ఈరోజు భాగంలో అనుభవాలు:
- పోలీస్ కేసులో ఇరుక్కోకుండా కాపాడిన సాయిబాబా.
- బాబా నిలిపిన నా వైవాహిక జీవితం
పోలీస్ కేసులో ఇరుక్కోకుండా కాపాడిన సాయిబాబా.
వాట్సాప్ ద్వారా వేంకటేష్ గారు పంపిన అనుభవం:
ముందుగా సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు వెంకటేష్. నేను చిత్తూరులోని ఒక ప్రైవేట్ ఆర్థిక సంస్థలో మేనేజరుగా పనిచేస్తున్నాను. 2019 మే నెలలో నా కర్మకొద్దీ నేను ఏ తప్పూ చేయకపోయినా ఒక పెద్ద చిక్కులో పడ్డాను. మా సంస్థ బంగారు నగలు కుదువ పెట్టుకుని ఋణాలు మంజూరు చేస్తుంది. సంస్థలో పనిచేసే అప్రైజర్(నగల నాణ్యత పరిశీలన చేసే ఉద్యోగి) మమ్మల్ని బాగా నమ్మించి మా కళ్ళుగప్పి గిల్టునగలు ఉంచి, ఏకంగా దాదాపు కోటి రూపాయల వరకు డబ్బులు కొట్టేసాడు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఇందుకు బాధ్యులైన వారిని పోలీసులకు అప్పచెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో నా తప్పు లేకపోయినా అప్పు మంజూరు చేసేందుకు సంతకం చేసిన పాపానికి నేను కూడా బాధ్యుడనయ్యాను. కోటి రూపాయలంటే మాటలా! నాలాంటి సగటు ఉద్యోగికి అంత డబ్బు ఎక్కడనుంచి వస్తుంది? ఆ కారణంచేత నేను చాలా ఆందోళనకు గురయ్యాను. సాయిబాబా ఎదుట నిలబడి పుట్టెడు దుఃఖంతో 'రక్షించమ'ని వేడుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాను. బాబా నా మొర ఆలకించారు. అధికారుల మనసు మారింది. సంస్థకు చెడ్డపేరు రాకుండా అన్ని లోన్లూ కట్టి గిల్టునగలు పూర్తిగా విడిపించుకోవడానికి కొంత గడువు ఇచ్చారు. దాదాపు నలభైరోజులు నిద్రలేదు. తీవ్ర భయాందోళనలతో సతమతమయ్యాను. ఎట్టకేలకు సాయిబాబా ఆశీస్సులతో తేది. 17-07-2019 నాటికి అన్ని లోన్లూ క్లియర్ చేసేశాం. సాయి కృప వల్ల ఎవ్వరూ పోలీస్ కేసుల్లో ఇరుక్కోలేదు. కానీ నేను ఇరవై లక్షల రూపాయల అప్పుల్లో పడ్డాను. నా అప్పుల భారం కూడా సాయిబాబా కరుణతో త్వరలోనే తీరిపోతుందని గట్టి నమ్మకం నాకుంది. బాబా తన బిడ్డలను ఎన్నటికీ చేయి వదలలేరు. ఎలాంటి కష్టం వచ్చినా ఆయన తప్పకుండా ఆదుకుంటారు. ఇది ముమ్మాటికీ సత్యం. "థాంక్యూ వెరీ మచ్ సాయిబాబా!"

జై జై సాయి రాం..
బాబా నిలిపిన నా వైవాహిక జీవితం
ఢిల్లీ నుండి సాయిభక్తురాలు స్వప్న తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
నా జీవితంలో బాబా ప్రసాదించిన చాలా ముఖ్యమైన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఆ అనుభవం ద్వారా కష్టసమయంలో తన భక్తులకు తోడుగా ఉంటానని బాబా నాకు తెలియజేశారు. ఆ తరువాత కూడా బాబా నాకెన్నో విషయాలు నేర్పించారు. ఇక నా అనుభవానికి వస్తే...
నాకు ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయ్యాక నా ఆరోగ్యం అంతగా బాగుండేది కాదు. ఒకటి తరువాత ఒకటి ఏదో ఒక ఆరోగ్య సమస్యతో నేను బాధపడుతూ ఉండేదాన్ని. అవి నాకు, నా భర్తకు మధ్య విభేదాలకు దారితీశాయి. అలా కొన్నినెలలు గడిచాక నా భర్త నాతో వింతగా ప్రవర్తిస్తూ, నాకు దూరంగా ఉండేవారు. ఒకరోజు అర్థరాత్రి నేను తనని నిలదీశాను. అప్పుడు తనకి వేరే స్త్రీతో సంబంధం ఉందన్న సమాధానం విని నేను నిర్ఘాంతపోయాను. అటువంటి మోసాన్ని నేనెప్పుడూ తననుంచి ఊహించలేదు. అలాంటిది హఠాత్తుగా భయంకరమైన నిజం తెలిసేసరికి నేను ఒక్కసారిగా కుప్పకూలిపోయాను. తరువాత నాకు, నా భర్తకు మధ్య పెద్ద పెద్ద గొడవలు జరిగి చివరికి విడాకుల వరకు దారితీశాయి. మళ్ళీ మేము ఒకటవుతామని ఎవరూ ఊహించలేదు.
ఆ కష్టసమయంలో నేను బాబానే నమ్ముకున్నాను. ఆ సమయమంతా నేను అనేక రకాలుగా పూజలు చేస్తూ, లెక్కలేనన్నిసార్లు నామజపం చేస్తూ ఉండేదాన్ని. ఆ కఠిన పరిస్థితులను ఎదుర్కొని నిలబడ్డానంటే అది నా బాబా ఇచ్చిన ధైర్యమే అని నాకు బాగా తెలుసు. ఆయన ఎన్నో లీలలను చూపించారు. వివిధ రూపాలలో ఆయన ఉనికిని నాకు తెలియజేస్తూ నాలో విశ్వాసాన్ని పెంచుతూ, పోరాడే శక్తినిచ్చారు. అనేకరకాల బలహీనతల నుండి బయటకు తీసి నన్ను దృఢంగా తయారుచేసారు. చివరికి నా భర్తను మార్చి, మళ్ళీ నాకు అప్పగించారు. ఇప్పుడు నా భర్త మునుపటికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నారు. ముందు మా గొడవలు చూసిన వాళ్ళు ఇప్పుడు మేము అన్యోన్యంగా ఉండటం చూసి ఆశ్చర్యపోతున్నారు. అంతా బాబా నాపై చూపిన కరుణ. నేను నా అనుభవాన్ని చాలా సింపుల్ గా చెప్పాను. బాబా నడిపిన ప్రతి ఒక్క సంఘటనను వివరిస్తే ఒక పుస్తకమైపోతుంది.
ఇటువంటి సమస్యలలో ఉన్న వారు నన్ను నమ్మండి. బాబా మనకోసం ఉన్నారు. తన భక్తులు కష్టకాలంలో ఉంటే ఆయన వాళ్ళకి తోడుగా ఉంటారు. ఇది నూటికి నూరుశాతం నిజం. మనం బాధపడుతుంటే ఆయన చూడలేరు. అది నేను ఎన్నోసార్లు అనుభవపూర్వకంగా గ్రహించాను. అయితే మనకు ఉండవలసింది ఆయనపట్ల చెదరని విశ్వాసం. ఆయన స్మరణ చేస్తూ ఉంటే పెనుతుఫానులను సైతం ఆయన దాటిస్తారు. నన్ను నమ్మండి, నేను ఆయన కృపవలన మాత్రమే ఆ కష్టకాలం నుండి బయటపడ్డాను. ఆయన మాత్రమే మన సమస్యలు పరిష్కరించగలరు. ఆయనను మన గురువుగా, దైవంగా కలిగివుండటం మన అదృష్టం. ఎప్పుడూ ఆయనను విడిచిపెట్టకండి.

అంటాము నాకెందుకు ఇంతటి కష్టాన్ని ఇచ్చారు అని. మనము ఆ కర్మల నుండి తప్పించు కొనే ప్రయత్నం కాకుండా వాటిని అనుభవించి తట్టుకొనే శక్తిని ఇవ్వమని అడగాలి ఆ తాతయ్యని. అందుకే తాతయ్య ఎప్పుడు అనేది *శ్రద్ద & శాబురి* వుండాలి అని. కేవలం ఆయన మన దగ్గరి నుండి ఇవి మాత్రమే అడుగుతారు.సాయి తాతయ్య మనము బాధపడుతుంటే చూడలేరు.ఆయననే మనము చేసిన కర్ములని తీసేసి తను అనుభవిస్తుంటారు. కాబట్టి ఎవరయినా సరే మనకు వీలయినంత వరకు ఒకరికి మంచే చెయ్యాలని అనుకోవాలి తప్ప ఒకరికి చెడు చెయ్యకూడదు. అప్పుడే మన మంచి కర్మల వలన సాయి తాతయ్య చాలా సంతోషిస్తాడు. ఇందులో నేను ఏ విషయం అయిన తప్పుగా చెప్పి వుంటే క్షమించండి. మంచిగా చెప్పి వుంటే స్వీకరించండి. ఓం శ్రీ సాయినాథయ నమః.
ReplyDeletevery nice చక్కగా చెప్పారు సాయి
Delete🕉 🕉 sai Ram
ReplyDeleteYes, Baba unnaru Babani nammukunnavariki thodu needaga Andaga untaaru
ReplyDelete