ఈ భాగంలో అనుభవాలు:
- బాబా రక్షణలో ఉన్నానని తెలియజేసిన అనుభవం
- అడగగానే ఆనందస్వరూపాన్ని ఆస్వాదించేలా అనుగ్రహించిన బాబా
బాబా రక్షణలో ఉన్నానని తెలియజేసిన అనుభవం
సాయిభక్తుడు దామోదర్ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
నా పేరు దాము. నేను చాలా అదృష్టవంతుడిని. బాబా నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక అద్భుతమైన లీలని చూపించారు. బాబా శక్తిని స్వయంగా నా కళ్లతో చూసే అవకాశం ఇచ్చారు బాబా. ఆ అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు, ఒకరోజు రాత్రి నేను, మా మాస్టర్, మా ఫ్రెండ్ ముగ్గురం మా డ్యాన్స్ ఇన్‌స్టిట్యూట్‌లో పడుకున్నాం. అక్కడ బాబా ఫోటో ఉంది. నేను బాబా ఫోటోకి ఎదురుగా బాబా వైపు తల పెట్టి పడుకున్నాను. నాకు ఆ వయసులో బాబా అంటే ఎవరో కూడా పూర్తిగా తెలియదు. మేము మంచి నిద్రలో ఉన్నప్పుడు కరెంట్ పోయింది. నాకెందుకో ఉన్నట్టుండి మెలకువ వచ్చింది. నేను లేచి చూస్తే నా పాదాలు బాబా వైపుకు తిరిగి ఉన్నాయి. నేను నిద్రలో ఏమైనా తిరిగి ఉంటానేమో అనుకుని మళ్లీ బాబా వైపు నా తల పెట్టి పడుకున్నాను. కానీ నేనింకా నిద్రపోలేదు. నేను మెలకువగా ఉండగానే నాకు తెలియకుండానే బాబా వైపుకి నా పాదాలు తిరగటం గమనించాను. అలా రెండుసార్లు జరిగింది. “నేను ఎందుకు అలా తిరుగుతున్నానా?” అని ఆలోచిస్తూ చుట్టూ చూస్తున్నాను. ఇంతలో ఒక మూలన దెయ్యం ఉండటం కనిపించింది. అది లంగా ఓణీ వేసుకుని చాలా అందంగా కనబడుతున్నది. దాని వెంట్రుకలు చాలా పొడవుగా ఉన్నాయి. అది నా వైపు కోపంగా చూస్తోంది. నేను చాలా భయపడ్డాను. ఇంతలో ఆ దెయ్యం పైన ఒక ఎర్రని వెలుగు ఉండటం గమనించాను. ఆ వెలుగును చూసి, “కరెంట్ లేదు కదా, ఈ వెలుగు ఎక్కణ్ణించి వస్తోందా?” అని అనుకుంటూ బాబా ఫోటో వైపు తిరిగి చూసి ఆశ్చర్యపోయాను. మనం బాబా నుదుటి పైన బొట్టు పెడతాము కదా, అక్కడ నుంచే ఆ ఎర్రని ప్రకాశవంతమైన వెలుగు వస్తోంది. ఆ దెయ్యం నా దగ్గరకు రాకుండా బాబా ఆ ఎర్రని వెలుగుతో దానిని బంధించారు. అంతటి ప్రకాశవంతమైన ఆ ఎర్రని వెలుగును నేను చూడలేకపోయాను. ఈ అనుభవం నేను జీవితంలో మర్చిపోలేనిది. నేను ఎంత అదృష్టవంతుడిని! ఆయన శక్తిని నా కళ్ళతో చూసే అవకాశం ఇచ్చారు బాబా. అప్పటికి బాబా గురించి నాకు ఏమీ తెలియకపోయినా బాబా మాత్రం ఎంతో ప్రేమతో నన్ను ఆ దెయ్యం బారినుండి కాపాడారు. “చాలా చాలా ధన్యవాదాలు బాబా!”

అడగగానే ఆనందస్వరూపాన్ని ఆస్వాదించేలా అనుగ్రహించిన బాబా
సాయిభక్తురాలు శ్రీమతి విజయవాణి తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు.
ఓం సాయిరాం! నా పేరు విజయవాణి. నేను, నా భర్త ఇద్దరం బాబా భక్తులం. ఇద్దరం కలిసి బాబాకి ఎంతో భక్తిగా పూజలు, హారతులు చేసుకునేవాళ్ళము. ప్రతి గురువారం ఉపవాసం కూడా ఉండేవాళ్లం. మావారు తన జీవితమంతా బాబా సేవలోనే గడిపి 1985లో కాలం చేశారు. దాంతో నేను ఒంటరిదాన్ని అయ్యాను. ఆ ఒంటరితనంలో నేను బాబాకి మరింత దగ్గరయ్యాను. ఎక్కడైనా బాబా సత్సంగాలుగానీ, భజనలుగానీ జరుగుతుంటే బాబా స్మరణలో ఎక్కువ సమయం గడపవచ్చని అక్కడికి వెళ్లి ఆ సత్సంగాలలో పాల్గొనేదాన్ని. సత్సంగాలకి హాజరైన సాయిబంధువులు తమ అనుభవాలను పంచుకునేందుకు వీలుగా కొంత సమయాన్ని వెచ్చించేవారు. ఆ సమయంలో చాలామంది సాయిబంధువులు బాబా తమకు ప్రసాదించిన అమూల్యమైన అనుభవాలను పంచుకుంటుండేవారు. వాటిని విని చాలా సంతోషించేదాన్ని. వారిలో కొంతమంది, ‘బాబా నా కలలోకి వచ్చారు, ఇలా ఆశీర్వదించారు, ఇలా మాట్లాడారు’ అని చెప్తుండేవారు. అయితే, ‘బాబా కలలోకి వచ్చారు’ అనే అనుభవం దగ్గర నా ఆలోచన, నా మనసు ఆగిపోతుండేది. బాబా దగ్గర కూర్చుని ఉన్నప్పటికీ ఆ ఆలోచన నన్ను వీడేది కాదు. అందువల్ల నేను బాబాతో, “బాబా! నాకెందుకు నీ దర్శన భాగ్యాన్ని ఇవ్వట్లేదు? నా భర్త ఉన్నంతకాలం ఇద్దరం కలిసి మీసేవ చేసుకున్నాము. ఆయన పోయిన తర్వాత కూడా నా ఒంటరితనంలో నువ్వు నాకు తోడుగా ఉన్నావన్న నమ్మకంతో నీకు మరింత దగ్గరయ్యాను కదా! మరి నాకు ఎందుకు మీరు కలలో దర్శనం ఇవ్వట్లేదు? నాలో లోపం ఏమిటి?” అని చెప్పుకుంటూ, బాబా దగ్గర చాలా బాధపడేదాన్ని, చాలా ఏడ్చేదాన్ని. బాబా నా మొర ఆలకించారు.
ఒకరోజు తెల్లవారుఝామున బాబా నాకు స్వప్నదర్శనమిచ్చారు. ఆ స్వప్నంలో, శిరిడీలో మసీదులో ఉన్న ఫోటోలాగా సాయిబాబా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఉన్నారు. నేను బాబాకి కాస్త దూరంగా ఉన్నాను. అప్పుడు బాబా, “రా! ఇలా వచ్చి నా దగ్గర కూర్చో! ఏదీ, నీ చెయ్యి నాకు ఇవ్వు” అని అన్నారు. అప్పుడు నేను బాబా దగ్గరికి వెళ్లి, “ఎందుకు బాబా నన్ను ఇలా పరీక్షిస్తున్నారు? ఏం మిగిలింది నా జీవితంలో?” అని ఏడుస్తూ అడిగాను. “పిచ్చిదానా! నేను లేనా నీ జీవితంలో? నీ బాధ్యత, నీ పిల్లల బాధ్యత కూడా నాదే!” అని నా భుజం తట్టారు. మళ్ళీ, “సరే, నీ చేతిని నాకు ఇవ్వు” అంటూ నా చేతిని తమ చేతిలోకి తీసుకుని ఊదీ ఇచ్చారు. “నా దర్శనం లభించింది కదా, ఏం బాధపడకు, సంతోషంగా ఉండు” అని నన్ను దీవించారు. అంతలో నాకు మెలకువ వచ్చింది. బాబా అనుగ్రహించిన స్వప్నదర్శనంతో నా మనసంతా ఆనందంతో నిండిపోయింది. అడగగానే అక్కున చేర్చుకొని ఆ ఆనందస్వరూపాన్ని ఆస్వాదించేలా చేసిన బాబాకి ఎలా ధన్యవాదాలు తెలియచేయగలను? నేను బాబా నీడలోనే సంతోషంగా ఉన్నాను. అందరికీ బాబా ఆశీస్సులు సదా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

Om Sai Ram 🙏🌹🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయిరాం తాతయ్య 🙏🙏🙏.
ReplyDeleteబాబా లీలలు అద్భుతం🙏🙏🙏
om sairam
ReplyDeletesai always be with me
sairam please bless me
ReplyDelete