కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 69వ భాగం.
శ్రీ కాకాసాహెబ్ ఆజ్ఞ ప్రకారం సోమవారం తారీఖు 8-2-15 సాయంకాలం బండి సమయానికి నేనే స్వయంగా స్టేషనుకు వెళ్ళాను. బండిరాగానే ఉత్తరంలో వ్రాసినట్లు శ్రీ బాలక్ రామ్ జి మరియు శ్రీ ముక్తారామ్ జి ఇరువురు శ్రీ బాబా యొక్క ఫోటో పెట్టుకుని కూర్చొనియుండటం చూసాను. రైలు పెట్టె తలుపు తెరిచి లోపలికి వెళ్ళి ఎంతో భక్తితో బాబా ఫోటోలోని చరణాలపై శిరస్సునుంచి నమస్కారం చేసుకున్నాను. తరువాత వారిరువురికి నమస్కరించి, బాబా ఫోటోను తీసుకొని ప్లాట్ ఫామ్ పై దిగాను. నా చేతిలోని పెద్ద ఫోటో చూసి నా చుట్టూ ప్రయాణికులు గుమిగూడటం మొదలుపెట్టడంతో నా చుట్టూ చాల రద్దీ అయింది. బాబా యొక్క ఫోటో మరియు వారిరువురితో కలసి టాంగాలో కూర్చొని మా ఇంటికి వచ్చాము. ఏ రోజయితే బాబా ఫోటో మా ఇంటికి వచ్చిందో, ఆ రోజు శ్రీరామనవమి పండుగ. ఒక పెద్ద పీటపై ఒక షాల్ ను పరచి ఆ పీటపై బాబా ఫోటోను కూర్చోబెట్టాము, సాయంకాలం ఆరతి ఇచ్చాము. ఆరతి సమయానికి చాలామంది వచ్చారు. సోదరులిరువురు బాలక్ రామ్ జి మరియు ముక్తారామ్ జి ఆజ్ఞననుసరించి బాబా ప్రసాదించిన చరణపాదుకలకు రుద్రాభిషేకం చేసి, బాబా ఫోటోకు పూజ చేసి ఆ ఫోటోను సింహాసనంపై కూర్చోబెట్టాము. తరువాత ఆరతి మరియు మంత్రపుష్పం ఎంతో ఉచ్ఛస్వరంతో జరిగాయి. తరువాత భిక్షువులకు దక్షిణ, పేడా ప్రసాదం ఇవ్వడం జరిగింది. బాబా పాదుకలకు అభిషేకం జరుగుతున్నప్పుడు, శ్రీ ముక్తారామ్ గారు ముందరి భాగంలోనున్న గ్యాలరీపైకి ఎక్కి బాబా చిహ్నంగా జెండాను పెట్టారు. ఆ చిహ్నంపెట్టే ప్రదేశం ఎంతో ప్రమాదకరమైనది. క్రిందపడితే ప్రాణం పోతుంది. అందరూ చూస్తూనే ఉన్నారు. తాను ఐదు నిమిషాలలో జెండాను ఇంటిపై ఎగరవేసి ఎలా క్రిందకు వచ్చారో ఎవరికీ అర్థం కాలేదు. గురువారం ఏ సమయంలోనైతే ఇక్కడ ముక్తారాం గారు జెండా ఎగురవేసారో, సరిగ్గా అదే సమయంలో శిరిడీలో బాబా చేయినొప్పితో బాధ పడుతుండడంతో, శ్రీ ఫకీర్ బాబాతో చేయిని పట్టించుకున్నారు. మరుసటి రోజు శివరాత్రి కావడంతో ఆదివారం బాబా ప్రసాదం చేయడం జరిగింది. తరువాత జరిగిన సంఘటనంతా శ్రీ సాయిలీల 11వ అంకంలో ఒకటవ సంవత్సరంలో తారీఖు 6-3-15న ఆ ఉత్తరం యొక్క నకలు ఇవ్వడం జరిగింది. అందువలన ఇక్కడ మరలా అదంతా ఇవ్వడం లేదు.
“బాబా ఈ ఉత్తరం వ్రాయడానికి గల కారణం ఏమిటంటే, మీ ఆశీర్వాదం వలన ఇద్దరు అబ్బాయిలు ఉత్తీర్ణులయ్యారు. ఈ విషయంలో మీ ఉపకారాన్ని ఎన్నటికీ మరువలేను. ఠాణేలో ప్లేగు వ్యాధి వ్యాపించి ఉంది. కాని ఫోటో రూపంలో మీరు మా వెంట ఉండటం వలన మా కుటుంబంలో ఎవరూ భయపడటం లేదు. మీ ఫోటోను దర్శించుకోవడం వలన అందరూ ఆనందంగా, సుఖంగా ఉన్నారు. మీ కోసం కొన్ని ఫలములు మరియు పది రూపాయిల దక్షణ పంపిస్తున్నాము. దయచేసి స్వీకరించండి"
శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.
అనుభవం - 128
హర్దా నగరంలో శ్రీ సదాశివ్ ఘండిరాజ్ నాయక్ అలియాస్ సాధుభయ్యా గారు శ్రీ సాయిబాబా తను సంస్థానాన్ని ఎలా స్థాపింపచేసుకున్నారోననే విషయం యొక్క వర్ణనను క్రింది విధంగాచెపుతున్నారు.
నాకు శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ గారి ఉత్తరం ఫిబ్రవరి 5, 1915 వ సం|| రోజున చేరింది. అందులోని సారాంశం క్రింది విధంగా ఉంది.
“శ్రీ బాలక్ రామ్ మరియు ముక్తారామ్ గారు ఇరువురూ తారీఖు 6-2-15 రోజున ముంబాయి నుండి బయలుదేరి “రావేరా” కు వెళుతున్నారు. అక్కడ నుండి తేదీ 8-2-15 సోమవారం బయలుదేరి, అదేరోజు సాయంకాలం సుమారు 5 గంటలకు హర్దా చేరుకుంటారు. రవేరా దగ్గర ఒకటిన్నర మైలు దూరంలో శ్రీ ముక్తారామ్ యొక్క ఇల్లు ఉంది. అక్కడ శ్రీ సమర్థ సాయిబాబా యొక్క పెద్ద ఫోటో ఉంది. ఆ ఫోటోను మీరు తీసుకువెళ్ళాలనే ప్రేరణ తనకు కలిగింది. కావున సోమవారం సాయంకాలం బండి సమయానికి తెలిసిన మనుషులను పంపే ఏర్పాట్లు చేయమని నేను ప్రత్యేకంగా వ్రాయాల్సిన అవసరం లేదు.”
శ్రీ కాకాసాహెబ్ ఆజ్ఞ ప్రకారం సోమవారం తారీఖు 8-2-15 సాయంకాలం బండి సమయానికి నేనే స్వయంగా స్టేషనుకు వెళ్ళాను. బండిరాగానే ఉత్తరంలో వ్రాసినట్లు శ్రీ బాలక్ రామ్ జి మరియు శ్రీ ముక్తారామ్ జి ఇరువురు శ్రీ బాబా యొక్క ఫోటో పెట్టుకుని కూర్చొనియుండటం చూసాను. రైలు పెట్టె తలుపు తెరిచి లోపలికి వెళ్ళి ఎంతో భక్తితో బాబా ఫోటోలోని చరణాలపై శిరస్సునుంచి నమస్కారం చేసుకున్నాను. తరువాత వారిరువురికి నమస్కరించి, బాబా ఫోటోను తీసుకొని ప్లాట్ ఫామ్ పై దిగాను. నా చేతిలోని పెద్ద ఫోటో చూసి నా చుట్టూ ప్రయాణికులు గుమిగూడటం మొదలుపెట్టడంతో నా చుట్టూ చాల రద్దీ అయింది. బాబా యొక్క ఫోటో మరియు వారిరువురితో కలసి టాంగాలో కూర్చొని మా ఇంటికి వచ్చాము. ఏ రోజయితే బాబా ఫోటో మా ఇంటికి వచ్చిందో, ఆ రోజు శ్రీరామనవమి పండుగ. ఒక పెద్ద పీటపై ఒక షాల్ ను పరచి ఆ పీటపై బాబా ఫోటోను కూర్చోబెట్టాము, సాయంకాలం ఆరతి ఇచ్చాము. ఆరతి సమయానికి చాలామంది వచ్చారు. సోదరులిరువురు బాలక్ రామ్ జి మరియు ముక్తారామ్ జి ఆజ్ఞననుసరించి బాబా ప్రసాదించిన చరణపాదుకలకు రుద్రాభిషేకం చేసి, బాబా ఫోటోకు పూజ చేసి ఆ ఫోటోను సింహాసనంపై కూర్చోబెట్టాము. తరువాత ఆరతి మరియు మంత్రపుష్పం ఎంతో ఉచ్ఛస్వరంతో జరిగాయి. తరువాత భిక్షువులకు దక్షిణ, పేడా ప్రసాదం ఇవ్వడం జరిగింది. బాబా పాదుకలకు అభిషేకం జరుగుతున్నప్పుడు, శ్రీ ముక్తారామ్ గారు ముందరి భాగంలోనున్న గ్యాలరీపైకి ఎక్కి బాబా చిహ్నంగా జెండాను పెట్టారు. ఆ చిహ్నంపెట్టే ప్రదేశం ఎంతో ప్రమాదకరమైనది. క్రిందపడితే ప్రాణం పోతుంది. అందరూ చూస్తూనే ఉన్నారు. తాను ఐదు నిమిషాలలో జెండాను ఇంటిపై ఎగరవేసి ఎలా క్రిందకు వచ్చారో ఎవరికీ అర్థం కాలేదు. గురువారం ఏ సమయంలోనైతే ఇక్కడ ముక్తారాం గారు జెండా ఎగురవేసారో, సరిగ్గా అదే సమయంలో శిరిడీలో బాబా చేయినొప్పితో బాధ పడుతుండడంతో, శ్రీ ఫకీర్ బాబాతో చేయిని పట్టించుకున్నారు. మరుసటి రోజు శివరాత్రి కావడంతో ఆదివారం బాబా ప్రసాదం చేయడం జరిగింది. తరువాత జరిగిన సంఘటనంతా శ్రీ సాయిలీల 11వ అంకంలో ఒకటవ సంవత్సరంలో తారీఖు 6-3-15న ఆ ఉత్తరం యొక్క నకలు ఇవ్వడం జరిగింది. అందువలన ఇక్కడ మరలా అదంతా ఇవ్వడం లేదు.
శ్రీ సబ్నోస్ గారి ఉత్తర సారాంశం.
ఠాణేకు చెందిన సుప్రసిద్ధ న్యాయవాది నారాయణ్ ఘనశ్యామ్ సబ్నీస్ గారు అనారోగ్యంతో కొంకణీకు వచ్చారు. అక్కడ ఆయన ఆరోగ్యం ఇంకా దెబ్బతిని ఎంతో విపత్కర పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితిలో బాబా తనకు దర్శనం ఇచ్చి “ఇక నీవు ఆరోగ్యవంతుడవు అవుతావు” అని చెప్పారు. మరుసటిరోజు నుండి తనకు స్వస్థత చేకూరసాగింది. త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకున్నాడు. శ్రీ సబ్నీస్ బాబా దర్శనానికి తరచుగా వచ్చేవారు. ఆయన వద్దనుండి బాబాకు అప్పుడప్పుడు ఉత్తరాలు వస్తుండేవి. వాటిలో ఒక ఉత్తరం నా చేతికి దొరికింది. అందులోని సారాంశం క్రిందివిధంగా ఉంది.
“బాబా ఈ ఉత్తరం వ్రాయడానికి గల కారణం ఏమిటంటే, మీ ఆశీర్వాదం వలన ఇద్దరు అబ్బాయిలు ఉత్తీర్ణులయ్యారు. ఈ విషయంలో మీ ఉపకారాన్ని ఎన్నటికీ మరువలేను. ఠాణేలో ప్లేగు వ్యాధి వ్యాపించి ఉంది. కాని ఫోటో రూపంలో మీరు మా వెంట ఉండటం వలన మా కుటుంబంలో ఎవరూ భయపడటం లేదు. మీ ఫోటోను దర్శించుకోవడం వలన అందరూ ఆనందంగా, సుఖంగా ఉన్నారు. మీ కోసం కొన్ని ఫలములు మరియు పది రూపాయిల దక్షణ పంపిస్తున్నాము. దయచేసి స్వీకరించండి"
తరువాయి భాగం రేపు.
సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.
🕉 sai Ram
ReplyDelete