ఈరోజు భాగంలో అనుభవాలు:
- సచ్చరిత్ర పారాయణతో ఇష్టమైన ప్రాజెక్టులో అవకాశంతో పాటు ప్రమోషన్ కూడా...
- డ్రైవింగ్ నేర్చుకోవడంలో బాబా సహాయం
- తలనొప్పినుండి ఉపశమనం కలిగించారు బాబా
సచ్చరిత్ర పారాయణతో ఇష్టమైన ప్రాజెక్టులో అవకాశంతో పాటు ప్రమోషన్ కూడా...
ఒక అజ్ఞాత సాయిభక్తుడు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
సాయిభక్తులందరికీ సాయిరామ్! ఇటీవల బాబా నాకు ఇష్టమైన టెక్నాలజీలో పనిచేసే అవకాశంతోపాటు ప్రమోషన్ కూడా ఇచ్చిన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.
నేనొక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను. నేను నాకు ఇష్టంలేని టెక్నాలజీకి సంబంధించిన ప్రాజెక్టులో పని చేయాల్సి వచ్చింది. ఆ విషయమై నేను సాయిని ప్రార్థించి సచ్చరిత్ర పారాయణ మొదలుపెట్టాను. తరువాత నా మేనేజరుని కలిసి నాకు ఇష్టమైన టెక్నాలజీలో పనిచేసే అవకాశం ఇవ్వమని కోరాను. అతను, "నేను ప్రయత్నిస్తాను, కానీ మాటివ్వలేను" అని అన్నారు. నేను రెండు సప్తాహాలు పారాయణ పూర్తి చేశాక నా మేనేజరు తనని కలవమని ఫోన్ చేసి చెప్పారు. నేను అతన్ని కలిస్తే, ఒక ప్రాజెక్ట్ విషయంగా నా రెజ్యూమ్ ఇవ్వమని అడిగారు. నేను నా రెజ్యూమ్ అతనికిచ్చి మరో సప్తాహపారాయణ మొదలుపెట్టాను. బాబా కృపతో నాకు ఇష్టమైన టెక్నాలజీ మీద పనిచేసే ప్రాజెక్టులోకి నేను ఎంపికయ్యాను. తరువాత నేను ఊహించని విధంగా నాకు ప్రమోషన్ వచ్చేలా బాబా సహాయం చేశారు. "ధన్యవాదాలు బాబా! దయచేసి ఇలాగే మీ ఆశీర్వాదాలను ప్రతి ఒక్కరికీ అందజేయండి. కోటి కోటి ప్రణామాలు బాబా!"
డ్రైవింగ్ నేర్చుకోవడంలో బాబా సహాయం
యు.కే నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
సాయిభక్తులందరికీ సాయిరామ్! నేను సాయిబాబా భక్తురాలిని. నేను ఆయనను అపారంగా నమ్ముతాను. నా ప్రతిరోజు బాబా స్మరణతోనే మొదలై బాబా స్మరణతోనే ముగుస్తుంది. ఆయనే నా జీవితం. చాలా కష్టసమయాలలో భక్తుల అనుభవాలు మా విశ్వాసాన్ని నిజంగా పెంపొందిస్తున్నాయి. డ్రైవింగ్ విషయంలో బాబా నాకు ఏ విధంగా సహాయం చేశారో నేనిప్పుడు మీతో పంచుకుంటాను.
నాకు డ్రైవింగ్ అంటే చాలా భయం. ప్రత్యేకించి కారు డ్రైవింగ్ అంటే మరీ భయం. ఆ కారణంచేత నేను డ్రైవింగ్ నేర్చుకోవడాన్ని వాయిదావేస్తూ ఉండేదాన్ని. కానీ నా కూతురు విద్యాభ్యాసం మొదలుపెట్టాక డ్రైవింగ్ నేర్చుకోవడం నాకు తప్పనిసరైంది.
బాబాను ప్రార్థించి డ్రైవింగ్ నేర్చుకోవడానికి వెళ్ళాను. బాబా కృపతో నా భయాన్ని తీసివేయటానికి సహాయపడే మంచి శిక్షకురాలు దొరికింది. ఆమె చాలా ప్రశాంతంగా అన్నీ నేర్పేది. నేను డ్రైవింగ్ నేర్చుకోవడానికి వెళ్లేముందే బాబాను ప్రార్థించి, ఊదీ పెట్టుకునేదాన్ని. అలా చేయడం నాకెంతో ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చేది. కొద్దినెలల తరువాత నేను డ్రైవింగ్ పరీక్షకు బుక్ చేసుకున్నాను. నేను ఉద్దేశ్యపూర్వకంగా బాబారోజు అని గురువారాలలోనే థియరీ, ప్రాక్టికల్ పరీక్షలు వచ్చేలా ఎంచుకున్నాను. అప్పటినుండి పరీక్షలో ఉత్తీర్ణురాలినయ్యేలా అనుగ్రహించమని రోజూ బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. ఆలోగా చాలాసార్లు ఒక నిర్ణీత సమయంలో బాబా రూపం కనిపించినట్లైతే నేను నా పరీక్ష ఉత్తీర్ణురాలినవుతానని అనుకుంటుండేదాన్ని. బాబా నాకటువంటి సూచనలు చాలా ఇచ్చారు. దాంతో, 'బాబా నాతో ఉన్నారు, నేను పరీక్షలో ఉత్తీర్ణురాలినవుతాన'న్న విశ్వాసం నాలో దృఢమైంది. చివరికి పరీక్షరోజు వచ్చింది. ఆరోజు నేను, "బాబా! నేను నా ఈ మొదటి ప్రయత్నంలో ఉత్తీర్ణురాలినైతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని ప్రార్థించాను. బాబా కృపతో మొదటి ప్రయత్నంలోనే నేను పరీక్షలో ఉత్తీర్ణురాలినయ్యాను. "బాబా! నాతో ఉంటూ ప్రతి చిన్న(కొన్నిసార్లు సిల్లీ) కోరికలను నెరవేరుస్తున్న మీకు చాలా చాలా ధన్యవాదాలు. దయచేసి ఎల్లప్పుడూ ప్రపంచంలోని అన్ని జీవులపై మీ ఆశీర్వాదాలు కురిపించండి".
సోర్స్: http://www.shirdisaibabaexperiences.org/2019/06/shirdi-sai-baba-miracles-part-2382.html
తలనొప్పినుండి ఉపశమనం కలిగించారు బాబా
సాయిభక్తుల అనుభవాలు చదవడంతో నా రోజు మొదలై, మళ్ళీ వాటిని చదవడంతో ముగుస్తుంది. ఒకసారి క్రింది దవడ సెన్సిటివిటీతో చాలా బాధపడ్డాను. డెంటల్ క్లినిక్‌కి వెళ్లి దంతాలు శుభ్రం చేయించుకున్నాను. కానీ సెన్సిటివిటీ మాత్రం తగ్గలేదు. ఆ నొప్పి తీవ్రత వలన తలనొప్పి కూడా వచ్చింది. నొప్పి తట్టుకోలేక రోజూ నొప్పి నివారణ మందులు తీసుకున్నాను. 4 రోజుల్లో మొత్తం 7 టాబ్లెట్స్ తీసుకున్నాను. అయినా నొప్పి తగ్గలేదు. చివరికి ఒకరోజు సాయంత్రం దవడకు బాబా ఊదీ రాసాను. అంతే! కొద్దిక్షణాల్లో తలనొప్పినుండి ఉపశమనం కలిగించారు బాబా. సెన్సిటివిటీ ఇంకా ఉంది, కానీ ప్రధానమైన తలనొప్పిని బాబా నయం చేశారు. "బాబా! దయచేసి నాకు తోడుగా ఉండండి. అన్నీ సక్రమంగా జరిగేలా చూడండి".
సోర్స్: http://www.shirdisaibabaexperiences.org/2019/06/shirdi-sai-baba-miracles-part-2386.html
తలనొప్పినుండి ఉపశమనం కలిగించారు బాబా
యు.ఎస్.ఏ నుండి సాయిభక్తురాలు లక్ష్మి తన అనుభవాన్నిలా చెప్తున్నారు:
సోర్స్: http://www.shirdisaibabaexperiences.org/2019/06/shirdi-sai-baba-miracles-part-2386.html
No comments:
Post a Comment