సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 411వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. వృద్ధుని రూపంలో బాబా దర్శనం
  2. బాబా నా ప్రార్థనలకు సమాధానమిస్తున్నారు 

వృద్ధుని రూపంలో బాబా దర్శనం

సాయిభక్తురాలు శాంతి తనకు బాబా ప్రసాదించిన దర్శనాన్ని (అనుభవాన్ని) మనతో పంచుకుంటున్నారు.

ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయిబంధువులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు శాంతి. గతవారంలో బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు మరొక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

నాకు 14 సంవత్సరాల వయసున్నప్పుడు నేను, నా స్నేహితులు కార్తీకమాసంలో వనభోజనాలకు వెళదామనుకున్నాము. దాదాపు అందరం బాబా భక్తులమే. ఆహారపదార్థాలు సిద్ధంచేసుకొని బయలుదేరబోతూ, “మనం బాబాని కూడా మనతో తీసుకువెళదాం. బాబాకి ముందు భోజనం పెట్టి తరువాత మనం తిందాము” అని అనుకొని బాబా ఫోటో ఒకటి మాతో  తీసుకువెళ్ళాము. మేమంతా ఒక అరటితోటలోకి వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక చాలాసేపు ఆటలు ఆడుకుంటూ అందరం సరదాగా గడిపాము. తరువాత భోజనం చేసే వేళయిందని అందరం భోజనం చేయడానికి సిద్ధం అవుతున్నాం. ఇంతలో ఎక్కడినుండి వచ్చారో, ఎప్పుడు వచ్చారో తెలియదు, సుమారు 65 సంవత్సరాలున్న ఒక వృద్ధుడు, కాదు.. కాదు, బాబానే వచ్చి,నాకు పెట్టకుండా తింటున్నారా?అని అన్నారు. అప్పుడు మాకు గుర్తుకొచ్చింది. 'బాబాకు ముందు భోజనం పెడదామనుకున్నా'మన్న సంగతి. ఇంతలో మళ్ళీ బాబా, “నేను ఆ దూరాన ఉన్న ఉసిరిచెట్టు క్రింద ప్రతిరోజూ వందమందికి పైగా భోజనం పెడతాను. మీరు నా ఒక్కడికి పెట్టడం మరచిపోతే ఎలా?” అన్నారు. మేమందరం ఆశ్చర్యపోయాము. కొంచెంసేపటికి తేరుకొని పిల్లలందరం పోటాపోటీగా బాబాకి ఆహారపదార్థాలు వడ్డించాము. బాబాతో ఎన్నో కబుర్లు కూడా చెప్పాము. బాబా వెళ్లబోయేటప్పుడు అందరం బాబా పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నాము. ఇంతకన్నా ఏం కావాలి ఈ జీవితానికి? ఇప్పటికీ ఆ సన్నివేశం తలచుకున్నప్పుడల్లా కనులవెంట ఆనందభాష్పాలు జలజలా రాలిపోతాయి. మా నాన్నగారితో ఈ సంఘటన గురించి చెబితే, “బాబా మీతోనే ఉన్నారమ్మా” అన్నారు. ఇప్పటికీ బాబా నాతోనే ఉన్నారు.

బాబా నా ప్రార్థనలకు సమాధానమిస్తున్నారు 

ఒక సాయిభక్తురాలు తన అనుభవాలను ఇలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్! ముందుగా బాబా పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. బాబాకి అత్యంత సన్నిహితంగా ఉన్నామనే భావనను మీ బ్లాగ్ ద్వారా వేలాదిమంది సాయిభక్తులకు ప్రతిరోజూ కలిగిస్తున్నారని నా విశ్వాసం. బాబా ఉనికిని ఈ ప్రపంచానికి తెలియజేస్తున్న మీ ప్రయత్నాలకు నిస్సందేహంగా బాబా ప్రాతినిధ్యం వహిస్తున్నారని నా ఉద్దేశ్యం. మనలో చాలామంది ఈ అనుభవాలు చదవడంతో తమ రోజుని ప్రారంభిస్తారని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ అనుభవాల ద్వారా మనమంతా ఆయన బిడ్డలమని భక్తులకు బాబా హామీ ఇస్తున్నారు. చాలామంది భక్తుల మాదిరిగానే నా జీవితంలో బాబా ప్రసాదించిన అనుభవాలు ఉన్నందుకు నేను ఎంతో ధన్యురాలిగా భావిస్తున్నాను. వాటిలో కొన్నిటిని ఇప్పుడు మీతో పంచుకుంటాను.

నాకు వివాహం అయ్యేంతవరకు వెంకటేశ్వరస్వామి, శివుడు మాత్రమే తెలుసు. నా భర్త బాబాకు అంకితభక్తులు. నేను ఆయనతో చాలాసార్లు అయిష్టంగానే బాబా మందిరానికి వెళ్ళాను. ఒకరోజు బాబా నాకు శ్రీరాముడిగా దర్శనమిచ్చారు. అప్పటినుండి నేను బాబా భక్తురాలినయ్యాను. ప్రతిరోజూ బాబా నా ప్రార్థనలకు సమాధానమిస్తున్నారు. నేను కోరింది ఏదైనా నాకు శ్రేయస్కరమైనదైతే నిమిషాల్లో బాబా అనుగ్రహిస్తున్నారు. బాబా నన్ను అడుగడుగునా కాపాడుతున్నారు అంటే అతిశయోక్తి కాదు.

2019, అక్టోబర్ 21, సోమవారంనాడు నేను ఆఫీసులో సెలవు అడగలేక షెడ్యూల్‌లో మార్పు కోసం బాబాను అభ్యర్థించాను. కొన్ని గంటల్లో ఆయన నా ప్రార్థనకు సమాధానమిచ్చారుమనం ఆయనకు సర్వస్య శరణాగతి చెందితే చాలు, ఆయన మనకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ రక్షణనిస్తారు. "ఇలాగే ఎల్లప్పుడూ మమ్మల్ని నడిపిస్తూ ఉండండి బాబా!"

2019, డిసెంబరు 30, సోమవారం ఉదయం నేను బాబాని ఒక ప్రశ్న అడిగినప్పుడు, "నాకు తాంబూలం సమర్పించు. నువ్వు అదృష్టవంతురాలివి" అని బాబా నుండి సమాధానం వచ్చింది. నేను అప్పటికి పదిరోజులుగా అమ్మవారికి అష్టోత్తరం చేయించాలని అనుకుంటున్నాను. కానీ నాకు బాబా అవకాశం ఇవ్వలేదు. ఆరోజు సాయంత్రం నేను బాబా గుడికి వెళ్ళాను. బాబా పాదాల చెంత పండ్లు, దక్షిణలతో తాంబూలం పెట్టగానే, పూజారి బాబా అష్టోత్తరం చదవడం మొదలుపెట్టారు. నేను, "బాబా! అమ్మకి చేయించాలనుకున్న అష్టోత్తరం నీవే చేయించుకుంటున్నావా! అమ్మవు, నాన్నవు నీవే తండ్రీ" అనుకున్నాను. బాబాకు హారతి ఇస్తుంటే ఆ తండ్రి ప్రేమకు నా కళ్ళలో కన్నీళ్ళు ఆగలేదు. తరువాత నేను బయటికి వస్తుంటే పూజారి నన్ను వెనక్కి పిలిచి, "అమ్మా, డబ్బులు తీసుకోండి" అంటూ నేను బాబా పాదాల వద్ద పెట్టిన డబ్బులను నాకు ఇచ్చేశారు. వాటితోపాటు నేను పెట్టిన పండ్లు కూడా ఇచ్చేశారు. నేను ఆశ్చర్యపోయాను. ఉదయం నన్ను అడిగిన తాంబూలం తప్ప బాబా నా నుంచి ఏమీ తీసుకోలేదు

ఇటీవల ఒకసారి నేను అలెర్జీతో చాలా ఇబ్బందిపడ్డాను. ఆ అలెర్జీ ఎందుకు వచ్చిందో నాకస్సలు అర్థం కాలేదు. వైద్యులు కూడా గుర్తించలేకపోయారు. అప్పుడు నేను "నా బాధను తొలగించమ"ని బాబాని ప్రార్థించాను. ఎప్పటిలాగే బాబా తమ అపారమైన కృపను చూపించారు. ఏదో అద్భుతం జరిగినట్లు నా బాధ ఇట్టే పోయింది. అంతేకాదు, ఆ అలెర్జీకి కారణం కూడా తెలుసుకోగలిగాను. "బాబా! మేము మనుషులం, ఏవో కారణాలతో మీ నుండి దూరమవుతుంటాం. కానీ మీరు మీ బిడ్డలమైన మమ్మల్ని గట్టిగా పట్టుకొని, మార్గదర్శకత్వం చేస్తూ మమ్మల్ని నడిపించండి. నాకున్న ఒక కోరికను త్వరలోనే తీరుస్తారని ఆశిస్తున్నాను బాబా. ఎల్లప్పుడూ మీ భక్తకోటిని ఆశీర్వదిస్తూ ఉండండి". 

జై సాయిరామ్!


6 comments:

  1. జై సాయిరామ్!

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. OM SAI SREE SAI JAYA JAYA SAI,LOVE U BABA,BE ALWAYS WITH ME.

    ReplyDelete
  4. ఓం శ్రీ సాయిరామ్ తాతయ్య 🙏🙏🙏

    ReplyDelete
  5. Avunu nenu morning Anni complete chesi ee blog lo ni anubhavulu chadivaka matrameyy na day ni start chestanu.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo