సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 413వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. లీల రూపంలో లభించిన బాబా ఆశీస్సులు
  2. కరోనా సమయంలో మా అబ్బాయిని సురక్షితంగా మా చెంతకు చేర్చిన బాబా

లీల రూపంలో లభించిన బాబా ఆశీస్సులు

సౌదీ అరేబియా నుండి ఒక సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

సాయిబంధువులకు నమస్కారం. మేము సౌదీ అరేబియాలో నివసిస్తున్నాము. 2019, డిసెంబరు 19, గురువారంనాడు మా బాబు ఆశ్విక్ సాయి నాలుగవ పుట్టినరోజు. ఆరోజు కొంతమంది అతిథుల్ని ఆహ్వానించి మా బాబు పుట్టినరోజు వేడుక చేద్దామనుకున్నాను. అప్పటికి నేను మహాపారాయణ గ్రూపులో సభ్యత్వం తీసుకుని ఒకటిన్నర నెల అవుతోంది. అందులో భాగంగా నేను ప్రతి గురువారం పారాయణ చెయ్యాలి. అంటే నేను ఆ రోజు పుట్టినరోజు వేడుక పనులతోపాటు పారాయణ కూడా చేసుకోవాలి. పుట్టినరోజు వేడుకకోసం బుధవారం నాడు బెలూన్స్ తో ఇల్లంతా అలంకరించేసరికి రాత్రి చాల ఆలస్యం అయింది. అలంకరణంతా పూర్తయ్యాక నేను, “చాలా ఆలస్యమైంది, అయినా సరే రేపు ఉదయం ఎలాగైనా త్వరగా లేవాలి. మహాపారాయణ చెయ్యాలి. ఆశ్విక్ పుట్టినరోజు వేడుకకు ఆహ్వానించిన అతిథులకోసం వంటచేయాలి, అలాగే మిగతా ఏర్పాట్లు కూడా చేసుకోవాలి" అని అనుకుంటూ పడుకున్నాను. 

వేకువఝామున 5 గంటలకి అలారం మ్రోగింది. నిద్రమత్తులో అలాగే అలారం ఆఫ్ చేసి మళ్ళీ పడుకున్నాను. ఇంతలో ఇండియా నుండి మా అన్నయ్య ఫోన్ చేశాడు. ఇండియాలో అప్పుడు సమయం - ఉదయం 7.30 గంటలు. “ఆశ్విక్ పుట్టినరోజు సందర్భంగా బాబా మందిరంలో ఆశ్విక్ పేరు మీద అభిషేకం, అర్చన చేయించాము. బాబాకి క్రొత్త బట్టలు సమర్పించాము” అంటూ చాలా సంతోషంగా ఆ విషయాలన్నీ నాతో పంచుకున్నాడు. అంతేకాదు, “నేను మా పాప పుట్టినరోజుకి కూడా ఇలాగే చేయిస్తాను” అని చెప్పాడు. తను చెప్పిన విషయాలన్నీ విని ఎంతో సంతోషించాను. అన్నయ్యతో మాట్లాడేసరికి నిద్రమత్తు వదిలిపోయింది. తరువాత లేచి స్నానం చేసి, బాబాకు పూజ చేసుకుని, పారాయణ పూర్తి చేశాను. తరువాత మిగత పనులన్నీ చేసుకున్నాను. ఆ రాత్రి మా అశ్విక్ సాయి పుట్టినరోజు వేడుక కొద్దిమంది అతిథుల మధ్యలో చక్కగా జరిగింది.

తరువాత రాత్రి పడుకునేముందు మావారితో, “మీ ఫోన్లో అలారం ఆఫ్ చేయండి, రేపు సెలవు (సౌదీలో శుక్ర, శనివారాలు సెలవలు) కదా” అని చెప్పి, నా ఫోన్లో కూడా అలారం ఆఫ్ చేద్దామని చూస్తే, అసలు ఫోన్లో అలారం సెట్ చేసి లేదు. అది చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. తరువాత అన్ని ఫోనుల్లోనూ వెతికితే, అసలు 5 గంటలకి అలారం ఏ ఫోన్లోనూ పెట్టలేదని అర్థమైంది. అప్పుడు అనుకున్నాం, "అలారం పెట్టకపోయినా బాబానే అలారం శబ్దంతో నిద్రలేపారు. అలారం మ్రోగినా నేను నిద్రలేవకపోయేసరికి మా అన్నయ్య చేత ఫోన్ చేయించి మరీ నన్ను నిద్రలేపి పారాయణ చేయించారు" అని. మా బాబు పుట్టినరోజునాడు బాబా చూపిన ఈ లీలను ఆయన ఆశీస్సులుగా అనుభూతి చెందాను. “థాంక్యూ వెరీ మచ్ బాబా! ఎప్పటికీ నా పైనా, నా కుటుంబసభ్యులందరి పైనా మీ ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటున్నాను బాబా!”

మరొక అనుభవం:

బాబా అనుగ్రహంతో మొదటి సంతానంగా మాకు మగబిడ్డ జన్మించాడు. 2018, జూలై 15వ తేదీన నేను రెండవసారి గర్భవతినని తెలిసింది. నాకు నాలుగవ నెలలో స్కానింగ్ చేసినప్పుడు నేను డాక్టరుని బేబీ జెండర్ గురించి అడిగాను. రెండవసారి కూడా నాకు మగబిడ్డ అని చెప్పారు. నేను ఇంటికి వచ్చాక, “బాబా! నాకు పాప కావాలి. నాకు అక్కచెల్లెళ్ళు లేరు. నావాళ్ళు ఎవరూ నన్ను ‘నా’ అనుకోరు. నాకు ఆడపిల్లే కావాలి బాబా” అంటూ సాయిబాబా ఫోటో ముందు కన్నీళ్లతో ప్రార్థించాను. 

తరువాత డెలివరీకి ఇండియా వెళ్ళాలని నిర్ణయించుకొని, 5వ నెలలో ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నాము. ఇండియా వెళ్ళేముందు 5వ నెలలో డాక్టర్ మరలా స్కానింగ్ చేయించారు. ఆశ్చర్యంగా, ‘ఈసారి పుట్టబోయేది పాప’ అని చెప్పారు డాక్టర్. ఆ మాట విని అవధుల్లేని ఆనందంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. నా ప్రార్థనను మన్నించి బాబా నాకు పాపని ప్రసాదించారు. “చాలా చాలా ధన్యవాదాలు బాబా!"

కొరోనా సమయంలో మా అబ్బాయిని సురక్షితంగా మా చెంతకు చేర్చిన బాబా

సాయిభక్తురాలు శ్రీమతి నాగలక్ష్మి తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై! 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వహిస్తున్న సాయిభక్తులకు, ఈ బ్లాగ్ ద్వారా తమ అనుభవాలను పంచుకుంటున్న సాటి సాయిభక్తులకు నా నమస్కారాలు. నా పేరు మంత్రిప్రగడ నాగలక్ష్మి. మాది విశాఖపట్నం. ఇదివరకు నా అనుభవం ఒకటి ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరొక అనుభవంతో మీ ముందుకు వస్తున్నాను.

అనంతకోటి బ్రహ్మాండనాయకుడు, రాజాధిరాజు, యోగిరాజు అయిన శ్రీ సాయినాథుని మహిమలు వర్ణించగలమా? మా అబ్బాయి శరత్ హైదరాబాదులో ఒక కంపెనీలో ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్నాడు. అది కొరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయం. మార్చి 22, ఆదివారంనాడు ప్రధానమంత్రి మోడీగారు ‘జనతా కర్ఫ్యూ’ ప్రకటించారు. మా అబ్బాయికి ప్రతి మంగళవారం ఆఫీసుకి సెలవు. ఆదివారంనాడు కర్ఫ్యూ కాబట్టి మంగళవారం సెలవులేదని, ఆఫీసుకు హాజరుకావాలని మేనేజర్ చెప్పడంతో, మా అబ్బాయి తాను ఇంటికి (విశాఖపట్నం) రావడం కుదరదని మాకు ఫోన్ చేసి చెప్పాడు. మేము కూడా ‘సరే, అక్కడే ఉండిపొమ్మ’ని సలహా ఇచ్చాము. ఇక్కడనుంచే బాబా లీలలు మొదలయ్యాయి. జనతా కర్ఫ్యూనాటి సాయంత్రం ఎందుకో మా అబ్బాయికి ఇంటికి రావాలనిపించి బయలుదేరి ఎయిర్‌పోర్టుకి వెళ్లాడు. వాకబు చేయగా, ప్రస్తుతం ఫ్లైట్స్ ఏమీ లేవనీ, మరుసటిరోజు ఉదయాన్నే ఒక ఫ్లైట్ ఉందని చెప్పారు. దాంతో తను ఆ రాత్రంతా అక్కడే ఉండి ఉదయాన్నే ఫ్లైట్‌లో విశాఖపట్నం చేరుకున్నాడు

ఇంటికి చేరుకున్న మరుసటిరోజు మా అబ్బాయికి వళ్ళంతా అమ్మవారు వచ్చింది. తీవ్ర అనారోగ్యంతో సుమారు ఇరవై రోజులు బాధపడ్డాడు. బాబా అనుగ్రహంతో ఇప్పుడు అంతా నెమ్మదించింది. మా అబ్బాయి కనుక ఈ లాక్ డౌన్ సమయంలో హైదరాబాదులోనే ఉండుంటే డాక్టర్లు గానీ, ఆసుపత్రులు గానీ అందుబాటులో లేక అనారోగ్యంతో చాలా బాధపడేవాడు. అంతేకాదు, మెస్‌లు లేక భోజనానికీ చాలా ఇబ్బందిపడేవాడు. మా అబ్బాయి కోసం మేము కూడా బాగా బెంగపెట్టుకొనేవాళ్ళం. బాబాకు ఇదంతా ముందే తెలిసి ఈ కొరోనా సమయంలో మా అబ్బాయిని సురక్షితంగా మా చెంతకు చేర్చారు. ఆ సాయినాథుడు నా పట్ల, నా కుటుంబం పట్ల అడుగడుగునా చూపుతున్న అభిమానానికి, ప్రేమకు మేము ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? మా కుటుంబాన్ని ఆదుకున్నట్లుగానే ఈ కొరోనా బారినుండి యావత్ ప్రపంచాన్ని కాపాడగలిగే శక్తి ఆ సాయినాథునికొక్కరికే ఉంది. ఆనాడు గోధుమపిండిని విసిరి కలరా బారినుండి శిరిడీని కాపాడినట్లు ఈనాడు ఈ కొరోనా బారినుండి ఈ ప్రపంచాన్ని కాపాడమని బాబాను మనసారా ప్రార్థిస్తూ..

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


10 comments:

  1. very nicesaileele.saisaveseveryone.omsairam

    ReplyDelete
  2. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  3. అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  4. OM SAIRAM
    SAI ALWAYS BE WITH ME

    ReplyDelete
  5. SAI NAAKU EMI ADGALO KUDA ARDAM KAVADAM LEDU
    PLEASE SAIRAM NEE EE ANDOLANAKI PARISHAKARM CHUPINCHU
    OM SAIRAM

    ReplyDelete
  6. Om sai namo namah
    sri sai namo namaha
    jaya jaya sai namo namah
    sadgugu sai namo namah

    saichidanada sadguru sainath maharaj ki jai

    ReplyDelete
  7. ఓం శ్రీ సాయిరాo 🙏🙏🙏

    ReplyDelete
  8. అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  9. SaiNadha! Nannu karuninchuu na meedha karuna chupinchuu. Naku patience ni ivvu tandri!

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo