni ee paristitulani datinchu sainath
please sairam , please sairam
please do something baba
naaku evithe estam ledoo avani naa jivitamlo jaruguthunavi
ReplyDeleteanduke entha thondaraga veelu unte anta thondaraga naa ee jivitani muginchu sai
Chala tappu sai. Antha manchike. Devudini nammukondi opikaga undandi
DeleteNenu ilaney undedanni kani aa Sainadhuni 🙏🌹🌺 nama Japam valana change vachindhi. Meeru satcharitra,saileela amrutam ilantivi chadavandhi .ee alochananu vodileyandhii.
DeleteDear Sai
ReplyDeleteNoppi debba tahilina vanike telestundi. Karma phalanni anubhavinchatam chala kastam. Especially kastallo sai meeda complete ga bharam vesi bathakalante entho parinithi kavali. We become weaker when faced with difficult situations. But we have to move on. No option. Chant baba name. Do some social service so that you feel happy and also baba
Om Sri Sai Ram
ReplyDeleteOm Sai Ram..🙏🌺🌺🙏
ReplyDeleteఓం శ్రీ సాయిరాం జీ 🙏🙏🙏
ReplyDeleteఅందరూ బాగుండాలి అందరి కష్టాలని తొలగించు వారే ఈ సాయి నాథుడు శ్రద్ధ భక్తి సహనం తో వేచి వుండి నిత్యం సాయి స్మరణతో వుండండి. మేము కూడా చాలా కష్టాలలో నుండి బాబా దయ వలన బయట పడిన వాళ్ళమే కనుక దృడ విశ్వాసం తో చెబుతున్నాను. దయచేసి మనమందరం సాయి బాట లో నడుద్దాం మన కర్మల ఫలితాన్ని సులువుగా తొలగించుకుందాం. "ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి". సర్వేజనా సుఖినోభవంతు.
Omesairam...ma akka ki oka babu puttela chudu baba pls ....pls .....
ReplyDelete