సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 51వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 51వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

           అనుభవం - 96

నాసిక్ లో నారాయణ్ మోతీరామ్ జానీ అనే పేరు గల బ్రాహ్మణుడు ఉండేవాడు. బాబాదేహధారియై ఉన్న రోజులలో రెండుసార్లు వచ్చి బాబా దర్శనం చేసుకుని వెళ్ళాడు. బాబా మహాసమాధి చెందాక సమాధి దర్శనం చేసుకునే భాగ్యం తనకు మూడు సంవత్సరాల వరకు కలుగలేదు. అంటే ఈ రోజు వరకు తాను సమాధిని చూడలేదు. బాబా సమాధి చెందిన తరువాత సుమారు ఒక సంవత్సరానికి తాను బాగా జబ్బు పడ్డాడు. కొన్నిరోజులు ఆ జబ్బుతో బాధపడిన తరువాత బాబా తనకు స్వప్నంలో క్రింది విధంగా దర్శనం ఇచ్చారు. ఒక గుహ నుండి బయటకు వచ్చిన బాబా నారాయణరావు వద్దకు వచ్చి “ఆందోళన చెందవద్దు. రేపటి నుండి కోలుకుంటావు. ఎనిమిది రోజులలో నీకు పూర్తిగా నయం అవుతుంది” అని అన్నారు. సరిగ్గా అలాగే జరుగసాగింది. ఆ రోజు నుండి తన ఆరోగ్యం బాగుపడసాగింది. ఎనిమిది రోజులలో తాను పూర్తిగా కోలుకున్నాడు. ఆ తరువాత రెండు సంవత్సరాలకు తనకు దర్శన భాగ్యం లభించింది. సమాధి వద్దకు రాగానే పైన చెప్పిన స్వప్నం తనకు గుర్తుకు వచ్చి ఉద్విగ్నతకు లోనయ్యాడు. తరువాత వాడాలోకి వచ్చి పై లీలను నాకు వివరించాడు. చెపుతున్నపుడు కూడా తన కన్నుల నుండి అశ్రుధార రాసాగింది. నారాయణరావు పూర్వం శ్రీ రామచంద్ర వామన్ మోడక్ వద్ద ఉద్యోగం చేసేవాడు. శ్రీ మోడక్ బాబా యొక్క భక్తుడు కావడం వలన శ్రీ నారాయణ్రావుకు కూడా బాబా పట్ల భక్తి కుదిరింది.

ఒకసారి నారాయణ్ రావు స్నేహితునికి తేలు కుట్టింది. అప్పుడు బాబా యొక్క ఊదీ తనవద్ద లేదు. అప్పుడు తాను బాబా ఫోటో ముందు ఉన్న అగర్ బత్తి పొడిని తీసుకొని తెలు కుట్టిన ప్రదేశంపై పూశారు. వెంటనే నొప్పి మాయం అయింది.  నారాయణ్ రావు తన తల్లి గారిని తీసుకొని బాబా మహాసమాధి చెందడానికి  కొన్ని రోజుల పూర్వం దర్శనానికి వచ్చాడు. అప్పుడు బాబా శ్రీ నారాయణ్ రావు తల్లిగారితో “ఇక మనం ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. మనం వ్యాపారం  చేద్దాం” అని అన్నారు. అప్పటికి శ్రీ నారాయణరావు ఉద్యోగంలోనే ఉన్నారు. కానీ తొందరలోనే తన ఉద్యోగాన్ని వదిలి నాసిక్లో ఆనందాశ్రమం అనే పేరుగల వసతి గృహాన్ని తెరిచారు. ఆ వసతిగృహం విజయవంతంగా నడుస్తోంది.

అనుభవం - 97

ఒకరోజు రాత్రి బాబా దాదాకేల్కర్ తో  “ఈ వఝే  కేవలం ఒక అధ్యాయం మాత్రమే చదువుతున్నాడు. నేనేమో తనను రాత్రంతా పారాయణ చేయమని చెపుతున్నాను” అని అన్నారు. ఆ మాటలు వఝే  చెవిలో పడగానే తాను బాబాతో “రాత్రంతా పారాయణ చేయమంటారా?” అని అడిగారు. అప్పుడు బాబా “అవును” అని సమాధానం ఇచ్చారు. ఆ రోజు నుండి తాను రాత్రంతా అంటే రాత్రి పది గంటలనుండి తెల్లవారుఝామున నాలుగు లేదా ఐదు గంటల వరకు తాను పారాయణ చేయసాగాడు. అంటే రాత్రంతా జాగరణ జరుగసాగింది. దాని వలన తనకు కొంచెం కూడా ఇబ్బంది కలుగలేదు. అది బాబా కృప!

తరువాయి భాగం రేపు

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo