ఈరోజు భాగంలో అనుభవాలు:
- మానసిక ఒత్తిడి నుండి బయటకు తెచ్చి నా జీవితాన్ని స్థిరపరిచారు బాబా
- బాబా రక్షణ
మానసిక ఒత్తిడి నుండి బయటకు తెచ్చి నా జీవితాన్ని స్థిరపరిచారు బాబా
ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
బాబా నాకు తోడుగా ఉంటూ నా జీవితాన్ని చక్కదిద్దిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. 2012 సంవత్సరంలో ఆశు అని ఒక మంచిమనిషి నా జీవితంలోకి వచ్చాడు. అతనితో నేను ప్రేమలో పడ్డాను. మాలో ఒకరిపట్ల ఒకరికి చాలా గౌరవం ఉండేది. స్నేహితులందరూ మేము చక్కని జోడి అని అనుకుంటూ ఉండేవారు. మా ఆలోచనలు, అభిప్రాయాలు బాగా కలవడంతో ఎప్పటికీ కలిసే ఉండాలని మేము అనుకున్నాం. తరువాత నేను పూణేలో ఉద్యోగం చేస్తుండగా తను ఉద్యోగరీత్యా అహ్మద్‌నగర్ మారాడు. అప్పటికి నాకు బాబా గురించి గానీ, ఆయన లీలల గురించి గానీ ఏమీ తెలియదు. అయినప్పటికీ మేము తరచూ శిరిడీ వెళ్తుండేవాళ్ళం.
2015లో పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాము. నన్ను చూడటానికి తన పేరెంట్స్ పూణే వచ్చారు. వాళ్లు నన్ను, నా స్నేహితులందరిని కలిశారు. పూణేనుండి తిరిగి వెళ్లే సమయంలో వాళ్లు నా విషయంలో చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు. కానీ మా దురదృష్టంకొద్దీ వాళ్ల కుటుంబంలోని మిగతా సభ్యులు మా పెళ్ళికి ఒప్పుకోలేదు. కారణం, వాళ్లు యు.పి బ్రాహ్మణులు, నేను బెంగాలీ. మేమెంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకుండాపోయింది. చివరికి 2016, మే నెలలో తనకి వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చయమైందని తను చెప్పాడు. దాంతో నేను మానసికంగా చాలా కృంగిపోయాను. దిగులుతో కొన్నిరోజుల పాటు సరిగా ఆహారం తీసుకోలేకపోయాను. గంటల తరబడి మంచానికి అతుక్కుని ఉండేదాన్ని. ఆఫీసు 2:30 కి అయితే 2 గంటలకు లేచి ఆఫీసుకు వెళ్లేదాన్ని. ఆఫీసులో సమయం ఎలా గడిపేదాన్నో ఆ భగవంతుడికే తెలుసు. అలా బ్రతకడం నాకు చాలా భయంగా అనిపించింది. అటువంటి సమయంలో మొదటినుండి నాలో ఉన్న దైవభక్తి నాకు తోడ్పడింది. నా కష్టాలు తీరుస్తాడని ఆ భగవంతుడినే నమ్ముకున్నాను. గంటల తరబడి పూజామందిరంలో కూర్చుని దేవుడితో నా బాధని చెప్పుకునేదాన్ని.
ఒకరోజు పూజామందిరం శుభ్రపరుస్తుండగా నా దృష్టి అక్కడున్న ఒక పుస్తకంపై పడింది. ఆ పుస్తకం 'సాయివ్రతకథ'. దాన్ని దాదాపు నాలుగేళ్లక్రితం నా స్నేహితురాలు నాకు ఇచ్చింది. ఏం జరిగిందో భగవంతుడికే తెలియాలి, వెంటనే నేను ఆ పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టాను. అప్పటికప్పుడే 'సాయి గురువార వ్రతం' చేయాలని నిశ్చయించుకున్నాను. నన్ను నమ్మండి ఫ్రెండ్స్, ఆ క్షణంనుండి బాబా నాతోనే ఉన్నారని అనుభూతి చెందాను. ఆ సమయంలోనే శిరిడీ వెళ్లి, బాబా దర్శనం చేసుకోవాలని ఎంతో అనిపించింది. కానీ ఏదో ఒక కారణంతో నా ప్రయాణం వాయిదాపడుతూ ఉండేది. అలా ఉండగా ఒకరోజు రాత్రి కలలో బాబా దర్శనం ఇచ్చారు. ఆయన నా బెడ్‌రూమ్ ద్వారంవద్ద నిల్చుని ఉన్నారు. తేజోవంతమైన ముఖవర్చస్సుతో నన్ను చూస్తూ, "చలో, చలో, జల్దీ శిరిడీ చలో!(పద పద, తొందరగా శిరిడీ పద)" అని అన్నారు. నేను ఆ కలను ఎంతో ఆశీర్వాదపూర్వకంగా భావించాను. వెంటనే ఆలస్యం చేయకుండా తర్వాత వచ్చిన శనివారంనాడు శిరిడీ వెళ్ళాను. అక్కడికి చేరుకున్నాక ఆశు గురించిన ఆలోచనలు నా మనసును చుట్టుముట్టాయి. దాంతో నేను చాలా బాధకు లోనయ్యాను. ఆ సమయంలో నేను సమాధిమందిరంలో ఉన్నాను. హఠాత్తుగా ఒక స్తంభంపై ఉన్న సాయిబాబా స్టిక్కర్ మీద నా దృష్టి పడింది. దానిమీద, "నువ్వెందుకు చింతిస్తున్నావు? నేనున్నాను కదా! అంతా బాగా అయిపోతుంది" అని ఉంది. చూశారా! సాయిబాబా మనకు ఎంత దగ్గరగా ఉంటూ, మన ప్రార్థనలను వింటున్నారో! నేను అదే స్టిక్కర్ కోసం మందిరంలో చాలా వెతికాను. ఈరోజువరకు మళ్లీ నాకు ఆ స్టిక్కర్ ఎక్కడా కనబడలేదు. స్వయంగా బాబాయే బాధపడుతున్న ఈ బిడ్డని ఆ మెసేజ్ ద్వారా ఓదార్చారని నా నమ్మకం.
అదేరోజు మరో సంఘటన కూడా జరిగింది. ఒక మధ్యవయస్కుడైన వ్యక్తి మందిరప్రాంగణంలో ఉన్న శివ మందిరంలో శుభ్రపరుస్తూ నావైపు చూసాడు. నేను ఒక చిన్న చిరునవ్వు నవ్వాను. అతను నా వద్దకు వచ్చి, నా చేతిలో ఒక కొబ్బరికాయ పెట్టారు. అది ఇప్పటికీ నా పూజామందిరంలో ఉంది. సచ్చరిత్రలో వ్రాసిన విధంగా బాబాయే అతని రూపంలో నాకా కొబ్బరికాయ ఇచ్చారని నా నమ్మకం. అదంతా ఇప్పుడు గుర్తుచేసుకుంటే నాకేది మంచిదో, ఏ సమయంలో నాకివ్వాలో అన్నీ బాబాకు తెలుసని అర్థమవుతుంది.
తర్వాత 2016, ఆగస్టులో బాబా ఆశీస్సులతో నా బాధాకరమైన పరిస్థితులను నా అధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం మొదలుపెట్టాను. ఆ ప్రయత్నంలో భాగంగా ఒక స్నేహితుల సమూహాన్ని కలిసాను. వాళ్లంతా ప్రతి వారాంతంలో ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్తూ ఉంటారు. నేను వాళ్ళతో చేరి వాళ్లతోపాటు కొత్త ప్రదేశాలను చూడటం, కొత్త స్నేహితులను కలవడం చేస్తుండేదాన్ని. అది నన్ను మానసికఒత్తిడి నుండి బయటపడేయడంలో ఎంతగానో ఉపయోగపడింది. వాళ్లంతా ఎంతో సంతోషంగా ఉండడం నాకెంతో నచ్చింది. అలా రోజులు గడుస్తున్న సమయంలో నేను ఎప్పడూ, "సాయీ! నేను, ఆశు విడిపోయాం. అది మీ సంకల్పం అయివుండొచ్చు, ఎవరు ఎక్కడున్నా మేమిద్దరం సంతోషంగా ఉండేలా చూడండి" అని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. కొన్నినెలల తర్వాత వాళ్ళ గ్రూపులో రాకేష్ అనే వ్యక్తితో పరిచయమైంది. లేదు! అతను నాకు సరైన వ్యక్తి అని బాబాయే పరిచయం చేశారు. తను ఒకరోజు హఠాత్తుగా ఉన్నట్టుండి నామీద ఒక గేయం చెప్పాడు. తర్వాత రెండురోజుల్లో, "నన్ను పెళ్లి చేసుకుంటావా?" అని అడిగాడు. ఆ క్షణంలో నాకేమీ అర్థం కాలేదు కానీ, నాకు తెలియకుండానే "ఎస్" అని చెప్పాను. ఈసారి కూడా తను బెంగాలీ కాదు. కానీ బాబా అనుగ్రహం వలన మా రెండు కుటుంబాలు మా పెళ్లికి అంగీకరించాయి. 2018, మే 4న సాయి ఆశీస్సులతో మా పెళ్లి జరిగింది. ఇదంతా సాయిబాబా ప్రణాళిక. నా జీవితంలో ఆశు వంటి ఉన్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తి ప్రవేశంతో నేను చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను. మనకు నచ్చిన వాళ్ళని మనకు తగిన వ్యక్తి అనుకుంటాం. కానీ, సాయిబాబాకి తెలుసు మనకెవరు సరైన వ్యక్తి అన్నది. ఆయన సరైన సమయంలో మనకు అన్నీ ఇస్తారు. నేను మానసికంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆయన తన సంరక్షణలోకి నన్ను తీసుకున్నారు. నన్ను సరైన మార్గంలో నడిపించి నాకు తగిన వ్యక్తితో నా జీవితాన్ని స్థిరపరిచారు. గత రెండేళ్లలో బాబా నాకెన్నోసార్లు స్వప్నదర్శనం ఇచ్చారు. ఆ స్వప్నానుభవాలను నేను ఎంతగానో ఇష్టపడతాను. మనము బాబాను నమ్మాలి, అప్పుడే నిజమైన ఆయన లీలలను చవిచూడగలము.
ఓం శ్రీ సాయినాథాయ నమః!

బాబా రక్షణ
అమెరికానుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
నేను బాబా భక్తురాలిని. నాకన్నీ ఆయనే. బాబా లీలలు ఇప్పటికీ విరివిగా జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన ఒక చిన్న అనుభవాన్ని నేనిపుడు మీతో పంచుకుంటాను.
ఒకసారి మేము ఒకచోటనుండి మా అమ్మాయిని తీసుకుని రావడానికి బయలుదేరాము. వెళ్తున్నప్పుడు మార్గమంతా నిర్మానుష్యంగా, భయానకంగా ఉంది, పైగా చీకటిగా ఉందని నేను అనుకున్నాను. తను ఒక వెహికిల్ పై, తన వెనుక మేము కారు డ్రైవ్ చేసుకుంటూ తిరిగి వస్తున్నాము. అకస్మాత్తుగా మా అమ్మాయి వెనుక ఒక పోలీసు వెహికిల్, మా కారు వెనుక మరో పోలీస్ వెహికిల్ అనుసరించాయి. మాకు తెలిసిన, లైట్లతో కూడుకున్న ప్రాంతం వరకు ఆ రెండు పోలీసు వెహికిల్స్ మమ్మల్ని అనుసరించాయి. అటువంటిది మన ప్రియమైన సాయి రక్షణ. "బాబా! నా కుటుంబాన్ని, మీ భక్తులను ఎల్లప్పుడూ కాపాడండి".
అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
🕉 sai Ram
ReplyDelete