ఖపర్డే డైరీ - ముప్పయితొమ్మిదవ భాగం
12-3-1912
సాయిమహారాజు బయటకు వెళ్ళటం చూశాను. ఆయన మశీదుకి వచ్చిన తరువాత ఆయన్ను దర్శించుకోవటం కోసం మశీదుకి వెళ్ళాను. నేను కూర్చుంటున్నప్పుడు సాయిసాహెబ్, "మనుషులు చాలా అజ్ఞానులు. నా భౌతిక శరీరాన్ని చూడనప్పుడు వారు నేను లేను అనుకుంటున్నారు" అన్నారు. 'ఈరోజు ఉదయం పింపల్‌గావ్‌ని తలచుకున్నాన'ని చెప్పారు. ఆయన అక్కడనుండి వచ్చిన నలుగురు మనుషులను కలిశారట. వారు ఈయన్ను అనుసరించి మశీదుకు వచ్చారు. సంభాషణ అనుకోకుండా పెళ్ళిళ్ళకు సంబంధించిన విషయాల వైపుకి మళ్ళింది. కొత్తగా నిర్మించిన గోడ గురించి ప్రస్తావిస్తూ సాయిసాహెబ్ అక్కడ ఒక బాట - అందులో ఉన్న ఒక చిన్న చెట్టు గురించి చెప్పారు. ఎంతో పవిత్రుడైన ఒక వృద్ధుడు అక్కడ కూర్చునేవాడట. ఆయన జాల్నా నుండి వచ్చారట. పన్నెండేళ్ళు గడిచినా, తన సోదరులూ, కుటుంబమూ అతను లేకపోవటం వల్ల ఎంతగా బాధలు పడినా తిరిగి వెళ్ళటాన్ని గురించి అతను పట్టించుకోలేదుట. చివరికి అతను తిరిగి వెళ్ళాలనుకున్నాడట. అతను గుర్రం మీద ప్రయాణిస్తుంటే, సాయిసాహెబ్ ఒక బండిలో అతన్ని అనుసరించారట. వారు జాల్నా చేరుకున్నారట. ఆ వృద్ధుడు భార్యతోనూ, తనకున్న నలుగురు కొడుకులతోనూ ఉంటూ, హఠాత్తుగా తన సోదరుడి కుమార్తెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందరూ నవ్వి ఎగతాళి చేసినప్పటికీ ఆ వివాహం జరిగిపోయింది. పెళ్ళికుమార్తె చాలా చిన్నపిల్ల. చివరికి ఆ అమ్మాయి పెద్దదయింది. ఆ వృద్ధుడికి ఆమె వల్ల ఒక కొడుకు పుట్టాడు. ఆ పిల్లవాడికి ఆరేళ్ళ వయస్సు వచ్చేటప్పటికి ఆ వృద్ధుడు మరణించాడు. దాయాదులు ఆ అబ్బాయికి విషమిచ్చారు. కొడుకును కోల్పోయిన బాలవితంతువైన ఆ తల్లి సౌశీల్యమైన జీవితాన్ని గడిపి, తిరిగి వివాహం చేసుకోకుండా చనిపోయింది. ఆ పిల్లవాడు 'బాబు'గా మళ్ళీ పుట్టి చనిపోయి మళ్ళీ ముంబాయిలో జన్మించాడు. భగవంతుని కృత్యాలు గొప్ప కళాత్మకమైనవి.
13-3-1912
సాయిమహారాజు బయటకు వెళ్ళటం చూశాము. తరువాత మశీదులోనూ చూశాము. ఆయన ఒక సుదీర్ఘమైన గాధను చెప్పారు. ఒక వృద్ధుడైన పెద్దమనిషి ఆయన్ను చూడటానికి వస్తుండేవాడట. మొదట నలుగురు, ఆ తరువాత పన్నెండుమంది డిటెక్టివ్‌లు అతని చర్యలు కనిపెడుతూ ఉండేవారట. ఆ వృద్ధుడికీ, ఆ డిటెక్టివ్‌లకీ మాటా మాటా పెరిగి తీవ్రంగా ముష్టియుద్ధం అయింది. సాయిసాహెబ్ వృద్ధుడికి సహాయంచేసి, అతన్నా ప్రదేశంలో కలిశారట. ఒక సందర్భంలో ఆ డిటెక్టివ్‌లు అతనిపై దాడి చేసినప్పుడు వాళ్ళని కొట్టారట. చివరికి ఆ వృద్దుడ్ని ఆ వ్యవహారంలో ఒక పెద్ద పట్టణానికి తరలిస్తే, సాయిసాహెబు కల్పించుకొని అతన్ని విడుదల చేయించారట.
19-5-1917
నేను పొద్దున్నే లేచాను కానీ, చాలామంది సమావేశమవటం వల్ల ప్రార్థన చేసుకోలేకపోయాను. మమ్మల్ని ఇక్కడనుంచి మధ్యాహ్నం వరకూ పోనివ్వకుండా ఇక్కడే ఉంచటానికి కొందరు ఒక ఆలోచన చేశారు. కేల్కరు ఆ ఆలోచన వైపుకు మొగ్గుచూపుతున్నట్లు కనిపించింది. నాకు పట్టరానంత కోపం వచ్చి బయలుదేరటానికి తొందరచేశాను. సంగమనేరులో పెద్ద లాయరైన సంత్ వాళ్ళింట్లో తాంబూలం స్వీకరించిన తరువాత మేము ఉదయం ఎనిమిదిన్నరకి బయలుదేరాం. దార్లో మోటారుబండికి పంక్చరై, దాన్ని బాగుచేసుకొన్న తరవాత ఉదయం సుమారు పదిగంటలకి శిరిడీ చేరి దీక్షిత్ వాడాలో దిగాము. బాపూసాహెబ్ బూటీ, నారాయణరావు పండిట్, బూటీ సహచరులు అక్కడ ఉన్నారు. నా పాత స్నేహితులు మాధవరావు దేశ్‌పాండే, బాలాసాహెబ్ భాటే, బాపూసాహెబ్ జోగ్, ఇంకా ఇతరులు కలిశారు. మేము మశీదుకి వెళ్ళి సాయిమహారాజుకి మా అభివాదాలు తెలిపాము. ఆయన అంత ఆనందంగా ఉండటం నేను అంతకుమునుపెన్నడూ చూడలేదు. ఎప్పటిలాగే ఆయన దక్షిణ అడిగితే మేమంతా సమర్పించాము. లోకమాన్యను చూస్తూ ఆయన, “మనుషులు చాలా చెడ్డవారు. నీ ఆలోచనలను గుప్తంగా ఉంచు" అన్నారు. నేను నమస్కరించాను. ఆయన నానుంచి కొన్ని రూపాయలను తీసుకున్నారు. కేల్కరు, పారేగోంకార్ కూడా సమర్పించారు. మాధవరావు దేశ్‌పాండే మేము యవలా వెళ్ళటానికి మా కోసం అనుమతిని అడిగాడు. “ఈ ఎండలో ఎందుకు వెళదామనుకుంటున్నారు? దోవలో చావటానికా? మధ్యాహ్నం చల్లబడ్డాక వెళ్ళండి. శ్యామా! వీళ్ళకి భోజనం పెట్టు” అన్నారు. అందుకని మేము ఆగి, మాధవరావు దేశ్‌పాండే గారింట్లో భోజనం చేసి కొద్దిసేపు విశ్రమించి, మళ్ళీ మశీదుకి వెళ్ళాము. సాయిమహారాజు నిద్రపోతున్నట్లుగా పడుకొనివున్నారు. భక్తులు లోకమాన్యకి చావడి దగ్గర తాంబూలం ఇచ్చారు. మళ్ళీ మేము మశీదుకి వచ్చాము. సాయిమహారాజు లేచి కూర్చుని, మాకు ఊదీ ఇచ్చి, మేము వెళ్ళటానికి అనుమతి ఇచ్చాక మోటారుబండిలో బయలుదేరాము.
తరువాయి భాగం రేపు ......

సంగమనేరు నుండి శిరిడీకి లోకమాన్య తిలక్ ఆగమనం

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.
Om Sai
ReplyDeleteSri Sai
Jaya Jaya Sai
🙏🙏🙏
ఓం శ్రీ సాయిరాం తాతయ్య 🙏🙏🙏
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDelete