సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 72వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 72వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 131

14-11-1912 వ తారీఖున కర్ సెట్ జీ  షాపూర్ జీ నుండి వచ్చిన ఉత్తరంలోని సారాంశం

నిజం చెప్పాలంటే బాబా ఊదీ అందుకునే సమయానికి నేను చాలా ఆందోళనలో ఉన్నాను. కానీ బాబా ఊదీని నుదిటిపై పెట్టుకున్న తరువాత నా ఆందోళనంతా తొలిగిపోయి, బాబా ఆశీర్వాదం వలన నాకు ఎనలేని ఉత్సాహం మరియు శక్తి కలిగాయి.

14-10-1912 వ తారీఖున శ్రీ ఆర్.ఎస్.నవల్కర్ గారి వద్ద నుండి వచ్చిన ఉత్తరంలోని సారాంశం

ఆదివారం నేను తీసుకున్న బాబా ఊదీని నా సోదరునికి ఇచ్చాను. ఆ ఊదీని తానే స్వయంగా తన నుదిటిపై పెట్టుకుని, మిగతా ఊదీని తన వద్దే ఉంచుకున్నాడు. తాను ఇప్పుడు బాగానే ఉన్నాడు. కానీ తాను ఆఫీసుకు వెళ్ళడానికి విముఖత చూపిస్తున్నాడు. దయచేసి ఈ విషయాన్ని బాబాకు నివేదించగలరు. 

1915-5-1915 వ తారీఖున శ్రీ అనంతరాయ్ భూపతిరాయ్ వైష్ణవ్ (జూనాఘడ్ ) గారి వద్ద నుండి వచ్చిన ఉత్తరంలోని సారాంశం

మీ సద్గురువు ప్రసాదించిన ఊదీ అత్యంత క్లిష్టసమయాలలో ని అద్భుతాలు చేసిందని మీకు తెలియచేసుకుంటున్నాను. కొంచెం ఊదీని క్లిష్టసమయాలలో ఉపయోగించడానికి ఇస్తున్నాను. నా కుమారుని బావమరిది తీవ్ర అనారోగ్యానికి  గురయ్యాడు. వారి ఇంట్లో తానొక్కడే మగపిల్లవాడు కావడం వలన అందరూ ఎంతో  ఆందోళనకు గురయ్యారు. కానీ బాబా ఊదీ సేవనంతో తాను పూర్తిగా స్వస్థుడయ్యాడు. సద్గురువుకు  నా కృతజ్ఞతాభివందనాలు తెలియచేసుకుంటున్నాను.

మాఘశుద్ధ 8 వ తారీఖు 1915 సం లో శ్రీ కాతాజీ వైద్య నుండి
వచ్చిన ఉత్తరంలోని సారాంశం

బాబా ఆజ్ఞాపిస్తే బాబా దర్శనానికి కార్తీకమాసం చివరలో వస్తాను. కానీ మార్గశిరమాసం నుండి ఇక్కడ ప్లేగు వ్యాధి వ్యాపించడం ప్రారంభమైంది. ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉంది. ఆ సమయంలో నా చిన్న కుమారునికి మరియు నా సోదరుని మనవనికి పునర్జన్మ లభించింది. ఆ సంకటసమయంలో బాబా ప్రకటమై మాకు ధైర్యాన్ని ప్రసాదించారని తెలియజేయడానికి అత్యానందం కలుగుతోంది. బాబా యొక్క మహిమలను వర్ణించేందుకు అజ్ఞాని మరియు అసమర్థుడనైన నాకు చేతకావడం లేదు. బాబా దర్శనానికి వీలయినంత తొందరగా వస్తాను. ఇదంతా బాబా యొక్క అనుగ్రహ ఫలితం. ఇంతకంటే ఎక్కువ ఏమి వ్రాయగలను.

16-3-1922 వ తారీఖున శ్రీ ఆర్.సి.బాజ్ పాయి గారు వ్రాసిన ఉత్తరంలోని సారాంశం

నేను రాగానే మా నాన్నగారి వద్ద నుండి ఎంతో ప్రేమపూర్వకమైన ఉత్తరం వచ్చింది. నేను రాత్రింబవళ్లు బాబాను ఆయన మనసు నావైపు మళ్ళించమని ప్రార్థించాను. ఇప్పుడు ఆ ఉత్తరాన్ని బట్టి నేను ముంబాయికి తిరిగి వచ్చాక సంతోషకరమైన వార్తలు వింటానని అనిపిస్తోంది. బాబా మహాసమాధిని దర్శించుకోవడం వలన అలసిపోయిన నా జవసత్వాలు తిరిగి నూతనోత్సాహాన్ని సంతరించుకున్నాయి.

తరువాయి భాగం రేపు.

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo