ఈ భాగంలో అనుభవాలు:
- నా వెనుకనున్నది మరెవరో కాదు, సాక్షాత్తూ ఆ శిరిడీ సాయినాథుడు!
- బాబా కృపతో నయమైన పాప కంటిసమస్య
నా వెనుకనున్నది మరెవరో కాదు, సాక్షాత్తూ ఆ శిరిడీ సాయినాథుడు!
ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై! ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి, సాటి సాయిబంధువులకు నా నమస్కారములు. ఈ నా అనుభవాన్ని మీతో ఇంత ఆలస్యంగా పంచుకుంటున్నందుకు సాయిమహరాజును క్షమాపణలు వేడుకుంటున్నాను. నేను గత నాలుగు సంవత్సరముల నుండి బాబాకి భక్తుడనయ్యాను. బాబా నాకున్న ఎన్నో సమస్యలను తీర్చారు. ఈరోజు నేను మీతో నా అనుభవాన్ని పంచుకుంటున్నానంటే అది నా సాయి నా యందు చూపిస్తున్న ప్రేమే. ఇక నా అనుభవంలోకి వస్తే..
నేను ఒకరోజు దారివెంట నడుచుకుంటూ వెళ్తున్నాను. ఉన్నట్టుండి నాకు బాగా దాహం వేసింది. ఆ చుట్టుప్రక్కల ఎక్కడా నీళ్ళు లేవు సరికదా ఒక్క ఇల్లు కూడా లేదు. అలా కొంచెం దూరం నడిచాక ఒక ప్రాంగణం లాంటిది కనిపిస్తే అందులోకి వెళ్ళాను. కానీ అక్కడ ఎవరూ లేరు, అంతా నిర్మానుష్యంగా ఉంది. అక్కడే ఉన్న వాటర్ ట్యాంక్ నుండి నీళ్ళు రావడం చూసి అక్కడికి వెళ్ళి నీళ్ళు త్రాగుతున్నాను. అకస్మాతుగా గాలిదుమారం లేచి నా వైపు రావడం చూసి భయపడ్డాను. సరిగ్గా అది నా దగ్గరకు రాగానే అందులో నుండి ప్రేతాత్మ ఒకటి నా వద్దకు వచ్చి వికటాట్టహాసం చేస్తూ నా గొంతు పట్టుకొని ‘నిన్ను చంపేస్తా’ అని అంది. నేను కొంచెం ధైర్యం చేసి దాని గొంతు పట్టుకుని, “ఎవరు నువ్వు? నన్నెందుకు పట్టుకున్నావ్? నన్ను వదిలేయ్, నాకు చిన్న పిల్లలున్నారు” అని అంటున్నాను. కానీ, అది వదలకుండా ‘నిన్ను చంపేస్తా’ అని గట్టిగా నా గొంతు నొక్కుతోంది. ఇంతలో నాకు ఎక్కడినుండి వచ్చిందో తెలియదు ఆ శక్తి, ఆ ప్రేతాత్మను గొంతు పట్టి గట్టిగా త్రోసివేశాను. అది క్రిందపడి, “నీకు ఇంత బలం ఎక్కడిదిరా? నీ వెనకాల ఎవరున్నారని నీకింత ధైర్యం?” అని అనగానే, ‘నా వెనకాల ఎవరున్నారు?’ అని వెనక్కి తిరిగి చూసి, నిర్ఘాంతపోయాను. నా వెనుకనున్నది మరెవరో కాదు, సాక్షాత్తూ ఆ శిరిడీ సాయినాథుడు! ఆ సద్గురువు నా వెనకాల నుండి “తన వెనకాల నేనున్నాను” అంటూ ఆ ప్రేతాత్మకు తన వ్రేలితో చూపిస్తూ వెళ్ళడం చూశాను. అంతలోనే నాకు నిద్రనుండి మెలకువ వచ్ఛింది. ‘ఇదంతా స్వప్నమా!’ అని అనుకున్నాను, కానీ నాకు చేతులు, భుజాలు చాలా నొప్పిగా ఉన్నాయి. అంటే, బాబా నా వెన్నంటే ఉండి నన్ను ఎళ్ళవేళలా కాపాడుతున్నారని నాకు అర్థమైంది. నన్ను ఎన్నో సమస్యల నుండి కాపాడుతున్న బాబాకి నా శతకోటి ధన్యవాదాలు.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!
ఇట్లు
సాయిభక్తుడు

బాబా కృపతో నయమైన పాప కంటిసమస్య
నా పేరు విజయ. ఇటీవల బాబా నాకు చూపిన మహిమను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా చిన్న కూతురికి ఇప్పుడు 14 నెలల వయసు. ఈమధ్య ఒకరోజు పాపకి సీసాతో పాలు త్రాగిస్తున్నపుడు పాప కంట్లో ఎర్రగా ఉండటం గమనించాను. ఎర్రదనం కాస్త ఎక్కువగానే ఉండటంతో నాకు కంగారుగా అనిపించి, కాస్త జాగ్రత్తగా గమనిస్తే అది నోట్లో ఏర్పడే అల్సర్‌లా కనిపించింది. నోట్లో అల్సర్లు వస్తే పెద్దవాళ్ళే బాధను తట్టుకోలేరు, అలాంటిది చిన్నపాప కంటి తెల్లని భాగంలో వస్తే ఆ నొప్పిని ఎలా తట్టుకుంటుంది? పైగా తన బాధ ఇదీ అని కూడా చెప్పలేదని పలురకాల ఆలోచనలతో చాలా కలవరపాటుకు గురయ్యాను. అసలే ఇప్పుడు లాక్‌డౌన్ రోజులైనందున పీడియాట్రీషన్ దగ్గరకు వెళ్లలేని పరిస్థితి. కనీసం ఇంకాస్త పరిశీలనగా దాన్ని చూద్దామనుకుంటే పాప చూడనివ్వట్లేదు. పాప ఏడవట్లేదుగాని, ఒకవేళ అది ఎక్కువై కంటిచూపుకు ఏదైనా సమస్య అవుతుందేమోనన్న భయంతో నేను చాలా బాధపడ్డాను. నాకు ఏమి చేయడానికీ పాలుపోలేదు. అప్పుడు బాబాని ప్రార్థించి, భారం ఆయన మీదే వేశాను. అప్పటికే మూడు వారాలుగా సాయి నవగురువార వ్రతం చేస్తున్నాను. పాప రాత్రి నిద్రపోయాక కొంచెం ఊదీ తీసుకొని పాప కంటిరెప్పలపై రాశాను. ఇలా ఐదు రోజులు చేశాక, పాపను పైకి చూసేలా చేస్తూ, అతికష్టంమీద తన కన్ను పరిశీలించాను. బాబా దయవలన అల్సర్ పూర్తిగా తగ్గిపోయింది. పట్టరాని ఆనందంతో బాబాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఈ అనుభవం ద్వారా బాబా యందు భక్తులకు నమ్మకం వృద్ధి చెందాలని ఆశిస్తూ...
సదా బాబా సేవలో
విజయ.

om sairam omsairam omsai ram
ReplyDeleteఓం శ్రీ సాయిరాం 🙏🙏🙏
ReplyDeleteసర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
ReplyDeleteom sairam
ReplyDeletesai always be with me
Om Sai Ram 🙏🌹🙏
ReplyDeleteOm sai ram🙏🙏🙏🙏🙏🌼🌻🌺🌹🌹🌺🌹
ReplyDelete