సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 57వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 57వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

శ్రీ మాధవనాథ్ మహారాజ్ సంస్థాన్, చిత్రకూట్ గారి శిష్యులు లక్ష్మణ్ కేశవ్  ఉరఫ్ భావురావు ప్రధాన్ గారు సాయిలీల మాసిక్ యొక్క చందాదారులు. ఆయన కోరికననుసరించి శ్రీ మాధవనాథ్ సంజీవని అనే మహాత్ముని చరిత్ర పూర్వ భాగంలో “మహాత్ములతాదాత్మ్యం” అనే అధ్యాయంలో 108వ పేజీలో “సాయిబాబా, శిరిడి" అనుభవాన్ని పాఠకుల కోసం ఇవ్వడం జరిగింది. ఆ అనుభవాన్ని యథాతథంగా క్రింద ఇవ్వడం జరిగింది.
అనుభవం - 112

సాయిబాబా (శిరిడీ) 

లక్ష్మణ్ రావ్  ఉరఫ్ భావుసాహెబ్ ప్రధాన్, సబ్ రిజిస్ట్రార్ గారితో శ్రీ మాధవనాథ్ మహారాజ్ బాబా వద్దకు వెళ్ళి “నాకు ప్రత్యక్షంగా చెప్పలేదు అని నాతో పాటుగా సందేశం పంపించారు” అని చెప్పు అని చెప్పారు. ఆ విధంగానే లక్ష్మణ్ రావ్ శిరిడీకి వెళ్ళగానే "నాథ్ యొక్క బిడ్డడు వచ్చాడు. తనను జాగ్రత్తగా చూసుకోవాలి” అని చెప్పి బాబా తమ వద్ద కూర్చోబెట్టుకున్నారు. శ్రీ లక్ష్మణ్ రామ్ నాథ్ గారి సందేశం వినిపించగానే “నేను సున్నం నింపిన బస్తాలను చాలా వాటిని గాడిదలపై తీసుకువచ్చాను. దారిలో దొంగలు అన్నీ దోచేసారు. అందువలన దొంగల సాంగత్యంలో ఉండటం చాలా కష్టం. అది నేర్పించటానికే భాయి నిన్ను నా వద్దకు పంపించారు” అని చెపుతూ “ఈ రోజు నాథ్ యొక్క ప్రసాదం తినాలి. తొందరగా కానీ” అని అన్నారు. బాబా మాటలు వినిన లక్ష్మణరావు, తనకు సంబంధించి బాబా ఏం ఉపదేశమైతే ఇచ్చారో, శ్రీ మాధవనాథ్ అదే ఉపదేశాన్ని ఇంతకుముందు తనకు ఇచ్చారు. కానీ చెవులు కుట్టాలనుకుంటే కంసాలి వద్దకు పంపించిన చందంగా ఆ ఉపదేశం హృదయంలో నాటుకుపోవడానికి శ్రీ మాధవనాథ్ మహారాజ్ లక్ష్మణ్ రావుని బాబా వద్దకు పంపించారు. వంటచేసి బాబాతో కలిసి భోజనం చేసాడు. తరువాత బయలుదేరడానికి బాబాను అనుమతి అర్థించాడు. అప్పుడు బాబా “నిస్సారమైన జగత్తులో నివసించడం కష్టం అనే ఉపదేశాన్ని బాబా నాకు ఇచ్చారు అని భాయికి చెప్పు” అని చెప్పి అనుమతిని ప్రసాదించారు.

అనుభవం - 113

ఒకసారి హరిభక్తి పరాయణుడు బాబూరావ్ బువా ఔరంగాబాద్ కర్ బాబా యొక్క దర్శనానికి వచ్చారు. బాబా తనను కొన్ని రోజులు శిరిడీలోనే ఉంచేసారు. చివరకు ఒకరోజు తాను ఊరికి వెళ్ళాలని మొండి నిర్ణయం తీసుకున్నారు. ఎవరి ఇంట్లోనయితే బసచేశారో, వారు బాబాతో “ఈ రోజు ఎలాగైనా వెళ్లిపోవాలని  బువా నిర్ణయించుకున్నారు. ఆ ప్రకారమే ఇప్పుడు బయలుదేరనున్నారు” అని చెప్పారు. అందుకు బాబా “ఆయన ఇష్టం. వెళ్ళాడంటే వర్షంలో నానా హైరానాపడతాడు. మనది ఏం పోయింది" అని అన్నారు. ఆయన బయలుదేరిన సమయంలో విపరీతమైన ఎండ ఉంది. వర్షం పడే సూచనలు ఏమాత్రం లేవు. అంటే బాబా అన్న "వర్షంలో నానా హైరానా పడతాడు” అనే మాటలు ఆయనకు తమాషాగా అనిపించాయి. కానీ ఆయన టాంగా అరమైలు ప్రయాణించిందో లేదో ఒక్కసారిగా ఆకాశం దట్టంగా మేఘావృతమై  జోరుగా వర్షం కురవసాగింది. ఆయన బట్టలు పూర్తిగా తడిసి నానా కష్టాలు పడ్డాడు. చివరకు ఒక గ్రామంలో ఆ రాత్రి బసచేయవలసి వచ్చింది.

అనుభవం - 114

అలాగే ఒకసారి తాత్యాపాటిల్ మరియు ఇంకొందరు కోపర్గామ్ వెళ్ళడానికై బయలుదేరారు. బయలుదేరేముందు బాబా దర్శనానికై వచ్చారు. అప్పుడు వారిద్దరి మధ్య క్రింది విధంగా సంభాషణ జరిగింది.

బాబా :- “ఎక్కడికి వెళుతున్నావు” 
తాత్యా :- “కోపర్గావ్ వెళుతున్నాను” 
బాబా :- “ఎందుకురా? కాళ్ళూ, చేతులు విరగగొట్టుకోడానికి వెళుతున్నావా?”
తాత్యా:- “బాబా చాలా అవసరమైన పని ఉంది. వెళ్ళిరావాల్సిందే”

పై విధంగా అంటూ బాబా సమాధానం, అనుమతికోసమై ఎదురు చూడకుండా వెనువెంటనే బయలుదేరాడు. పొలిమేరలోని కాలువ వద్దకు అంటే సుమారు అర్ధమైలు టాంగా వెళ్ళిందో, లేదో గుర్రం ఒకవైపుకు ఒరగడం వలన బండి తలక్రిందులైంది. బండి  పూర్తిగా విరిగిపోయింది. బండిలోని వారందరికి ఒక మోస్తరు దెబ్బలు తగిలాయి.

తరువాయి భాగం రేపు 

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

సాయి కరుణా కటాక్షాములతో దీక్షిత్ డైరీ, సాయి భక్త దాసగణు మహరాజ్, సాయి భక్త శ్యామా గ్రంథాలను సాయి భక్త కోటికి అందించిన పర్నా విజయ్‌కిషోర్ గారు ఈ గురు పౌర్ణమి కానుకగా మనకు సాయి భక్తులలో యెనలేని సేవలు చేసిన పరమ భక్తురాలు రాధకృష్ణ మాయి గురించిన గ్రంథం 'సాయిభక్త అచార్యురాలు రాధాకృష్ణఆయీ' అందిస్తున్నారు. గురుపౌర్ణమి నుండి ఈ బుక్ భక్తులకు అందుబాటులో ఉంటుంది. 

గమనిక: విజయ్ కిషోర్ గారు రచించిన బుక్స్ అన్నీ క్రింద ఇవ్వబడిన అడ్రస్ లో దొరుకుతాయి.


పి. విజయ్ కిషోర్.
ప్లాట్ నెంబర్: 202, ప్లాట్ నెంబర్: 97,
ధనుంజయ నెస్ట్,
హైదరాబాద్ -500045.
ఫోన్ నెంబర్: 040 - 23831510.

శిరిడీలో ద్వారకామాయికి ఎదురుగా ఉన్న ద్వారకామాయి ఎంపోరియం లో కూడా బుక్స్ లభిస్తాయి.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo