సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 93వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. బాబా మహత్యం వలన మందుల అవసరం లేకుండా నాకు నయమైపోయింది.
  2. బాబా నా ప్రార్థనలు వింటున్నారన్న నిదర్శన

బాబా మహత్యం వలన మందుల అవసరం లేకుండా నాకు నయమైపోయింది.

శ్రీమతి నాగరాజుగారు తమ అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను నెల్లూరు నివాసిని. చాలా చిన్నవయస్సు నుండే నేను బాబా గుడికి వెళ్లేదాన్ని. ఆయనంటే నాకు చాలా చాలా ఇష్టం. ఒకసారి నాకొక ఆరోగ్య సమస్య వచ్చింది. అసలే డయాబెటిక్ పేషెంటునైన నాకు కుడికాలి పాదంలో ఆనె(ముళ్ళు లాంటివి ఏవైనా గుచ్చుకోవడం వలన అక్కడ కండలా గట్టిగా అయిపోతుంది.) వచ్చింది. అది ఎంతగా తీవ్రమయ్యిందంటే నేను పూర్తిగా నడవలేని పరిస్థితికి వచ్చేసాను. డాక్టరుకి చూపిస్తే, "వెంటనే ఆపరేషన్ చేసి ఆనె తీసేయాల"ని చెప్పారు. వేరే డాక్టరుకి చూపిస్తే ఆయన కూడా అదేవిధంగా చెప్పారు. ఆపరేషన్ అంటే నాకు చాలా భయంవేసి బాబాతో నా బాధను చెప్పుకున్నాను. రోజూ నేను, "బాబా! ఆపరేషన్ అవసరం లేకుండా మందులతో నయమైపోయేలా చూడండి" అని వేడుకుంటూ ఉండేదాన్ని. నిజంగా బాబా కరుణామయులు. ఆయన నా ప్రార్థన విన్నారు. కొన్నిరోజులకి బాబా మహత్యం వల్ల ఏ మందులూ తీసుకోకుండానే పూర్తిగా నాకు నయమైపోయింది. కనీసం నొప్పి కూడా లేదు. బాబా ఎప్పుడూ నాతో ఉంటారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలి? "చాలా చాలా ధన్యవాదాలు బాబా!"

బాబా నా ప్రార్థనలు వింటున్నారన్న నిదర్శన

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

గత నెలరోజుల నుండి బాబాను ఒక విషయం గురించి అడుగుతూ ఉన్నాను(నా కోరిక తీరిన తరువాత ఆ అనుభవాన్ని కూడా మీతో పంచుకుంటాను). నేను ఆ విషయం గురించి పదే పదే బాబాను అడుగుతూ ఉన్నాను(బాబా! ఆ విషయాన్ని పదే పదే అడిగి మిమ్మల్ని విసిగిస్తున్నందుకు నన్ను క్షమించండి). నా కోరిక తీర్చమని నేను దివ్యపూజ మరియు సప్తాహపారాయణ చేశాను. ‘ప్రశ్న-సమాధానం’ బ్లాగులో బాబాను అడిగినప్పుడల్లా, “నీ గతజన్మ కర్మఫలాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. నీ కోరిక ఈ సంవత్సరం నెరవేరదు. వచ్చే సంవత్సరం నెరవేరుతుంది. నేను ఆ పనిమీదే ఉన్నాను. నా మీద విశ్వాసముంచు!” - ఇలాంటి సూచనలు బాబా ద్వారా నాకు వచ్చేవి. బాబా నా కోరిక తీరుస్తారనే సంపూర్ణ విశ్వాసముంది.

నేను ఏ కాస్త ఖాళీగా ఉన్నా, ‘సాయి! సాయి!’ అని బాబాను స్మరిస్తూ ఉంటాను. ఒక గురువారం, ‘ప్రశ్న-సమాధానం’ బ్లాగు నుండి “బాబాకు గులాబీ పూలదండను సమర్పించు!” అనే సందేశం వచ్చింది. అందువలన, ఎవరైనా నా తరఫున శిరిడీలో బాబాకు గులాబీ పూలదండ సమర్పిస్తే బాగుంటుందని నేను శుక్రవారం మధ్యాహ్నం ఆలోచించుకుంటూ ఉన్నాను. అలా ఆలోచిస్తూ నేను నిద్రలోకి జారుకున్నాను. నిద్రలేచాక సాయంత్రం కాఫీ త్రాగుతూ ఫేస్‌బుక్ చూస్తున్నప్పుడు, నా స్నేహితురాలు ఒకామె శిరిడీలో ఉన్నట్లు తెలిసింది. వెంటనే నేను, ఆమె ఇంకా శిరిడీలో ఉన్నట్లయితే నా తరఫున బాబాకు ఒక గులాబీ పూలదండను సమర్పించమని, డబ్బులు తరువాత ఇస్తానని ఆమెకు సందేశం పంపించాను. ఆమె తను అప్పటికి రెండుసార్లు బాబా దర్శనం చేసుకున్నానని, ప్రస్తుతం నాశిక్‌కు వెళుతున్నానని చెప్పింది. శనివారం నాశిక్ చుట్టుపక్కల ప్రాంతాలు దర్శించుకుని, ఆదివారం ఉదయానికి శిరిడీ చేరుకుంటామని చెప్పింది. అంతేకాకుండా, ఆదివారం ఉదయాన్నే తన తిరుగు ప్రయాణం ఉండటంతో, మళ్ళీ ఇంకొకసారి బాబా దర్శనానికి వెళ్ళే అవకాశం ఉండదని, ఒకవేళ వెళ్లే అవకాశం దొరికినట్లైతే తప్పకుండా గులాబీలు సమర్పిస్తానని చెప్పింది. తను అలా చెప్పడంతో నేను కొంచెం నిరాశచెందాను.

దానిగురించే కొంచెం బాధతో శనివారం ఉదయం వంటింట్లో పనిచేసుకుంటూ, “బాబా! నేను శ్రద్ధ, సబూరీలతో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. నా ప్రార్థనలు వింటున్నారా? నా ప్రార్థనలు మిమ్మల్ని చేరుతున్నాయా? నేను మీకు పూలదండ సమర్పించాలని అనుకున్నాను, కానీ నా కోరిక నెరవేరలేదు. నా నుంచి మీరు పూలదండను స్వీకరించదలిస్తే దానికి కావలసిన ఏర్పాట్లు కూడా మీరే చెయ్యాలి కదా!” అని నాలో నేను బాబాతో మాట్లాడుకుంటున్నాను. అలా అనుకున్న కొద్దిక్షణాలకే అనుకోకుండా మా స్నేహితురాలు ఫోన్ చేసి తను శిరిడీలోనే ఉన్నానని చెప్పింది. నిన్న నాతో ఫోనులో మాట్లాడిన 20 నిమిషాల తరువాత తన కుమారుడికి అకస్మాత్తుగా వాంతులు మొదలయ్యాయని, ఆరోగ్యం బాగాలేకపోవటంతో వెంటనే తన కుమారుడిని తీసుకొని శిరిడీ తిరిగి రావాల్సి వచ్చిందని చెప్పింది. అంతేకాకుండా, నా తరఫున ఒక గులాబీ పూలదండను బాబాకు సమర్పించేందుకు తను మూడవసారి బాబా దర్శనానికి వెళుతున్నానని చెప్పింది. ఆమె మాటలు విన్న నేను ఎంత సంతోషించానో నేను మాటల్లో వర్ణించలేను. ఇది పరమాద్భుతం. "బాబా! నా కోరిక మన్నించి నా పూలదండను స్వీకరించినందుకు మీకు కృతజ్ఞతలు. మీరు నా ప్రార్థనలు వింటున్నారని నాకు ఈ విధంగా నిదర్శనమిచ్చారు. బాబా! ఎల్లప్పుడూ ఇలాగే నన్ను విడిచిపెట్టకుండా నాతోనే ఉండమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. నా కోరికను మన్నించి నా పిల్లలు, నా భర్త మరియు నా తల్లితండ్రులను జాగ్రత్తగా కాపాడమని నా కోరిక. నా కోరికను మన్నిస్తారని ఆశిస్తున్నాను".

ఓం సాయి నమో నమః౹
శ్రీ సాయి నమో నమః౹
జయ జయ సాయి నమో నమః౹
సద్గురు సాయి నమో నమః౹

source:http://www.shirdisaibabaexperiences.org/2019/05/shirdi-sai-baba-miracles-part-2358.html 

3 comments:

  1. Om Sai ram Telugu lo yela. Rayali.please inform me

    ReplyDelete
    Replies
    1. https://youtu.be/Tq3BY-vaF3c


      పైన ఇవ్వబడిన యూట్యూబ్ లింక్ లో చూపిన విధంగా మీ మొబైల్ లో settings చేసుకుంటే మీరు నెమ్మదిగా మాట్లాడితే అదే టైప్ అవుతుంది. అలా కానీ పక్షంలో తెలుగులో టైప్ చేయొచ్చు లేదంటే, ఇంగ్లీష్ అక్షరాకతో telugu padalu type chestu ఇలా కూడా చేయొచ్చు. లేకపోతే తెలుగులో పేపర్ మీద వ్రాసి దాన్ని ఫోటో తీసి పంపించవచ్చు. ఇక చివరిగా ఆడియో రికార్డ్ చేసి పంపింపొచ్చొచ్చు. అవన్నీ బ్లాగ్ లో ఇవ్వబడిన mail id ki లేదా వాట్సప్ నెంబర్ కి పంపండి ప్లీజ్. మీకు ఏదైనా డౌటు ఉంటే నా WhatsApp number ki మెసేజ్ పెట్టండి ప్లీజ్.

      Delete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo