సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 100వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. సాయి తండ్రి కరుణ.
  2. బాబా లీలలు వర్ణించడానికి పదాలు సరిపోవు

సాయి తండ్రి కరుణ.

యు.ఎస్. నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు:

"బాబా! మీ అనుమతి లేనిదే మేము ఒక్క అడుగైనా వేయలేము. మాకు గురువు, దైవం, సర్వం మీరే. ప్రతీక్షణం మమ్మల్ని జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు. దయచేసి పరిస్థితులు ఏవైనా మీపట్ల స్థిరమైన భక్తిభావంతో ఉండేలా మమ్ము అనుగ్రహించండి".

సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

మొదటి అనుభవం:

నేనొకసారి నవ గురువార వ్రతం చేశాను. అందులో భాగంగా చివరి గురువారం ముందురోజైన బుధవారంనాడు  సచ్చరిత్ర పారాయణ ముగించిన తరువాత, రాత్రి భోజనం చేసి ప్రశాంతంగా బాబా పాటలు వింటూ కూర్చున్నాను. కాసేపటికి అనుకోకుండా కిటికీ వైపు చూశాను. అక్కడ నా సాయితండ్రి మరియు శివుని ప్రతిరూపాలు నా కంటికి కనిపించాయి. ఆహ్లాదకరమైన చిరునవ్వుతో బాబా ముఖం పెద్ద ఆకృతిలో కనిపించింది. అలా చాలా సమయం దర్శనమిస్తూనే ఉంది. అది నా ఊహా, లేకపోతే నిజమా అన్నది నాకు తెలీదు. కాని నేను ఆయన ముఖాన్ని చాలా స్పష్టంగా చూశాను. నేనెంత అనుభూతి పొందానో మాటల్లో చెప్పలేను. అయితే దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, భయంతో నేను కిటికీ దగ్గరకు వెళ్ళలేకపోయాను. కానీ 9వ వారం పూర్తయ్యేలోపు బాబా దర్శనభాగ్యాన్ని పొందాను. అదే నాకు సంతోషం. "థాంక్యూ సో మచ్ సాయి తండ్రీ!"

మరో అనుభవం: నా పిల్లలు ఇండియానుండి ఈమధ్య అమెరికాకు వచ్చారు. వాళ్ళని ఇక్కడి స్కూలులో చేర్చడం ఒక పెద్ద పని. ఆ పని మొత్తం పూర్తి కావడానికి ఒక నెలరోజులు పట్టింది. ఒక గురువారంనాడు వైద్యపరీక్షలు చేయించాం. ఆ రిపోర్టులు స్కూలుకి పంపడానికి 2 నుండి 3 రోజులు పడుతుందని వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పినట్లు రెండు, మూడు రోజులు పట్టినట్లైతే నా సెంటిమెంట్ ప్రకారం పిల్లల్ని సోమవారం లేదా గురువారం నుండి స్కూలుకి పంపలేను. అందువలన నేను, "బాబా! సోమవారం లేదా గురువారం పిల్లల్ని స్కూలుకి పంపగలిగేలా చూడండి. అలా జరిగిన వెంటనే నేను నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని ప్రార్థించాను. బాబా నా కోరిక నెరవేర్చారు. స్కూలు వాళ్ళు శుక్రవారంనాడు ఫైనలైజ్ చేసారు. దాంతో నేను అనుకున్నట్లు సోమవారంనాడు పిల్లల్ని స్కూలుకి పంపగలిగాను. "థాంక్యూ సో మచ్ బాబా!"

ఆమధ్యలో మరో అనుభవం కూడా జరిగింది. సాధారణంగా ప్రతినెల మొదటిరోజున నా కంపెనీ భీమా యాక్టివేట్ అవుతుంది. ఆ దృష్ట్యా నేను 3వ తేదీన డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకున్నాను. తీరాచూస్తే 3వ తేదీ నాటికి కూడా భీమా యాక్టివేట్ కాలేదు. నేను భీమా కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి విషయం అడిగాను. వాళ్ళు, "మాకింకా మీ భీమా విషయంలో ఎటువంటి అప్డేట్లు మీ కంపెనీనుండి రాలేద"ని చెప్పారు. అప్పటికే 11 గంటలు అయింది. 2 గంటలకి డాక్టర్ అపాయింట్‌మెంట్ ఉంది. అప్పటికే నేను ఎన్నోసార్లు డాక్టర్ అపాయింట్‌మెంట్ రద్దు చేసుకుని ఉన్నందున నేను చాలా టెన్షన్ పడి, "సాయి తండ్రీ! ఎలాగైనా భీమా అప్డేట్ అయ్యేలా చూడండి" అని ప్రార్థించాను. బాబా కృపవలన హెచ్.ఆర్. వాళ్ళు మధ్యాహ్నం 12 గంటలకల్లా అప్డేట్ చేసారు. దాంతో నేను సకాలంలో డాక్టరుని సంప్రదించగలిగాను. "అన్ని పరిస్థితులందు మాకు తోడుగా ఉంటున్న మీకు చాలా చాలా ధన్యవాదాలు సాయి తండ్రీ!"

శ్రీ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

బాబా లీలలు వర్ణించడానికి పదాలు సరిపోవు

ఆస్ట్రేలియానుండి సాయిభక్తురాలు హిమాని తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్! నేను బాబాకు సాధారణ భక్తురాలిని. బాబాతో మరింత సాన్నిహిత్యం అనుభూతి చెందడానికి బ్లాగు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంత చక్కగా బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా కృతజ్ఞతలు. బాబా నా జీవితం. ఆయనే నాకన్నీ. నేను పూర్తిగా ఆయనకు శరణాగతి చెందాను. కానీ కొన్ని కఠిన పరిస్థితులలో మనస్సు చలిస్తుంటుంది. అయినా సరే బాబా నన్ను ఒంటరిగా విడిచిపెట్టరు. 4 సంవత్సరాలుగా నా జీవితంలో బాబా ఇచ్చిన అనుభవాలు చాలా ఉన్నాయి. వాటిలో ఈమధ్యకాలంలో జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

2019 ఫిబ్రవరిలో నా సోదరి వివాహం నిశ్చయమైంది. బాబా కృపవలన నిజంగా తనకి చాలా మంచి గుణాలున్న వరుడు కుదిరాడు. కానీ పెళ్ళికి సరిపడా డబ్బులు అందుబాటులో లేనందున ఏమి చేయాలో అర్థంకాక నా తల్లిదండ్రులు చాలా కలతచెందారు. ఆ విషయం గురించి అమ్మ నాకు చెప్పినప్పుడు నేను కూడా ముందు కలత చెందినా, తరువాత అమ్మతో, "ఆందోళనపడవద్దు. నా బాబా చాలా గొప్పవారు. ఆయన ఏదో ఒకటి చేస్తారు" అని చెప్పాను. ఖచ్చితంగా ఏదో ఒకటి బాబా చేస్తారని నా దృఢనమ్మకం.

అప్పట్లో మాకున్న ఒక చిన్న స్థిరాస్తి(ఇల్లు లేదా షాపు, భక్తురాలు వివరంగా తెలుపలేదు) అద్దెకు ఇవ్వబడి ఉంది. సరిగ్గా పెళ్లికి నెలరోజులు ఉందనగా ఒకతను మా ఇంటికి వచ్చి, ఆ ఆస్తిని తాను కొనుక్కోవాలని ఆశపడుతున్నట్లు మా నాన్నగారితో చెప్పారు. ఆ సమయంలో ఆస్తి అమ్మకపు ధరలు చాలా చాలా తక్కువగా ఉన్నప్పటికీ సాయి కృపతో మంచి ధర రావడంతో నాన్న అమ్మతో మాట్లాడి అమ్మడానికి నిశ్చయించుకున్నారు. అతను మాకు ముందుగా కొంత అడ్వాన్సు ఇచ్చి, మిగిలిన మొత్తం పదిరోజుల్లో ఇస్తానని చెప్పారు. ఆస్తి విషయాలలో పెద్ద మొత్తాన్ని తక్కువ సమయంలో అందజేయడం చాలా అరుదు. అయినప్పటికీ చాలా తక్కువ టైములో అంతా సర్దుబాటు అయిపోయింది. అదంతా నా బాబా చేసిన ఏర్పాట్లే. వేరే ఎవరివల్లా సాధ్యం కాదది. ఆ విషయం నా తల్లిదండ్రులు నాకు చెప్పినప్పుడు నా ఆనందాన్ని నేను నియంత్రించుకోలేక పోయాను. పట్టరాని ఆనందంతో నా బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఆయన లీలలు వర్ణించడానికి పదాలు సరిపోవు. బాబా మనకోసం ఎన్నో చేస్తున్నారు. ఆయనయందు విశ్వాసముంచండి.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై! 

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo