సాయిశరణానంద అనుభవాలు - ఎనిమిదవ భాగం
నిన్నటి తరువాయిభాగం.....
ఎవరైనా ఏదైనా ధార్మిక కార్యక్రమాన్ని చేయాలని తలిస్తే, అది పూర్తయ్యేంతవరకూ వారిని వెళ్ళనీయక, ఆ తరువాతే వారిని పోనీయటం బాబా తత్వం. ఇప్పుడు కూడా బాబా అలాగే ఆలోచిస్తుంటారు. దీనికి సాక్ష్యంగా 1957 ఆగస్టు 1వ తారీఖున చందూలాల్ పాఠక్‌కి జరిగిన అనుభవం ఉంది. అతను అనుకొన్న ప్రకారం సమాధిమందిరంలో దక్షిణ సమర్పించే పని మిగిలిపోయినప్పుడు వారు అతని బస్సు తప్పిపోయేలా చేసి, ఆ విషయాన్ని అతనికి గుర్తు తెప్పించి, అర్ధాంతరంగా వదిలిన ఆ పనిని పూర్తి చేయించారు. నేను శిరిడీలో ఉన్న ఆ పదిరోజుల్లో విష్ణుబువా బ్రహ్మచారి గీత గురించిన మహత్వపూర్వక సూచన లభించటం చాలా విశిష్టమైనది.
ఇన్ని అనుభవాలు కలిగిన తరువాత కూడా బాబా మీద నా అంతరంగంలో ప్రేమ ఉత్పన్నం కాలేదు. కానీ ఆయన దైవత్వంపై విశ్వాసం కలగటం వల్ల చివరికి నామస్మరణ చేయటం ప్రారంభించాను. శిరిడీకి వెళ్ళకముందు మా నాన్న నాకు ఎన్నోరకాలుగా, "బాబా ఇచ్చిన ప్రసాదాన్ని పారెయ్యకూడదు. ఆయన మాంసం ముక్కే ఇచ్చినప్పటికీ దాన్ని దాచిపెట్టుకోవాలి" అని చెప్పారు.
ఈ జాగ్రత్తను గురించిన సూచన సరైనదే. ఖపర్డేగారు బాబా గురించి వ్రాసిన పుస్తకం ఆధారంతో ఈ విషయం స్పష్టమవుతోంది. పైన ఉదహరించిన పుస్తకంలో 70-72 పేజీల్లో కర్మఠుడైన ఒక పేద బ్రాహ్మణుని కథ ఉంది. అతను బాబా దర్శనం కోసం వచ్చాడు. అప్పుడు బాబా అతనికి అంగవస్త్రంలో మాంసం ముక్కలు కట్టిచ్చి, "నీ నలుగురు పుత్రులు తినటానికి సరిపడా ఉంది” అన్నారు. కర్మకాండలు చేసే ఆ బ్రాహ్మణుడు బాబా ఇచ్చిన ఆ ప్రసాదం విలువను తెలుసుకోలేకపోయాడు. అతను ప్రసాదమైతే తీసుకున్నాడు కానీ ఇంతలో అతనికో ఆలోచన వచ్చింది. గ్రామ సరిహద్దులు చేరుకుని అతను తన ఉత్తరీయాన్ని నీటిలో ఝాడించాడు. అప్పుడు అతని చేతికి ఒక గట్టి వస్తువు తగిలింది. ఒకటీ అరా ఎముకలు మిగిలిపోయాయేమో అనుకొని అతను పైపంచెను గట్టిగా విదిలించాడు. అప్పుడు సుమారు ముప్పావు తులం బరువున్న బంగారపు కడ్డీ బయటపడింది. దాన్ని చూసి అతను విస్మితుడై ఇంకా ఏమైనా ముక్కలున్నాయేమోనని వెతికాడు, కానీ అది వ్యర్థమైంది. ఈ చమత్కారం సాయిబాబాకు సంబంధించిన వేరే ఏ చరిత్ర గ్రంథాల్లోనూ వర్ణించబడలేదు. తొంభై సంవత్సరాల వయసున్న శిరిడీ వాస్తవ్యుడైన బాబాజీ బాపూజీ జగతాప్ ద్వారా ఈ కథను శ్రీ ఖపర్డే 1956లో విన్నారు. మాంసాన్ని బాబా తమ ప్రసాదంగా ఒకవేళ నాకు ఇస్తే దాన్ని తీసుకోమని మా నాన్నగారు నాకు జాగ్రత్తపూర్వకమైన సూచన చేయటం వల్ల ఆయన కూడా ఈ కథ విని ఉంటారని స్పష్టమవుతోంది.
తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.
Om Sai
ReplyDeleteSri Sai
Jaya Jaya Sai
🙏🙏🙏
Om Sri sairam tatayya 🙏🌹🙏🌹🙏🌹
ReplyDelete