ఈ భాగంలో అనుభవం:
- బాబా వర్క్‌లో నేను పొందిన అనుభూతి
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
శ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ కీ జై!
ఓం సాయిరాం! తమ పాదాల చెంత నాకింత స్థానమిచ్చి ఆదరిస్తున్న నా సాయినాథ్ మహారాజ్‌కి ప్రణామాలు. నేను చాలా ఇష్టంగా పంచుకుంటున్న మొదటి అనుభవం ఇది. ఈ జీవితం బాబా నాకు పెట్టిన భిక్ష. అందుకు కృతజ్ఞతగా "నా భవిష్యత్తు బాబానే" అనుకునే నాకు "సాయి మహారాజ్ సన్నిధి బ్లాగ్"లో 'సాయి భవిష్య'గా ఒక స్థానాన్నిచ్చి, "సమకాలీన భక్తులు విభాగం"లో "సాయి అనుగ్రహసుమాలు" శీర్షిక క్రింద వస్తున్న బాబా దర్శన భాగ్యాన్ని పొందిన ఆనాటి భక్తుల అనుభవాలను పబ్లిష్ చేసే సదవకాశాన్ని నాకిచ్చిన సాయిబాబాకు మరియు మా అన్నయ్యకు నా ధన్యవాదాలు. బ్లాగ్ ప్రారంభించిన మొదట్లో బాబాను దర్శించిన భక్తుల సమాచారం ప్రతి గురువారం పబ్లిష్ అవుతూ ఉండేది. 'అవి ప్రతిరోజూ పబ్లిష్ అయితే బాగుంటుంది కదా!' అనే నా ఆలోచనని ఒకరోజు అన్నయ్యతో పంచుకున్నాను. అలా రోజూ చేస్తుంటే బాబా ధ్యాసలో నేను కూడా ఉండొచ్చు అనేది నా ఆశ. నా మనసులోని ఆ ఆశకు అన్నయ్య తన పూర్తి సహకారాన్ని అందించారు. తను మాత్రమే కాకుండా తన చుట్టూ ఉండేవాళ్ళు కూడా సాయి ధ్యాసలో, సాయి ఊసులో ఉండేలా చేసే అన్నయ్య ప్రయత్నం మమ్మల్నందరినీ ఒక్కటిగా చేసి బాబా పనిలో, బాబా ధ్యాసలో నిమగ్నమయ్యేలా చేసింది. బ్లాగులో ఒక మిరాకిల్ పబ్లిష్ అవడం వెనుక కొంతమంది గురుబంధువుల, సాయిబంధువుల సహకారం ఉంది. వాళ్ళ సహాయ సహకారాలతోనే బాబా ప్రేమను ఎంతోమంది సాయిభక్తులకు పంచగలుగుతున్నాము. తెర వెనుక ఉన్న వీరందరికీ బాబా ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
"సాయి అనుగ్రహసుమాలు" మొదలుపెట్టి నేటికి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఇది కేవలం బాబా అనుగ్రహం వలననే సాధ్యమైంది. సాయి అనుగ్రహసుమాలు మొదలుపెట్టే ముందు, "నేను ఎన్ని రోజులు ఈ వర్క్ చేస్తానో! అసలు చేయగలనో, లేదో!" అని భయపడ్డాను. కానీ బాబా ఎంతో కృపతో చాలా బాగా చేయించుకున్నారు, ఒక సంవత్సరం పూర్తి చేయించి నాకు గొప్ప అనుభూతినిచ్చారు. ఈ ప్రయాణంలో బాబా నాకు ఎంతో ప్రేమను పంచారు. "దీక్షిత్ డైరీ", 'సాయిపథం' వారి ఇంటర్వ్యూలు, తర్ఖడ్, ప్రధాన్, సాఠే తదితర భక్తుల అనుభవాలు పబ్లిష్ చేస్తూ బాబా ప్రేమ ప్రవాహంలో ఓలలాడాను. ముఖ్యంగా "రఘువీర భాస్కర పురంధరే" అనుభవాలు చేస్తున్నప్పుడు ఎంత ఆనందాన్ని, ప్రేమను పొందానో మాటల్లో చెప్పలేను. బాబా, పురంధరేల ప్రేమబంధానికి ఎన్నిసార్లు కన్నీళ్లపర్యంతమయ్యానో చెప్పలేను. పురంధరే పల్లకి కోసం చేసిన గది నిర్మాణానికి సంబంధించిన అనుభవాన్ని చేస్తున్నపుడు 'ఆ గది ఎలా ఉండి ఉంటుందో?' అనే ఒక చిన్న ఆలోచన నా మనసులో మెదిలింది. ఎల్లవేళలా మనల్ని కనిపెట్టుకుని ఉండే బాబా ఆ చిన్న ఆలోచనను కూడా విడిచిపెట్టలేదు. ఒకరోజు నాకొక కల వచ్చింది. ఆ కలలో బాబా నన్ను శిరిడీలో తిప్పుతూ, తాము పునరుద్ధరింపజేసిన గణపతి, మారుతి ఆలయాలను, సాఠేచే నిర్మింపజేసిన ముఖద్వారాన్ని చూపించి, చివరిగా మసీదుకు తీసుకుని వెళ్లి, "చూడాలనుకున్నావు కదా! ఇదిగో, ఇదే పల్లకి కోసం పురంధరే నిర్మించిన గది" అని ఆ గదిని చూపించారు. ఆ కలలో సభామండపాన్ని కూడా చూపించి బాబా నాకెంతో ఆనందాన్నిచ్చారు. నిజంగా బాబా ప్రేమ ఎంతో మధురమైనది. ఎంత అనుభూతి చెందినా తనివితీరనిది. "ఇంతటి ఆనందాన్ని, అనుభూతిని ఇచ్చిన ఈ వర్క్ నుండి నన్ను ఎప్పటికీ దూరం చేయకండి బాబా".
నా జీవితంలో ఈ సంవత్సరకాలం పాటు బాబా కోసం నేను ఈ బ్లాగ్ వర్క్‌ని చేశాను. కాదు, కాదు.. బాబా ధ్యాసలో ఉండటానికి నాకోసం నేను చేసుకున్నాను. నా వరకు నా జీవితంలో ఈ 365 రోజులు చాలా విశేషమైనవి. ఈ సంవత్సర కాలంలో బాబా నాలో తీసుకొచ్చిన మార్పు, నేను పొందిన సంతోషం మాటల్లో చెప్పలేనివి. ఈ సంవత్సరంలో నేను చాలా నేర్చుకున్నాను. అలా అనేదానికన్నా బాబా నాకు చాలా నేర్పించారు అనడం కరెక్ట్. ముఖ్యంగా నాలో ఉన్న అహాన్ని కొంతవరకు తొలగించారు, నాలో మనోస్థైర్యాన్ని పెంపొందించారు. "మన ఆలోచనలని తరచి చూసుకుంటే, అవి బాబాకి చెందినవై ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం బాబా ధ్యాసలో ఉన్నట్లు" అనే భావంతో గురువుగారు ఒక మాట చెప్తారు. ఇప్పుడు నేను తరచి చూసుకుంటే, నా ఆలోచనలు బాబాకు సంబంధించినవై ఉండడం నాకు చాలా సంతోషాన్నిస్తోంది.
ప్రతి ఒక్కరి జీవితంలో సుఖదుఃఖాలు, కష్టనష్టాలు సహజమే. అయితే ఈ సంవత్సరంలో నేను కాస్త ఎక్కువగానే బాధను అనుభవించాను. నేనిలా బాధపడుతూ ఉంటే ఏమీ పట్టనట్లు బాబా మౌనంగా ఉన్నారని అనుకున్నాను. కానీ ఆ బాధ నాకు చాలా మేలు చేసింది, నన్ను బాబాకు చాలా దగ్గర చేసింది. గురువుగారు చెప్పినట్టు బాబా దగ్గర కూర్చోవడం, బాబాని చూస్తూ ఉండడం, బాబా నామం చెప్పుకోవడం మొదలైన సాధనలు ఈ సమయంలోనే నేను నేర్చుకున్నాను. బాధను పంచుకోవడానికి వ్యక్తులను వెతుక్కోకుండా తమకే చెప్పుకునేలా చేసి వీలైనంత సమయం ఆయన ధ్యాసలోనే ఉండేలా చేశారు బాబా. ఒక్క మాటలో చెప్పాలంటే బాబా మానసికంగా నన్ను స్ట్రాంగ్ చేశారు. నా ఆలోచనా విధానంలో కూడా చాలా మార్పు వచ్చింది. ఈ మార్పు విషయంలో గురువుగారి దయ కూడా ఉంది. "బాబా అంటే ఏమిటి? బాబాను ఎలా అర్థం చేసుకోవాలి? అసలు బాబా మనకు ఏం ఇవ్వదలచుకున్నారు? మనం ఏం కోరుకుంటున్నాం? ఇంకా ఇంకా బాబాను ఎలా అర్థం చేసుకోవాలి? సహజంగా మనకు వచ్చే కొన్ని పరిస్థితుల్లో మనం ఎలా నిలదొక్కుకోవాలి?" వంటి అంశాలలో అవగాహన రావడానికి గురువుగారి యూట్యూబ్ సత్సంగాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి.
నేను నా జీవితంలో ఒక భార్యగా, తల్లిగా, కోడలిగా, కూతురిగా చాలా బాధ్యతలు నిర్వర్తించాను. కానీ ఏం చేశావో చెప్పమంటే ఏమీ చెప్పలేను. అలాంటిదిప్పుడు బాబా వర్క్ చేశానని సగౌరవంగా చెప్పుకునేలా బాబా అనుగ్రహించారు. ఇన్ని సంవత్సరాలలో ఏ ఒక్క యానివర్సరీని నేను ఇంతగా ఎంజాయ్ చేయలేదు. ప్రతి సంవత్సరం వచ్చే నా పిల్లల పుట్టినరోజులుగానీ, మా పెళ్లిరోజునిగానీ ఇంతగా ఆస్వాదించలేదు. ఇంత ఆనందాన్ని నేనెప్పుడూ అనుభూతి చెందలేదు. ఇదంతా బాబాకు నాపై ఉన్న ప్రేమ. ప్రేమకు మారుపేరు బాబా. ఆనందం అంటే బాబా. "బాబా! నాకు, నా కుటుంబానికి, మీ బిడ్డలందరికీ సదా అమృతమయమైన మీ ప్రేమను పంచుతూ, అందరూ ఆనందంగా ఉండేలా ఆశీర్వదించండి. లవ్ యు బాబా".

We thank you sooooo much for the work done on sai anugraha sumalu.i read it daily and i am reading the old posts also and so many new leelas are there which were not there in some books
ReplyDeleteAs you said these leelas keep our thoughts only on sai maharaj
Thanks a lit and sai bless you
ధన్యవాదములు సాయి.
DeleteNenu everyday morning eee anubhavalani chadvutanuu.Naku oka strength ichindhi ee blog loni anubhavalu. Okosari degrade avutanu kani na baba unnaru chusukuntaru anukuntanu. Meeru so lucky. Baba ashishulu miku eppudhu undali🙏🙏🙏
Deleteమీ అనుభవాలు గురించి చాలా బాగా రాశారు థాంక్యూ
ReplyDeleteసాయిరాం సాయి.ధన్యవాదములు.
Deleteమీరు ఎంతో అదృష్టం చేసుకున్నారు ..బాబా వర్క్ లో 1year పాటు లీనమై వున్నారు ..ఇది గొప్ప తపస్సు కదా అమ్మా ..అందుకే మీరు ఎంతో ఆనందం పొంద గలిగారు ..మీ వల్ల మేమందరం కూడా ఎంతో ఆనందం పొందుతున్నాం ప్రతి రోజు ..ధన్యవాదములు అమ్మా .🙏🙏🙏🙏
ReplyDeleteసాయిరాం సాయి.ఇది కేవలం బాబా అనుగ్రహం వలన మాత్రమే సాధ్యం అవుతుంది సాయి. ధన్యవాదములు సాయి.
DeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDelete0m sairam
ReplyDeleteఓం శ్రీ సాయిరాం 🙏🙏🙏🙏
ReplyDeleteom sairam
ReplyDeletesai always be with me
sairam naa koduku naku duram ayi
ReplyDelete1 year avtundi sai
please sairam do some miracle
ఓం సాయిరాం🌹🙏🌹
ReplyDelete