ఈ భాగంలో అనుభవాలు:
- ఆ సాయినాథుడే కాపాడారు
- బాబా కృపతో వీసా సమస్య పరిష్కారం
ఆ సాయినాథుడే కాపాడారు
నేను సాయిభక్తుడిని. నా పేరు విష్ణువర్థన్. నేనిప్పుడు సుమారు పాతికేళ్ల క్రిందట జరిగిన ఒక అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను.
అది 1995వ సంవత్సరం. ఒకరోజు ఉదయం నేను, నా భార్య, మూడు సంవత్సరాల మా పెద్దబాబు కలిసి హైదరాబాద్ వెళ్లేందుకు విజయవాడ రైల్వేస్టేషనుకి బయలుదేరాము. మమ్మల్ని ట్రైన్ ఎక్కించటానికి మాతోపాటు మా అన్నయ్య కూడా వచ్చాడు. స్టేషన్ చేరుకున్నాక నేను నా భార్యని, బాబుని వెళ్లి ట్రైనులో కూర్చోమని చెప్పి, నేను టిక్కెట్లు తీసుకోవటానికి టికెట్ కౌంటర్ వద్ద నిలుచున్నాను. అన్నయ్య వాళ్ళను తీసుకొని వెళ్లి ట్రైనులో కూర్చోబెట్టాడు. వాళ్లంతా నాకోసం ఎదురు చూస్తున్నారు. నేను మా టిక్కెట్లు తీసుకొని వస్తూ, అన్నయ్యకు ప్లాట్‌ఫార్మ్ టికెట్ తీసుకోవడం మరిచిపోయానని గుర్తొచ్చి మళ్ళీ వెళ్లి లైన్లో నిలుచున్నాను. నేను నా పనిలో ఉన్నానేగానీ ట్రైన్ కదిలే సమయమైనదన్న సంగతి చూసుకోలేదు. ఇక ట్రైన్ కదలడానికి కొద్ది సెకన్లు ఉందనగా అన్నయ్య పరిగెత్తుకుంటూ వచ్చి, "ట్రైన్ కదిలే సమయమైంది, త్వరగా రా" అని పిలిచాడు. సరిగ్గా అప్పుడే టికెట్ నా చేతికొచ్చింది. వెంటనే 1వ ప్లాట్‌ఫార్మ్ నుండి 4వ ప్లాట్‌ఫార్మ్‌కు పరుగుతీశాను. అక్కడ సాయిబాబా భక్తురాలైన నా భార్య నాకోసం కంగారుపడుతూ బాబాను తలుచుకుంటూ ఉంది. నేను ఫ్లై ఓవర్ మీదనుండి దిగుతుండగా ట్రైను కదిలింది. సరిగ్గా నేను చివరిమెట్టు దిగే సమయానికి కదులుతున్న ట్రైన్ నుండి నా భార్య దిగబోతూ కనిపించింది. నేను కంగారుగా 'వద్దు, వద్దు' అని గట్టిగా కేకలు వేస్తూ, పరుగున వెళ్లి ఆ బోగీలోకి ఎక్కాను. అప్పటికే ట్రైన్ వేగం అందుకుంది. ట్రైన్ ఎక్కేటప్పుడు ఏమాత్రం తేడా జరిగినా జరిగే ప్రమాదాన్ని ఎవరైనా ఊహించవచ్చు. అంతేకాదు, అప్పుడు నా భార్య 4వ నెల గర్భవతి. తను గనక వేగంగా వెళ్తున్న ట్రైన్ నుండి దిగి ఉంటే, ఇప్పుడు మాకు రెండవ కొడుకు ఉండేవాడు కాదు. ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆ సాయినాథుడే కాపాడారు. తన భకులకు రక్షణనివ్వడానికి బాబా ఉన్నారనడానికి ఇంతకంటే ఏమి నిదర్శనం కావాలి? ఇలాంటి అనుభవాలు నాకు చాలా ఉన్నాయి. "బాబా! మీకు చాలా చాలా కృతజ్ఞతలు. మీరు చేసిన మేలు ఎప్పటికీ మరువలేనిది".
విష్ణువర్ధన్ రెడ్డి

బాబా కృపతో వీసా సమస్య పరిష్కారం
యు.ఎస్. నుండి ఒక సాయిభక్తుడు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
నేను చిన్నప్పటినుంచి బాబా భక్తుడిని. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ నెమ్మదిగా నేను ఆయనను అర్థం చేసుకున్నాను. నాకు వచ్చే మంచి, చెడు అనుభవాలన్నీ ఆయన చిత్తంగా భావిస్తాను. వాటిని ఓర్పుతో స్వీకరిస్తాను. ఇక నా అనుభవంలోకి వస్తే...
ఎక్స్టెండెడ్ వీసా కలిగి ఉన్న నేను 5 సంవత్సరాల తరువాత గత సంవత్సరం భారతదేశ పర్యటనకు వెళ్ళాను. మేము ఆ పర్యటనను ప్లాన్ చేసినప్పుడు, ఐదేళ్ళకాలంలో భారతదేశంలో వచ్చిన మార్పులను చూడబోతున్నానని చాలా ఆనందపడ్డాను. ఆ పర్యటనలో భాగంగా స్నేహితులను, బంధువులను కలవడం, దేశమంతటా విహారయాత్ర చేయడంతోపాటు పుణ్యక్షేత్ర (అందులో శిరిడీ ఒకటి) దర్శనాలు కూడా ప్లాన్ చేసుకున్నాము. ఆ పర్యటనకు అవసరమైన వీసా స్టాంపింగ్ కోసం నేను గురువారమని ఆగస్టు 8ని ఎంపిక చేసుకున్నాను. 15 ఏళ్ళకు పైగా యు.ఎస్.లో ఉండటం, ప్రతిష్టాత్మకమైన ఒక పెద్ద కన్సల్టింగ్ సంస్థలో పనిచేస్తున్నందున వీసా స్టాంపింగ్ సుళువుగానే అయిపోతుందని అనుకున్నాను. అయితే, ట్రంప్ పాలనలో కఠినమైన నిబంధనలతోపాటు వీసా అధికారి కొంత అపార్థం చేసుకున్నందున నా వీసా అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్ ఆఫీసుకు పంపబడింది. వాళ్ళు నన్ను అదనపు పత్రాలు ఏవీ అడగకుండా నేరుగా నాకు 221జి స్లిప్(అప్లికేషన్ కు అవసరమైన సమాచారం లేదు లేదా అప్లికేషన్‌ను అడ్మినిస్ట్రేటివ్ హోల్డ్‌లో పెట్టడం) ఇచ్చారు. దాంతో అన్నేళ్ళుగా నేను యు.ఎస్.లో ఏర్పరుచుకున్న జీవితం, కుటుంబం, వృత్తి ప్రశ్నార్థకంగా మారాయి. ఒకవేళ వీసా తిరస్కరించబడితే ఏం చేయాలో మాకు అస్సలు అర్థం కాలేదు. నాలో నేను చాలా టెన్షన్ పడ్డాను. కానీ, కుటుంబం ముందు బయటపడలేదు. ఆ స్థితిలో నేను, "బాబా! వచ్చే గురువారం నాటికల్లా ఎటువంటి ఇబ్బంది లేకుండా నాకు వీసా వస్తే 108 ప్రదక్షిణలు చేస్తానని, నా అనుభవాన్ని వెబ్‌సైట్‌లో పంచుకుంటాన"ని బాబాకు మాట ఇచ్చాను. బాబా కృప చూపించారు. రెండురోజుల తరువాత నా వీసా ఆమోదం పొందింది. పెద్ద కష్టం రాకుండా సహాయం చేసినందుకు నేనెప్పుడూ బాబాకు కృతజ్ఞుడనై ఉంటాను. ఆయన కృపతో నేను 108 ప్రదక్షిణలు పూర్తి చేయగలిగాను. "బాబా! ఆలస్యంగా నా అనుభవాన్ని పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి. ఈసారి నేను శిరిడీ వచ్చినప్పుడు మంచి దర్శనం ఇవ్వండి. అలాగే శిరిడీలో పారాయణ, మరో 108 ప్రదక్షిణలు చేయగలిగేలా అనుగ్రహించండి".
జై సాయిరామ్!

ఓం శ్రీ సాయిరాం తాతయ్య 🙏🙏🙏
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteBaba, l want money iMMeDiATely.
ReplyDelete